గణపతి బప్పా మోరియా | 'Ganapati Bappa Moriya' is an commercial movie | Sakshi
Sakshi News home page

గణపతి బప్పా మోరియా

Published Fri, Sep 13 2013 12:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

గణపతి బప్పా మోరియా

గణపతి బప్పా మోరియా

‘గణపతి బప్పా మోరియా’ పేరుతో ఓయస్‌యం సంస్థ ఓ చిత్రం నిర్మిస్తోంది. అయితే ఇది భక్తిరసాత్మక చిత్రం కాదు, కమర్షియల్ మూవీ అని నిర్మాతలు కుమార్ ఏయస్‌కే, రామ్‌కుమార్ ఏయస్‌కే అంటున్నారు. రామ్‌కుమార్ ఏయస్‌కే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనాథ్, రాజశేఖర్, మల్లేష్, రితీష్  ముఖ్య తారలు. ఈ చిత్రం లోగో, వినాయకుడి పాట ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘మురళీ లియోన్ మంచి పాటలిచ్చారు. నందన్‌రాజ్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారు. ఇంతవరకూ తెరపై రాని కథతో  ఈ సినిమా చేశాం’’ అన్నారు. ‘‘వినాయకుడి ప్రతి మండపం దగ్గర ఈ పాట మోగాలి. 
 
త్వరలో పాటల సీడీని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘వినాయకుడి మీద పాటతో ఈ షూటింగ్ ప్రారంభించాం. సినిమా మంచి విజయం సొంతం చేసుకోవాలి’’ అని సంగీతదర్శకుడు తెలిపారు. ఈ టైటిల్‌కి మంచి స్పందన లభించిందని, మంచి పాత్రలు చేశామని శ్రీనాథ్, రాజశేఖర్, రితీష్  చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement