breaking news
Ganapati Bappa Moriya
-
చవితి రుచులు చవిచూడాల్సిందే!
వినాయక చవితి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేవి కమ్మని వంటకాలు! ఉండ్రాళ్ళు, పులిహోరా, తాలికలు ఇలా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన రుచులతో వేడుక మొదలవుతుంది. మరి మన బొజ్జగణపయ్యకు ఇష్టమయ్యే రుచులను సులభంగా ఇలా చేసుకుందామా?బెల్లం తాలికలుకావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, బియ్యప్పిండి– అర కప్పు, నీళ్ళు– ఒకటిన్నర కప్పులుబెల్లం తురుము– ఒక కప్పు (కావాలంటే పెంచుకోవచ్చు), ఏలకుల పొడి– అర టీస్పూన్నెయ్యి– 2 టీస్పూన్లు, గోధుమపిండి– ఒక టీస్పూన్, బాదం, జీడిపప్పు –కొద్దికొద్దిగాతయారీ: ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి ముద్దలా అయ్యాక, చల్లారనివ్వాలి. చల్లారిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, చేతితో సన్నని తాలికల్లా చుట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి, అవి మరుగుతున్నప్పుడు తాలికలను కొద్దికొద్దిగా వేసుకోవాలి. తాలికలు విరిగిపోకుండా సున్నితంగా గరిటెతో కలపాలి. తాలికలు పాలలో ఉడికిన తర్వాత, చిన్న గిన్నెలో గోధుమపిండిని కొద్దిగా నీటితో కలిపి, పాలలో వేసి గరిటెతో కలుపుకోవాలి. అనంతరం బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. బెల్లం కరిగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసుకుని నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులను కలుపుకుంటే చాలు.పులిహోరకావలసినవి: అన్నం– 2 కప్పులు (మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి)చింతపండు గుజ్జు– 2 టేబుల్ స్పూన్లు (నిమ్మరసం కూడా వాడుకోవచ్చు)పల్లీలు– పావు కప్పుశనగపప్పు– ఒక టేబుల్ స్పూన్మినపప్పు, ఆవాలు– ఒక టీస్పూన్ చొప్పున, జీలకర్ర– అర టీస్పూన్ఎండుమిర్చి– 3 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 3 (సన్నగా చీల్చినవి), కరివేపాకు– కొద్దిగాపసుపు– అర టీస్పూన్ఇంగువ– చిటికెడు (అభిరుచిని బట్టి)నూనె– తగినంత, ఉప్పు– రుచికి సరిపడాతయారీ: ముందుగా పెద్ద పాత్ర తీసుకుని అన్నంలో కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకుని చల్లారనివ్వాలి. ఈలోపు మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. చింతపండుతో అయితే, వేగిన పోపులో చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకోవాల్సి ఉంటుంది. అదే నిమ్మకాయ పులిహోర అయితే, పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, అందులో నిమ్మకాయ రసం కలుపుకుని, ఆ పోపు మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.దద్ధోజనంకావలసినవి: అన్నం– రెండున్నర కప్పులుగడ్డ పెరుగు– రెండు కప్పులు, పాలు– అర కప్పు(కాచి చల్లార్చినవి)ఉప్పు– సరిపడా, నూనె– ఒక టేబుల్ స్పూన్ఆవాలు– ఒక టీస్పూన్, కరివేపాకు– కొద్దిగాకొత్తిమీర తురుము– కొద్దికొద్దిగాఅల్లం తురుము– అర టీస్పూన్తయారీ: ముందుగా అన్నం వండి, చల్లారనివ్వాలి. చల్లారిన అన్నంలో పాలు, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు దోరగా వేగించాలి.అభిరుచిని బట్టి పప్పులు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని వేయించుకోవచ్చు ఇప్పుడు ఆ పోపును పెరుగు అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.ఉండ్రాళ్ళుకావలసినవి: బియ్యప్పిండి–ఒక కప్పునీళ్ళు– ఒకటిన్నర కప్పులుఉప్పు– సరిపడానూనె– 2 టీ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి తురుము, అల్లం తురుము, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు– కొద్దికొద్దిగాతయారీ: ఒక పాత్రలో నీళ్ళు, ఉప్పు, నూనె వేసి మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలా తయారయ్యాక, స్టవ్ ఆపేసి మూత పెట్టి ఐదు నిమిషాలుంచాలి. పిండి కొద్దిగా చల్లారాక, చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో ఈ ఉండ్రాళ్ళను పెట్టి, ఆవిరిపై ఉడికించి ప్రసాదంగా పెట్టొచ్చు. అభిరుచి బట్టి ఈ ఉండ్రాళ్ళకు తాలింపు కూడా వేసుకోవచ్చు. అదెలా అంటే, స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వేగిన పోపులో ఈ ఉడికించిన ఉండ్రాళ్ళను వేసి సున్నితంగా కలుపుకుని, కొబ్బరితురుమును కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: గణేశుడే అలంకరణ) -
గణపతి బప్పా మోరియా
‘గణపతి బప్పా మోరియా’ పేరుతో ఓయస్‌యం సంస్థ ఓ చిత్రం నిర్మిస్తోంది. అయితే ఇది భక్తిరసాత్మక చిత్రం కాదు, కమర్షియల్ మూవీ అని నిర్మాతలు కుమార్ ఏయస్‌కే, రామ్‌కుమార్ ఏయస్‌కే అంటున్నారు. రామ్‌కుమార్ ఏయస్‌కే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనాథ్, రాజశేఖర్, మల్లేష్, రితీష్ ముఖ్య తారలు. ఈ చిత్రం లోగో, వినాయకుడి పాట ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘మురళీ లియోన్ మంచి పాటలిచ్చారు. నందన్‌రాజ్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారు. ఇంతవరకూ తెరపై రాని కథతో ఈ సినిమా చేశాం’’ అన్నారు. ‘‘వినాయకుడి ప్రతి మండపం దగ్గర ఈ పాట మోగాలి. త్వరలో పాటల సీడీని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘వినాయకుడి మీద పాటతో ఈ షూటింగ్ ప్రారంభించాం. సినిమా మంచి విజయం సొంతం చేసుకోవాలి’’ అని సంగీతదర్శకుడు తెలిపారు. ఈ టైటిల్‌కి మంచి స్పందన లభించిందని, మంచి పాత్రలు చేశామని శ్రీనాథ్, రాజశేఖర్, రితీష్ చెప్పారు.