30 ఏళ్ల క్రితం ఫోటో.. చిరుతో ఉన్నదెవరో తెలుసా..? | An old picture of Megastar Chiranjeevi with a boy is currently trending on social media. | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల క్రితం ఫోటో.. చిరుతో ఉన్నదెవరో తెలుసా..?

Published Tue, Oct 15 2024 11:21 AM | Last Updated on Tue, Oct 15 2024 11:36 AM

An old picture of Megastar Chiranjeevi with a boy is currently trending on social media.

మెగాస్టార్‌ చిరంజీవితో ఉన్న ఒక బాలుడి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతని పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్‌ ఈ ఫోటోను షేర్‌ చేస్తున్నారు. ఇందులో ఉన్నది ఎవరో కనిపెట్టండి అంటూ ఒక క్యాప్షన్‌తో వారు షేర్‌ చేస్తున్నారు. గుర్తుపట్టిన అభిమానులు మాత్రం వెంటనే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇంతకు చిరు చేతిలో ఉన్న ఆ బాలుడు ఎవరంటే..? టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌.

మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ అక్టోబర్‌ 15న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సినిమాల పరంగా తన కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టిన ఆయన ఆ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే, విరూపాక్ష, బ్రో చిత్రాలతో అభిమానులను మెప్పించాడని చెప్పవచ్చు.

రాబోయే సినిమా విషయానికొస్తే.. సాయి ధరమ్‌ తేజ్‌ టైటిల్‌ రోల్‌లో  ‘గాంజా శంకర్‌’గా రానున్నాడు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, సినిమా టైటిల్‌ మార్చాలని పలు అభ్యంతరాలు వచ్చాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement