
‘గరుడవేగ’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు డా.రాజశేఖర్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో రాజశేఖర్ హవా మళ్లీ మొదలైంది. యాంగ్రీ యంగ్‌మెన్‌గా రాజశేఖర్ ఎన్నో మరుపురాని హిట్స్ ఇచ్చారు. అయితే గరుడవేగ రిలీజై చాలా రోజులవుతున్నా.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.
‘అ!’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. మంచి ప్రయత్నంగా మిగిలినా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. అయితే రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. ఆదా శర్మా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment