మూడోసారి మిస్‌ కాదల్చుకోలేదు! | Daksha Nagarkar talking about zombie Reddy Movie | Sakshi
Sakshi News home page

మూడోసారి మిస్‌ కాదల్చుకోలేదు!

Published Mon, Feb 1 2021 3:30 AM | Last Updated on Fri, Feb 5 2021 12:19 PM

Daksha Nagarkar talking about zombie Reddy Movie - Sakshi

దక్షా నగార్కర్‌

‘‘తెలుగులో నా మొదటి చిత్రం ‘హోరా హోరీ’(2016). బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తేజాగారి దర్శకత్వంలో ఆ సినిమా చేసే అవకాశం వచ్చింది. చదువు కోసం రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించాను’’ అన్నారు దక్షా నగార్కర్‌. తేజ సజ్జ, దక్షా నగార్కర్‌ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. దక్షా నగార్కర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్‌ వర్మ తీసిన ‘అ’ చిత్రంలో నిత్యామీనన్‌ పాత్రలో నేను నటించాల్సింది. అప్పటికి నాకంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడైతే ఆ పాత్రని ఒప్పుకునేదాన్ని. ‘కల్కి’కి కూడా సంప్రదించారు ప్రశాంత్‌ వర్మ.. కానీ కుదరలేదు. మూడోసారి మిస్‌ కాకూడదని ‘జాంబీ రెడ్డి’ చేశా. ఇందులో మ్యాగీ అనే గేమర్‌ పాత్రలో నటించాను. ప్రస్తుతం బెల్లంకొండ గణేశ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. రెండు పెద్ద నిర్మాణ సంస్థల్లో రెండు సినిమాలు, హిందీలో ఓ వెబ్‌ ఫిల్మ్‌ కమిట్‌ అయ్యాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement