Rajashekar
-
మిర్యాలగూడ గ్యాంగ్ వార్ లపై డి.ఎస్ .పి సీరియస్ వార్నింగ్
-
చంద్రబాబు నేను చేసిన పాపం ఏంటి..? కన్నీరు పెట్టుకున్నటీడీపీ నేత
-
నాన్న..! 'నాకు మాట్లాడాలని ఉంది'..
కరీంనగర్: ఆ కుటుంబంలో మొదటి సంతానంగా పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఆ సంబరం ఏడాది తిరగకముందే ఆవిరైంది. పాపకు మాటలు రాకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆస్తులు అమ్ముకొని కొంత, దాతల సహకారంతో కొంత సొమ్ము సేకరించి కేంద్ర ప్రభుత్వ పథకంతో ఆపరేషన్ చేయించినా, లక్షల్లో ఖరీదు చేసే హియరింగ్ మిషన్ల కొనుగోలుకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాపకు మాటలు రావాలంటే మిషన్లకు, హియరింగ్ థెరపీకి రూ.11 లక్షలు అవసరముండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కూతురు తపన.. తండ్రి ఆవేదన! కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్, కావ్యశ్రీ దంపతులకు 2016లో రిషిత జన్మించింది. ఆరోగ్యంగానే ఉన్న పాప ఏడాది వయస్సు వచ్చినా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపకు పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్య ఉన్నట్లు గుర్తించారు. స్పీచ్ థెరపీతో మాటలు వస్తాయని చెప్పడంతో 2017లో తిరుపతిలోని శ్రవణం స్వీచ్ థెరపీ ఆస్పత్రిలో ఏడాది పాటు ఉండి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో 2018లో దాతల సాయంతో రూ.1.5 లక్షలతో వినికిడి యంత్రం కొనుగోలు చేసినా పాపకు ఉపయోగపడలేదు. మళ్లీ 2019లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని తెలిపారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పథకం అడిప్ స్కీం కింద అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్నారు. అడిప్ స్కీం కింద తల లోపల కాక్లర్ ఇంప్లాట్ మిషన్ వేశారు. ఆపరేషన్ చేయడం ఒక ఎత్తయితే, తర్వాత హియరింగ్ మిషన్ కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ఆపరేషన్ తర్వాత ప్రతీ రెండు నెలలకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలి. ఈ క్రమంలో చెవిలో ఇన్ఫెక్షన్ సోకడంతో 2022లో మరోసారి ఆపరేషన్ చేయించారు. ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్గా పనిచేసుకునే రాజశేఖర్ తరచూ బిడ్డను ఆసుపత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు. ప్రస్తుతం రేకుర్తిలో ఉంటున్నారు. రిషిత మాట్లాడాలంటే కుడి చెవికి రూ.7.5 లక్షల విలువైన న్యూక్లియర్–8 మిషన్, ఎడమ చెవికి రూ.1.5 లక్షల మరో మిషన్ అవసరముంది. వీటిని కొనుగోలు చేసినా ప్రతినెలా రూ.13 వేలు వెచ్చించి రెండేళ్లపాటు స్పీచ్ థెరపీ అందించాల్సి ఉంటుంది. సుమారు రూ.11 లక్షలు ఖర్చు చేస్తే తప్ప పాప మూగ గొంతుకు మాటలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు కోసం రోదిస్తున్నాడు. పాపపై కరుణతో హృదయమున్న దాతలు సహకరించాలని వేడుకుంటున్నాడు. రాజశేఖర్‌కు సహాయం చేయాలనుకునేవారు: అకౌంట్ నంబర్ : 20343433912 ఎస్బీఐ బ్యాంకు, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0014237, ఫోన్‌పే/గూగుల్‌పే నంబర్ : 77024 88503. ఇవి చదవండి: డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’! -
రెండు ఉద్యోగాలు సాధించిన భార్య! అంతలోనే భర్త విషాదం!
కరీంనగర్: భార్య రెండు ఉద్యోగాలు సాధించడంతో స్నేహితులు పార్టీ అడిగారు. వారికి విందు ఇచ్చేందుకు వెళ్లిన గంటలోనే రోడ్డు ప్రమాదం కబళించింది. దీంతో ఆ ఇంట్లో విషాదం నిండింది. ఈ ఘటన ధర్మపురిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి పట్టణంలోని గంగపుత్రకాలనీకి చెందిన నర్ముల రాజశేఖర్ (36) బీర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. రాజశేఖర్ భార్య మనీషా ఇటీవల ప్రకటించిన టీజీటీ, పీజీటీలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. దీంతో పార్టీ (దావత్) ఇవ్వాలని తోటి మిత్రులు కోరారు. మంగళవారం సాయంత్రం బీర్పూర్లో విధులు ముగించుకుని ఇంటికి చేరిన రాజశేఖర్ నిద్రకు ఉపక్రమించాడు. అదే సమయంలో తన స్నేహితుడైన ధర్మపురికి చెందిన సిరుప బద్రి ఇంటికొచ్చి పార్టీ కోసమని ద్విచక్రవాహనంపై మండలంలోని రాయపట్నం గ్రామానికి వెళ్లారు. విందు చేసుకుని తిరిగి వస్తుండగా బూరుగుపల్లె బస్టాండ్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజశేఖర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సీపతి బద్రి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. ఇంటి నుంచి వెళ్లిన గంటలోపే.. ఇప్పుడే వస్తానంటూ రాజశేఖర్ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి నుంచి బయల్దేరాడు. వెళ్లిన కొద్దిసేపటికే పార్టీ ముగించుకుని తిరుగు పయనమయ్యారు. అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భార్య, తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. రాజశేఖర్‌కు కుమారుడు శ్రీహర్ష ఒక్కగానొక్క కుమారుడు. అతడు తండ్రి చితికి నిప్పు పెట్టడం అక్కడున్నవారిని కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. ఇవి చదవండి: అమ్మా.. 'ఎందుకు ఏడుస్తున్నావమ్మా..! నాన్నకు ఏమైంది..? -
నితిన్ 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' టాక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' నేడు (డిసెంబర్ 8) విడుదలైంది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించగా.. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని సినిమా విడుదలకు ముందు నితిన్ చెప్పడం విశేషం. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఒకే లక్ష్యంతో ఈ చిత్రాన్ని చేశామని ఆయన చెప్పాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు నితిన్. తాజాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఫుల్ కామెడీ ఉందని ఎంజాయ్ చేస్తున్నారు. భీష్మ తర్వాత నితిన్‌కు సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైన ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఎక్స్ట్రా ఆర్డనరీ మ్యాన్ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించడం విశేషం. ఈ క్యారెక్టర్లో ఆయన ఫర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని, అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుందని నెటిజన్లు చెబుతోన్నారు. 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' ఫుల్ ఫన్‌తో కూడిన చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా నితిన్ సరికొత్త రోల్లో కనిపించి అదరగొట్టాడని నెటిజన్లు తెలుపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమాకు రావు రమేష్ పాత్ర ప్రధాన బలం అని ఒకరు చెబుతుంటే.. ప్రత్యేక పాత్రలో కనిపించిన రాజశేఖర్ కూడా భారీగానే వినోదాన్ని పంచాడని తెలుపుతున్నారు. ద్వితీయార్దంలో అయితే ఫుల్ ఫన్‌గా కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్ రోల్ తక్కువే అయినా ఆయన కనిపించిన సీన్స్ మొత్తం ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం కథలో ఎలాంటి కొత్తదనం లేదని తెలుపుతున్నారు. అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. వక్కంతం వంశీ ఆర్డినరీ కథనే చెప్పాడని తెలుపుతున్నారు. ద్వితియార్థం నుంచి థియేటర్లో నవ్వులు తెప్పిస్తాయని తెలుపుతున్న నెటిజన్లు.. సినిమా మాత్రం ఎలాంటి డిస్పాయింట్మెంట్కు గురిచేయదని తెలుపుతన్నారు. Hit Kottesam Anna @actor_nithiin #ExtraOrdinaryMan 💓💥 pic.twitter.com/teygT9ygvx — N I T H I I N 🤍🕊 (@MNP_FOLLOWERS) December 8, 2023 One Night Away For #ExtraOrdinaryMan Outdated Music Director @Jharrisjayaraj Asal Edu Mottam Pata Instruments & Worst Production Values @sreshthmoviesoffl Whats Remaining Except Script & Screen Presence Of #ExtraordinaryManFromTomorrow pic.twitter.com/rpUrlet3ut — GK (@Adithya_7M) December 7, 2023 First Half Report: Comedy parledu.#Sreeleela tho unna scenes anni reality ga dooram ga unnai . Story kuda outdated anipinchindhi. But few comedy scenes first half ni save chesayane cheppukovali and same time konni comedy scenes over the top unnai #ExtraOrdinaryMan https://t.co/TwVPvZekiz pic.twitter.com/MEf80ys3SU — Filmy Lagoon (@filmylagoon_) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 just now done 1st half Hilarious Comedy with Good Interval let's see 2nd Half...sree #ExtraOrdinaryMan #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/YDsqSxJWBS — AK Nellore (@AkNellore) December 8, 2023 -
ఎక్స్ట్రార్డినరీ సాంగ్
ఎక్స్ట్రార్డినరీ లెవల్లో డ్యాన్స్ చేశారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’. రాజశేఖర్ ఓ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఓ భారీ సెట్లో 300 మందికి పైగా ఫారిన్ డ్యాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవు తుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని యూనిట్ పేర్కొంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్. -
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్‌గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్' నిర్మాత
రాజశేఖర్ హీరోగా, శివానీ రాజశేఖర్, ఆత్మీయా రాజన్, ముస్కాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నిర్మాత బొగ్గరం శ్రీనివాస్‌తో నాకు ఉన్న పరిచయం వల్ల ‘కార్తికేయ’ సినిమాకు తనతో ఇన్వెస్టర్‌గా చేరాను.ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నిర్మించాను. ఇక ‘శేఖర్’ విషయానికి వస్తే.. రాజశేఖర్‌గారు నా ఫేవరెట్ హీరో. అందుకే ఆయన చేసిన ‘గరుడవేగ’ సినిమాతో ట్రావెల్ చేశాను. మలయాళ ‘జోసెఫ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని జీవితగారు చెప్పడంతో నేనూ ‘జోసెఫ్’ చూశాను. నచ్చి ‘శేఖర్’ సినిమాకు నిర్మాతగా ఉన్నాను. రాజశేఖర్‌గారు అద్భుతంగా నటించారు. జీవితగారు బాగా తీశారు. దాదాపు 300 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. సినిమా బాగుందని, మంచి సందేశం ఇచ్చారని ప్రేక్షకులు అభినందిస్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
‘శేఖర్’ మూవీ రివ్యూ
టైటిల్ : శేఖర్ నటీనటులు : రాజశేఖర్, ముస్కాన్, ఆత్మీయ రాజన్, శివాణి, సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్ తదితరులు నిర్మాతలు: బీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాణి రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ దర్శకురాలు: జీవిత రాజశేఖర్ సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫి:మల్లికార్జున్ నారగాని విడుదల తేది:మే 20, 2022 యాంగ్రీస్టార్ రాజశేఖర్.. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత ఆయన చిత్రాలకు పెద్ద ఆదరణ దక్కలేదు. ఇక రాజశేఖర్ పని అయిపోతుదన్న సమయంలో గరుడవేగ, కల్కీ చిత్రాలతో మళ్లీ పుంజుకున్నాడు. ఆ చిత్రాలు విజయవంతం కావడంతో..అదే కిక్‌తో ‘శేఖర్’చిత్రంలో నటించారు. మలయాళం మూవీ జోసెఫ్ చిత్రం రీమేక్ ఇది. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిపెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘శేఖర్’చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘శేఖర్’ అందకున్నాడా? లేదా?, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శేఖర్(రాజశేఖర్)..ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో దిట్ట. నేరస్తులను ఎవరైనా సరే..ఇట్టే కనిపెట్టేస్తాడు. ఓ మర్డర్ కేసులో పోలీసులు అతని సహాయం తీసుకుంటారు. అదే సమయంలో అతని భార్య ఇందు(ఆత్మీయ రాజన్) నుంచి విడిపోయిన జ్ఞాపకాలు శేఖర్ని వెంటాడుతుంటాయి. ఓ రోజు ఇందు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలియడంతో శేఖర్ ఆస్పత్రికి వెళ్తాడు. దురదృష్టవశాత్తు ఇందు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందుతుంది. ఈ కేసుపై శేఖర్‌కి అనుమానం రావడంతో వెంటనే విచారణ ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్లో ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఎవరో హత్య చేశారని తెలుస్తుంది.అసలు ఇందుని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును శేఖర్ ఎలా ఛేదించాడు? ఇందు నుంచి శేఖర్ విడిపోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘శేఖర్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ చిత్రాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే ఆ జానర్ చిత్రాలు ఎక్కువగా హిట్ అవుతుంటాయి. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘శేఖర్’లో ఆ ఉత్కంఠత కాస్త తగ్గింది. 2018లో వచ్చిన మలయాళ చిత్రం జోసెఫ్..అప్పట్లో సూపర్ హిట్. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం.. క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు అన్ని రకాల జానర్లకు సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉండడంతో, ఆ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘శేఖర్’ కథ ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి అందించడం కాస్త కష్టమే. అయితే దర్శకురాలు జీవిత మాత్రం.. కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి,కూతుళ్లు(రాజశేఖర్, శివాణి) మధ్య వచ్చే సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. అలాగే భార్యతో విడిపోవడానికి దారితీసిన కారణాలు, ఒకరి బాగు కోసం మరోకరు చేసే త్యాగం..అందరిని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే..హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వ్యవస్థలో ‘ఆర్గనైజ్డ్ మెడకల్ క్రైమ్’ ఎలా జరుగుతుందో ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. వైద్యరంగంలో ఇలాంటి స్కామ్‌లు కూడా ఉంటాయా? అని సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. స్కామ్‌ని బయటపెట్టేందుకు హీరో తీసుకునే సంచలన నిర్ణయం కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. క్లైమాక్స్‌లో ప్రకాశ్ రాజ్ ఇచ్చిన వివరణతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. అయితే సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మది సాగడం, ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడం ఈ సినిమాకు మైనస్. మలయాళం మూవీ జోసెఫ్ చూడకుండా, ఈ చిత్రాన్ని చూసే మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటనలో ఇప్పటికి జోష్ తగ్గలేదు. రిటైర్డ్ కానిస్టేబుల్ శేఖర్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో అయితే అద్భుతంగా నటించారు. ఆయన కంటతడి పెట్టిన ప్రతిసారి.. ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో తెరపై యంగ్‌గా, స్టైలీష్‌గా కనిపించాడు. ‘కిన్నెర’ పాటలో అయితే ఒకప్పటి రాజశేకర్ని చూస్తారు. ఇక హీరో భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్ న్యాయం చేశారు. శేఖర్ కూతురు గీత పాత్రలో శివాణి ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం. హీరో స్నేహితులుగా సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్, ప్రియురాలు కిన్నెరగా ముస్కాన్ ఆకట్టుకున్నారు. పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంది. చిన్ని చిన్ని ప్రాణం.. కిన్నెర పాటలతో మిగిలిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ పాటలన్నీ కథతో సాగుతాయే తప్ప..తెచ్చిపెట్టినట్లు ఉండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిం పెడితే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అది జరగపోతే అప్పుల పాలవుతాం: రాజశేఖర్
కోవిడ్ టైమ్‌లో చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను .ఇక జీవితం అయిపోయింది..సినిమాలను చేయలేను అనుకున్నా. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్‌తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకొని ‘శేఖర్’ చిత్రంలో నటించాను . ఈ చిత్రం నాకు చాలా స్పెషల్’అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. మీ కెరీర్లో ఎప్పుడులేనంతగా.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మా సినిమాను బతికించండి అని ప్రేక్షకులను వేడుకున్నారు.ఎందుకు? ఇంతవరకు మా వెనక ప్రాపర్టీ ఉంది. కాబట్టి సినిమాలు ఆడినా ఆడకపోయినా..పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు శేఖర్ సినిమా సక్సెస్ అయితేనే అప్పుల నుంచి బయటపడతాం. లేదంటే అప్పుల పాలవుతాం. అందుకే నాకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఓ ఢిపరెంట్ సినిమా ఎంచుకొని వచ్చాం. సినిమా బాగుందని తెలిసిన తర్వాతే థియేటర్స్ వెళ్లి చూడండి. కానీ త్వరగా వచ్చి చూడండి. ఈ టెన్షన్స్ కారణంగానే మనసులోనుంచి ఆటోమేటిగ్గా ఈ సినిమాను బతికించండి అని వచ్చింది. మీ గత సినిమాలతో పోలిస్తే.. శేఖర్‌లో కొత్తగా ఏం ఫీలయ్యారు? ఆర్టిస్టుగా చాలా సంతృప్తి చెందాను. శేఖర్ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్, బాధను చూపించడానికి బాగా చేశాను. ఈ చిత్రంలో మీ పాత్ర మేకోవర్ గురించి? 55-60 ఏళ్ల వయసు ఉన్న క్యారెక్టర్ నాది. ఈ క్యారెక్టర్‌కి కొత్త లుక్ ఉంటే.. సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించి.. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో వచ్చాం. ఆ గెటప్ బాగుందని చాలా మంది చెప్పారు. అయినా కొంచెం భయం ఉండేది. ఇటీవల ట్రైలర్ విడుదలైన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి చాలా మెచ్చుకున్నారని జీవిత చెప్పారు. దీంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. జీవిత దర్శకత్వం గురించి? షూటింగ్‌కి వెళ్తే మేమిద్దరం ఒక డైరెక్టర్, ఆర్టిస్టుగానే ఉంటాం. కానీ ప్రతి విషయంపై ఇద్దరం చర్చింకుంటాం. ఆమె గొప్ప దర్శకురాలు. అందరి నుంచి కావాల్సిన పనిని రాబట్టుకుంటుంది. మలయాళం మూవీ జోసెఫ్ మూవీని రీమేక్‌గా ఎంచుకోవడానికి కారణం? నా గత సినిమాలు ఒక్కసారి తలంబ్రాలు, అంకుశం,ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి.. ఇవన్నీ రీమేక్ సినిమాలే. అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందుకే జోసెఫ్ మూవీ ఎంచుకున్నాం. మలయాళంలో పెద్ద సక్సెస్ అయిన సినిమా అది. నేను గతంలో చాలా మళయాల మూవీలను రీమేక్ చేసి హిట్ కొట్టాను. రీమేక్‌లకు సక్సెస్ గ్యారెంటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జోసెఫ్ని సెలెక్ట్ చేశాం. ఈ చిత్రంలో మీ కూతరు శివాణి నటించారు. ఆమె నటన గురించి? మొదట ఈ చిత్రంలో కూతురి పాత్రలకు శివాణి, శివాత్మికలను కాకుండా వేరే వాళ్లను తీసుకుందామని అనుకున్నాం. ఈ విషయం జీవితతో చెబితే.. లేదంటే..మన ఇద్దరి కూతుళ్లలో ఎవరినో ఒకరిని పెడితే..ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. మీ కూతురు అని చెప్పడానికి ఎక్కువ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడడానికి బాగుంటదని చెప్పింది. నేను ఓకే అన్నారు. ఇద్దరిలో ఎవరు చేస్తారని అడిగితే..ఇద్దరు చేస్తామని చెప్పారు. చివరకు అక్క కోసం శివాత్మిక త్యాగం చేసింది(నవ్వుతూ..) మీ పాత్రలకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లు ఉన్నారు కదా? మధ్యలో 10 ఏళ్లు సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేదు. గత పదేళ్లుగా శ్రీనివాస్ మూర్తి నా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఎవరు డబ్బింగ్ చెప్పారో ఆడియన్స్ కూడా గుర్తుపట్టకుండా ఇద్దరు బాగా చెప్పారు. శేఖర్ చిత్రానికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. 37 ఏళ్ల నా సినీ కెరీర్లో 27 ఏళ్లు సాయికుమార్, 10 ఏళ్లు శ్రీనివాస్ మూర్తి నా పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. కోవిడ్ టైమ్‌లో చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ని ఫేస్ చేశారు కదా? అవును. చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను. మళ్లీ కోలుకుంటానని అనుకోలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి అక్కడ టీవీ పెట్టారు. సినిమాలో హీరోలు చేస్తున్న ఫైట్స్, డాన్స్‌లు చూసి.. నేను కూడా ఇలా ఉండేవాడిని.. ఇప్పుడిలా అయిపోయిందే అని బాధపడేవాడిని. ఇక జీవితం అయిపోయిందని అనుకున్నాను. ఇక సినిమాలు చేయలేనని అనుకొని జోసెఫ్ రీమేక్ హక్కులను వేరే వాళ్లకు ఇవ్వమని చెప్పాను. కానీ జీవితతో పాటు అందరూ.. నువ్వు కోలుకుంటావని భరోసా ఇచ్చారు. సినిమాపై ఉన్న కసితో ఒక్కొక్కటిగా మళ్లీ నేర్చుకొని ‘శేఖర్’ మూవీ చేశాను. నా కెరీర్లో చేసిన సినిమాలన్నింటిలో ‘శేఖర్’మూవీ చాలా స్పెషల్. ఇంత ఎనర్జిటిక్ పాత్రను మళ్లీ చేయలేను అనుకుంటా. ఒరిజినల్ మూవీతో పోలిస్తే ‘శేఖర్’లో ఏమైనా మార్పులు చేశారా? పెద్దగా మార్పులు చేయలేదు. మలయాళంలో కొంచెం పేస్ స్లోగా ఉంటుంది. తెలుగులో అలా ఉంటే పనికిరాదు. మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మలయాళం చిత్రంలో కొన్ని సీన్స్‌కి వివరణ ఉండదు..ఇందులో ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా వివరణ ఇచ్చాం. నిడివి కూడా ఒరిజినల్‌తో పోలిస్తే.. ఈ చిత్రం నిడివి తక్కువ. మీ అమ్మాయి(శివాణి) పాత్రను ఏమైనా పెంచారా? లేదు. మా అమ్మాయి కదా అని పాత్రను పెంచితే.. సినిమాను చెడగొట్టినవాళ్ల అవుతాం. అలా చేయలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిగ్ గురించి? ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో నా పాత్ర స్మోకింగ్ చేయాలి. కానీ నా అనారోగ్యం కారణంగా స్మోకింగ్ చేయొద్దని వైద్యులు చెప్పారు. అనూప్ తన మ్యూజిగ్తో ఈ సీన్స్ మ్యానేజ్ చేశారు. కోవిడ్ టైమ్‌లో మీ ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి మీ బాగోగులు చూశారు.ఎలా అనిపించింది? నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడే నాతో ‘మీ ఇద్దరు కూతుళ్లే నిన్ను కాపాడారు.గుర్తుపెట్టుకో. నా కొడుకులు కూడా నన్ను అలా చూసుకోలేదు’అన్నాడు. నిజంగా నా కూతుళ్లు, జీవిత ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నారు. కోవిడ్ టైమ్‌లో మేం నలుగురం ఐసీయూలోనే ఉండిపోయాం. నేను ఇలా లేస్తే చాలు..డాడీ ఏం కావాలి అంటూ ఇద్దరు వచ్చేవాళ్లు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. మీ నలుగురు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా? ఉంది. కొన్ని కథలు కూడా వచ్చాయి. ‘దొరసాని’ ఫేమ్ మహేందర్ కూడా మా నలుగురితో ఓ సబ్జెక్ట్ అనుకుంటున్నాడు.మేం కొన్ని మార్పులు చెప్పాం. అలాగే ప్రవీణ్ సత్తారు కూడా గరుడవేగ పార్ట్2లో ఇద్దరు కూతుళ్లను యాడ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. భవిష్యత్తులో తప్పుకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం. ప్రీరిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు మాట్లాడుతూ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చామని చెప్పారు.ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అని ఫీలయ్యా(నవ్వుతూ..) కొత్త సినిమాలు ఏం ఉన్నాయి? త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాం. -
రాజశేఖర్‌గారి వల్ల ఫేమస్ అయ్యా! – డైరెక్టర్ సుకుమార్
‘‘నా ఫ్రెండ్ కృష్ణ అని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. తను మా ఊర్లో అందర్నీ ఇమిటేట్ చేస్తుంటే నేను అసూయపడేవాణ్ణి. మొదటిసారి మా ఊర్లో రాజశేఖర్‌గారిని ఇమిటేట్ చేశాను.. దాంతో ఫేమస్ అయ్యాను. స్కూల్లో నన్ను రాజశేఖర్‌గారిలా చేయమంటే చేసేవాణ్ణి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న సుకుమార్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్‌గారు చేసిన ‘ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం’.. ఇలాంటి సూపర్‌డూపర్ సినిమాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి.. ఆ టైమ్‌లో ఆయనకు వీరాభిమాని అయ్యాను. సినిమాల్లోకి రాగలను, ఏదైనా చేయగలను అనే ఆలోచన నాలో ఏర్పడటానికి ఆయనే కారణం. ఆయనలోని గొప్ప విషయం ఏంటంటే.. మనందరం సినిమా పరిశ్రమలో ఉంటూ డబ్బులు, పేరు సంపాదిస్తూ మన పిల్లల్ని, కుటుంబాన్ని మాత్రం ఇండస్ట్రీకి దూరం పెడుతుంటాం. కానీ ఆయన ఇద్దరమ్మాయిలను (శివాని, శివాత్మిక) ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు హ్యాట్సాఫ్. తద్వారా ఇండస్ట్రీ ఒక పవిత్రమైన ప్రదేశం అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒక డైరెక్టర్‌కి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది జీవితగారు అటు ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు భర్తని హీరోగా పెట్టి ఓ సినిమాకి దర్శకత్వం చేస్తూ భారాన్ని మోసినందుకు ఆమెకు దండాలు. జీవితగారి కోసమైనా ‘శేఖర్’ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కరోనా వల్ల చావు అంచులదాకా వెళ్లి వచ్చి ‘శేఖర్’ చేశాను.. ప్రజల ఆశీర్వాదాలే నన్ను బతికించాయి. నన్ను బతికించారు.. ‘శేఖర్’ చూసి నా బతుకుదెరువుని కూడా బతికించండి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసినప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా కోసం మాకంటే కూడా జీవితగారే ఎక్కువ కష్టపడ్డారు. పోస్ట్ ప్రొడక్షన్లో మా పిల్లలు (శివాని, శివాత్మిక) జీవితకు ఎంతో సాయంగా ఉన్నారు’’ అన్నారు. నటుడు సముద్ర ఖని, కెమెరామేన్ మల్లిఖార్జున్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత
టాలీవుడ్లో యాంగ్రీ ఎంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా నటించింది. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా మే 20న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో డైరెక్టర్ జీవిత రాజశేఖర్ ముచ్చటించారు. 'కొన్ని పరిస్థితుల వల్ల దర్శకురాలిగా మారాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయలానే ఆసక్తి ఎప్పుడూ లేదు. తమిళంలో సూపర్ హిట్ అయిన ట్రూ స్టోరీ శేషు మూవీని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా కథను మార్చకుండా తీయాలని అనుకున్నాం. అలా చేసేందుకు ఏ డైరెక్టర్ ముందుకు రాలేదు. దీంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకురాలిగా అది నా మొదటి చిత్రం. మలయాళంలో హిట్ సాధించిన జోసెఫ్ సినిమాను శేఖర్ పేరుతో తెరకెక్కించాం. 'పలాస' డైరెక్టర్ కరుణ కుమార్, నీలకంఠను కలిశాం. వారు బిజీగా ఉండటంతో నేనే డైరెక్షన్ చేశాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'శేఖర్' ఉంటాడు అనేలా ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ.. యూట్యూబ్ వారే థంబ్‌నేయిల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు.' అని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ 'వన్ వీక్‌లో షూట్ స్టార్ట్ అవుతుంది అనగా రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సీరియస్ కావడంతో తను బతుకుతాడా.. లేదా అనే పరిస్థితి ఏర్పడింది. అందరి ఆశీర్వాదంతో తను రికవరీ అయి ఈ సినిమా చేశారు. ఇందులో డాటర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివానినే కూతురిగా చేయిస్తే బాగుంటుందని చేయించాం. అందరూ రాజశేఖర్ నెగెటివ్ రోల్స్ చేస్తారా.. అని అడుగుతున్నారు. మొదట్లో తన జర్నీ విలన్ గానే మొదలైంది. బారతి రాజా దర్శకత్వంలో విలన్‌గా నటించారు. తర్వాత హీరోగా చేయడంతో బిజీ అయ్యారు. అయితే రామ్ చరణ్ సినిమా "ధ్రువ" లోని అరవిందస్వామి లాంటి క్యారెక్టర్, పెదరాయుడులోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్‌టచబుల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తారు. అలాగే చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారు. అలాగే నన్ను కూడా సేమ్ క్వశ్చన్ వేస్తున్నారు. నాకు మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.' అని పేర్కొన్నారు. -
ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం : రాజశేఖర్ ఎమోషనల్
‘‘శేఖర్’ సినిమా స్టార్టింగ్‌లో కరోనా బారిన పడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకుల ప్రార్థనలు నన్ను బతికించింది ఈ సినిమా కోసమేనేమో! మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం’’ అన్నారు రాజశేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘శేఖర్’ సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో అడివి శేష్ ‘శేఖర్’ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసి, మాట్లాడుతూ – ‘‘రాజశేఖర్‌గారి ‘మగాడు’ చిత్రం నా ఫేవరెట్. ‘శేఖర్’ సినిమా ట్రైలర్ బాగుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించినందు వల్ల ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. మహిళలు ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువమంది ప్రోత్సహించరు. ‘శేఖర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మా ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమాయే ‘శేఖర్’. నేను మిస్ ఇండియా పోటీకి అర్హత సాధించడానికి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను ఎంచుకుంటే తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వగా, నేను తమిళనాడు కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టుకున్నాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుడు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ మూవీ నుంచి రాజశేఖర్‌ను తప్పించారా? జీవిత వల్లే ఆయనకు ఆఫర్ పోయిందట!
Rajasekhar Removed From Sriwass and Gopichand Movie: ఫ్యామిలీ హీరోలుగా మెప్పించిన నటుడు జగపతి బాబు, శ్రీకాంత్‌లు విలన్స్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే విలనిజంలో జగపతి బాబుకు వందకు వందశాతం మార్కులు కొట్టెసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అఖండతో శ్రీకాంత్ కూడా ప్రతి కథనాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక వీరి జాబితాల్లోకి యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా చేరాలనుకున్నాడు. మంచి అవకాశం వస్తే తాను విలన్‌గా చేసేందుకు సిద్ధం అంటూ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు! ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న రాజశేఖర్‌కు జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఎలాంటి పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్ ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను నుంచి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్‌ను మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ స్థానంలో జగపతి బాబును రీప్లేస్ చేసినట్లు సమాచారం. చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? అయితే గోపిచంద్ సినిమా నుంచి రాజశేఖర్‌ను తప్పించడానికి కారణమేంటో తెలియదు కానీ, ఆయనకు ఈ ఆఫర్ పోవడానికి ఆయన భార్య జీవిత కారణమంటూ కొందరూ అంటున్నారు. ఈ సినిమా రాజశేఖర్ పాత్ర విషయంలో జీవిత ఎక్కువగా కలుగ చేసుకుందట. ఈ విషయంలో ఆమె ప్రమేయం నిర్మాతలకు చికాకు తెప్పించిదట. దీంతో గోపించంద్-శ్రీవాస్ ప్రాజెక్ట్ నుంచి రాజశేఖర్‌ను తీసేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై చిత్ర బృందం కానీ, జీవిత రాజశేఖర్‌లు స్పందించే వరకు వేచి చూడాలి. అయితే ఇది విన్న పలువురు విలన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రాజశేఖర్ ఆశలకు జీవిత విలన్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
స్టార్ హీరోకు బాబాయ్‌గా హీరో రాజశేఖర్!, ఏ సినిమాలో అంటే..
ప్రస్తుతం హీరో రాజశేఖర్ హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన శేఖర్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో ప్రాజక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఈ క్రమంలో రాజశేఖర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబో ఎన్టీఆర్30(#NTR30) ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: డబ్బు కోసం ఇంత దిగజారాలా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్ కాగా చిత్రంలో ఎన్టీఆర్ బాబాయ్‌ది చాలా పవర్ ఫుల్ రోల్ అని, ఆ పాత్రకు రాజశేఖర్ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించాడట. దీంతో వెంటనే ఆయనను సంప్రదించి పాత్ర గురించి వివరించగా రాజశేఖర్ దీనిక ఫిదా అయ్యారని వినికిడి. దీంతో ఎన్టీఆర్‌కు బాబాయ్‌గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ఈ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా గతంలో పవర్ఫుల్ క్యారెక్టర్స్.. విలన్ రోల్స్ చేసే అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని గతంలో రాజశేఖర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ పాత్ర చేయాలనుకుంటున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ హీరోలుగా ఆకట్టుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోయిన జగపతి బాబు, శ్రీకాంత్‌లు ఇప్పటికే విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన విలక్షణ నటనతో విలన్‌గా జగపతి బాబు పరిశ్రమలో సెటిలైపోయాడు. ఇక తాజాగా అఖండతో ప్రతికథానాయకుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు శ్రీకాంత్. -
‘ఆ భయంలో నుంచి పుట్టిన కథే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈ చిత్రం’
‘‘కేవీ గుహన్గారివంటి అద్భుతమైన టెక్నీషియన్‌తో నా కుమార్తె శివానీ వర్క్ చేస్తుందని తెలిసి హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో శివానీకి కరోనా సోకింది. ఆ తర్వాత నాకూ కరోనా పాజిటివ్ అని తేలింది. తన వల్ల నాకు కరోనా వచ్చిందని శివానీ ఏడ్చింది. తను హీరోయిన్గా నటించిన ‘అద్భుతం’ సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో..ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమాకు అంతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ అన్నారు. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు.. ఎక్కడ.. ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవి ప్రసాద్‌రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గుహన్‌గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. సినిమా చూశాను. పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘పూర్తిగా వెబ్‌క్యామ్‌తో సినిమా తీశాం. కరోనా సమయంలో అసలు బతుకుతామో లేదో అనే భయంకలిగింది. ఈ భయంలో నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. అదిత్ పెర్ఫార్మెన్స్ చూసి షాకయ్యాను. శివానీ అమాయకత్వం నచ్చింది. యాక్ట్రస్‌గా నిరూపించుకోవాలనే కసి ఆమెలో కనిపించింది’’ అన్నారు కెవీ గుహన్. ‘‘నిర్మాత సురేష్‌బాబుగారు ప్రోత్సహిస్తున్నారు. మరో నిర్మాత ‘దిల్’ రాజు మా సినిమాను చూసి మెచ్చుకున్నారు’’ అన్నారు రవి. ‘‘ఇది నా 17వ సినిమా. నా కెరీర్ కొంచెం తగ్గినప్పుడు రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ నాకు బూస్ట్ ఇచ్చింది.’’ అన్నారు అదిత్. ‘‘ఈ ప్రాజెక్ట్ నాకు అదిత్ వల్లే వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కేవీ గుహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు శివానీ. ఈ కార్య క్రమంలో సంగీత దర్శకుడు సైమన్ కింగ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం
ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య పద్మావతి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో ఈ నెల 13న ఆమె కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 30) ఉత్తేజ్ తన భార్య పద్మ సంస్మరణ సభను హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పలువురు టాలీవుడ్ ప్రములు హజరై పద్మకు ఘన నివాళి అర్పించారు. చిరును చూడగానే ఉత్తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి ఆయనను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయనను, కూతురు చేతనను ఓదార్తూ చిరు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్ ఇక ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘భార్యా వియోగం అన్నది చాలా దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను. హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఆపద సమయంలో ఉత్తేజ్‌కు మనమందరం అండదండగా ఉండాలి. ఈ విషాదం నుండి ఉత్తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సంతాప సభకు మెగాస్టార్‌తో పాటు మెగా బ్రదర్ నాగాబాబు, హీరోలు డా. రాజశేఖర్, శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య -
Gopichand: మల్టీస్టారర్ మూవీలో..?
తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాల సందడి బాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్–రామ్‌చరణ్, Ðð ంకటేశ్– వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్–రానా.. ఇలా ఇద్దరు హీరోలు కలసి నటిస్తున్నారు. తాజాగా మరో మల్టీస్టారర్‌కి రంగం సిద్ధమవుతోందట. రాజశేఖర్–గోపీచంద్ కాంబినేషన్లో డైరెక్టర్ శ్రీవాస్ ఓ మల్టీస్టారర్‌కి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘డిక్టేటర్’ వంటి సినిమాలతో శ్రీవాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గోపీచంద్–శ్రీవాస్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. కాగా రాజశేఖర్ చేతిలో ప్రస్తుతం ‘శేఖర్, ఆర్ఎస్ 92, మర్మాణువు’ సినిమాలుండగా, గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు. -
రాజశేఖర్ సరికొత్త దెయ్యం.. ప్రేక్షకులను భయపెడతాడా..!
రాజశేఖర్ హీరోగా, స్వాతీ దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవా, బెనర్జీ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 16న విడుదల కానుంది. బుధవారం రామ్‌గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సరికొత్త దెయ్యం కథ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ మేకప్ లేకుండా సహజంగా నటించడం విశేషం. స్వాతీ దీక్షిత్ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ప్రొడ్యూసర్స్: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె. సాయి కార్తీక్ గౌడ్, కెమెరా: సతీష్ ముత్తాల, సంగీతం: డీఎస్ఆర్. చదవండి: ఫుల్ స్పీడ్‌లో రాజశేఖర్.. 92వ సినిమా అదేనట -
ఫుల్ స్పీడ్‌లో రాజశేఖర్.. 92వ సినిమా అదేనట
హీరో రాజశేఖర్ వరుసపెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానులని ఖుషి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా 91వ సినిమాగా రాబోతున్న శేఖర్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసందే. తాజాగా తన 92వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేశారు రాజశేఖర్. ‘గతం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మేకర్స్ దర్శకత్వంలో రాజశేఖర్ 92వ సినిమా చేయనున్నారు. కిరణ్ కొండమడుగల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. Here's #RS92ThemePoster🔥 After #Shekar, @ActorRajasekhar teams up with the makers of the super hit film #Gatham for #RS92. Banners: @off_beat_films @SOriginals1 @PegasusCineC 🎬: @kkondamadugula @Rshivani_1 @ShivathmikaR @bpoldaz @nooble451 @HarshaPratap pic.twitter.com/w7XAtWKiI9 — BARaju (@baraju_SuperHit) February 6, 2021 శివాణి-శివాత్మిక, సృజన్, భార్గవ, హర్ష సంయుక్తంగా నిర్మించనున్నారు. 2021లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. తాజాగా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో మందు గ్లాసు, కళ్ళద్దాలు, బుల్లెట్స్, గన్ , న్యూస్ పేపర్ ఇవన్నీ చూస్తుంటే ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుందని, ఇందులో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు అర్ధమవుతుంది. (చదవండి: రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’.. ఫస్ట్‌లుక్) -
కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్
కరోనా మహమ్మారి బారిన పడిన హీరో రాజశేఖర్ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబరులో రాజశేఖర్, జీవితలతో పాటు ఆయన కుమార్తెలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తొలుత శివాని, శివాత్మిక కరోనా నుంచి కోలుకోగా ఆ తర్వాత జీవిత కోలుకున్నారు. అయితే రాజశేఖర్ మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు– జీవిత ‘‘రాజశేఖర్‌గారు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు నేను, మా అమ్మాయిలు కూడా ఆస్పత్రిలోనే ఉంటూ ఆయన్ని చూసుకున్నాం. డాక్టర్ కృష్ణగారు, ఇతర డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్స్‌తో పాటు యాజమాన్యం వారు మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. అందుకే రాజశేఖర్‌గారు ఇంత పెద్ద విపత్తు నుంచి బయట పడ్డారు. రాజశేఖర్‌గారు త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అన్నారు జీవిత. -
ఆస్పత్రి నుంచి రాజశేఖర్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్ : హీరో రాజశేఖర్ కరోనాను జయించారు. సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఆయన భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక త్వరగా ఈ మహమ్మారి నుంచి బయట పడగా.. రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం కాస్త క్షీణించింది. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. (చదవండి : చిరంజీవికి కరోనా పాజిటివ్) గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. ఆయన ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా రాజశేఖర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నెగిటివ్ రావడంతో ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేసారు. ఈ విషయాన్నీ రాజశేఖర్ సతీమణి జీవిత తెలిపారు. మెదట్లో ఆయన ఆరోగ్యం చలా క్రిటికల్ స్టేజికి వెళ్లిందని, వైద్యులు తీవ్రంగా కృషి చేసి ఆయనను కాపాడరని జీవిత అన్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. Jeevitha Rajasekhar thanked Doctors and medical staff of City Neuro Centre for their support during the treatment @ActorRajasekhar pic.twitter.com/Klkjj6CGJe — BARaju (@baraju_SuperHit) November 9, 2020 -
రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు: జీవిత
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) -
నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్‌తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చేరిన హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని ప్రకటిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆసుపత్రిలోనే ఇంకా చికిత్స కొనసాగుతుందని, నిపుణలైన వైద్య బృందం నిరంతం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంటూ ఆయన కుమార్తె శివాని సైతం ట్వీట్ చేశారు. మీ అందరి ప్రార్థనలు, ఆశీస్తులకు కృతఙ్ఞతలు అని తెలిపింది. మరోవైపు రాజశేఖర సతీమణి జీవితకు కరోనా నెగిటివ్ రావడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇటీవలె నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. (రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ ) Team of doctors @CitiNeuro lead by Dr.Krishna garu have been taking the best care of my father . His condition is stable and he is responding to the medication! Thanks for all ur best wishes and prayers ..means a lot 🙏 — Shivani Rajashekar (@Rshivani_1) October 24, 2020 -
ఐసీయూలో హీరో రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చేరిన హీరో రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు గురువారం ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ‘ పిల్లలు.. శివాత్మిక, శివానీ ఇద్దరికీ బాగానే ఉంది. నేను, జీవిత చికిత్స తీసుకుంటున్నాం’ అని ట్విట్టర్ ద్వారా నాలుగు రోజుల క్రితం ఆయన తెలిపిన సంగతి విదితమే. కాగా, రాజశేఖర్ ఆరోగ్యం విషమించిందన్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. ‘నాన్నగారు కోవిడ్‌తో పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు కావాలి. మీ ప్రేమతో ఆయన మరింత ఆరోగ్యంగా బయటకు వస్తారు’ అని ఆయన కుమార్తె శివాత్మిక గురువారం ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా కూడా ఆయన కుటుంబం తెలిపింది. -
రాజశేఖర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మికకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, రాజశేఖర్ ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని గురువారం ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. ‘ప్రియమైన ప్రతి ఒక్కరికి కోవిడ్‌తో నాన్నా పోరాటం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ అతను గట్టిగా పోరాడుతున్నాడు. మీ ప్రార్థనల ప్రేమ శుభాకాంక్షలు మమ్మల్ని రక్షిస్తాయని అనుకుంటున్నాను. నాన్నా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అడుగుతున్నాను. మీ ప్రేమతో, అతను త్వరగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను’ అని శివాత్మిక ట్వీట్ చేసింది. (చదవండి : నాన్న కోవిడ్‌తో పోరాడుతున్నారు: శివాత్మిక) ఆతర్వాత కాసేపటికే నాన్న బాగానే ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో శివాత్మిక ట్వీట్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్ త్వరగా కోలుకొవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న, నా సహా నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ధైర్యంగా ఉండు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక రాజశేఖర్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి సిబ్బంది హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్లో ఉన్నప్పటికీ వైద్యానికి హీరో రాజశేఖర్ స్పందిస్తున్నారని తెలిపారు. Dear @ShivathmikaR Wishing your loving dad and my colleague and friend #DrRajashekar a speedy recovery. All our best wishes and prayers are with him and your family. Stay Strong. https://t.co/7vorNZ8VMK — Chiranjeevi Konidela (@KChiruTweets) October 22, 2020 -
రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్..
-
రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్..
హీరో రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవితలకు చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన కుమార్తె శివాత్మిక అరగంటలో రెండు ట్వీట్లు చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ శివాత్మిక మొదటి ట్వీట్ చేశారు. అందరి అభిమానంతో క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. (చదవండి: మేం బాగానే ఉన్నాం) Dear All. Nanna's fight with covid has been difficult, yet he is fighting hard. We believe that it is your prayers love and well wishes that protect us and keep us going. I am here asking you, to pray for Nanna's speedy recovery! With your love, he'll come out stronger💖🙏 — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020 మరి కాసేపటికే.. నాన్న బాగానే ఉన్నారంటూ... మరో ట్వీట్ చేశారు శివాత్మిక. కరోనా నుంచి కోలుకుంటున్నారంటూ రెండో ట్వీట్లో పేర్కొన్నారు. ఇక జీవితకు కూడా కరోనా నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. I cannot thank you all enough for your love and wishes! But please know, he is not critical.. he is stable and getting better! We just need your prayers and positivity💖 Thank you once again💖 Do not panic Please do not spread fake news💜 — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020 -
మేం బాగానే ఉన్నాం
రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకింది. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘జీవితాకి, పిల్లలకి, నాకు ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాం. పిల్లలిద్దరికీ పూర్తిగా తగ్గిపోయింది. నేను, జీవిత ప్రస్తుతం బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి వెళ్లనున్నాం’’ అని ట్వీట్ చేశారు రాజశేఖర్. -
రీల్లోనే కాదు రియల్‌గాను హిట్ పెయిరే
(వెబ్‌స్పెషల్): రోజులు మారాయి.. ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలు కూడా జాబ్ చేసే అమ్మాయిలనే కోరుకుంటున్నారు. పెళ్లి విషయానికి వస్తే.. ఇద్దరు ఉద్యోగం చేస్తూంటే.. అమ్మాయిది, అబ్బాయిది ఒకే ఫీల్డ్ అయితే మరీ మంచిది అంటున్నారు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ రంగంలోని వారిని వివాహం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ సినీ ఫీల్డులో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా బయటి వ్యక్తులను వివాహం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలా ఇండస్ట్రీలోని వారినే వివాహం చేసుకుని.. రీల్లోనే కాదు రియల్‌గా కూడా హిట్ పెయిర్ అనిపించుకుంటున్న వారిని ఓ సారి చూడండి.. కృష్ణ-విజయ నిర్మల 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరతో వివాహం అయ్యింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం అయినప్పటికి అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ టైంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం మొదలయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. అలా మెల్లిగా శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ వివాహం 1997లో జరిగింది. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: మొత్తం స్టూడియోలోనే?) జీవిత-రాజశేఖర్ జంట పదాలుగా తెలుగు పరిశ్రమలో ఈ భార్యాభర్తల పేర్లు ఎప్పటికీ పాపులరే. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమె వద్దు తొలగించండి’ అంటూ దర్శక నిర్మాతలకు చెప్పారు. ఆయన ఇలా చెప్పడంతో దర్శకనిర్మాతలు.. రాజశేఖర్‌నే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగార్జున- అమల టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో అక్కినేని నాగార్జున-అమల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట సిల్వర్ స్క్రీన్ పై 'ప్రేమయుద్ధం' 'కిరాయి దాదా' 'శివ' 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేష్ సోదరితో వివాహం జరగడం.. విడాకులు తీసుకోవడం జరిగింది. (చదవండి: నో ప్యాంట్ 2020.. జీన్స్‌కి గుడ్‌బై) మహేష్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే ఎనలేని ప్రేమ. తన సక్సెస్‌కు కారణం నమ్రత అని చెప్తారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు లవ్ చేసుకున్న వీరు 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి దగ్గరి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అతి నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చై-సామ్ ప్రస్తుతం ఉన్న దంపతుల్లో చై-సామ్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఏ మాయ చేశావే చిత్రంలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఆటో నగర్ సూర్య, మనం, వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంలో జంటగా నటించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్గా నటించారు. 2000 సంవత్సరంలో నటుడు అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వ్యక్తిగతంగానే కాక ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్, దీపికా- రణ్వీర్ దంపతులు ప్రేమించి వివాహం చేసుకుని.. ఆనందంగా, ఆదర్శంగా జీవిస్తున్నారు. -
గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ మృతి
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. ఆమె చార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించడం గమనార్హం. -
వాస్తవ సంఘటనలతో...
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘అర్జున’. మరియం జకారియా హీరోయిన్. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను నట్టికుమార్ ఆవిష్కరించారు. నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది. వాస్తవ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించాం. సూర్యనారాయణ అనే రైతు పాత్రలో, ఆయన తనయుడు అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఓ హైలైట్. దాదాపు 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
అర్జున... సన్నాఫ్ సూర్యనారాయణ
రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘అర్జున’. ఇందులో మరియం జకారియా హీరోయిన్గా నటించారు. కన్మణి దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ‘‘ఇందులో సూర్యనారాయణ అనే రైతు, అతని కొడుకు అర్జునగా ద్విపాత్రాభినయం చేశారు రాజశేఖర్. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. వాస్తవ సంఘటనల ప్రేరణగా రాజకీయ నేపథ్యంలో కన్మణి బాగా తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, శివాజీరాజా తదితరులు నటించిన ఈ సినిమాకు ‘వందేమాతరం’ శ్రీనివాస్ సంగీతం అందించారు. -
రాజశేఖర్ నటవిశ్వరూపం ‘అర్జున’
యాంగ్రీ హీరో రాజశేఖర్, మరియం జకారియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున’. రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి క్రాంతి, నట్టి కరుణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 15న విడుదల చేస్తారో లేక ‘అర్జున’ను ఆలస్యంగా విడుదల చేస్తారో వేచి చూడాలి. చిత్ర ప్రమోషన్లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ తన పాత్రలలో నట విశ్వరూపం చూపించారని, ప్రస్తుత రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమని నిర్మాతలు పేర్కొన్నారు. వయసు మళ్లిన సూర్యనారయణ అనే రైతు పాత్ర, ఆయన తనయుడిగా అర్జున్ పాత్రలో రాజశేఖర్ ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. అంతేకాకుండా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయన్నారు. యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దర్శకుడు కన్మణి ఈ చిత్రాన్ని మలిచారని నిర్మాతలు పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్, కాదంబరి కిరణ్, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందిస్తున్నాడు. -
నటుడు రాజశేఖర్ లైసెన్స్ రెన్యువల్‌కు నో..
బండిపై వెళుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపినా.. డ్రైవింగ్ లైసెన్స్‌పై వేటు పడుతుంది. సాధారణంగా చాలామంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు తమను గమనించడం లేదనే ఉద్దేశంతో సిగ్నల్ జంపింగ్, ఓవర్‌స్పీడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ నిఘా కెమెరాలకుచిక్కుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల హ్యాండీ కెమెరాలు సైతం క్లిక్‌మనిపిస్తున్నాయి. ఇలా పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఏడాది కాలంలో 1,242 డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధిలో 531, అత్తాపూర్ ఆర్టీఏ పరిధిలో 699 ఉన్నాయి. షాద్‌నగర్ పరిధిలో మరో 12 ఉన్నాయి. వీటిలో డ్రంకన్ డ్రైవ్ కింద పట్టుబడిన వారు సైతం ఉన్నారు. సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పాయింట్ల పద్ధతిని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 24 నెలల వ్యవధిలో 12 ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వివిధ ఉల్లంఘనలపై 3 నెలల నుంచి 6 నెలల వరకు సస్పెన్షన్ విధించారు. ఇలా మేడ్చల్ ఆర్టీఏ పరిధిలో ఒక లైసెన్స్ రద్దు కాగా, ఏడాది కాలంలో 1,120 మంది వాహనదారుల లైసెన్సులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక డ్రంకెన్ డ్రైవ్ కింద పట్టుబడి న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొన్న మరో 122 మంది లైసెన్సులను సైతం 6 నెలల వరకు రవాణా అధికారులు సస్సెండ్ చేశారు. ఓవర్‌లోడ్ కేసులే ఎక్కువ.. రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లిన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు నడిపే డ్రైవర్ల లైసెన్సులు ఎక్కువగా సస్సెండ్ అయ్యాయి. 338 మంది అలా తమ డ్రైవింగ్ లైసెన్సుల అర్హతను తాత్కాలికంగా కోల్పోయారు. ఇక సరుకు రవాణాకు వినియోగించే వాహనాల్లో ప్రయాణికులను తరలించిన మరో 17 మంది డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను సైతంఆర్టీఏ 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. సెల్ఫోన్లో మాట్లాడినా.. బండి నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడారో ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే కాదు. డ్రైవింగ్ లైసెన్సును సైతం కోల్పోవాల్సిఉంటుంది. అలా ఏడాదిలో 126 లైసెన్సులపై ఆర్టీఏ వేటు వేసింది. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే 3 పాయింట్లు నమోదవుతాయి. రెండేళ్లలో 12 పాయింట్ల వరకు నమోదైతేలైసెన్సుపై వేటు పడుతుంది. ఇలా 126 లైసెన్సులపై సస్పెన్షన్ విధించారు. ఓవర్‌స్పీడ్, రాష్ డ్రైవింగ్ వంటి కారణాలతో 9 లైసెన్సులను, సిగ్నల్ జంపింగ్‌పై 23 లైసెన్సులను ఆర్టీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. నటుడు రాజశేఖర్ లైసెన్స్ రెన్యువల్‌కు నో.. ఇటీవల రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సినీనటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయబోమని రవాణా అధికారులు స్పష్టం చేశారు. ఆయన వాహనం నడిపే సమయానికే డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిందని, దానిని రెన్యువల్ చేసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపారని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రమేష్ తెలిపారు. వివిధ రకాల ఉల్లంఘనల కింద 3 నెలల నుంచి 6 నెలల వరకు సస్పెండైన లైసెన్సులు ఆ తర్వాత చెల్లుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. -
మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి
-
మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ అవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబును ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకర్షించింది. అంతకుముందు రాజశేఖర్ ప్రవర్తనపై మోహన్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో చాలా మందికి ఏ సాయం కావాలన్న చేసే టీ సుబ్బిరామిరెడ్డి లాంటి పెద్దల సమక్షంలో ఇలా జరగడం బాధకరమన్నారు. అలాగే కార్యక్రమాన్ని ఫన్నీ వేలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘తాత గారైన కృష్ణంరాజు’ అని చెప్పి.. సభలో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు కలగచేసుకుని.. ‘మా’ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండటమే.. అందరు ఫ్యామిలీలా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీలు ఒకే వేదికపై కూర్చొని సరదాగా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేవారని మోహన్‌బాబు గుర్తుచేశారు. అలాగే తానూ, చిరంజీవి కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకుంటుంటామని చెప్పారు. అది సరదాకే తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవి కుటుంబం నాది.. నా కుటుంబం అతనిది అని అన్నారు. ఈ సమయంలో మోహన్‌బాబు వద్దకు వచ్చిన చిరంజీవి ఆయన బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టారు. అనంతరం మోహన్‌బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. చిరంజీవిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. తను భార్యకు భయపడను.. విధేయుడిని అయి ఉంటానని అన్నారు. గతంలో పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించిన ఇద్దరు కమెడియన్లను చిరంజీవి పిలిచి మరి హెచ్చరించారని తెలిపారు. సినీ పరిశ్రమ మంచి చెడులపై నలుగురం కూర్చొని మాట్లాడుదామని చిరంజీవి అన్నారని.. కానీ తాను అందుకు రాలేనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ తల్లిలాంటిందిని.. దీనిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి : ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితారాజశేఖర్ -
‘మా’ లో రచ్చ.. స్పందించిన జీవితారాజశేఖర్
-
‘మా’ డైరీ ఆవిష్కరణలో గందరగోళం
-
‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో అభిప్రాయబేధాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘మా’ డైరీ అవిష్కరణ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. రాజశేఖర్ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి రాజశేఖర్ మైకు లాక్కోవడంతో వివాదం తలెత్తింది. చిరంజీవి వ్యాఖ్యలపై రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. మొదటగా సభలో మాట్లాడిన చిరంజీవి.. ‘మా’లో మంచి ఉంటే మైక్‌లో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెబుదాం అని సముదాయించే ధోరణిలో చెప్పారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చిరంజీవి వ్యాఖ్యలపై నిరసనగా రాజశేఖర్ వేదికపైకి వచ్చి అక్కడ ఉన్నవారి కాళ్లకు నమస్కారం చేస్తూ.. ఆ సమయంలో మాట్లాడుతున్న పరుచూరి నుంచి మైకు లాక్కున్నారు. చిరంజీవి చెప్పిన అంశాలను తప్పుబట్టారు. చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అంటూ సినీ పెద్దలపై రాజశేఖర్ రుసరుసలాడారు. ఇండస్ట్రీలో అగ్గి రాజేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన కారు ప్రమాదానికి ‘మా’ పరిస్థితే కారణమని ఆరోపించారు. దీనిపై స్పందించిన చిరంజీవి.. ఆయన చెప్పిన మాటలకు విలువెక్కడుందని రాజశేఖర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాజశేఖర్ ప్రవర్తనను తప్పుబడుతూ, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. అదే సమయంలో వేదిక దిగి వెళ్లిపోయిన రాజశేఖర్.. మళ్లీ వచ్చి ‘మా’ పై తాను మాట్లాడింది అంతా నిజమేనని గట్టిగా మాట్లాడారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి.. రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజశేఖర్ పథకం ప్రకారమే ఈ కార్యక్రమాన్ని రసాభాస సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లు హామీ ఇచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్దికి సరైన ప్రణాళికతో ముఖ్యమంత్రులను కలుద్దామని చెప్పారు. అంతకుముందు ‘మా’ నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. మా డైరీ-2020’ తొలి ప్రతిని ఆవిష్కరించి రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, జీవిత, రాజశేఖర్ దంపతులు, నరేష్, రాజా రవీంద్ర, జయసుధ, హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అందరి అడ్రస్‌లు డైరీలో ఉన్నాయి. పేద కళాకారులకు సహాయ, సహకారాలు అందించాలి. అందుకోసం అందరు అగ్ర హీరోలను కలుస్తా’ అని తెలిపారు. మా అధ్యక్షుడు నరేశ్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ల మధ్య కొద్దికాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సినీ పెద్దల సమక్షంలో మూవీ అసోసియేన్‌లో భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ మాట్లాడిన అంశాలపై కాకుండా.. ఆయన ప్రవర్తించిన విధానంపై చాలా మంది ఖండిస్తున్నారు. సినీ పెద్దలపై రాజశేఖర్ నేరుగా కామెంట్లు చేయడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి. -
కథా బలం ఉన్న సినిమాలు హిట్టే
‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ట్రైలర్ చూస్తుంటే మంచి సందేశాత్మక చిత్రమని తెలుస్తోంది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. అందరూ బాగా నటించారు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. సంజయ్ ఇదామ, శ్రీనాథ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా జె.కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమా పాటల విడుదల వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి దగ్గర పనిచేసిన కరుణ కుమార్ ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. యాజమాన్య పాటలు బాగున్నాయి. కథా బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో కథతో పాటు సందేశం ఉన్నందున తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో విద్యార్థుల గురించి ఒక మంచి సందేశం ఉంది. ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటి జీవిత. ‘‘ఈ చిత్రం నాకు నచ్చింది.. అందుకే స్వయంగా విడుదల చేస్తున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. ‘‘తెలుగులో నేను తీసిన మూడో సినిమా ఇది. డబ్బు వస్తుందా?లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉంది’’ అన్నారు బి.ఓబుల్ సుబ్బారెడ్డి. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
మా సంతోషం కోసం...
కలిసి కూర్చుంటే మాటలు కలుస్తాయి. కూర్చొని మాట్లాడుకుంటే అపోహలు విడిపోతాయి. కలిసి కూర్చొని, మాట్లాడుకుంటూ.. భోజనాలు చేస్తే.. అదొక ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంది. జీవిత ‘మా’ సభ్యులందరినీ కార్తీక భోజనాలకు పిలుస్తున్నారు. ఆ విశేషాలను మనతో పంచుకున్నారు. వన భోజనాల ఏర్పాట్లతో హడావుడిగా ఉన్నారని తెలిసింది... జీవిత: ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ‘మా’ తరఫున వన భోజనాలు ఏర్పాటు చేసేవారు. అప్పుడు ఎప్పుడో చిరంజీవిగారి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ‘మా’ నుంచి చేయలేదు. ఇప్పుడు కూడా ‘మా’లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ‘మా’ ఆధ్వర్యంలో కాకుండా మేం పర్సనల్‌గా చేస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా ‘మా’ నుంచి చేసే ప్రయత్నాలు చేస్తాం. అంటే.. ఇప్పుడు జరిగేది ‘మా’ తరఫున కాదు. జీవితా రాజశేఖర్ తరఫున అంటారా? అవును. మా సంతోషం కోసం చేస్తున్నాం. వేదిక ఎక్కడ? ఫీనిక్స్‌లో ప్లాన్ చేస్తున్నాం. 300 నుంచి 400 మంది వస్తారని ఊహిస్తున్నాం. ‘మా’ అంటే నటీనటుల సంఘం మాత్రమే. మరి.. మిగతా శాఖల వాళ్లని కూడా పిలుస్తున్నారా? లేదు. ‘మా’ సభ్యులనే అనుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఎవర్నీ పిలవకూడదు అనుకుంటున్నాం. ఇలా మీరు నిర్వహించడంవల్ల ఏదైనా వివాదాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఎటువంటి వివాదాలు రావనే భావిస్తున్నాం. రాబోయే నెల రోజుల్లో ‘మా’లో ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాం. ప్రస్తుతానికి పరిష్కరించి, ఆ తర్వాత వన భోజనాలు ఏర్పాటు చేసేంత టైమ్ లేదు. కార్తీక మాసం వచ్చే వారంతో అయిపోతుంది కాబట్టి.. ఇది ప్లాన్ చేశాం. వనభోజనాలను మీరు హోస్ట్ చేయబోతున్నారని తెలిసి ‘మా’ మెంబర్స్ ఏమన్నారు? చాలామంది ఉత్సాహం చూపించారు. ఈ మధ్య కాలంలో ఎవరూ చేయలేదు. చాలా విరామం తర్వాత మీరు చేయబోతున్నారని హ్యాపీగా స్పందిస్తున్నారు. ఎటువంటి వంటకాలను ప్లాన్ చేశారు? ఇంకా ఏం అనుకోలేదు. ఆదివారం వెళ్లి వంట విభాగానికి చెందిన వారితో చేయబోయే వంటకాల గురించి చర్చించాలి. ఈ విందులో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారా? లైవ్ మ్యూజిక్ పెట్టాలనుకున్నాం. ఇంకా కొన్ని స్కిట్స్, గేమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వచ్చినవాళ్లందరూ బాగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఉంటుంది. నాలుగు వందల మంది అతిథులంటే మీకు చేతి నిండా పనే.. (నవ్వుతూ) చేస్తున్నది మేం అయినప్పటికి అందరూ సహాయం చేస్తారు. అలా అందరితో కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నాం. మీ కుమార్తెల విషయానికి వస్తే.. శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టారు. మీరు శివ భక్తులా? రాజశేఖర్‌గారు శివభక్తులు. ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం. రాజశేఖర్‌గారి మెడలో శివలింగం ఉంటుంది. శివభక్తి వల్లే మా కుమార్తెలకు శివానీ, శివాత్మిక అని పేర్లు పెట్టాం. కార్తీకమాసంలో మీరు పూజలు చేస్తారా? జనరల్‌గా కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు. నేనూ వెలిగిస్తాను. కానీ పెద్దగా పూజలు చేయను. రాజశేఖర్, మీ కుమార్తెల సినిమాల గురించి? రాజశేఖర్‌గారు హీరోగా చేయబోతున్న సినిమా జనవరిలో మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతా. ‘పెళ్ళిగోల’ వెబ్ సిరీస్ చేసిన మల్లిక్ దర్శకత్వంలో శివానీ హీరోయిన్గా ఓ సినిమా జరుగుతోంది. చైల్డ్ ఆర్టిస్టు తేజ హీరోగా నటిస్తున్నారు. ‘అద్భుతం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రచయిత. మంచి కథ. శివానిది మంచి పాత్ర. -
దేవుడి దయవల్ల క్షేమంగా బయటపడ్డా
-
పెద్ద ప్రమాదమే: జీవితా రాజశేఖర్
-
మాలో ఏం జరుగుతోంది?
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో ఏం జరుగుతోంది? అన్నది ఆదివారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నటుడు వీకే నరేశ్ అధ్యక్షతన కొత్త కార్యవర్గం ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే కార్యవర్గ సభ్యుల మధ్య అంతరాలు పెరగడంతో ఇటీవల వివాదాలు తలెత్తుతున్నాయని పలువురు భావిస్తున్నారు. ‘మా’లో అటు నరేశ్, ఇటు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ల వర్గాలు తయారయ్యాయని సమాచారం. ఆదివారం ‘మా’ సభ్యుల మీటింగ్ ఉందంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ జీవిత, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు, ఈసీ మెంబర్లకు మెసేజ్‌లు పంపడంపైనా వివాదం నెలకొంది. ఫిల్మ్‌చాంబర్‌లో ఆదివారం నిర్వహించిన ‘మా’ సమావేశం నరేశ్, రాజశేఖర్ వర్గాల మధ్య మాటల యుద్ధంతో వాడి వేడిగా సాగిందని టాక్. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నరేశ్ ‘మా’ కి నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టకపోగా, ‘మా’లోని 5.5కోట్ల మూల ధనం నుంచి ఖర్చు చేస్తున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారని భోగట్టా. ఇరువర్గాల వారిని ‘మా’ ట్రెజరర్ పరుచూరి గోపాలకృష్ణ సముదాయించేందుకు ప్రయత్నించినా, ఆయన మాట వినకపోవడంతో సమావేశం నుంచి బయటకు వచ్చేశారట. కాగా, కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ కాదని కేవలం ఫ్రెండ్లీ మీటింగే అని, త్వరలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని జీవితా–రాజశేఖర్‌లు చెప్పారు. నటుడు, ‘మా’ ఈసీ మెంబర్ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మా’లో కొందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఫీలవుతున్నారు. కృష్ణంరాజుగారు, చిరంజీవిగారు వంటి సినీ పెద్దలు జోక్యం చేసుకుంటేనే ‘మా’ సమస్యకి పరిష్కారం అవుతుంది’’ అన్నారు. సమావేశం అనంతరం బయటికి వచ్చిన ‘మా’ సభ్యులు ఎవరికి తోచింది వారు మీడియా ముందు చెప్పడం విశేషం. -
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమా చేశారు. నేనూ అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతుంటా... నాకు కథ నచ్చితే రెమ్యునరేషన్ ఇవ్వొద్దు అని. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులొస్తేనే ఇవ్వమని చెబుతా. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని నటుడు రాజశేఖర్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘1990లలో కశ్మీర్లో పండిట్లకు ఏం జరిగిందో అందరికీ తెలియాలని చేసిన ప్రయత్నం ఇది. ఆది ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం సాయికుమార్‌గారు.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కశ్మీర్ పండిట్ల ఎమోషన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదు. మాకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుదామని తీశాం’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘నాకు ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఆది మా అబ్బాయిలాంటివాడు’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ ఫంక్షన్‌కి నేను ఆది కుటుంబ సభ్యుడిగా వచ్చాను.’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘‘ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమిది’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి. నిర్మాతలు కేశవ్, ప్రతిభ, హీరో అడివి శేష్, నటులు కృష్ణుడు, మనోజ్ నందం, పార్వతీశం, కార్తీక్ రాజు, అనీష్ కురువిళ్ల, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. కెమెరా: జైపాల్‌రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
నా స్టైల్ ఏంటో తెలియదు
‘‘ఏ కథ తీసుకున్నా ముందు క్లైమాక్స్ రాసుకుంటాను. ముగింపు పూర్తయితే మిగతా కథను ఈజీగా రాసుకోవచ్చని నమ్ముతాను. కథ తయారవుతూ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందనుకుంటాను. ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కథను ఎలా అయినా అక్కడి వరకూ తీసుకెళ్లొచ్చు’’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పంచుకున్న విశేషాలు... ► ‘అ!, కల్కి’ సినిమాలకు క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలే బలం. అలాగని అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేలా ప్లాన్ చేయలేము. నెక్ట్స్ అనుకున్న కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉండొచ్చు? అలాగే నా సినిమాలు ఇలానే ఉంటాయి అని ఆడియన్స్ కూడా ఓ ముద్ర వేయకూడదు. ప్రస్తుతానికి నా జానర్ ఏంటి? నా స్టైల్ ఏంటో నాకే తెలియదు. మెల్లిగా తెలుసుకుంటున్నాను. ► ‘అ!’ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ రావాలంటే చాలా విషయాలను పరిగణించాలి. వాళ్లను హ్యాండిల్ చేయగలనా? కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేస్తానా?అనేవి చూస్తారు. ఆ ఉద్దేశంతోనే ‘కల్కి’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ టేకప్ చేశాను. ► ‘కల్కి’ కథను ముందు నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో తయారయ్యేసరికి నాకే మంచి ఎగై్జటింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రిప్ట్‌ను ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాలు రిఫరెన్స్ కోసం చూశా. ‘కేజీఎఫ్’ లాంటి ట్రీట్మెంట్ అయితే బావుంటుందని స్టైలిష్‌గా తీశాం. ► నేను ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. కానీ ఇలాంటి సినిమాలో ఉండాలి. అందుకే పెట్టడం జరిగింది. అన్ని సినిమాలు రివ్యూవర్స్‌కి నచ్చాలని లేదు. ‘అ!’ సినిమాకు బాగా రాశారు. ఈ సినిమా ఎవరి కోసం తీశామో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నన్నే రివ్యూ రాయమన్నా తప్పులు బడతానేమో? ► రాజశేఖర్‌గారు షూటింగ్ స్పాట్‌కి లేట్‌గా వస్తారని విన్నాను. కానీ వాళ్ల ఫ్యామిలీతో వర్క్ చేయడం నాకు సౌకర్యంగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కొన్నిరోజులు వాళ్లతో ట్రావెల్ అయ్యాను. చాలా స్మూత్‌గా జర్నీ నడిచింది. వీళ్లను భరించొచ్చు అని ముందుకెళ్లిపోయా(నవ్వుతూ). ► శ్రావణ్ భరద్వాజ్ నాకు కాలేజ్ టైమ్ నుంచి ఫ్రెండ్. నేను తీసిన యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా అందరి కంటే తనకే మంచి పేరొస్తుంది. ► ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా దర్శకుడు తప్పుకోవడంతో నేను జాయిన్ అయ్యాను. 31రోజుల్లో మొత్తం రీషూట్ చేశాను. దర్శకుడిగా క్రెడిట్ ఉండకూడదనేది అగ్రిమెంట్. ‘కల్కి’ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉందనడంతో ఆ సినిమా పూర్తి చేశాను. రీమేక్ సినిమా చేయడం కూడా ఓ ఎక్స్పీరియన్స్. ► ప్రస్తుతానికి కథలైతే సిద్ధంగానే ఉన్నాయి. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కలెక్షన్స్ అన్నీ చూసి నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చేస్తా. హాట్‌స్టార్ వాళ్లకి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ థ్రిల్లర్. ఇప్పటి వరకు అలాంటి కథ రాలేదు. -
ఇప్పుడు ఆ భయమే లేదు
‘‘సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎంతసేపు?’ అని ఆలోచించే యాక్టర్‌ని కాదు నేను. మనకిచ్చిన రోల్లో, మనకున్న స్క్రీన్ టైమ్‌లో ఒప్పుకున్న పాత్రకు, ఆ సినిమాకు మనమేం కొత్తదనం తీసుకురాగలం అని మాత్రమే ఆలోచిస్తాను. యాక్టర్‌గా చేసే ప్రతిదీ ఫుల్ లెంగ్త్ రోల్ అయ్యుండాలనీ సినిమా మొత్తం కనిపించాలనీ అనుకోను’’ అన్నారు అదా శర్మ. రాజశేఖర్, అదా శర్మ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అదా శర్మ పలు విశేషాలు పంచుకున్నారు. ► ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ‘అ!’ సినిమా నచ్చింది. తనతో సినిమా చేయాలనుకున్నా. ప్రశాంత్ ‘కల్కి’ కథ చెప్పగానే నచ్చింది. హీరోయిన్ పాత్రలను ఆయన విభిన్నంగా రాస్తారు. ఈ సినిమాలోనూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. తొలిసారి డాక్టర్ పాత్ర చేశా. ఈ పాత్ర అన్నీ కళ్ల ద్వారానే వ్యక్తపరుస్తుంది. తక్కువ మాట్లాడుతుంది. నిజజీవితంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాను నేను. అందుకే ఈ పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. ఇది పీరియాడికల్ మూవీ కాబట్టి రిఫరెన్స్ కోసం కొన్ని పాత సినిమాలు చూశాను. అప్పటి హీరోయిన్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అనే విషయాలను గమనించాను. పాత తరం నటీమణుల్లో వహీదా రెహమాన్, వైజయంతి మాల నాకు ఇష్టమైన హీరోయిన్లు. ► రాజశేఖర్గారిలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్‌తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ తొలి సినిమా చేస్తున్న హీరోకి ఉండే ఎగై్జట్‌మెంట్‌తో ఈ సినిమాకు వర్క్ చేశారాయన. తను సీనియర్, నేను జూనియర్ అనే ఫీలింగ్ సెట్లో ఎప్పుడూ లేదు. చాలా పాజిటివ్ పర్సన్. ► ‘క్షణం’ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. తెలుగు సినిమాలు వరుసగా ఎందుకు చేయడం లేదని తెలుగు ఫ్యాన్స్ అడుగుతుంటారు. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాను. సో.. హిందీలో వరుసగా రెండు సినిమాలు చేస్తే తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా చేయాలి, ఆ తర్వాత హిందీ సినిమా చేయాలి అనే స్ట్రాటజీతో ప్లానింగ్ చేయలేను. ► ప్రస్తుతం హిందీలో ‘కమాండో 3’, మ్యాన్ టు మ్యాన్’ సినిమాలు కమిట్ అయ్యాను. ‘కమాండో’ సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రమిది. సాధారణంగా ఫ్రాంచైజీ సినిమాల్లో హీరోయిన్స్‌ను మారుస్తారు. కానీ మూడో సినిమాలోనూ నేనే హీరోయిన్‌గానే కొనసాగుతున్నాను. ‘మ్యాన్ టు మ్యాన్’లో అబ్బాయిగా నటిస్తున్నాను. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్, రెండు షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నాను. ► నా వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే యాక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. కొందరు వాళ్ల ప్రొఫెషన్ని ఇష్టపడరు. ఉదయాన్నే లేచి అబ్బా.. ఇవాళ కూడా ఆఫీస్‌కి వెళ్లాలా? అని బాధపడతారు. నేను మాత్రం వీకెండ్స్ కూడా వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అందరికీ హీరోయిన్ అయ్యే చాన్స్ రాకపోవచ్చు. మనకి వచ్చిన చాన్స్‌ని కష్టపడి నిలబెట్టుకోవాలి. అందుకే నా జాబ్‌ను లక్కీగా ఫీల్ అవుతాను. ► ఏ కథ అంగీకరించినా అది నా నిర్ణయమే. ‘క్షణం’ ఓకే చేసినప్పుడు చిన్న సినిమా ఎందుకు? అన్నారు. కానీ నా నిర్ణయాలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్ కార్పెట్ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్ స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది. -
కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు
‘‘ఒకప్పుడు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి.. లాంటి దర్శకులు నాకు ఇచ్చిన నమ్మకాన్ని ఇప్పుడు ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’తో మా ముందు ఒక లక్ష్యాన్ని ఉంచారు. ‘కల్కి’ సినిమాతో దాన్ని అందుకుంటామనే నమ్మకముంది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది. ‘కల్కి’ మూవీ హానెస్ట్ ట్రైలర్‌ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా కథలతో కొత్త దర్శకులు నన్ను సంప్రదించొచ్చు. సి.కళ్యాణ్ నిర్మాతగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడవేగ–2’ తెరకెక్కబోతోంది. చిరంజీవిగారి సినిమాలను కొడుకు రామ్‌చరణ్ నిర్మిస్తున్నట్టు నా సినిమాలకు నా కూతుర్లు సపోర్ట్ ఇవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘1983 నేపథ్యంలో సాగే పీరియాడికల్ చిత్రమిది. కొత్త ఫార్మాట్లో ఉంటుంది. సాయితేజ కథ ఇచ్చాడు. ఎవరి కథనీ కాపీ కొట్టలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ఓ సాధారణ ప్రేక్షకుడిలా క్లైమాక్స్ కోసం ఉత్కంఠగా చూశాను. థియేట్రికల్ రైట్స్ ఒక్కరే తీసుకోవడం విశేషం. రిలీజ్‌కి ముందే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు సి.కళ్యాణ్. ‘‘గరుడవేగ’ కన్నా ‘కల్కి’ పెద్ద విజయం సాధిస్తే.. దీన్ని మించి ‘గరుడవేగ–2’ తీస్తాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం
‘‘కల్కి’ మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్, హైప్ వచ్చాయి. ఆ క్రేజ్, కంటెంట్ చూసి ఈ సినిమాను పంపిణీ చేస్తున్నాం’’ అని నిర్మాత కె.కె. రాధామోహన్ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల హక్కులను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని, విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. శ్రవణ్ భరద్వాజ్ బ్రహ్మాండమైన ట్యూన్స్, నేపథ్య సంగీతం అందించారు. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు ఉన్న ఈ సినిమా తప్పకుండా బాగుంటుంది. ఆ నమ్మకంతోనే ‘కల్కి’ని విడుదల చేస్తున్నాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా మెయిన్ ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!
హీరో రాజశేఖర్‌గారి మేనరిజమ్స్‌ని ఇప్పటివరకూ చాలామంది ఇమిటేట్ చేశారు. అయితే తన మేనరిజమ్స్‌ని రాజశేఖర్‌గారే ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? ‘ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!’ డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉంటుంది? ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాని ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కమర్షియల్ ట్రైలర్‌ని హీరో నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని ‘మహర్షి’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ చాలా బావుందని, చాలా ఎంజాయ్ చేశామంటూ చాలా మంది ఫోన్లు చేశారు.. మెసేజ్‌లు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘కల్కి’ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్‌గారు నేను అడిగినది కాదనకుండా చేశారు. ఆయన మేనరిజమ్స్ ఆయనే ఇమిటేట్ చేయడంతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. సి. కళ్యాణ్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘రాజశేఖర్ డెడికేషన్, ప్రశాంత్ వర్మ హార్డ్ వర్క్‌తో సినిమా బాగా వచ్చింది’’ అని సి. కళ్యాణ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
పురాతన కట్టడాలు, కోటలు, కొండలు... అడవులు, కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు... బాంబులు ఉన్నాయి.. బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగులు తీసే మనుషులు ఉన్నారు.. గ్రామ పెద్దలు, గుమిగూడిన మనుషులున్నారు.. నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నడుమ, వివిధ వర్గాల ప్రజల మధ్య ‘కల్కి’ కదిలాడు.. కదనరంగంలోకి గొడ్డలి పట్టి దిగాడు. అతడి కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. పైన చెప్పినందంతా టీజర్లో వచ్చిన సన్నివేశాలే. అయితే ఈ టీజర్లో ఒక్క డైలాగ్ లేకపోవడం విశేషం. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. రాజశేఖర్‌గారు పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకూ పని చేసిన యాక్టర్స్‌లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ రాజశేఖర్‌గారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘టీజర్‌కు వస్తున్న స్పందన వింటుంటే సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు సి.కళ్యాణ్. అదా శర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
‘చంద్రబాబు.. నీ భాష, పద్దతి మార్చుకో’
సాక్షి, విజయవాడ : చంద్రబాబు వాడే భాష సక్రమంగా లేదని పద్దతి మార్చుకోవాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ హెచ్చరించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల నుంచి తొలగించినప్పటికి ఏబీ వెంకటేశ్వర రావు హవా ఇంకా అనధికారికంగా కొనసాగుతుందని ఆరోపించారు. పోలింగ్ దగ్గర పడటంతో అధికార పార్టీ నేతలు పోలీసులతో కలిసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబు మేక వన్నె పులి : నాగిరెడ్డి నూరు తప్పులు చేసిన చంద్రబాబు మేక వన్నె పులి లాంటి వ్యక్తి అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. పోలింగ్ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను బయటకు రాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. -
చంద్రబాబు మరో మోసానికి యత్నం: రాజశేఖర్
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత వైఎస్సార్ హయాంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వైస్సార్సీపీ నేతలు జీవిత, రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య శ్రీ, 108 లాంటి పథకాలతో ఎంతో మందికి ప్రాణదాత అయ్యారని గుర్తుచేశారు. తణుకులోని లయన్స్ క్లబ్లో శనివారం ముస్లింల ఆత్మీయ సమావేశం వారు పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ కంటే మంచి పథకాలను అమలు చేస్తానంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్కఅవకాశం ఇవ్వాలని వారు కోరారు. చంద్రబాబు నాయుడికి అనుభవం ఉందని సీఎం చేసి అందరూ మోసపోయారని అన్నారు. అమరావతి పేరుతో ముప్పైవేల ఎకరాల పంట భూములను నాశనం చేశారని వారు ఆరోపించారు. అమరావతిని సింగపూర్ చేస్తానని భ్రమపెట్టారని, అక్కడి కంపెనీల దగ్గర కమీషన్లు కొట్టేశారని విమర్శించారు. ప్రజల కోసం బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు. మన భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయ్యాలని అభ్యర్థించారు. వేలకోట్ల సంపాదన వదిలేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, చంద్రబాబు దగ్గర బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. పసుపు కుంకుమ డబ్బులతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది ప్రజల డబ్బున్న విషయాన్ని మహిళలంతా గమనించాలని సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు
తమిళంలో ‘విక్రమ్‌వేదా’ (2017) చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియో ప్రతినిధి శశికాంత్ నిర్మించారు. ‘విక్రమ్‌వేదా’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఇతర భాషల్లో రీమేక్ కానుందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై వైనాట్ స్టూడియోస్ ప్రతినిధులు తమ సంస్థ ట్వీటర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘విక్రమ్‌వేదా’ తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ఇంకా మా వద్దే ఉన్నాయి. మేం అధికారిక ప్రకటన ఇచ్చేంతవరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరుతున్నాం’’ అన్నారు. -
నా రూ.3కోట్లు తిరిగి ఇచ్చేయండి
-
నా రూ.3కోట్లు తిరిగి ఇచ్చేయండి: టీడీపీ అభ్యర్థి
సాక్షి, కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన ఓటమిని ఖరారు చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్ రాజశేఖర్ ....పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన బద్వేల్లో పరాజయం తప్పదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. చదవండి...(భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి ) దీంతో తన ఓటమి ఖాయమని నిర్థారించుకున్న రాజశేఖర్ నిన్న తన కుటుంబసభ్యులతో సమావేశం అయ్యారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే అంశంపై చర్చించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం తాను ఇచ్చిన రూ.3 కోట్లు తిరిగి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సమయంలో రాజశేఖర్ ఉదంతం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీలో అవమానించారు వైయస్సార్ జిల్లా బద్వేల్ టీడీపీ నాయకురాలు విజయజ్యోతి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీడీపీలో ఉన్నంత కాలము తనను చిత్ర హింసలకు గురిచేశారని, అవమానించారని వాపోయారు. టీడీపీ మోసం చేయడంతో ఆ పార్టీని వదిలిపెట్టినట్టు చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారు. చదవండి...(టీడీపీలో చల్లారని అసమ్మతి) -
అందుకే ఎన్నికలకు వెళ్తున్నాం
‘‘శివాజీ రాజా కంటే నేనే సీనియర్. అయితే తన మనసులో మాటని అర్థం చేసుకోవడంతో పాటు ‘మా’ బాగుండాలనే ఉద్దేశంతో గత పర్యాయం ‘మా’ అధ్యక్షుడిగా ఉండమని శివాజీరాజాకి నేనే చెప్పా. అయితే గత ఏడాది వచ్చిన వివాదాలు, కొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏకగ్రీవం కాకుండా ఎన్నికలకు వెళ్తున్నాం’’ అని నటుడు నరేశ్ అన్నారు. నరేశ్ అధ్యక్షుడిగా, రాజశేఖర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, జీవితా రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్యానల్ మంగళవారం హైదరాబాద్‌లో తమ మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ– ‘‘మా’ అన్నది ఒక ఆర్గనైజేషన్. దీన్ని రాజకీయ పార్టీగానో, వ్యాపార సంస్థగానో నడపదలచుకోలేదు. సభ్యుల మధ్య ఆలోచనా విధానాల్లో తేడాలున్నప్పుడు ఎన్నికలు తప్పవు. మా ప్యానల్ విజయం సాధిస్తే పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేసి, ‘మా’ ప్రతిష్టను పెంపొందిస్తాం’’ అన్నారు. ‘‘మా’ కమిటీలోని వారందరితో పని చేయించే బాధ్యత నాది’’ అన్నారు రాజశేఖర్. ‘‘చిరంజీవిగారు ఓ ప్యానల్‌కి మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అందరూ మన కుటుంబ సభ్యులే.. ఏ ప్యానల్ విజయం సాధించినా మద్దతు ఇస్తాను’’ అని మేం కలిసినప్పుడు అన్నారు అని జీవితా రాజశేఖర్ చెప్పారు. -
‘కల్కి’ టీజర్ : అదరగొడుతున్న రాజశేఖర్!
‘గరుడవేగ’ ఇచ్చిన సక్సెస్‌తో హీరో రాజశేఖర్లో మంచి జోష్ కనబడుతోంది. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదరుచూసిన ఈ హీరోకు సరైన టైమ్‌లో సరైన సినిమా పడింది. ఈ సినిమా అంచనాలకు మించి ఆడటంతో రాజశేఖర్ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నెలకొంది. నేడు (ఫిబ్రవరి 4) రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ టీజర్‌ను రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ టీజర్‌తో అదరగొట్టేస్తున్నాడు. 1980 నేపథ్యంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ క్రైమ్ బ్యాగ్రౌండ్లో ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి కల్కితో మరో విజయాన్ని సొంతం చేసుకునేలా ఉన్నారు రాజశేఖర్. సి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. -
‘కల్కి’ టీజర్ విడుదల
-
అంతకుమించిన సంతోషం లేదు
‘‘లోకంలో ఎవరికైనా పని దొరకడమన్నదే గ్రేట్. దానికంటే సంతోషమైన విషయం ఏదీ ఉండదు. నాకు పని కల్పించి, నాతో పని చేయించుకుంటూ సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అని రాజశేఖర్ అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా, అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయికలుగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నేడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ సినిమా టీజర్ విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ సినిమా తర్వాత ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించి, ఈ కథ ఓకే చేశాం. ‘గరుడవేగ’ కి ప్రవీణ్ సత్తారుతో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, ప్రశాంత్ వర్మతోనూ అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘శేషు’ తర్వాత రాజశేఖర్‌గారితో నేను చేస్తున్న చిత్రమిది. నేను చిన్న సినిమాలు చేసేటప్పుడు లైట్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఓ తమిళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని, నన్ను నిర్మాతను చేశారు జీవిత–రాజశేఖర్ దంపతులు’’ అన్నారు. ‘‘అ!’ చిత్రానికి ముందే ‘కల్కి’ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ, కుదరలేదు. ఒక ఫ్రాంచైజీ తరహాలో ఈ సినిమాకు సీక్వెల్స్ చేయాలనుంది. అన్నీ కుదిరితే రాజశేఖర్‌గారి తర్వాతి బర్త్ డేకి ‘కల్కి 2’ మొదలవుతుంది. నా అభిమాన నటుడు రాజశేఖర్‌గారికి ఈ పుట్టిన రోజు కానుకగా నేను ‘యాంగ్రీ స్టార్’ అనే బిరుదు ఇస్తున్నా’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘గరుడవేగ’ కి ముందు మళ్లీ సక్సెస్‌లోకి వస్తామా? లేదా? అనుకున్న రోజులు ఉన్నాయి. మన వెనుక ఎన్ని కోట్లు ఉన్నా కెరీర్‌ని కొనలేం. అటువంటి సమయంలో ‘గరుడవేగ’ వచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి’ గురించి మాట్లాడుతున్నప్పుడు ‘గరుడవేగ’ గురించి కూడా మాట్లాడుతుండటంతో సంతోషంగా ఉంది’’ అన్నారు జీవిత. శివానీ, శివాత్మిక, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రపాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
వైరల్ అవుతోన్న ‘కల్కి’ మోషన్ పోస్టర్!
‘గరుడవేగ’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు డా.రాజశేఖర్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో రాజశేఖర్ హవా మళ్లీ మొదలైంది. యాంగ్రీ యంగ్‌మెన్‌గా రాజశేఖర్ ఎన్నో మరుపురాని హిట్స్ ఇచ్చారు. అయితే గరుడవేగ రిలీజై చాలా రోజులవుతున్నా.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘అ!’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. మంచి ప్రయత్నంగా మిగిలినా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. అయితే రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. ఆదా శర్మా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. -
హంతకుడు ఎవరు?
ప్రముఖ రచయిత రాజశేఖరం హత్య వార్త ఆనాటి దినపత్రికలో చదివాడు ప్రైవేటు డిటెక్టివ్ శ్రీకర్. దినపత్రిక టీ పాయ్మీద గిరాటు వేసి ఉన్నపళంగా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. హత్యా ప్రాంతం ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ చరణ్ తను కలిసి ఇదివరకు రెండు మూడు క్లిష్టమైన కేసులు పరిష్కరించారు. శ్రీకర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ గురించి వాకబు చేస్తూ.. ‘‘ఎవరైనా అనుమానస్తులున్నారా.. కూపీ లాగావా’’ అంటూ తనూ అదే చిరునవ్వు ప్రదర్శించాడు. ‘‘రాజశేఖర్ ముఖంపై దిండు బలంగా అదిమి ఊపిరాడకుండా చేశారని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది’’ అన్నాడు చరణ్.శ్రీకర్‌కు తాను సేకరించిన కొన్ని ఆధారాలు చూపించాడు.‘‘కాని ఇవి మార్ఫింగ్ ఫోటోలేమోనని నా అనుమానం. పైగా అవి పూర్తిగా నేరాన్ని రుజువు చేసేలా లేవు. అందుకే ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. పైగా ఫోటో తీశారూ అంటే మరో మనిషి ఆ గదిలో ఉన్నట్లేగా.. ఎవరో అతను తెలిస్తే గాని కేసు ముందుకు సాగదు’’ అని వివరిస్తూ..తన కెదురుగా నిలబడ్డ అనుమానితుడిని చూపించాడు. ‘‘ఇతను రాజశేఖరం వద్ద టైపిస్టుగా పనిచేసే కుమార్.. ఇంటరాగేషన్ చేస్తున్నాను’’అన్నాడు చరణ్.‘‘రాజశేఖరం గారిని ఎందుకు చంపావ్.. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేగా..’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. ‘‘సార్! నేను హత్య చేయలేదు సర్.. నేను రాజశేఖర్ గారి ముఖం మీద ఉన్న దిండును తీసి చూశానంతే’’ గజ, గజ వణకుతూ అన్నాడు కుమార్. ‘‘సార్.. నేనూ ఒక రచయితనే. ‘జయసుధ’ అనే కలం పేరుతో కథలు రాస్తున్నది నేనే అని చాలా మందికి తెలియదు. ప్రముఖ రచయిత రాజశేఖరం ఒక వేదికపై పరిచయమయ్యారు. వారన్నా.. వారి రచనలన్నా నాకు చాలా ఇష్టం. నా రచనా శైలి బాగుంటుందని తనకు సాయం చెయ్యమని కోరారు. వారు కథకు ప్లాట్ ఇస్తే నేను కథగా..స్క్రిప్ట్‌గా.. నవలగా డెవలప్ చేసే వాణ్ణి. ఇద్దరం చర్చించుకొని తుది నిర్ణయం తీసుకున్నాక రాజశేఖరం పర్సనల్ కంప్యూటర్లో టైప్ చేసి పదిలపరచే వాణ్ణి. వారి సహచర్యం వల్ల మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ నా రచనలను కూడా కొనసాగిస్తున్నాను. వారికి వచ్చే పారితోషికంలో కొంత నాకు ముట్ట చెప్పే వారు. అది నేనూహించినదాని కంటే ఎక్కువ మొత్తం. అలా వారి ఉప్పు తినే నేను వారికి ముప్పు తలపెడ్తానా.. సర్’’ అని వాపోయాడు కుమార్.‘‘కేవలం కథలవరకేనా.. లేక వారి కుటుంబ కథల్లో కూడా తలదూర్చే వాడివా’’ కాస్త వ్యంగ్యంగానే అడిగాడు శ్రీకర్. ‘‘నా కంత సాన్నిహిత్యం లేదు సార్.. నాకు తెలిసినంత వరకు వారికి పెద్ద కుటుంబం అంటూ ఏదీ లేదు. చుట్టాలు, పక్కాలు వచ్చిన జాడ కనబడేది కాదు. వారి సతీమణి పది సంవత్సరాల క్రితమే కాలం చేశారట. వారికి ఏకైక సంతానం విశాల్. తల్లి లేని పిల్లవాడు కదా అని కాస్త గారాబమెక్కువనుకుంటాను’’‘‘ఎందుకలా అనుకుంటున్నావ్’’ ‘‘విశాల్ చదివేది ఇంటర్ రెండవ సంవత్సరమే గాని డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేస్తుంటాడని రాజశేఖరంగారు అప్పుడప్పుడు చెప్పే వారు’’ ‘‘ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు’’‘‘వంట మనిషి రాములమ్మ. ఆమె భర్త రంగయ్య తోట పని చూసుకుంటూ ఉంటాడు’’ శ్రీకర్ మనసుకు ఎందుకో కుమార్ నిర్దోషని తోచింది. ఆ మరునాడు ఉదయమే తన ఫోన్లో మెసేజ్ చూసుకొని శ్రీకర్ ఆఫీసుకు వెళ్ళాడు కుమార్. ‘‘నీకు వివాహమయ్యిందా..’’ అడిగాడు శ్రీకర్.‘‘వివాహమయ్యింది సర్.. ఒక పాప గూడా.. ఉంది’’ ‘‘పాప వయసెంత.. బడికి వెళ్తుందా..’’‘‘లేదు సర్.. ఆరేళ్ళ ప్రాయం..’’ అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఆగిపోయాడు. అది గమనించిన శ్రీకర్ ‘‘చూడు కుమార్.. నావద్ద ఏదీ దాచిపెట్టొద్దు’’‘‘రహస్యమేమీ లేదు సార్..’’ నీళ్ళు నములసాగాడు. ‘‘మీ పాపకు గుండెలోని చిన్న రంధ్రం గురించి డాక్టర్లు ఏమన్నారు’’ అని శ్రీకర్ ప్రశ్నించే సరికి గతుక్కుమన్నాడు కుమార్.‘‘సార్.. ఆ విషయం చెబితే.. డబ్బు కోసం నేనే హత్య చేసానని మీకు అనుమానం వస్తుందని చెప్పాలా వద్దా.. అని సందేహించాను సర్. డాక్టర్లు మరి కొన్ని పరీక్షలు చేస్తే గాని చెప్పలేమన్నారు. నిజం దాచినందుకు క్షమించండి సర్.. ప్లీజ్’’ అని వేడుకున్నాడు కుమార్. ‘‘రాజశేఖరంగారు సినిమాలకు కూడా రాస్తుంటారు కదా.. ఆ రంగంలో ఎవరైనా పోటీదారులున్నారా..’’‘‘పోటీదారుల సంగతి తెలియదు గాని సార్.. కథలకు ఎంతో డిమాండు ఉన్నదన్న విషయం తెలుసు’’‘‘రాజశేఖరంగారు హత్య కాబడ్డ రోజు నువ్వు ఎక్కడున్నావు?’’ ‘‘సార్ గది పక్కనే నాకూ ఒక గది ఇచ్చారు. ఎవరైనా సార్‌తో మాట్లాడ్డానికి వచ్చినప్పుడు నేను నా గదిలోకి వెళ్ళి కథలు పూర్తి చేస్తుంటాను.ఆ రోజు ఉదయమే వారి అబ్బాయి విశాల్ వచ్చాడు సర్. కాలేజీ మమ్మల్ని బొటానికల్ టూర్ కోసం బెంగళూరు తీసుకెళ్తుంది. అలాగే మైసూర్ కూడా విహార యాత్రకు వెళ్ళి వద్దామని అంటున్నారు.పదివేలు కావాలని అడిగి తీసుకున్నాడు.రాత్రి భోజనం తరువాత సరిచేసిన ఆ నాలుగు కథలను ప్రింటౌట్ తీసి తప్పులుంటే సరిచెయ్యండని సార్కిచ్చి.. నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను.తెల్లవారుజామున లేచి ఫైనల్ ప్రింటౌట్ కాపీలు తీయాల్సి ఉంది. మధ్యరాత్రి నన్నెవరో పిలిచినట్లు వినిపించింది. లేచి గబగబా వెళ్లి సార్ గది తట్టాను. సాధారణంగా సార్ తలుపు గడియపెట్టుకోరు. గదిలోకి వెళ్లి చూస్తే సార్ ముఖంపై దిండు ఉంది. పక్కన టీపాయ్ పైన మేము తయారు చేసిన కథలు.. కంప్యూటరూ.. సార్ సెల్ ఫోన్ కనపడలేదు. నాకు అనుమానమేసి సార్ దిండును పైకి తీశాను. సార్ కనుగుడ్లు నిలబడి ఉన్నాయి. భయంతో రంగయ్యా! అంటూ గట్టిగా అరిచాను. ఎవరూ రాలేదు. భయమేసింది. లేని శక్తి కూడగట్టుకొని ఔట్హౌస్కు పరుగెత్తి,. తలుపుబాదాను. రంగయ్య తలుపు తీశాడు. విషయం చెప్పే సరికి రంగయ్య, రాములమ్మ ఇద్దరూ పరుగు పరుగున నా వెనకాలే వచ్చారు.ఉలుకూ.. పలుకూ.. లేని సార్‌ను చూసి ఏడ్వసాగారు. వెంటనే రాజశేఖరం ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాను. డాక్టరు వచ్చి సార్‌ను పరీక్షించాడు. చనిపోయి దాదాపు గంట కావస్తోందని.. పోలీసులకు ఫోన్ చేశాడు. కొద్దిసేపటికి ఇన్స్పెక్టర్ చరణ్ గారు తన బృందంతో వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టంకు పంపారు. నిన్న ఉదయమే బాడీని నాకప్పగించారు’’ అని కుమార్ చెప్తుంటే ఆవేదన అడ్డుపడింది. ఆగిపోయి మౌనంగా రోదించసాగాడు. ‘‘నేను కాలేజీకి ఫోన్ చేసి విషయం చెప్పి విశాల్‌ను అర్జెంటుగా వెనక్కి పంపించమన్నాను. అసలు వారు ఎలాంటి విహారయాత్రలకూ పిల్లలను తీసుకెళ్ళలేదట’’ శ్రీకర్ భృకుటి ముడిపడింది. వెంటనే ఇద్దరూ కలిసి రాజశేఖరం ఇంటికి వెళ్ళారు. విశాల్ గది చూద్దామని లోనికి వెళ్తుంటే.. శ్రీకర్ సెల్ ఫోన్ మోగింది.. ఆన్ చేశాడు. ‘‘హల్లో చరణ్..’’ అన్నాడు శ్రీకర్. అందులో నేనుచెప్పిన విషయం ఏమయ్యింది? అనే అర్థం ప్రస్ఫుటమవుతోంది.‘‘నేనొక మొబైల్ నంబరిస్తాను.ఆ నంబరుకే రాజశేఖరం గత రెండు రోజులుగా పలుమార్లు మాట్లాడాడు. కాని ఆ నంబర్ ఎవరి పేరుమీద రిజిస్టర్ అయిందో.. వివరాలు లేవు’’ఇన్స్పెక్టర్ చరణ్ గొంతు అస్పష్టంగా కుమార్‌కు వినవస్తోంది. ‘‘ఈ నంబర్ ఎవరిదో తెలుసా’’ అంటూ కుమార్‌కు చూపిస్తూ అడిగాడు. ‘‘రచయిత సుందరం నంబర్. అప్పుడప్పుడు కథల విషయంలో ఇరువురు చర్చించుకునే వారు’’‘‘ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు.. పోటీదారులెవరూ తెలియదన్నావ్’’ అంటూ రెట్టించాడు శ్రీకర్. ‘‘ఇతనూ ఒక రచయితనే కదా అనుకున్నాను సర్’’‘‘మరి రచయితల్లోనే కదా.. పోటీ తత్వముండేది. ఏదైనా నా వద్ద దాచొద్దని చెప్పాను. సుందరం రచయిత అనే విషయం చెప్పలేదు. అంటే నిన్నూ అనుమానించక తప్పదు’’ గంభీరంగా అన్నాడు శ్రీకర్.దెబ్బకు ఠారెత్తి పోయాడు కుమార్. విశాల్ గదిలో కొన్ని రహస్యపు కాగితపు ముక్కలు దొరికాయి. వాటిని వాసన చూశాడు శ్రీకర్. ఏదో అనుమాన మేసింది.రాములమ్మను ఒంటరిగా మరో గదిలోకి పిలిచి విచారించాడు. తన అనుమానం నిజమయ్యింది. నిజనిర్థారణ కోసం తన అసిస్టెంట్ అనిల్‌కు ఫోన్ చేద్దామనుకునే సరికి అనిల్ ప్రత్యక్షమయ్యాడు ‘‘సార్.. మీ అనుమానం నిజమే. నేను కాలేజీకి వెళ్ళి విశాల్ గురించి వాకబు చేశాను. విహార యాత్ర అబద్ధం.. విశాల్ అలా అబద్ధాలాడుతూ తన తండ్రి దగ్గర డబ్బు పట్టిస్తాడని.. అ డబ్బుతో మాదక ద్రవ్యాలు కొంటాడని అతని స్నేహితులు కొందరు చెప్పారు. అతని మొబైల్ సిగ్నల్స్..శంషాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుపుతోంది.అదే ప్రాంతంలో సుందరం ఫామ్‌హౌస్ ఉంది’’ అన్నాడు అనీల్.‘‘కమాన్ క్విక్..’’ అంటూ వేగంగా కారు వైపు కదిలాడు శ్రీకర్. ‘‘భేష్.. ఇప్పటికైనా అక్కరకొచ్చే ఒక ఇన్ఫర్మేషనిచ్చావ్’’ అనిల్ పరుగెత్తి కారు డ్రైవ్ చేద్దామని సీట్లో కూర్చున్నాడు. శ్రీకర్ కారు ముందు సీట్లో.. కుమార్ వెనక సీట్లో కూర్చున్నారు. కారు వాయువేగంగా కదిలింది. ‘‘చరణ్.. శంషాబాద్ సుందరం ఫామ్‌హౌస్‌కు వెళ్తున్నా. అర్జెంటుగా పోలీసు ఫోర్స్‌ను తీసుకొని వచ్చేయ్’’ అంటూ ఫోన్ కట్ చేశాడు.‘‘సర్.. అక్కడే సుందరంగారు కథలు చెప్తుంటే అతని అసిస్టెంట్ భూషణం టైప్ చేస్తుంటాడు’’ అంటూ మరికొంత సమాచారమిచ్చాడు కుమార్.‘‘భూషణం ఎలాంటి వాడు.. నీకేమైనా తెలుసా’’ కూపీ లాగాడు శ్రీకర్.‘‘అంతగా పరిచయం లేదు సర్. అతను నా కంటే ముందు రాజశేఖరంగారి వద్ద పనిచేసే వాడట. అతని ప్రవర్తన నచ్చక పంపించేశానని సార్ ఒకసారి అన్నారు. ప్రస్తుతం సుందరం దగ్గర పనిచేస్తున్నాడు’’ మళ్ళీశ్రీకర్ ఏమంటాడో.. భూషణం గురించి ముందు చెప్పక పోవడమూ తప్పు చేశానని గిల్టీగా ఫీలయ్యాడు కుమార్.‘‘అదే కుమార్.. నీలో ఉన్న పెద్ద తప్పు. ఏదైనా అడగంది చెప్పడం లేదు. నేర పరిశోధన సమయంలో ఏ విషయమూ దాచొద్దు. సరే అయిందేదో అయింది. నాకు భూషణం మీద అనుమానంగా ఉంది. అనిల్ త్వరగా పోనీయ్’’ అంటూ వేగిర పెట్టాడు శ్రీకర్. వారు ఫామ్‌హౌస్ చేరుకునే సరికి చరణ్ తన బృందంతో అప్పుడే జీపు దిగుతున్నాడు.చరణ్ సంకేతాలందుకొని పోలీసులు తలుపులు బద్దలుకొట్టారు. ఎదురుగా ముగ్గురు రౌడీలు.. పోలీసులను చూడగానే కాళ్ళకు బుద్ధి చెప్పబోయారు. నలుగురు పోలీసులు చుట్టుముట్టి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు భూషణం.. కుమార్ గుర్తించాడు.‘‘విశాల్ ఎక్కడ’’ అని గద్దించాడు ఇన్స్పెక్టర్ చరణ్. భూషణాన్ని సోదా చేసి సెల్ ఫోన్ లాక్కున్నాడు. భూషణం పక్క గదిలోకి కదిలాడు. అంతా వెంబడించారు. మంచంపై విశాల్ మత్తుగా నిద్రపోతున్నాడు. ఇంతగా అలజడి అయినా విశాల్ లేవక పోవడం.. అధిక మొత్తంలో మాదక ద్రవ్యం కన్జ్యూమ్ చేసి ఉంటాడని భావించాడు చరణ్. శ్రీకర్, అనిల్ పక్క గది లోకి వెళ్ళి సోదా చేసారు. రాజశేఖరం గారి పర్సనల్ కంప్యూటర్.. కథలు దొరికాయి. వాటిని తీసుకొచ్చి చరణ్‌కు అందజేశారు.చరణ్ భూషణం సెల్ ఫోన్ లోని ఫొటోలు చూపించాడు. ఇద్దరూ.. చిరునవ్వు నవ్వుకున్నారు. ఇద్దరు పోలీసులను విశాల్ దగ్గర కాపలా పెట్టి లేచాక స్టేషన్‌కు తీసుకురమ్మన్నాడు చరణ్.‘‘చరణ్.. అనిల్, కుమార్‌లను కూడా ఇక్కడే ఉండనిద్దాం. విశాల్ లేచాక ముందుగా రాజశేఖరం గారి అంతిమ సంస్కారం పోలీసుల పర్యవేక్షణలో చేయిద్దాం. కుమార్, అనిల్ ఆ పని చూసుకుంటారు. నేను నీతో స్టేషన్‌కు వస్తాను’’ అని అనుమతి అడిగాడు శ్రీకర్. చరణ్ ఓకే.. అన్నట్టుగా తలూపాడు. ఇద్దరు రౌడీలను, భూషణంను పోలీసు జీపు ఎక్కించారు పోలీసులు.చరణ్, శ్రీకర్ అంతా కలిసి అదే జీబులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఇన్స్పెక్టర్ చరణ్ తనదైన శైలిలో లాఠీ ఝళిపించే సరికి భూషణం గుండె అదిరి పోయింది. లాఠీ రుచి చూడక ముందే..‘‘సర్.. నిజం చెబుతాను’’ అంటూ చరణ్ కాళ్ళపై పడిపోయాడు భూషణం. శ్రీకర్ కనుసైగ చూసి మీడియాను రమ్మన్నాడు చరణ్. ఫామ్‌హౌస్ నుంచి వస్తుంటే దారిలో శ్రీకర్ మీడియాకు ప్రముఖ రచయిత రాజశేఖరం హంతకుడు దొరికాడని చెప్పడం విన్నాడు. మీడియా ముందు భూçషణం నోరు విప్పాడు.‘‘కుమార్ కంటే ముందు రచయిత రాజశేఖరం గారి దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేసేవాడిని. మాది చాలా పెద్ద కుటుంబం. ఖర్చుల కోసం అడ్డదార్లు తొక్కాల్సి వచ్చేది. నాకు కథలు రాయడం రాదు. కేవలం కంప్యూటర్లో టైప్ చేసే వాణ్ణి. ఒకసారి రాజశేఖరంగారి ఒక కథా వస్తువును రచయిత సుందరం గారికి లీక్ చేశాను. తను అధిక మొత్తంలో డబ్బు ఇచ్చాడు. కథలకు అంత డబ్బు వస్తుందని నాకు మొదటి సారిగా తెలిసింది. ఆ కథను డెవలప్ చేసి సుందరం గారు ఒక నిర్మాతకు అమ్మాడు. అది సినిమాగా తీశారు. విజయం సాధించింది. ఆ కథ నాదంటూ రాజశేఖరం నిర్మాతతో గొడవకు దిగాడు. అప్పుడు నా విషయం బయట పడింది. నన్ను అందరి ముందూ తిట్టి ఉద్యోగంలో నుంచి తీసేశాడు రాజశేఖరం. సుందరంగారు నన్ను చేరదీశారు. రాజశేఖరం గారి కథలతో మూడు సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందడం.. సుందరంగారి కథలతో సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం.. ఆలోచనలో పడ్డాం. నాకు విశాల్ సంగతి పూర్తిగా తెలుసు. అతను మత్తు మందుకు బానిస. అది రాజశేఖరం గారికి తెలియదు. పూర్తిగా కథల్లో మునిగి పోయి విశాల్ గురించి పెద్దగా పట్టించుకునే వాడు కాదు. కొడుకుపై నమ్మకమెక్కువ. విశాల్‌ను బుట్టలో వేసుకున్నాను. ముందుగా కొంత మత్తుమందు ఉచితంగా ఇచ్చాను. దాంతో నన్ను పూర్తిగా నమ్మాడు. డబ్బు కోసం మీ నాన్న గారిని బలవంత పెట్టొద్దు. ఎంత కావాలన్నా అంత బ్రౌన్ షుగర్ నీకందిస్తారని నమ్మబలికి సుందరం గారికి పరిచయం చేశాను. రాజశేఖరం గారు కుమార్ సాయంతో మరి కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారని విశాల్ ద్వారా తెలుసుకున్నాను. ఈసారి కథలతో బాటు ఏ ఆధారాలు లేకుండా ల్యాప్‌టాప్‌ను కూడా తస్కరించాలని.. సుందరం గారికి నా పథకం చెప్పాను.మరో పథకం కూడా వేసి.. సినీ జగత్తులో నాకు మరో పోటీ దారుడు లేకుండా చేయి. నీకూ పగ చల్లారినట్టు ఉంటుంది. కుమార్‌ను కూడా లేపెయ్యి. కోటి రూపాయలిస్తానని ఆశ చూపారు సుందరంగారు. కోటి రూపాయలంటే మాటలా! ఒక్క దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టాలనుకున్నాను. తను విహార యాత్రకు వెళ్లాడని తెలుసు.. ఎవరికీ అనుమానం రాదని ఆ రాత్రి రమ్మన్నాడు విశాల్. విశాల్ చెప్పిన సమయానికి వారి ఇంటికి వెళ్ళాను. విశాల్ నన్ను తన గదిలో కూర్చోమన్నాడు. తను రాజశేఖరం గదికి వెళ్ళి కథలు.. పర్సనల్ కంప్యూటర్, సెల్ ఫోన్ తెచ్చిచ్చాడు. వానిని ఒక బ్యాగులో సర్దుకొని రెండుబ్రౌన్ షుగర్ పాకెట్లిచ్చాను. దాన్ని చూడగానే ఆవురావురుమంటూ లాగించాడు విశాల్. అతను అలా ఒరిగి పోగానే నేను రాజశేఖరం గదిలోకి వెళ్ళి దిండు ముఖాన పెట్టి ఊపిరాడకుండా అదిమి పట్టాను. కాసేపటికి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక ‘కుమార్.. కుమార్’ అంటూ గట్టిగా పిలిచాను. కుమార్ వస్తున్నట్లు గమమనించి వెళ్ళి ఆల్మారా వెనుకాల దాక్కున్నాను. కుమార్ వచ్చి రాజశేఖరాన్ని చూస్తుంటే సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాను. కుమార్ రంగయ్య కోసం ఔట్ హౌస్‌కు పరుగెత్తడం చూసి విశాల్‌ను ఎత్తుకొని, బ్యాగు తీసుకొని బయట పడ్డాను. ఇంటికి కాస్తా దూరంగా పార్క్ చేసిన కారులో శంషాబాద్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నాను.తెల్లవారు జామున విశాల్ లేచాడు. కాని ఇంకా పూర్తిగా మత్తు వదలినట్లుగా లేదు. వాళ్ల నాన్న గారిని కుమార్ హత్య చేశాడని అనుకుంటున్నారంతా. నీవేలి ముద్రలు టీపాయ్ మీద పడి ఉంటాయి. విహార యాత్రకు వెళ్ళినవాడి వేలి ముద్రలెలా వచ్చాయనే అనుమానం రావచ్చు. నీ విహార యాత్ర అబధ్ధమని తేలితే నిన్నూ అరెస్టు చేయవచ్చు. ఎందుకైనా మంచిది. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళొద్దని భయపెట్టి.. బలవంతంగా మత్తు మందు ఇంజక్షన్ చేశాను. ఫొటోల ప్రింటౌట్లను మరుసటి రోజు ఉదయమే ఎస్సై గారి క్వార్టర్ గుమ్మం ముందు వేయించాను. కాని నా ఫోన్లో ఫొటోలు డిలీట్ చెయ్యడం మరిచాను’’ అంటూ తల దించుకున్నాడు భూషణం. ‘‘మావాళ్ళు సుందరాన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకు వస్తున్నామని ఇప్పుడే ఫోన్ వచ్చింది. తప్పు చేసిన వారెవరూ చట్టం నుండి తప్పించుకో లేరు. ఈ కేసులో శ్రీకర్, అనిల్‌తో బాటు కుమార్ గూడా నా కెంతగానో సహకరించారు. వారికి నా ధన్యవాదాలు’’ అంటూ విలేకరుల ముందు తన వినమ్రతను చాటుకున్నాడు చరణ్. - క్రైమ్ స్టోరీ -
నా కెరీర్‌ని టాప్‌కి తీసుకెళుతుంది
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత చాలా కథలు విన్నా. ఎలాంటి కథతో సినిమా చేయాలనే క్లారిటీ లేదు. టీఎన్ కృష్ణ చెప్పిన ‘హిప్పీ’ కథ నచ్చడంతో ఓకే చెప్పా’’ అని కార్తికేయ అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత కార్తికేయ హీరోగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘హిప్పీ’. వీ క్రియేషన్స్‌పై రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన సన్నివేశానికి కలైపులి థాను క్లాప్ ఇచ్చా రు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘హిప్పీ’ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తున్నారని తెలియడంతో మరింత ఉత్సాహం కలిగింది. ‘కబాలి’ లాంటి పెద్ద సినిమా తీసిన ఆయనతో నా రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌ని టాప్ లెవెల్‌కు తీసుకెళుతుందని బలంగా నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి స్ట్రయిట్ చిత్రం ‘హిప్పీ’. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయతో సినిమా చేయడం చాలెంజ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు టీఎన్ కృష్ణ. ‘‘రెండు రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని కలైపులి థాను అన్నారు. జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్డీ రాజశేఖర్, సంగీతం: నివాస్ కె. ప్రసన్న. -
కల్కి షురూ
పవర్ఫుల్ పాత్రలతో పాటు కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు కథానాయకుడు డా. రాజశేఖర్. గతేడాది ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తర్వాతి చిత్రానికి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తర్వాతి చిత్రం ఉంటుందని రాజశేఖర్ ఓ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్రబృందం ‘కల్కి’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అంజలి కనిపించనున్నారనే వార్త షికారు చేస్తోంది. -
1983లో ఏం జరిగింది?
1983లో ఇండియాకు తొలిసారి వరల్డ్ కప్ వచ్చింది. చిరంజీవి ‘ఖైదీ’ రిలీజైంది. అలాగే ఓ మర్డర్ కూడా జరిగింది. ఆ మర్డర్ చేసింది ఎవరు? తెలియదు. ఆ మిస్టరీ ఛేదించేందుకు సిద్ధమయ్యారు హీరో రాజశేఖర్. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘పీయస్వి గరుడ వేగ’తో సూపర్ సక్సెస్ అందుకున్న రాజశేఖర్ స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. 1980లో జరిగే పీరియాడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ–లుక్‌ను విడుదల చేశారు. ఆగస్ట్ 26న ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారు. -
48 ఏళ్లు వెనక్కి!
రాజశేఖర్ టైమ్ మెషీన్‌ని వెనక్కి తిప్పనున్నారు. అది కూడా ఏ పదేళ్లో.. పాతికేళ్లో కాదు.. ఏకంగా 48ఏళ్లు.. ఎందుకిలా వెనక్కి వెళుతున్నారంటే ఆయన నటించనున్న తాజా చిత్రం కోసమట. ‘గరుడవేగ’తో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ తన తర్వాతి చిత్రంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆ మధ్య ఓ హింట్ ఇచ్చారు. ‘‘నా తర్వాతి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. అది అద్భుతంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఏంటంటే.. ‘అ’ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఆగస్టులో ఈ మూవీ స్టార్ట్ కానుంది. -
హింట్ ఇచ్చారు
చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ తర్వాతి చిత్రంపై తొందర పడకుండా ఆచి తూచి అడుగులేస్తున్నారు. తదుపరి చిత్రాన్ని చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ‘గరుడవేగ’ తర్వాత రాజశేఖర్ చేయబోయే సినిమాపై ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా తన తర్వాతి సినిమాపై రాజశేఖర్ ఓ హింట్ ఇచ్చి రూమర్లకు తెరదించారు. ‘‘నా తర్వాతి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. అది ఆసమ్‌గా (awe some) ఉంటుంది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఆయన తర్వాతి చిత్రం ‘అ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మతోనే అన్న క్లారిటీ వచ్చిందంటున్నారు సినీ జనాలు. ‘అ’ వంటి వైవిధ్యభరిత చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రశాంత్. ప్రస్తుతం తమన్నా లీడ్ రోల్లో ‘క్వీన్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు ప్రశాంత్. సో.. ఆ సినిమా పూర్తయ్యాక రాజశేఖర్ సినిమా పట్టాలెక్కనుందన్నమాట. -
కమల్‌తో కటీఫ్
నటుడు కమల్‌హాసన్ స్థాపించిన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీలో అప్పుడే లుకలుకలుప్రారంభమయ్యాయి. పార్టీలో సరైన గుర్తింపు లేదని అసంతృప్తిని వ్యక్తంచేస్తూ ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు కమల్‌కు కటీఫ్ చెప్పేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ వెండితెర వేల్పులుగా ప్రజలు కొలుస్తున్న వారిలో ఎంజీ రామచంద్రన్, శివాజీగణేశన్ అగ్రగణ్యులు. వీరిద్దరూ రాజకీయప్రవేశం కూడా చేశారు. అయితే శివాజీ అంతగా రాణించలేకపోయినా, ఎంజీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ కాలంలో మాస్ ఇమేజ్ ఎంజీఆర్‌కు సొంతమైతే, క్లాస్ ప్రేక్షకులు శివాజీ సినిమాలకు క్యూకట్టేవారు. అంతలా తమిళ ప్రేక్షకులను వారిద్దరూ పంచుకున్నారు. ఇక వారితరం అంతరించిపోగా, తరువాత తరంలో రజనీకాంత్, కమల్‌హాసన్ అదే తరహాలో దూసుకొచ్చారు. వారిలాగానే రజనీకాంత్ తెరపై కనపడితే మాస్ ప్రేక్షకులు ఊగిపోతారు. భిన్నమైన పాత్రలు, వేషధారణలతో హాలీవుడ్‌నే ఔరా అనిపించేలా నటించిన కమల్ అంటే క్లాస్ ప్రేక్షకులకు వల్లమాలిన అభిమానం. వెండితెరపై వెలుగులు చిమ్మిన వారు రాజకీయ తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం తమిళనాడులో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పటికే ఎందరో నటీనటులు రాజకీయ అరంగేట్రం చేసి అగ్రస్థానానికి చేరుకోగా తాజాగా రజనీ, కమల్ సైతం అదేబాట పట్టారు. ఒకేసారి వెండితెరను పంచుకున్న కమల్, రజనీ రాజకీయాల్లో సైతం అదే తరహాలో ముందుకు వచ్చారు. సిద్ధాంతాలు వేరైనా.. లక్ష్యం ఒకటే రజనీ, కమల్ పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అధికారంలోకి రావాలనే లక్ష్యం మాత్రం ఒకటే. పార్టీ స్థాపనలో రజనీకాంత్ మరికొంతకాలం వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కమల్ మాత్రం మక్కల్ నీది మయ్యంను స్థాపించి ప్రజల్లోకివెళ్లడం ప్రారంభించేశారు. ఇదిలా ఉండగా, పార్టీ నిర్మాణంలో భాగంగా 14 ఉన్నతస్థాయి కమిటీలను కమల్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో న్యాయవాది రాజశేఖర్ ఒకరు. కాంగ్రెస్ పార్టీలో సీడి మెయ్యప్పన్ అనుచరుడిగా ఉండిన రాజశేఖర్ ఆ తరువాత టీటీవీ దినకరన్ పంచన చేరారు. కొంతకాలం దినకరన్ వెంట నడిచి కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యంలో చేరారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏజీ మవురియా, స్టార్ జెరాక్స్ సౌరిరాజన్ తదితరులు రాజశేఖర్‌ను కమల్‌కు పరిచం చేయడంతో ఉన్నతస్థాయి కమిటీలో సభ్యత్వం లభించింది. అయితే, రాజశేఖర్ మూడురోజుల క్రితం కమల్‌హాసన్‌ను స్వయంగా కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన నిర్ణయంపై రాజశేఖర్ వివరణ ఇచ్చారు. ‘పార్టీ స్థాపన నుంచి కమల్ వెంటే ఉంటూ శ్రమించాను. ఉన్నతస్థాయి కమిటీలోని 14 మందిలో ఐదుగురు నావారే. ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిచడం ప్రారంభమైంది. పార్టీ పనుల కోసం సమయం కేటాయించడం వీలుకావడం లేదు. నా కక్షిదారులు కోపగించుకోవడం వల్ల న్యాయవాద వృత్తి దెబ్బతినింది. అందుకనే కమల్ పార్టీకి రాజీనామా చేశా’’ అని వివరించారు. రాజశేఖర్ రాజీనామా వల్ల మక్కల్ నీది మయ్యంలోని ఆయన అనుచరులు సైతం వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానికానికి సై : కమల్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తలపడేందుకు తమ పార్టీ సిద్ధమని కమల్ ప్రకటించారు. రెండు నెలల కిత్రం మదురైలో బహిరంగసభ తరువాత మంగళవారం చెన్నై మోడల్ గ్రామసభను నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండే భూమిని సిద్ధం చేస్తున్నానని చెప్పారు. గ్రామసభల ఆవశ్యకతను ఈ ప్రభుత్వానికి తెలియజెప్పడమే ఈనాటి కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. స్థానిక పరిపాలనే తమ బలమని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీచేసేందుకు మక్కల్ నీది మయ్యం సిద్ధంగా ఉందని చెప్పారు. అవినీతిని ఒక్కసారిగా రూపుమాపలేమని, తగ్గించుకుంటూ పోయి చివరకు పూర్తిగా లేకుండా చేయడమే తన పార్టీ ధ్యేయమని అన్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో నిందితులు ఎవరైనా న్యాయస్థానం ముందు శిక్షపడేలా చేయాలని ఆయన కోరారు. -
అవినీతిపై విచారణకు సిద్ధమా ?
చిలకలూరిపేట టౌన్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి దమ్ముంటే సీబీసీఐడీ విచారణకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ సవాలు విసిరారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీసీఐ కుంభకోణం, యడవల్లి దళిత భూముల అన్యాక్రాంతం, ఇద్దరు విలేకరుల హత్య, ఆత్యహత్యా ఉదంతాలు, నీరు–చెట్టు పథకంలో భాగంగా దళిత భూముల ఆక్రమణ, చెరువుల మట్టి అమ్ముకోవటం, యడ్లపాడులో అక్రమ గ్రావెల్ తవ్వకం, అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లు, మద్యం వ్యాపారులు, బాణాసంచ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున బలవంతపు వసూళ్లు, సిటీ కేబుల్ ఆపరేటర్ల ఆస్తుల స్వాధీనం, సీఆర్ క్లబ్లో పేకాట వ్యవహారం, స్వర్ణాంధ్ర పౌండేషన్‌కు నిధుల మళ్లింపు వంటి వాటిపై సీబీసీఐడీ, లేదా సీబీఐ విచారణకు పుల్లారావు సిద్ధమా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం, అడ్డువచ్చిన వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పుల్లారావు సతీమణి రాజ్యాంగేతర శక్తిగా మారారన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, మైత్రి సంఘాలు, బంగారపు దుకాణాల నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసుళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
నరబలి కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నరబలికి ముందు రోజు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, ఆయన భార్య శ్రీలత, రాజశేఖర్ అత్త చేర్యాల నరసింహస్వామి గుడిలో నిద్ర చేసినట్లు తెలుస్తోంది. అలాగే నరబలికి సలహా ఇచ్చిన పూజారితో రాజశేఖర్ గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నరబలి సమయంలో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారని...బలి ఇచ్చిన అనంతరం చిన్నారి మొండాన్నినాచారం లక్ష్మి ఇండస్ట్రీ లోపల పడేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 30 మంది విచారణ చేశారు. వారిలో ఇరవై మంది రాజశేఖర్ కుటుంబసభ్యులు కాగా, మరో పదిమంది పూజారులు ఉన్నారు. ఇక బలి ఇచ్చిన చిన్నారిని వరంగల్ జిల్లా భీమ్ దేవేరుపల్లి మండల్ హామ్లెట్ తండా నుంచి రాజశేఖర్ కొనుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. రాజశేఖర్ నోరు విప్పితేనే... మరోవైపు నరబలి కేసులో రాజశేఖర్ నోరు విప్పితేనేగానీ మిస్టరీ వీడేలా లేదు. కేసు అతని చుట్టూనే తిరుగుతోంది. భార్య శ్రీలత ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చంద్ర గ్రహణం రోజు పసికందును బలి ఇచ్చి ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా అసలు విషయం చెబితే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందనే అతడు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. -
కోలీవుడ్‌కు మరో వారసురాలు
తమిళసినిమా: సినీ వారసుల ఎంట్రీలు ఈజీనే. అయితే ఇక్కడ నిలదొక్కుకోవడం అనేది వారి ప్రతిభ, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యమే. అలా నవ నటి శివాని కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షంచుకోనుంది. శివాని అంటే ఎవరన్నది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఎస్ నటి జంట రాజశేఖర్, జీవిత దంపతులు పెద్ద కూతురే ఈ శివాని. ఈ బ్యూటీని ఇంతకు ముందే దర్శకుడు బాలా తన చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో జరగలేదు. తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. హిందీ చిత్రం 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌లో శివాని హీరోయిన్గా పరిచయం కానుంది. ఇలాంటి పరిస్థితిలో కోలీవుడ్ నుంచి శివానికిప్పుడు పిలుపు వచ్చింది. తన యువ నటుడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయం గురించి శివాని తెలుపుతూ ఇటీవల విష్ణు విశాల్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పింది. తన ఫొటోలు పంపించమని చెప్పారని తెలిపింది. ఆ తరువాత తాను చెన్నైకి వచ్చి, దర్శకుడు వెంకటేశ్, విష్ణువిశాల్లను కలిశానని చెప్పింది. దర్శకుడు చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, అయితే ఆ సమయంలో వారు హీరోయిన్గా తనను కన్ఫార్మ్ చేయలేదని అంది. మరి కొన్ని రోజుల తరువాత తమ చిత్రంలో హీరోయిన్‌వి నువ్వే అని చెప్పారని తెలిపింది. ప్రేమతో కూడిన చాలా ఢిపరెంట్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పింది. తన పాత్రలో నటించడానికి చాలా స్కోప్ ఉంటుందని అంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఎప్పుడెప్పుడు నటిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న శివానికి నటన గురించి చెప్పనక్కర్లేదు. తను నటనలో శిక్షణ తీసుకోవలసిన అవసరం ఉండదనుకుంటా. కారణం ఆమె తల్లిదండ్రులిద్దరూ నటీనటులే కాబట్టి. తను సినిమా వాతావరణంలోనే పుట్టి పెరిగింది.శివాని కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. అదే విధంగా తను చిన్న వయసులోనే హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందట. అయితే ప్రస్తుతం తాను డాన్స్ క్లాసులకు వెళ్లుతున్నట్లు, బెల్లీ, కథక్ నృత్యాలను నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. వేల్రాజ్ ఛాయాగ్రహణం, గాయకుడు క్రిష్ సంగీతాన్ని అందించనున్నారు. -
సినిమా చూసి థ్రిల్ అవుతారు
రామ్ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్ జంటగా విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో వరప్రసాద్ బొడ్డు నిర్మించిన ‘మామ ఓ చందమామ’ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సుమన్‌గారు బిజీగా ఉండటంతో ‘వందేమాతరం’ సినిమాలో టి.కృష్ణగారు నాకు అవకాశం ఇచ్చారు. సుమన్‌గారి వల్లే నేను హీరో అయ్యా. ట్రైలర్ చుశాను. ఈ సినిమా హిట్ అవుతుంది’’ అని అన్నారు. ‘‘వెంకట్ కథ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చెయ్యలేదు. ‘గరుడవేగ’తో మంచి హిట్ కొట్టిన రాజశేఖర్‌కి కంగ్రాట్స్’’ అన్నారు నటుడు సుమన్. ‘‘రామ్‌గోపాల్ వర్మగారి స్ఫూర్తితో డైరెక్టర్ అవ్వాలని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చా. కథ చెప్పగానే సినిమా చేద్దామని ముందుకు వచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారన్న నమ్మకం ఉంది.’’ అన్నారు వెంకట్. సీనియర్ నటి గీతాంజలి, రామ్ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్, రచయిత చిన్నికృష్ణ, నటి జీవిత, నిర్మాత రాజ్ కందుకూరి, చిత్రబృందం పాల్గొన్నారు. -
బావ బావమరిది?
‘గరుడవేగ’ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రాజశేఖర్. ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ జోష్‌లో ఉన్నారు తేజ. అదే జోష్‌తో వెంకటేశ్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ నెల 13న వెంకీ బర్త్ డేకి ఈ సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటించనున్నారట. ‘‘కథ, పాత్ర నచ్చితే విలన్‌గా, ఇతర పాత్రల్లో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని ఇటీవల రాజశేఖర్ చెప్పిన విషయం తెలిసిందే. తేజ చెప్పిన కథ రాజశేఖర్‌కు నచ్చిందట. క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇందులో రాజశేఖర్ విలన్‌గా చేయబోతున్నారట. వెంకీకి బావగా కనిపించనున్నారని మరో టాక్. -
గ్రాఫిక్స్ హైలెట్
అభిమన్యుసింగ్, సుమన్, చలపతిరావు, తనాశ్రీ, ‘తాగుబోతు’ రమేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘శివ ప్రళయం’. ఎం.ఏ. చౌదరి దర్శకత్వంలో శ్రీపాద నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోని హీరో రాజశేఖర్, దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ–‘‘శివప్రళయం’ మంచి టైటిల్. టైటిల్ ఇంత బాగుందంటే సినిమా ఎంత బాగుంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. దర్శక–నిర్మాతలు ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా రష్స్ కొంత చూశా. కొత్త తరహా కథలా ఉంది. గ్రాఫిక్స్ బాగున్నాయి’’ అన్నారు మారుతి. ‘‘సరికొత్త జానర్లో రూపొందిస్తోన్న చిత్రమిది. గంటపాటు సాగే గ్రాఫిక్స్ సినిమాకి హైలెట్. ఓ ప్రముఖ హీరోయిన్‌పై త్వరలో చివరి షెడ్యూల్ షూటింగ్ చేయనున్నాం’’ అన్నారు చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: ఎస్. మహి. -
కథ విని శరత్‌కుమార్‌గారు ఏడ్చారు – రాధిక
‘‘విజయ్ ఆంటోని సినిమాలు చూడలేదు కానీ, ఆయన నటించిన ‘పిచ్చైకారన్’ను తెలుగులో రీమేక్ చేయాలను కుంటుండగానే ‘బిచ్చగాడు’ పేరుతో అనువాదమై, హిట్ అయింది. అప్పుడు ‘మంచి సినిమా వదులుకున్నామే’ అనుకున్నా’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రల్లో జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రాజశేఖర్, జీవిత రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను మిస్ చేసుకున్న ‘బిచ్చగాడు’ సినిమా చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. ఆ సినిమాలో అమ్మ పాట నాకు ఎంతో నచ్చుతుంది. దాని కోసమైనా సినిమా చూస్తా. ‘ఇంద్రసేన’ మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. నటి–నిర్మాత రాధిక మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా లను ఆదరించే ప్రేక్షకుల్లో మొదటి స్థానం తెలుగు వారిదే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారు. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి రుణపడి ఉంటా. ఈ కథ విని, శరత్‌కుమార్‌గారు ఏడ్చారు. నేను అడగ్గానే సినిమా చేయడానికి ఓకే అన్నారు విజయ్ ఆంటోని. ‘ఇంద్రసేన’ తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణం విజయ్ ఆంటోనిగారు. ఈ అవకాశాన్నిచ్చిన రాధిక, ఫాతిమా ఆంటోనిలకు థ్యాంక్స్’’ అన్నారు జి. శ్రీనివాసన్. ‘‘పదిహేనేళ్ల క్రితం రాధికగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఇప్పుడు నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్‌కుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ ఆంటోని. నటి జీవిత, చిత్రనిర్మాత నీలం కృష్ణారెడ్డి, ‘బిచ్చగాడు’ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత భాష్యశ్రీ, సినిమాటోగ్రాఫర్ దిల్‌రాజ్, నిర్మాత సురేశ్ కొండేటి పాల్గొన్నారు. -
అందువల్లనే థియేటర్లకు రావడం లేదేమో!
‘‘నా స్వస్థలం ఏలూరు. సినిమాలంటే ఆసక్తి. దర్శకుడు కావాలన్నది నా గోల్. నాన్నగారి సలహా మేరకు సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్‌లో పీజీ డిప్లొమా చేశా’’ అన్నారు ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పి.ఎస్.వి గరుడవేగ’ సినిమాకి ధర్మేంద్ర ఎడిటర్‌గా వర్క్ చేశారు. ‘‘నా తొలి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ‘గరుడవేగ’ అని ధర్మేంద్ర చెబుతోన్న విశేషాలు... ► ఎడిటర్లు శ్రీకర్‌ప్రసాద్, మార్తాండ్ కె. శంకర్లు నాకు స్ఫూర్తి. ఎడిటర్‌గా ‘ప్రస్థానం’ నా తొలి సినిమా. ఎడిటర్ శ్రవణ్ నా బ్యాచ్‌మేట్. తను బిజీగా ఉండటంతో ఆ సినిమా అవకాశాన్ని నాకు ఇప్పించారు. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం ఎదురుచూసే అవసరం రాలేదు. ఫిల్మ్ ఎడిటింగ్కీ, డిజిటల్ ఎడిటింగ్కీ మాన్యువల్ వర్క్ తగ్గిందే తప్ప... బ్రెయిన్ పరంగా కాదు. డిజిటల్ ఎడిటింగ్‌లో సగం టైమ్ తగ్గుతోంది. నాగచైతన్య ‘దడ’ ఎడిటర్‌గా నాకు పెద్ద సినిమా. నా మూడో సినిమా కూడా! భారీ డిజాస్టర్ అది. అందుకే పెద్ద సినిమా అవకాశాలు రాలేదనుకుంటున్నా. ► మన సినిమాలు జనరల్‌గా 2కె ఔట్పుట్లోనే ఉంటాయి. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడవేగ’కి మాత్రమే 4కె రిజల్యూషన్ అవుట్‌పుట్ ఇచ్చాం. అందుకే క్వాలిటీకి అంత అభినందనలొస్తున్నాయి. 4కె టెక్నాలజీలో చేయాలంటే ఖర్చు ఎక్కువ. అందువల్ల, నిర్మాతలు ఒప్పుకోరు. ఫిల్మ్ క్వాలిటీగా ఉంటేనే... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఇప్పుడు యూట్యూబ్‌లో క్వాలిటీ పెంచుకుని చూస్తే ఎలా ఉంటుందో... స్క్రీన్‌పైనా అలాగే ఉంటోంది. అందుకే, థియేటర్స్‌కి ప్రేక్షకులు తగ్గిపోతున్నారేమో! అని నా ఫీలింగ్. ► ట్రైలర్స్ కట్ చేసేవాళ్లు ఎడిటర్ కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అది పబ్లిసిటీ. ‘గరుడవేగ’ ఎడిటింగ్‌కి 195 రోజులు వర్క్ చేశాం. ► రెండేళ్ల తర్వాత డైరెక్షన్ చేద్దామనుకుంటున్నా. కథ రెడీ చేసుకుంటున్నా. పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు శ్రేష్ట్ మూవీస్‌లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వం చేయబోతున్న సినిమాలకు నేను పనిచేయబోతున్నా. -
ఆ సినిమాకు సీక్వెల్ తీస్తా: రాజశేఖర్
సాక్షి, విజయవాడ : త్వరలోనే అల్లరి ప్రియుడు వంటి కమర్షియల్ సినిమా తీసేందుకు కసరత్తు చేస్తున్నానని, గరడ వేగ సినిమా సీక్వెల్ కూడా చేస్తానని సినీనటుడు రాజశేఖర్ ప్రకటించారు. రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’ సినిమా విజయోత్సవ సభ విజయవాడలోని ట్రెండ్ సెట్మాల్లోని కేపిటల్ సినిమాలో నిన్న (గురువారం) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విడుదలకు ముందు తన తల్లి, బావమరిది చనిపోయారని, ఆ బాధ నుంచి చిత్ర విజయం ఊరట ఇచ్చిందని పేర్కొన్నారు. రాజశేఖర్ భార్య, నటి జీవిత మాట్లాడుతూ తాను విజయవాడ ఆడపడుచునేనని అన్నారు. తన తల్లి, అత్తగారి ఊరు విజయవాడేనని, సత్యనారాయణపురంలోనే ఉండేవారిమని ఆమె గుర్తుచేసుకున్నారు. గరుడ వేగ మిగిలిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని, రొటీన్‌గా పాటలు, ఫైట్లు లేకుండా ఉన్నా ప్రేక్షకులు ఆదరించటం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ హైదరాబాదుకు దీటుగా విజయవాడ అభివృద్ధి చెందడం సినీవర్గాలను ఆకట్టుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవిత, రాజశేఖర్ దంపతుల కుమార్తెలు శివాని, శివాత్మిక, అలంకార్ ప్రసాద్, సురేష్ మూవీస్ ప్రతినిధి ముళ్లపూడి భగవాన్, కేపిటల్ సినిమాస్ మేనేజర్ కె.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పీఎస్వీ గరుడవేగ’ ఆడదనుకున్నా
సాక్షి, హైదరాబాద్: సినిమాకు మూడు వారాల ముందు నా తల్లి మరణం.. ఇక మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది అనగా జీవిత సోదరుడు చనిపోవడంతో నా టైమ్ బాగలేదు.. ఈ సినిమా ఆడదేమోననుకున్నానని హీరో రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పీఎస్వీ గరుడవేగ’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చిత్రయూనిట్ మంగళవారం ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు. సినిమాకు ముందు బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకోవడంతోపాటు చెన్నైలో వరదలు ముంచెత్తడంతో నా టైం బాలేదనుకొని సినిమా ఆడదేమోననుకున్నాను. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌కు సహకరించిన చిరంజీవి.. బాలకృష్ణలకి ఎంతగానో రుణపడి ఉంటానన్నారు. -
నెక్ట్స్ మిషన్...
మిషన్ గరుడవేగ... రాజశేఖర్ హీరోగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన ‘పీఎస్వీ గరుడవేగ’ మంచి హిట్ టాక్‌తో రన్ అవుతోంది! గరుడవేగ హిట్‌తో ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడి నెక్ట్స్ సినిమా ఎవరితో? నితిన్‌తో! యస్, ప్రవీణ్ సత్తారు నెక్ట్స్ మిషన్... నితిన్‌తోనే. ‘‘నా తర్వాతి చిత్రాన్ని వెరీ టాలెంటెడ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో చేయబోతున్నా’’ అన్నారు నితిన్.