Zombie Reddy
-
బిగ్‌బాస్‌లోకి ‘జాంబి రెడ్డి’ భామ.. లిస్ట్‌లో ఇంకా ఎవరున్నారంటే...
బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు ఇటీవల విడుదలైన ప్రోమోతో తెరపడింది. ఇక నాగార్జున కూడా ప్రోమో షూటింగ్‌లతో బిజీగానే ఉన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్‌లో ఈ షోని ప్రారంభించాలని చూస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ బిగ్ రియాల్టీ షోకి వరుసగా మూడోసారి కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఇదిలా ఉంటే ఎప్పటి మాదిరే ఈ సీజన్‌కి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. యువ హీరో తేజా సజ్జా హీరోగా ఇటీవల విడుదలైన జాంబి రెడ్డి లో ఓ రోల్ చేసిన లహరి శారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే ఆమె ఒప్పందంపై సంతకం చేశారని, హౌస్ లోకి లహరి వెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని, ఆ తర్వాత వెండితెరపై వెలిగిపోవాలని ఆశపడుతుందట ఈ బ్యూటీ. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే.. బిగ్‌బాస్ షో ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే. -
మళ్లీ భయపెట్టడానికి జాంబీలు వస్తున్నాయి!
Zombie Reddy: తెలుగు ప్రేక్షకులకు తొలిసారి జాంబీలను పరిచయం చేసిన సినిమా జాంబీ రెడ్డి. హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఇలాంటి కొత్త జోనర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జా ఈ మూవీతో హీరోగా మారాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ మధ్యే ఓటీటీ‘ఆహా’లో విడుదలై 9.7 టీఆర్పీ రేటును సాధించింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రానుందట. తాజాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఈ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడని, దీనిపై హీరో తేజతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. . ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘ఒక గన్ను 6 బులెట్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం జాంబీరెడ్డి 2 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడట. మరి జాంబీ రెడ్డి సీక్వెల్‌పై వస్తోన్నవార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఆ డైరెక్టర్‌కు బేబమ్మ నో చెప్పడమేంటి? బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘పుష్ప’ -
‘ఆహా’లో జాంబిరెడ్డి, ఎప్పటినుంచంటే..
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జాంబిరెడ్డి సినిమా యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా డాబాగార్డెన్స్‌లోని ఓ హోటల్లో ఆదివారం హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ విలేకరులతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన ఈ సినిమా లాక్డౌన్ సడలింపులు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. అయితే అధిక శాతం మంది సినిమా చూడలేకపోయారని.. అలాంటి వారి కోసం ఈ నెల 26న ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా చూసి నచ్చితే పది మందికి చెప్పాలని కోరారు. విశాఖ నుంచి ఆహా ప్రీ రిలీజ్ టూర్ ప్రారంభించామని, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో కొనసాగిస్తామన్నారు. త్వరలో జాంబిరెడ్డి–2 తీయనున్నట్టు చెప్పారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ జాంబిరెడ్డిలో కశిరెడ్డి పాత్రలో నటించానన్నారు. ఆహాలో ఈ సినిమాను ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో నటుడు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సోషల్ హల్చల్: రాశి ఖన్నా అందాల విందు.. -
'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ
టైటిల్ : జాంబీ రెడ్డి జానర్ : జాంబీ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు దర్శకుడు : ప్రశాంత్ వర్మ నిర్మాత : రాజశేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె. రాబిన్ సినిమాటోగ్రఫి: అనిత్ విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021 మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్‌డౌన్‌ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్‌కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం. ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే.. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్‌తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్) నటన: ఇక ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!) -
'జాంబీ రెడ్డి'కి బెదిరింపులు: దర్శకుడు
‘‘లాక్ డౌన్ తర్వాత ఆరంభించిన ఫస్ట్ చిత్రం మా ‘జాంబిరెడ్డి’. మొదట్లో ఇద్దరు ముగ్గురుతో ఉన్న సీన్స్ చేశాం.. ఒక్కో వారం గ్యాప్ తీసుకొని చేయడం వల్లే సినిమా ఇంత ఆలస్యం అయ్యింది.. లేదంటే మా సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మన సినిమాల్లో లవ్ జానర్ ఎలానో జాంబీ కూడా ఒక జానర్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ అల్లుకుని ఈ సినిమా తీశా. హాలీవుడ్లో ఇప్పటికే జాంబీ సినిమాలు తీసినవాళ్లకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ సినిమా అనుకున్నాను. కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది. ఒక తెలియని విషయాన్ని మనకు తెలిసిన విషయానికి కనెక్ట్ చేసి చెప్తే సులభంగా అర్థమవుతుంది. త్రివిక్రమ్‌గారు ఈ విధంగా చేస్తుంటారు. మహాభారతం, భాగవతంతో కలిపి తన సినిమాల్లో చెబుతుంటారాయన. అలా నేను కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేద్దామనుకొని జాంబీ కాన్సెప్ట్‌కి ఫ్యాక్షన్ యాడ్ చేశాను. ‘జాంబిరెడ్డి’ టైటిల్ పెట్టినప్పుడు చాలానే బెదిరింపులు వచ్చాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఇండస్ట్రీలో భిన్నమైన స్వరాలు వినిపించాయి. ‘ఇలాంటి జానర్ మేం చేద్దాం అనుకున్నాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాదేమో అని వదిలేశాం’ అని కొందరు.. ‘మంచి ఐడియా’ అని మరికొందరు అన్నారు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ‘నువ్వు సాధించావ్’ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో పెద్ద హీరో అయితే మార్కెట్ పరిధి బాగుండేది. కానీ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టేదేమో? త్వరగా సినిమా చెయ్యాలనుకున్నాను.. తేజ సరిపోతాడనిపించి తీశాను. మా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యాక హిందీ రీమేక్‌కి అవకాశాలొచ్చాయి. సమంతగారికి చెప్పింది ‘జాంబిరెడ్డి’ కథ కాదు.. వేరేది. మేమిద్దరం ఆ స్క్రిప్ట్‌ని నమ్మాం.. కానీ నిర్మాత దొరకలేదు. నా దగ్గర ప్యాన్ ఇండియా కథలు కూడా ఉన్నాయ్. ‘జాంబిరెడ్డి’ విజయం సాధించి మంచి పేరు వస్తే, సీక్వెల్‌ని ప్యాన్ ఇండియా స్థాయిలో తీస్తాం’’ అన్నారు. -
తేజ మా మెగాఫ్యామిలీ మెంబర్
‘‘తేజ చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్. చిరంజీవిగారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. ‘ఓ బేబీ’ సినిమాలో తనని చూసి సర్ప్రై జ్ అయ్యాను. ప్రశాంత్ వర్మ గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబీ జానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాంబిరెడ్డి’ ప్రీ–రిలీజ్ వేడుకలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘ ‘శివ’ సినిమా టైమ్‌లో ఆర్జీవీని చూసి గొప్ప డైరెక్టర్ అవుతాడనుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయాలనే నా కల. ‘జాంబిరెడ్డి’తో నిజమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా నిర్మాత రాజశేఖర్ వర్మగారు కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. తేజ నాకు మంచి ఫ్రెండ్. ‘అ!’ సినిమా కన్నా ముందే తనతో ఓ చిత్రం చేయాలి... కుదరలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
హీరోగా నాకిది సరైన లాంచ్
‘‘బాలనటుడిగా చాలా సినిమాలు చేశాను. అవి మినహాయిస్తే ‘ఓ బేబీ’ నా తొలి చిత్రం. ఆ ప్రాజెక్ట్‌లో నాకన్నా పెద్ద స్టార్స్ ఉన్నారు. హీరోగా ‘జాంబీ రెడ్డి’ సినిమా నాకు సరైన లాంచ్. ఈ సినిమా విడుదల కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నా’’ అని తేజ సజ్జ అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మ నాకు చాలా సన్నిహితుడు. నా బలాలు ఏంటో తనకు బాగా తెలుసు. నన్ను హీరోగా ఎలివేట్ చేయడానికి ప్రశాంత్ బాగా కష్టపడ్డాడు. కోవిడ్ సమయంలో మా సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. లాక్డౌన్లో చాలా విషయాలు మారిపోయాయి. దాంతో ప్రేక్షకులను మరింతగా నవ్వించడానికి వ్యంగ్యంతో కూడిన ఉల్లాసమైన కామెడీని జత చేశాం. ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ చాలా బాగుంది. మా సినిమా టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమాని కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రవిజయం నా కెరీర్‌ను మార్చుతుందనే బలమైన నమ్మకం ఉంది. అన్ని రకాల పాత్రలు చేసి, ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
మూడోసారి మిస్ కాదల్చుకోలేదు!
‘‘తెలుగులో నా మొదటి చిత్రం ‘హోరా హోరీ’(2016). బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తేజాగారి దర్శకత్వంలో ఆ సినిమా చేసే అవకాశం వచ్చింది. చదువు కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించాను’’ అన్నారు దక్షా నగార్కర్. తేజ సజ్జ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. దక్షా నగార్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మ తీసిన ‘అ’ చిత్రంలో నిత్యామీనన్ పాత్రలో నేను నటించాల్సింది. అప్పటికి నాకంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడైతే ఆ పాత్రని ఒప్పుకునేదాన్ని. ‘కల్కి’కి కూడా సంప్రదించారు ప్రశాంత్ వర్మ.. కానీ కుదరలేదు. మూడోసారి మిస్ కాకూడదని ‘జాంబీ రెడ్డి’ చేశా. ఇందులో మ్యాగీ అనే గేమర్ పాత్రలో నటించాను. ప్రస్తుతం బెల్లంకొండ గణేశ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. రెండు పెద్ద నిర్మాణ సంస్థల్లో రెండు సినిమాలు, హిందీలో ఓ వెబ్ ఫిల్మ్ కమిట్ అయ్యాను’’ అన్నారు. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: సమంత
‘‘జాంబిరెడ్డి’ సినిమా టీజర్ అదిరిపోయింది. నా ఊహను మించిపోయింది. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. నాకు సినిమాలంటే ప్రాణం’’ అన్నారు సమంత. తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత విడుదల చేశారు. పోస్టర్‌ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిఫరెంట్‌గా ఉంది. టీజర్‌తో ప్రశాంత్ వర్మ భయపెడుతున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్‌ను సగం పూర్తి చేశాం. మిగిలిన భాగాన్ని లాక్డౌన్ తర్వాత పూర్తి చేశాం. నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడానికి ఈ సినిమా తీయలేదు. ఎంటర్టైన్ చేయడం కోసం తీశాను. ఈ సినిమా హిట్ సాధిస్తే ‘జాంబిరెడ్డి’ లెవల్ 2 స్క్రిప్ట్ ఉంది. నన్ను నమ్మిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ముందు సమంతగారితో ఓ సినిమా అనుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారు’’ అన్నారు తేజ సజ్జా. ఈ కార్యక్రమంలో ఆనంది, దక్షా నగార్కర్, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు పి. కిరణ్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి
‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైంది. తేజ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’. లాక్డౌన్ సడలించాక ప్రభుత్వ నిబంధనల మేరకు తెలుగు పరిశ్రమలో ముందు షూటింగ్ మొదలు పెట్టి, పూర్తి చేసిన తొలి చిత్రం మాదే. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం. మా సినిమాతో జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగుకి పరిచయం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి.