‘‘నిర్మాత బాగుండాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాని 79రోజుల్లో పూర్తి చేశాం. నేను నిర్మాత సి. కల్యాణ్‌కి 79రోజుల కంటే ఒక్కరోజు ముందే మన చిత్రం పూర్తి కావాలన్నా. త్వరగా అంటే సినిమా చుట్టేయడం కాదు. బాగా తీయడం కూడా ఇంపార్టెంట్’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. రాజశేఖర్, పూజా కుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. శివాణి–శివాత్మిక సమర్పణలో కోటేశ్వరరాజు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాకీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. ఎంత ఖర్చు పెడుతున్నామన్నది నిర్మాతలకే తెలియని పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. ‘గరుడవేగ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. మనకున్న అరుదైన డైరెక్టర్లలో ప్రవీణ్ ఒకరు. రాజశేఖర్ విలక్షణ నటులు. ఆయన ఎంచుకునే కథలు, పాత్రలే కాదు.. నటన కూడా భిన్నంగా ఉంటుంది. నవంబర్ 3న విడుదలవుతున్న ‘గరుడవేగ’ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారు ఎక్కడికెళితే అక్కడ అదృష్టమని ఇండస్ట్రీ అందరికీ తెలుసు.
వందేమాతరం, ప్రతిఘటన, అంకుశం’లో ఎలా చేశానో ఇప్పుడూ అదే ఉత్సాహంతో చేస్తానని చెప్పా’’ అన్నారు. ‘‘గుంటూరు టాకీస్’ ట్రైలర్‌ని బాలకృష్ణగారు రిలీజŒ æచేశారు. 2కోట్లతో తీసిన ఆ సినిమా 25 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘గరుడవేగ’ ట్రైలర్ లాంచ్ చేశారు. 25 కోట్లతో తీసిన ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో లెక్కపెట్టుకోండి. ఈ సినిమాకు మూల స్తంభం జీవితగారు’’ అన్నారు ప్రవీణ్ సత్తారు.చిత్రనిర్మాత కోటేశ్వరరాజు, పూజాకుమార్, శ్రద్ధా దాస్, శివాణి–శివాత్మిక, నిర్మాతలు సి.కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment