garudavega
-
అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం!
ప్రముఖ కొరియర్ సంస్థ గరుడవేగ కొత్త సవాల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (T.A.T.A) నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ కోసం 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు 15 అడుగుల చార్మినార్, 18 అడుగుల ఓరుగల్లు స్తూపాల నమూనాలను తమ కొరియర్ సంస్థ ద్వారా పంపేందుకు రంగం సిద్ధం చేసింది. కష్టసాధ్యమైన పనిలో భాగమైనందుకు గరుడవేగ ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతోకలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను అందిస్తోంది గరుడవేగ సంస్థ (GarudaVega - ships all over the world). ఎంతో నమ్మకమైన, ఖచ్చితమైన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న సంస్థ గరుడవేగా. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఒరిస్సా, చంఢీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో గరుడవేగ సేవలు అందిస్తోంది. గరుడవేగా కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా మీరు అమెరికానుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి పార్శిల్/కొరియర్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు గరుడవేగా సేవలు అందుతాయి. డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసు కూడా ఉన్నాయి. మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం ఉన్నది. కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అన్ని షిప్మెంట్ సర్వీసులకు మీరు గరుడవేగా వారిని వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. "ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఆప్తులందరినీ కలుపుతూ, వారి మధ్య దూరాలను తగ్గిస్తూ, బంధాలను నిలబెడుతూ, ఒక వారధిలా నిలబడుతున్న సంస్థ గరుడవేగా. మా సేవలు వినియోగించుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము-గరుడవేగ, గరుడబజార్’’ (అడ్వెర్టోరియల్) -
గరుడవేగ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ షిప్పింగ్ సర్వీసెస్
హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేయటానికి గరుడవేగ సంస్థ ముందుకు వచ్చింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎక్కడ కొనుగోలు చేసినా వాటిని ఇండియాలోని తమ వారికి వాటిని నేరుగా అందిచాలని అనుకుంటే, వెంటనే తమను సంప్రదించాలని (www.garudavega.com) గరుడవేగ సంస్థ ప్రకటించింది. ఏ విధమైన లాభాలు ఆశించకుండా, ఆ సిలెండర్లు పంపటానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతే సొమ్ము తీసుకుని, మీవారికి ఆ సిలెండర్లు అందిస్తామని గరుడవేగ తెలిపింది. పేలెట్ కార్గో/కమర్షియల్ షిప్మెంట్లు చేయదలుచుకున్నవారు oxygen@garudavega.comకు ఈమెయిల్ చెయవచ్చు. గరుడవేగ కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా అమెరికా నుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి షిప్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు తమ సేవలు అందుతాయని గరుడవేగ తెలిపింది. డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసుతో పాటు మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం.. కార్పొరేట్ సంస్థలకు డిస్కౌంట్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇండియా నుంచి అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ తో బాటు, రెండువందల దేశాలకు షిప్పింగ్ సేవలు అందిస్తున్నట్టు గరుడవేగ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, ఒరిస్సా, చండీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో తమ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. -
గరుడవేగ సేవలు పునః ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో లాక్డౌన్లు అమలైన క్రమంలో కొద్దినెలలుగా నిలిచిపోయిన తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ గరుడవేగ తెలిపింది. తమ బ్రాంచీలన్నీ పున:ప్రారంభమయ్యాయని పేర్కొంది. వినియోగదారుల సరుకులను ఎప్పటిలాగే దూర దేశాలలో ఉన్న తమ వారికి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భౌతిక దూరం, ఐసోలేషన్ వంటి కోవిడ్-19 నిబంధనలను అమలు చేస్తామని తెలిపింది. తమ సంస్థ అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ లోని అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయి, ఎన్నో మిడిల్ ఈస్ట్ దేశాలతో సహా 200 దేశాలకు సేవలను అందిస్తున్నదని గరుడవేగ పేర్కొంది. ఇక గరుడ బజార్ "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ్చని పేర్కొంది. -
హైదరాబాద్ మెట్రోలో ‘గరుడ వేగ’ సర్వీసులు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు సేవలను అందిస్తున్న ప్రముఖ ట్రాన్స్‌పోర్టు సంస్థ గరుడవేగ.. తాజాగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కూడా కొత్త బ్రాంచీలను ప్రారంభించనుంది. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య తూర్పులోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను గరుడవేగ అందిస్తోంది. బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్‌ప్రెస్" సర్వీస్‌తో పాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా ఉన్న పార్శిళ్లకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజులలోపు అమెరికాలో ఉన్న బంధువులకు చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గరుడ వేగ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపే సదుపాయాన్ని గరుడవేగ కల్పిస్తోంది. తద్వారా పండుగ సమయాలలో, విదేశాల్లో తమవారికి దూరంగా ఉన్నప్పటికీ కానుకలు పంపించి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందన్న గరుడవేగ.. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సదుపాయాలను ఆఫర్ల రూపంలో అందించనుంది. ఈ సందర్భంగా వినియోగదారులకు కొత్త సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. -
‘గరుడవేగ’తో 5-8రోజుల్లో సరుకులు అమెరికాకు..
సాక్షి, హైదరాబాద్ : వినాయక చవితిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులందరికీ గరుడవేగ కొరియర్ సర్వీసెస్ శుభాకాంక్షలు తెలిపింది. మనోహరమైన వినాయక విగ్రహాలను ఈ ఏడాది అట్లాంటా, సియాటిల్, కాలిఫోర్నియాలోని దేవాలయాలకు గరుడవేగ ద్వారా పంపించడం ఆనందదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. వినియోగదారులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ ప్రేమ ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య తూర్పులోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను గరుడవేగ అందిస్తోంది. బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్‌ప్రెస్" సర్వీస్‌తో పాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా వున్న పార్సళ్ళకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజులలోపు అమెరికాలో ఉన్న మీ బంధువులకు చేరతాయి. మరిన్ని వివరాలకోసం గరుడవేగ ఏజెంట్లను సంప్రదించవచ్చు. అదే విధంగా "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపే సదుపాయాన్ని గరుడవేగ కల్పిస్తోంది. తద్వారా పండుగ సమయాలలో, తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని గరుడవేగ తెలిపింది. గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అడయార్ ఆనందభవన్ వంటి ప్రసిద్ధి చెందిన తమిళనాడు స్వీట్ సంస్థల నుంచి కూడా ఇప్పుడు మీరు గరుడవేగ ద్వారా, నేరుగా మీ ఇంటికి స్వీట్లు తెప్పించుకోవచ్చని సూచిస్తోంది. -
బిజీ అవుతున్న యువ నటుడు
‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌దీప్ సూరినేని సరికొత్త మేకోవర్‌లో రెడీ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించిన చరణ్‌దీప్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు ఈ యువ నటుడు. తాజాగా ఈ చరణ్ న్యూలుక్లో ఆకట్టుకుంటున్నాడు. జుట్టు బాగా పెంచి, గడ్డంతో మెడ్రన్ లుక్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో నటిస్తున్నాడు చరణ్ దీప్. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ ‘రాజశేఖర్ గారి ‘పీఎస్వీ గరుడవేగ’లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్ గారితో నటించే అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్పించారు. రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కిలో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. గరుడవేగలో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే... కల్కిలో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నా. ఆ పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను. అయితే మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. మరో మూడు నాలుగు భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటించమని సంప్రదించారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా’ అన్నారు. -
నేను క్షేమంగా ఉన్నా : హీరో రాజశేఖర్
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో పది రోజుల కిందట రాజశేఖర్ గాయపడ్డారు. అయితే చాలా మంది నటీనటులు కాంబినేషన్లో షూటింగ్ ఉండటంతో రెస్ట్ తీసుకోకుండానే ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. కొద్ది రోజుల గ్యాప్ తరువాత ప్రస్తుతం మరో మేజర్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కులుమానాలీ వెళ్లారు. అయితే అక్కడ మరోసారి రాజశేఖర్ ప్రమాధానికి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హీరో రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.‘చిన్న అడ్డంకి కారణంగా ప్రయాణం కాస్త ఆలస్యమైంది అంతే ఎలాంటి ప్రమాదం జరగలేదు. కులుమనాలీలో జరగబోయే షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాను. నా క్షేమాన్ని కోరుతూ ఎంతో మంది మెసేజ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశారు. The rumours are little too spiced, here’s what actually happened. Dear media, please don’t attach my old accident pictures to the recent news.😊 pic.twitter.com/NUImzNcvhB — Dr.Rajasekhar (@ActorRajasekhar) 22 November 2018 -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘జిగేల్’
కథ సినిమాతో హీరోగా పరిచయం అయిన అరుణ్ ఆదిత్ ఇటీవల గరుడవేగ సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగేల్’. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో అరుణ్ ఆదిత్ సరసన ‘జంబ లకిడి పంబ’ ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లి యేలూరి మాట్లాడుతూ.. ‘కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతొన్న జిగేల్ తొలి షెడ్యూల్ పూర్తయింది. జులై 30 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఆగస్ట్ 20 వరకు జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్‌లో సినిమా టోటల్ షూట్ పూర్తి చేస్తామన్నా’రు. చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. ‘భారీ తారాగణంతో , కథకు తగ్గ బడ్జెట్ తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ది బెస్ట్ టీమ్ వర్క్ చేస్తున్నారు. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. మా టీమ్ అందరికి జిగేల్ మంచి పేరును తీసుకువస్తుందన్నా’రు. -
రామ్ సినిమా ఆగిపోయిందా..?
ప్రస్తుతం హలో గురూ ప్రేమకోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ హీరో రామ్, ఈ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ లో నటించేందుకు ఓకె చెప్పాడు. గరుడవేగ సినిమాతో సక్సెస్ సాధించిన ప్రవీణ్, రామ్ హీరోగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలన భావించాడు. అయితే ప్రస్తుతం ఉన్న రామ్ మార్కెట్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాదన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. నేను శైలజ తరువాత రామ్ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ సమయంలో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తే రిస్క్ అన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు
పనాజి : అంతర్జాతీయ లాజిస్టిక్ సర్వీసులను అందిస్తున్న గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గోవాలో జరిగిన డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఈవెంట్లో తమకు గోల్డ్ పార్టనర్ అవార్డు దక్కినట్టు కంపెనీ తెలిపింది. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని పేర్కొంది. ఈ అవార్డును డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియా సీనియర్ మేనేజ్మెంట్ టీమ్, ఎస్వీపీ అండ్ కంట్రీ మేనేజర్(ఇండియా) ఆర్ఎస్ సుబ్రహ్మణియన్, వైస్ ప్రెసిడెంట్(కమర్షియల్) సందీప్ జునేజాలు ఈ అవార్డుతో సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా గరుడవేగ తన సర్వీసులను అందజేస్తుంది. అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, మధ్య ప్రాచ్యతో పాటు 200 ఇతర దేశాల్లో గరుడవేగ నమ్మకమైన సర్వీసు ప్రొవైడర్‌గా ఉందని కంపెనీ తెలిపింది. తమ పాపులర్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు ద్వారా ప్రస్తుతం అమెరికాకు ఎకానమీ షిప్పింగ్‌ను కేజీకి రూ.350కే అందజేస్తున్నట్టు గరుడవేగ పేర్కొంది. ఐదు పని దినాల్లోనే డెలివరీని చేస్తున్నట్టు కూడా చెప్పింది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు, పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో గడిపే సమయాన్ని మిస్ అయితే, వారికి పండుగ సందర్భంగా స్వదేశం నుంచి కానుకలను, మిఠాయిలను పంపించుకునే సౌకర్యాలను కూడా అందిస్తోంది. గరుడబజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేస్తోంది. దక్షిణా భారత దేశంలో పలు ప్రముఖ వర్తకుల వద్ద స్పెషల్ స్వీట్లను, స్నాక్‌లను అందుబాటులో ఉంచింది. గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అద్యార్ ఆనంద భవన్, స్వగృహ, పుల్లా రెడ్డి, వెల్లంకి, శ్రీదేవి వంటి ప్రముఖ వర్తకుల నుంచి వీటిని అందరజేస్తోంది. -
విలన్‌గా మారనున్న యాంగ్రీ హీరో
చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు యాంగ్రీ హీరో. కేవలం హీరోగానే కాకుండా కీలకమైన పాత్రల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు. గతంలో ధృవ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటించాల్సి ఉన్న అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించేందుకు రాజశేఖర్ అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇటీవల ప్రారంభించారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నారట. తనకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన ప్రవీణ్ కోరటంతో రాజశేఖర్ ప్రతినాయక పాత్రకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను జార్జియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలలో చిత్రీకరించనున్నారు. -
రామ్ కొత్త సినిమా ఓపెనింగ్
యంగ్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ రోజు (26-04-2018) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పటికే కాంబినేషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో ఉంటుందంటున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘ఈ రోజు హైదరాబాద్‌లో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలను నిర్వహించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. విదేశాల నుంచి తిరిగి వచ్చాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. న్యూ వేవ్ లో సాగే చిత్రమిది. మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని చెప్పారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘హీరో రామ్‌కి చక్కగా సరిపోయే కథ కుదిరింది. స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్, అడ్వంచరస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. న్యూ వేవ్‌లో సాగే సినిమా. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు, నటీనటులు మా చిత్రానికి పనిచేస్తారు. అందరినీ మెప్పించే సినిమా అవుతుంది’ అని అన్నారు. -
గరుడ వేగ సినిమా ప్రదర్శించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో రాజశేఖర్ నటించిన ‘పీయస్వీ గరుడ వేగ’ చిత్రాన్ని ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గరుడ వేగ సినిమాపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారించిన సివిల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దంటూ దర్శకనిర్మాలతో పాటు, యూట్యూబ్‌కు కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగింది? గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు నాల్గవ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సదరు సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు.. ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ స్కాంను ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ పాత్రధారుడిగా హీరో వెలికి తీసినట్టు చూపారని లాయర్ పేర్కొన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీంతో పిటిషనర్ వాదనలను పరిశీలించిన జడ్జి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు. చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు గతేడాది నవంబరులో వచ్చిన గరుడ వేగ మంచి విజయం అందించిన విషయం తెలిసిందే . సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రావడం గమనార్హం. -
ఆ సినిమాకు సీక్వెల్ తీస్తా: రాజశేఖర్
సాక్షి, విజయవాడ : త్వరలోనే అల్లరి ప్రియుడు వంటి కమర్షియల్ సినిమా తీసేందుకు కసరత్తు చేస్తున్నానని, గరడ వేగ సినిమా సీక్వెల్ కూడా చేస్తానని సినీనటుడు రాజశేఖర్ ప్రకటించారు. రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’ సినిమా విజయోత్సవ సభ విజయవాడలోని ట్రెండ్ సెట్మాల్లోని కేపిటల్ సినిమాలో నిన్న (గురువారం) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విడుదలకు ముందు తన తల్లి, బావమరిది చనిపోయారని, ఆ బాధ నుంచి చిత్ర విజయం ఊరట ఇచ్చిందని పేర్కొన్నారు. రాజశేఖర్ భార్య, నటి జీవిత మాట్లాడుతూ తాను విజయవాడ ఆడపడుచునేనని అన్నారు. తన తల్లి, అత్తగారి ఊరు విజయవాడేనని, సత్యనారాయణపురంలోనే ఉండేవారిమని ఆమె గుర్తుచేసుకున్నారు. గరుడ వేగ మిగిలిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని, రొటీన్‌గా పాటలు, ఫైట్లు లేకుండా ఉన్నా ప్రేక్షకులు ఆదరించటం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ హైదరాబాదుకు దీటుగా విజయవాడ అభివృద్ధి చెందడం సినీవర్గాలను ఆకట్టుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవిత, రాజశేఖర్ దంపతుల కుమార్తెలు శివాని, శివాత్మిక, అలంకార్ ప్రసాద్, సురేష్ మూవీస్ ప్రతినిధి ముళ్లపూడి భగవాన్, కేపిటల్ సినిమాస్ మేనేజర్ కె.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
'పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్'
టైటిల్ : పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, పూజా కుమార్, కిశోర్, అదిత్ అరుణ్, నాజర్, పోసాని కృష్ణమురళీ సంగీతం : శ్రీచరణ్ పాకల, భీమ్స్ దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు నిర్మాత : ఎమ్. కోటేశ్వర రాజు, మురళీ శ్రీనివాస్ చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో గరుడ వేగను తెరకెక్కించారు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రాజశేఖర్ సక్సెస్ సాధించారా..?(సాక్షి రివ్యూస్) తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రాన్ని డీల్ చేసి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏమేరకు ఆకట్టుకున్నారు. కథ : చంద్రశేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో అసిస్టెంట్ కమిషనర్. తన ఉద్యోగం సంగతి భార్యతో కూడా చెప్పుకోలేని శేఖర్, తన మిషన్స్ కారణంగా తరుచు భార్య స్వాతి(పూజా కుమార్)తో గొడవ పడుతుంటాడు. ఇక ఉద్యోగం వద్దు అనుకొని రాజీనామ చేసే సమయంలో ఓ కేసు శేఖర్ దగ్గరకు వస్తుంది. నిరంజన్ (అదిత్ అరుణ్) తన దగ్గర ఉన్న ఓ ఇన్ఫర్మేషన్ను ప్రతిపక్షనాయకుడు ప్రతాప్ రెడ్డి(పోసాని కృష్ణమురళీ)కి బేరం పెడతాడు. పది కోట్లకు ఆ ఇన్ఫర్మెషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్న నిరంజన్ చివరి నిమిషంలో శేఖర్‌కి దొరికిపోతాడు. కానీ ఎన్ఐఏ కస్టడీలో ఉండగానే నిరంజన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ శత్రువు చేతికి వెళ్లిపోతుంది.(సాక్షి రివ్యూస్) అసలు నిరంజన్ దగ్గర ఉన్న సమాచారం ఏంటి..? ఆ సమాచారంతో ప్రతాప్ రెడ్డి పనేంటి..? అనుకున్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ప్రతాప్‌రెడ్డికి చేరిందా..? ఈ మిషన్ తో క్రిమినల్ జార్జ్ కు సంబంధం ఏంటి..? నటీనటులు : తనకు బాగా అలవాటైన పోలీస్రోల్లో రాజశేఖర్ మరోసారి అద్భుతంగా నటించి మెప్పించారు. గతంలో పోలీస్రోల్స్తో ఆకట్టుకున్న రాజశేఖర్ సరైన పాత్ర దొరికితే మరోసారి సత్తా చాటగలనని నిరూపించుకున్నారు. హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. రాజశేఖర్ టీం మెంబర్స్ గా చరణ్ దీప్, రవివర్మలు తమ పాత్రకు న్యాయం చేశారు. పోసాని కృష్ణమురళీ రాజకీయనాయకుడి పాత్రలో మరోసారి అలరించగా, అలీ, 30 ఇయర్స్ పృధ్వీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కీలక పాత్రలో నటించిన అదిత్ అరుణ్ ఈ సినిమాతో మంచి మార్కులు సాధించాడు. గత చిత్రాల్లో లవర్ బాయ్ లుక్స్‌లో కనిపించిన అదిత్ ఈ సినిమాతో డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.(సాక్షి రివ్యూస్) విలన్ పాత్రలో నటించిన కిశోర్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నా.. పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పాత్ర కాకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రల్లో శ్రద్దాదాస్, షియాజీ షిండే, శత్రులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : రాజశేఖర్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించే బాధ్యతను తీసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు అనుకున్న విజయం సాధించారు. యాక్షన్ థ్రిల్లర్‌కు కావాల్సిన పర్ఫెక్ట్ కథను రెడీ చేసుకున్న దర్శకుడు అదే స్థాయి టేకింగ్ తో అలరించాడు. పూర్తిగా టెక్నాలజీ, మైండ్ గేమ్ కు సంబందించిన అంశాలతో కథను నడిచిన ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించటంలో సక్సెస్ సాధించారు. అయితే సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా కథ స్లో అయినట్టుగా అనిపించినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, అన్నింటినీ కవర్ చేసేస్తాయి. సినిమాకు మరో మేజర్ ఎసెట్ సంగీతం. భీమ్స్ కంపోజ్‌చేసిన రెండు పాటలు బాగున్నాయి.(సాక్షి రివ్యూస్) శ్రీచరణ పాకల అందించిన నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫి సినిమా మూడ్ ను క్యారీ చేసేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, నైట్ ఎఫెక్ట్ లో తీసిన సీన్స్ సూపర్బ్‌గా వచ్చాయి. సన్నిలియోన్ స్పెషల్‌సాంగ్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాజశేఖర్ నటన కథా కథనం నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే మసాలా ఎలిమెంట్స్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఆస్తులు అమ్ముకున్నా! – రాజశేఖర్
‘‘గరుడవేగ’కి కోటేశ్వర్ రాజు, జీవిత, ప్రవీణ్ సత్తారు, మా నాన్నగారు నాలుగు పిల్లర్లు. నా పిల్లలు శివాని, శివాత్మికలు సూపర్ పవర్స్‌లా మరో రెండు పిల్లర్స్‌లా సహకారం అందించారు’’ అన్నారు రాజశేఖర్. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వర్ రాజు నిర్మించిన సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్ ముఖ్య తారలు. నవంబర్ 3న సినిమా విడులవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ చూసిన మా అమ్మగారు హ్యాపీ ఫీలయ్యారు. తను చనిపోవడంతో నేను కింద పడిపోయినట్లు అనిపించింది. మేం సినిమాల్లో ఉండటం కారణంగా చాలా ఆస్తులు అమ్మేశా. దాంతో నష్టపోయాను. ఆ విషయంలో అమ్మగారు బాధపడుతుండేవారు. ఈ సినిమా సక్సెస్‌తో నేను బాగానే ఉన్నానని పై లోకంలో ఉన్న మా అమ్మ తెలియాలి. ఇందుకు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పేరు మీదనే జ్యో స్టార్ బేనర్ స్టార్ట్ చేశాం. మా మావయ్యగారి ద్వారా కోటేశ్వర్ రాజుగారు పరిచయం. రాజశేఖర్‌గారికి మంచి హిట్ ఇవ్వాలనే తపనతో ఖర్చుకు వెనకాడకుండా 30 కోట్లతో సినిమా నిర్మించారు. సినిమాకి ఫైనాన్షియల్ సమస్యలున్నాయని, నవంబర్ 3న రాదని కొందరు అంటున్నారు. అవన్నీ పుకార్లే. 3నే విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. జీవితగారు అందించిన సహకారం మరచిపోలేను. నిర్మాత రాజీ పడలేదు’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు కోటేశ్వర్ రాజు. నటీనటులు పూజా కుమార్, శ్రద్ధా దాస్, సన్నీ లియోన్, ఆదిత్ అరుణ్ తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రతి సినిమాకీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు – బాలకృష్ణ
‘‘నిర్మాత బాగుండాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాని 79రోజుల్లో పూర్తి చేశాం. నేను నిర్మాత సి. కల్యాణ్‌కి 79రోజుల కంటే ఒక్కరోజు ముందే మన చిత్రం పూర్తి కావాలన్నా. త్వరగా అంటే సినిమా చుట్టేయడం కాదు. బాగా తీయడం కూడా ఇంపార్టెంట్’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. రాజశేఖర్, పూజా కుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. శివాణి–శివాత్మిక సమర్పణలో కోటేశ్వరరాజు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాకీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. ఎంత ఖర్చు పెడుతున్నామన్నది నిర్మాతలకే తెలియని పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. ‘గరుడవేగ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. మనకున్న అరుదైన డైరెక్టర్లలో ప్రవీణ్ ఒకరు. రాజశేఖర్ విలక్షణ నటులు. ఆయన ఎంచుకునే కథలు, పాత్రలే కాదు.. నటన కూడా భిన్నంగా ఉంటుంది. నవంబర్ 3న విడుదలవుతున్న ‘గరుడవేగ’ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారు ఎక్కడికెళితే అక్కడ అదృష్టమని ఇండస్ట్రీ అందరికీ తెలుసు. వందేమాతరం, ప్రతిఘటన, అంకుశం’లో ఎలా చేశానో ఇప్పుడూ అదే ఉత్సాహంతో చేస్తానని చెప్పా’’ అన్నారు. ‘‘గుంటూరు టాకీస్’ ట్రైలర్‌ని బాలకృష్ణగారు రిలీజŒ æచేశారు. 2కోట్లతో తీసిన ఆ సినిమా 25 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘గరుడవేగ’ ట్రైలర్ లాంచ్ చేశారు. 25 కోట్లతో తీసిన ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో లెక్కపెట్టుకోండి. ఈ సినిమాకు మూల స్తంభం జీవితగారు’’ అన్నారు ప్రవీణ్ సత్తారు.చిత్రనిర్మాత కోటేశ్వరరాజు, పూజాకుమార్, శ్రద్ధా దాస్, శివాణి–శివాత్మిక, నిర్మాతలు సి.కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు. -
30 కథలు విన్నా.. ఏదీ నచ్చలేదు
‘‘నేను చాలా ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేసిన తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయమని కొందరు అడిగినప్పుడు.. సరే అనుకుని 30 కథలకు పైగా విన్నాను. ఏదీ నచ్చలేదు. నేను పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలాంటి స్క్రిప్ట్‌తో సినిమా చేయాలనుకున్నానో అలాంటి కథనే దర్శకుడు చెప్పడంతో ఒప్పుకున్నా’’ అన్నారు రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘‘పి.ఎస్.వి గరుడవేగ.. 126.18ఎం’. కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయగలడా అనుకున్నా. కానీ అద్భుతంగా తెరకెక్కించాడు. ఐదారు కోట్లతో కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేసిన ఈ సినిమా బడ్జెట్ పాతిక కోట్లు అయింది. నాపై నమ్మకంతో కోటేశ్వరరాజుగారు, ఆయన శ్రీమతి హేమగారు భారీ స్థాయిలో నిర్మించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు రాజశేఖర్‌గారే కరెక్ట్ అనుకుని ఆయన్ను కలిశాను. జీవితగారి సపోర్ట్ మరువలేనిది. ఇంత పెద్ద సినిమాకు ఏది అడిగితే అది సమకూర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘మా ఊరిలో ‘మగాడు’ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు రాజశేఖర్‌గారిని చూసి ఆరాధించాను. ఇప్పుడు ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి’’ అన్నారు నిర్మాతలు. -
డిజిటల్ చెల్లింపులకు గరుడవేగ ప్రోత్సాహం, స్పెషల్ డిస్కౌంట్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భారతీయులకు సుపరిచితమైన గరుడవేగ, గరుడ బజార్ నూతన సంవత్సరం సందర్భంగా కొత్తగా డిజిటల్ సేవలను పరిచయం చేస్తోంది. కేంద్రప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల పథకానికి సంస్థ ప్రోత్సాహాన్నందిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డుల ఆన్ లైన్ చెల్లింపులను అనుమతిస్తోంది. అన్ని ప్రదేశాల్లో ఆక్సిస్ పే , పే టీఎం ద్వారా మొబైల్ అండ్ ఇంటర్నెట్ చెల్లింపులను పే పాల్ ద్వారా అన్ లైన్ చెల్లింపులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికాలో దేశీయంగా అంతర్జాతీయంగా, అమెరికా నుంచి భారత్ షిప్పింగ్ సేవలను కొత్తగా ప్రారంభించిన సేవలను విస్తరిస్తున్నట్టు గరుడ వేగ అధిపతి కృష్ణ మందలపు ఒక ప్రకటనలో తెలిపారు. గరుడ బజార్ ద్వారా హ్యాపీ హాలిడేస్ అనే కూపన్ ద్వారా 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ కోసం హ్యాపీ హాలిడేస్ డిస్కౌంట్ కోడ్ వాడాలని సూచించారు. అమెరికాకు కేజీకి రూ.400(కనీసం 40 కిలోలు) చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచంలో విశ్వసనీయ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ గా చాలా నమ్మకమైన సమర్థమైన అద్భుతమైన కస్టమర్ సేవల్న అందిస్తున్నట్టు గరుడ వేగ తెలిపింది. తమ గరుడ బజార్ ద్వారా ప్రస్తుతం కేజీకి రూ. 299 ధరలతో ఇండియా నుంచి ప్రపంచంలో ముఖ్యమైన అమెరికా, బ్రిటన్, యూఏఈ, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్య తూర్పు సహా 200 ఇతర దేశాల్లో సేవల్ని అందిస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు వారు అనుబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ తమ స్వస్థలాల నుంచి తెప్పించిన రుచికరమైన పిండివంటలు, స్నాక్స్, స్వీట్లను.. బహుమతులను ఇచ్చి కుటుంబసభ్యులను సంతోషపెట్టి తామూ సంతోషిస్తారు. విదేశాల్లో భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సొంతూరులోని వారివారి కుటుంబాలకు బహుమతులు పంపుకోవచ్చని తెలిపింది. అలాగే పండుగ ఆనందాన్ని మిస్ కాకుండా ఇంటినుంచి రుచికరమైన స్నాక్స్, స్వీట్లు అందించుకోవచ్చని పేర్కొంది. ఈ టోకెన్ల ద్వారా వారి ప్రేమాభిమానాలకు దూతలుగా పనిచేస్తుండటం తమ అదృష్టమని తెలిపింది. ఇకముందుకూడా వినియోగదారుల ప్రేమ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు తమ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచేందుకు మీ విలువైన అభిప్రాయాలు సలహాలను అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు. -
గరుడవేగా, గరుడ బజార్ దీపావళి ధమాకా!
అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగా' దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తమ వినియోగదారులకోసం గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న తమ వారికి ఇష్టమైన వస్తువులను పంపించేందుకు డెలివరీ చార్జీల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. దీపావళి' కూపన్ కోడ్ ఉపయోగించి మరో 5 శాతం కూడా డిస్కౌంట్ పొందవచ్చని గరుడ వేగా తెలిపింది. ఇప్పటికే ఇతర దేశాల్లో కూడా డెలివరీ సర్వీసులను అందిస్తున్న గరుడ వేగా ఇప్పుడు యూవీఈలోని పలు ప్రాంతాలకు కూడా తన సేవలు మరింత విస్తృతం చేయనుంది. ఇందులో భాగంగా అమెరికాలోని ఆలయాల్లో అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ నుంచి వెండి వస్తువులను కూడా డెలివరీ చేయడం ప్రారంభించింది. వినాయక చతుర్ధి సందర్భంగా అమెరికాలో ప్రఖ్యాత దేవాలయాలకు 10 అడుగుల గణేషుని ప్రతిమలు, 100 కేజీల లడ్డూలను డెలవరీ చేసినట్టు పేర్కొంది. దీంతోపాటు ఇదే సంస్థకు చెందిన గరుడా బజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేస్తోంది. గరుడబజార్లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, స్వగృహ, పుల్లారెడ్డి, వెల్లంకి.. తదితర బ్రాండ్ల స్వీట్లు సిద్దంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే డెలీవరి సర్వీసులను అందిస్తున్నట్టు గరుడవేగా పేర్కొంది. -
గరుడవేగ దివాళి ఆఫర్స్..
అంతర్జాతీయ సరుకు రవాణాసంస్థ గరుడవేగ, గరుడ బజార్ తన వినియోగదారులకు ఈ దీపావళి సౌభాగ్యం, సుఖసంతోషాలతో వెల్లివెరియాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. అమెరికా, యూకే, యూఏఈ, యూరప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్య ప్రాచ్య దేశాలతో పాటు, 200 దేశాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ, దీపావళి ఆఫర్స్ ప్రకటించింది. పండుగకి ఇంటికి వెళ్లడానికి మిస్ అయిన ప్రవాస భారతీయ కుటుంబసభ్యుల్లో ఆనందం నింపడానికి వారి కోసం గిప్ట్లను, నోరూరించే స్నాక్స్, స్వీట్స్‌ను వారి స్వదేశానికి పంపనుంది. స్పెషల్ దివాళి కింద కొన్ని రిటర్న్ గిప్ట్లపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. కూపన్ కోడ్ కింద అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను వినియోగదారులు పొందవచ్చని తెలిపింది. ఎన్ఆర్ఐలకు అవసరమైన అన్ని వస్తువులను వేగంగా, నమ్మకంగా డెలివరీ చేస్తూ గరుడావేగ కస్టమర్ల మనన్నలు పొందుతోంది. అతి తక్కువ ధరలకే విదేశాలకు గిప్ట్ ప్యాకెట్లను పంపిస్తోంది. అంతర్జాతీయంగా(భారత్ నుంచి విదేశాలకు, అమెరికా నుంచి భారత్‌కు), అమెరికా దేశీయ రూట్లలో గరుడవేగ ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ ఆఫర్లను అందిస్తోంది. అదేవిధంగా సముద్రాల్లో కూడా ఎక్కువ మొత్తంలో సరుకులను రవాణా చేస్తూ విశిష్ట సేవలందిస్తోంది. గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా అమెరికాలోని ప్రముఖ దేవాలయాలకు 10 అడుగుల గణేష్ విగ్రహాన్ని, 100 కేజీల లడ్డూలను ఈ రవాణా సంస్థ తరలించింది.తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవడానికి వినియోగదారులు నుంచి గరుడవేగ సలహాలు సూచనలను అభ్యర్థిస్తోంది. -
ఉగాదికి 'గరుడ వేగా' భారీ డిస్కౌంట్లు
అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగా' ఉగాది సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తమ వినియోగదారులకోసం గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న తమ వారికి ఇష్టమైన వస్తువులను పంపించేందుకు డెలివరీ చార్జీల్లో 20శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. 'UGADI' కూపన్ కోడ్ ఉపయోగించి మరో 5 శాతం కూడా డిస్కౌంట్ పొందవచ్చని గరుడ వేగా తెలిపింది. ఇప్పటికే ఇతర దేశాల్లో కూడా డెలివరీ సర్వీసులను అందిస్తున్న గరుడ వేగా ఇప్పుడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా తన సేవలు మరింత విస్తృతం చేయనుంది. ఇందులో భాగంగా అమెరికాలోని ఆలయాల్లో అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ నుంచి వెండి వస్తువులను కూడా డెలివరీ చేయడం ప్రారంభించింది. దీంతోపాటు ఇదే సంస్థకు చెందిన గరుడా బజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేయనుంది. గరుడబజార్లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, స్వగృహ, పుల్లారెడ్డి, వెల్లంకి.. తదితర బ్రాండ్ల స్వీట్లు సిద్దంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే డెలీవరి సర్వీసులను అందించనుంది. -
గరుడ వేగాస్ లో దసరా ఆఫర్లు
అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగాస్' దసరా దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తమ వినియోగదారులకోసం గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న తమ వారికి ఇష్టమైన వస్తువులను పంపించేందుకు అనువైన డెలివరీ చార్జీలను ప్రకటించింది. అమెరికాకు ఏదైనా పంపించాలనుకున్న వారు ఒక కేజీకి రూ.350 చెల్లిస్తే సరిపోతుందని, భద్రంగా దానిని డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 41 నగరాల్లో100 బ్రాంచులతో, ఇతర దేశాల్లో కూడా డెలివరీ సర్వీసులను అందిస్తున్న గరుడ వేగాస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా తన సేవలు మరింత విస్తృతం చేయనుంది. ఇందులో భాగంగా పచ్చళ్ల డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇదే సంస్థకు చెందిన గరుడా బజార్ ద్వారా అక్కడి నుంచి బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేయనుంది. ముఖ్యంగా ఈ దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే డెలీవరి సర్వీసులను అందించనుంది. -
సంక్రాంతికి గరుడవేగ, గరుడబజార్లలో డిస్కౌంట్లు
కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గరుడబజార్ ఉత్పత్తులన్నింటి మీద 5%, గరుడవేగ షిప్మెంట్ల మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. కొత్త సంవత్సరంతో గరుడవేగ ఆపరేషన్లు ప్రారంభమై ఐదేళ్లు అవుతుందని, తమ సేవల నాణ్యతకు ఇదే సిసలైన నిదర్శనమని ఆ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు తమపై ఉన్న నమ్మకం, వారి మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. అందుకు కృతజ్ఞతగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుంచి గరుడవేగ ద్వారా 5 కిలోలు, అంతకంటే ఎక్కువగా చేసే షిప్మెంట్లకు ఈనెల 20వ తేదీ వరకు 10 శాతం డిస్కౌంట్ ప్రటిస్తున్నామని తెలిపారు. ఇక సంక్రాంతి సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు కూడా పండుగ సంబరాలను ఇంటికి తెచ్చుకుంటారని, ప్రధానంగా ఈ పండుగకు రుచికరమైన స్వీట్లు తమ జన్మభూమి నుంచి తెప్పించుకుంటారని అన్నారు. అందుకోసం గరుడబజార్లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, ప్రత్యేకమైన స్వీట్లు తెప్పించామన్నారు. స్వగృహ, పుల్లారెడ్డి, వెల్లంకి.. తదితర బ్రాండ్ల స్వీట్లు సిద్దంగా ఉన్నాయని, వాటిమీద 5% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. LikeUS @ https://www.facebook.com/Garudabazaar LikeUs @ https://www.facebook.com/garudavega2