Bigg Boss Telugu 5: Actress Lahari Shari Set To Enter In Bigg Boss - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లోకి ‘జాంబి రెడ్డి’ భామ

Published Sat, Aug 7 2021 12:42 PM | Last Updated on Wed, Sep 1 2021 8:12 PM

Bigg Boss Telugu 5: Actress Lahari Shari Set To Enter In Bigg Boss - Sakshi

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు ఇటీవల విడుదలైన ప్రోమోతో తెరపడింది. ఇక నాగార్జున కూడా ప్రోమో షూటింగ్‌లతో బిజీగానే ఉన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్‌లో ఈ షోని ప్రారంభించాలని చూస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ బిగ్‌ రియాల్టీ షోకి వరుసగా మూడోసారి కింగ్‌ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం.

ఇదిలా  ఉంటే ఎప్పటి మాదిరే ఈ సీజన్‌కి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ లిస్ట్‌లో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది.

తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. యువ హీరో తేజా సజ్జా హీరోగా ఇటీవల విడుదలైన జాంబి రెడ్డి లో ఓ రోల్ చేసిన లహరి శారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే ఆమె ఒప్పందంపై సంతకం చేశారని, హౌస్ లోకి లహరి వెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని, ఆ తర్వాత వెండితెరపై వెలిగిపోవాలని ఆశపడుతుందట ఈ బ్యూటీ. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే.. బిగ్‌బాస్‌ షో ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement