
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కలి". ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా "కలి" మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ - "కలి" ట్రైలర్ థ్రిల్లింగ్ గా అనిపించింది. టీమ్ అంతా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేశారు. వీఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉన్నాయి. "కలి" మూవీ చూసేందుకు నేనూ వెయిట్ చేస్తున్నా అన్నారు.

కలి ట్రైలర్ విషయానికి వస్తే.. శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అతని మంచితనం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. 'నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ' ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్. ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు.
ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక శివరామ్ జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రియదర్శి వాయిస్ ఓవర్ నవ్వించింది. 'మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే...' అనే డైలాగ్ "కలి" కథలోని సారాంశాన్ని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment