'హనుమాన్' ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్‌ ట్వీట్‌.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు | Sakshi
Sakshi News home page

'హనుమాన్' ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్‌ ట్వీట్‌.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

Published Fri, Mar 15 2024 2:09 PM

Prasanth Varma Comments On HanuMan Movie OTT Delay - Sakshi

ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా 'హనుమాన్‌' సినిమా విడుదలైంది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే పలు ఓటీటీలలో వచ్చేశాయి. కానీ  ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్‌ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'హనుమాన్‌ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్‌ విరామం లేకుండా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇప్పటి వరకు మా చిత్ర యూనిట్‌కు సపోర్ట్‌ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.' అని తెలిపారు.

తాజాగా ప్రశాంత్‌ వర్మ చేసిన పోస్ట్‌పై నెటిజన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్‌ చేసేది ఏంటి..? ఆలస్యానికి కారణాలు ఏంటి..? కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా..? మీరు చేస్తున్న అతికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది అని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

మొదట హనుమాన్‌ సినిమా మార్చి 2 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్‌ అవుతుందని టాక్ వినిపించింది. అప్పుడు జరగలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అన్నారు. అప్పుడూ లేదు. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అదీ లేదు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలయని పరిస్థితి అని  అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. భారీ సినిమాల మధ్య రిలీజ్‌ అయిన సినిమాకు తాము ఎంతగానో సోషల్‌మీడియాలో ప్రమోట్‌ చేస్తే ఇప్పుడు ఇలా గేమ్స్‌ అడుతున్నారా అంటూ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మపై ఫైర్‌ అవుతున్నారు. ఇప్పటికి అయితే హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అనే విషయంపై ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement