Zombie Reddy OTT Release Date Confirmed and Released on Aha Video - Sakshi
Sakshi News home page

‘ఆహా’లో జాంబిరెడ్డి, ఈ నెలలోనే రిలీజ్‌!

Published Mon, Mar 22 2021 8:32 AM | Last Updated on Mon, Mar 22 2021 4:15 PM

Zombie Reddy Premiere On Aha From March 26 - Sakshi

సాక్షి, డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): జాంబిరెడ్డి సినిమా యూనిట్‌ ఆదివారం విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా డాబాగార్డెన్స్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ విలేకరులతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన ఈ సినిమా లాక్‌డౌన్‌ సడలింపులు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. అయితే అధిక శాతం మంది సినిమా చూడలేకపోయారని.. అలాంటి వారి కోసం ఈ నెల 26న ‘ఆహా’లో రిలీజ్‌ చేస్తున్నట్టు చెప్పారు.

ఈ సినిమా చూసి నచ్చితే పది మందికి చెప్పాలని కోరారు. విశాఖ నుంచి ఆహా ప్రీ రిలీజ్‌ టూర్‌ ప్రారంభించామని, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో కొనసాగిస్తామన్నారు. త్వరలో జాంబిరెడ్డి–2 తీయనున్నట్టు చెప్పారు. గెటప్‌ శ్రీను మాట్లాడుతూ జాంబిరెడ్డిలో కశిరెడ్డి పాత్రలో నటించానన్నారు. ఆహాలో ఈ సినిమాను ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో నటుడు హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: సోషల్‌ హల్‌చల్‌: రాశి ఖన్నా అందాల విందు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement