అశోక్‌ గల్లా కొత్త మూవీ.. కెమెరా స్విచ్చాన్‌ చేసిన నమ్రత | Ashok Galla, Prashant Varma New Movie Launched | Sakshi
Sakshi News home page

Ashok Galla: అశోక్‌ గల్లా కొత్త సినిమా.. అంతులేని విజయం సాధించాలన్న మహేశ్‌బాబు

Feb 6 2023 9:22 AM | Updated on Feb 6 2023 9:22 AM

Ashok Galla, Prashant Varma New Movie Launched - Sakshi

ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నమ్రత కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వెంకటేష్‌ క్లాప్‌ కొట్టారు. బో

యంగ్‌ హీరో అశోక్‌ గల్లా కొత్త చిత్రం షురూ అయింది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా, అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నమ్రత కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వెంకటేష్‌ క్లాప్‌ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించగా, మిర్యాల రవీందర్‌ రెడ్డి, సాహు గారపాటి, హరీష్‌ పెద్ది కలిసి స్క్రిప్ట్‌ని ప్రశాంత్‌ వర్మకు అందజేశారు.

అశోక్‌ గల్లా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నా పాత్ర రఫ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ప్రశాంత్‌ వర్మగారు చాలా మంచి వినోదాత్మక కథ అందించారు’’ అన్నారు అర్జున్‌ జంధ్యాల. ‘‘నాలుగేళ్లుగా ఈ కథను రాసుకున్నాను’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. హీరో మహేశ్‌ బాబు ఈ సినిమా పూజా కార్యక్రమాల ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ అశోక్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఎప్పటికీ అంతులేని విజయం సాధించాలంటూ ఆకాంక్షించారు.

చదవండి: నయనతారను పొగిడిన షారుక్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement