
గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ అతనికి జంటగా నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీరియాడిక్ హై యాక్షన్ మూవీతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వర్కింగ్ టైటిల్ 'ఎస్‌డీటీ 18' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్‌లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
MY NEXT #SDT18 ✊
This one will be more than special.
Need all your love & blessings 🙏🏼
All the best to us @rohithkp_dir 🤗
Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024