డిజిటల్ చెల్లింపులకు గరుడవేగ ప్రోత్సాహం, స్పెషల్ డిస్కౌంట్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భారతీయులకు సుపరిచితమైన గరుడవేగ, గరుడ బజార్ నూతన సంవత్సరం సందర్భంగా కొత్తగా డిజిటల్ సేవలను పరిచయం చేస్తోంది. కేంద్రప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల పథకానికి సంస్థ ప్రోత్సాహాన్నందిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డుల ఆన్ లైన్ చెల్లింపులను అనుమతిస్తోంది. అన్ని ప్రదేశాల్లో ఆక్సిస్ పే , పే టీఎం ద్వారా మొబైల్ అండ్ ఇంటర్నెట్ చెల్లింపులను పే పాల్ ద్వారా అన్ లైన్ చెల్లింపులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.
అమెరికాలో దేశీయంగా అంతర్జాతీయంగా, అమెరికా నుంచి భారత్ షిప్పింగ్ సేవలను కొత్తగా ప్రారంభించిన సేవలను విస్తరిస్తున్నట్టు గరుడ వేగ అధిపతి కృష్ణ మందలపు ఒక ప్రకటనలో తెలిపారు. గరుడ బజార్ ద్వారా హ్యాపీ హాలిడేస్ అనే కూపన్ ద్వారా 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ కోసం హ్యాపీ హాలిడేస్ డిస్కౌంట్ కోడ్ వాడాలని సూచించారు. అమెరికాకు కేజీకి రూ.400(కనీసం 40 కిలోలు) చార్జ్ చేయనున్నట్టు తెలిపారు.
ప్రపంచంలో విశ్వసనీయ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ గా చాలా నమ్మకమైన సమర్థమైన అద్భుతమైన కస్టమర్ సేవల్న అందిస్తున్నట్టు గరుడ వేగ తెలిపింది. తమ గరుడ బజార్ ద్వారా ప్రస్తుతం కేజీకి రూ. 299 ధరలతో ఇండియా నుంచి ప్రపంచంలో ముఖ్యమైన అమెరికా, బ్రిటన్, యూఏఈ, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్య తూర్పు సహా 200 ఇతర దేశాల్లో సేవల్ని అందిస్తున్నట్టు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు వారు అనుబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ తమ స్వస్థలాల నుంచి తెప్పించిన రుచికరమైన పిండివంటలు, స్నాక్స్, స్వీట్లను.. బహుమతులను ఇచ్చి కుటుంబసభ్యులను సంతోషపెట్టి తామూ సంతోషిస్తారు. విదేశాల్లో భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సొంతూరులోని వారివారి కుటుంబాలకు బహుమతులు పంపుకోవచ్చని తెలిపింది. అలాగే పండుగ ఆనందాన్ని మిస్ కాకుండా ఇంటినుంచి రుచికరమైన స్నాక్స్, స్వీట్లు అందించుకోవచ్చని పేర్కొంది. ఈ టోకెన్ల ద్వారా వారి ప్రేమాభిమానాలకు దూతలుగా పనిచేస్తుండటం తమ అదృష్టమని తెలిపింది. ఇకముందుకూడా వినియోగదారుల ప్రేమ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు తమ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచేందుకు మీ విలువైన అభిప్రాయాలు సలహాలను అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు.