Shipments
-
భారత్‌లో పెరిగిన ట్యాబ్ సేల్స్.. కారణం ఇదే
2024 ఏప్రిల్ - జూన్ మధ్యలో భారతదేశంలో ట్యాబ్ సేల్స్ భారీగా పెరిగినట్లు 'ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్' (IDC) వెల్లడించింది. మూడు నెలల్లో 1.84 మిలియన్ యూనిట్ల ట్యాబ్ విక్రయాలు జరిగినట్లు.. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 128.8 శాతం పెరిగినట్లు సమాచారం.వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ ట్రాకర్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసింది. ఇది విక్రయాలు గణనీయంగా పెరగడానికి దోహదపడిందని తెలుస్తోంది. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌లు అన్నీ కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.మొత్తం ట్యాబ్ విక్రయాలలో.. 23.6 శాతం వాటాతో ఏసర్ గ్రూప్ మొదటి స్థానంలో.. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో శామ్సంగ్, యాపిల్ వంటివి ఉన్నాయి. నాలుగో స్థానంలో లెనోవో ఉంది. షియోమీ ఐదో స్థానంలో నిలిచింది. కీలకమైన విద్యా ఒప్పందాలు, చిన్న & మధ్య తరహా వ్యాపారం విభాగం ఊపందుకోవడంతో వాణిజ్య విభాగం పటిష్టంగా మారింది. దీంతో ట్యాబ్స్ వినియోగం భారీగా పెరిగిందని దక్షిణాసియా డివైసెస్ రీసెర్చ్ మేనేజర్ భరత్ షెనాయ్ అన్నారు. -
రష్యా నుంచి భారీగా దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా నుంచి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 36.27 బిలియన్ డాలర్లు విలువైన (రూ.3.01లక్షల కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2022 ఏప్రిల్–అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు 22.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు, ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా రెండో అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్కశాతమే. కానీ, ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా 40 శాతం వాటా ఆక్రమించేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతీకారంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్‌కు మార్కెట్ కంటే తక్కువ ధరకే చుమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ భారీగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. దేశాల వారీగా.. ♦ ఇక ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా నుంచి దిగుమతులు 60.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.60.26 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నాయి. ♦అమెరికా నుంచి దిగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 16 శాతం తగ్గి 24.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ♦యూఏఈ నుంచి దిగుమతులు 21 శాతం తగ్గి 24.91 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ♦అంతేకాదు సౌదీ అరేబియా, ఇరాక్, ఇండోనేషియా, సింగపూర్, కొరియా నుంచి కూడా దిగుమతులు క్షీణించాయి. ♦ స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో 10.48 బిలియన్ డాలర్లుగా ఉంటే, అవి ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 13.97 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. ♦మరో వైపు భారత్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న టాప్–10 దేశాలలో, ఆరు దేశాలకు ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు ప్రతికూలంగా నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, సింగపూర్, జర్మనీ, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకు తగ్గాయి. ♦బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు ఎగుమతులు వృద్ధి చెందాయి. ♦చైనాకు ఎగుమతులు 8.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇవి 8.85 బిలియన్ డాలర్లు. -
డిమాండ్ వీటికే! దేశంలో ఎలాంటి టీవీలు కొంటున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల దిగుమతులు (షిప్మెంట్) ప్రస్తుత ఏడాది మొత్తం మీద 7 శాతం వరకు తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2023 మొదటి ఆరు నెలల కాలంలో స్మార్ట్ టీవీల షిప్మెంట్ 5 శాతం తగ్గినట్టు పేర్కొంది. పండుగల సీజన్ ఉన్నందున ద్వితీయ ఆరు నెలల కాలంలో దిగుమతులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేసింది. ఓఈఎంలు కొత్త పెట్టుబడుల రూపంలో అదనపు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందున దేశీయంగా స్మార్ట్ టీవీల తయారీ పెరుగుతున్నట్టు వివరించింది. భారత మార్కెట్లో కొత్త ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు)లు కూడా ప్రవేశిస్తున్నాయని, ప్రముఖ బ్రాండ్లతో టైఅప్ అయ్యి టీవీల తయారీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. పెద్ద టీవీలకు డిమాండ్ స్మార్ట్ టీవీల షిప్మెంట్ తగ్గినప్పటికీ, పెద్ద తెరల టీవీలకు డిమాండ్ బలంగానే ఉందని, బ్రాండెడ్ టీవీలకు ప్రాధాన్యత (ప్రీమియమైజేషన్) పెరుగుతున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 55 అంగుళాలు, అంతకుమించిన పెద్ద స్మార్ట్ టీవీల షిప్మెంట్ మొదటి ఆరు నెలల్లో 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. భారత్‌లో అమ్ముడయ్యే అధిక శాతం స్మార్ట్ టీవీల్లో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఆడియో సపోర్ట్ ఉంటున్నట్టు తెలిపింది. జనవరి–జూన్ కాలంలో మొత్తం టీవీల్లో స్మార్ట్ టీవీల వాటా 91 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ద్రవ్యోల్బణం ప్రతికూలం.. ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో ప్రజలు కనీస కొనుగోళ్లకే పరిమితం కావాల్సి వచ్చిందని.. టీవీ దిగుమతులు తగ్గడానికి దీన్ని కారణంగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మధ్య శ్రేణి విభాగంలో (రూ.30–50వేల మధ్య) క్యూఎల్ఈడీ టీవీలు మరింత ఆదరణకు నోచుకుంటున్నట్టు తెలిపింది. ‘‘మొదటి ఆరు నెలల్లో క్యూఎల్ఈడీ టీవీల షిప్మెంట్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం పెరిగింది. మొత్తం టీవీల మార్కెట్లో వీటి వాటా ఇక ముందు కూడా పెరుగుతుంది’’అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మొదటి ఆరు నెలల్లో స్మార్ట్ టీవీల షిప్మెంట్లో షావోమీ 10 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. శామ్సంగ్ రెండో స్థానంలో ఉండగా, వన్‌ప్లస్, ఎల్జీ, టీసీఎల్, ఏసర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏసర్, శాన్సుయ్ వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లుగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఇవి విడుదల చేసే కొత్త బ్రాండ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు వివరించింది. -
పీసీ మార్కెట్ 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) రవాణా (షిప్మెంట్/విక్రేతలకు సరఫరా) జనవరి–మార్చి త్రైమాసికంలో 29.92 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో షిప్‌మెంట్‌తో పోల్చి చూసినప్పుడు 30 శాతం తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికం పీసీ షిప్మెంట్ వివరాలను విడుదల చేసింది. 2022 ఏడాది మొదటి మూడు నెలల్లో మన దేశ మార్కెట్లో పీసీల షిప్మెంట్ 42.82 లక్షల యూనిట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంలో డెస్క్‌టాప్‌లకు డిమాండ్ ఉందని, నోట్‌బుక్‌ల డిమాండ్ మరో విడత బలహీనంగా నమోదై, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు 41 శాతం తగ్గినట్టు ఐడీసీ నివేదిక తెలిపింది. వినియోగ డిమాండ్ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్ 25.1 శాతం తగ్గింది. అగ్రస్థానంలోనే హెచ్‌పీ కంపెనీ హెచ్‌పీ కంపెనీ 33.8 శాతం వాటాను పీసీ మార్కె ట్లో కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 30.2 శాతం తగ్గింది. లెనోవో చేతిలో 15.7 శాతం వాటా ఉంది. లెనోవో పీసీ షిప్మెంట్ మార్చి త్రైమాసికంలో 37.5 శాతం క్షీణించి 4.72 లక్షల యూనిట్లుగా ఉంది. డెల్ మార్కెట్ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. 4.17 లక్షల పీసీలను షిప్ చేసింది. ఏసర్ గ్రూప్ వాటా 12.3 శా తంగా, ఆసుస్ మార్కెట్ వాటా 6.6 శాతం చొప్పున ఉంది. -
స్మార్ట్ఫోన్ల మార్కెట్ డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు (తయారీ సంస్థల నుంచి రిటైలర్లకు సరఫరా) 3.1 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19 శాతం తగ్గాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. రూ. 30,000 లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు గణనీయంగా పడిపోగా, ప్రీమియం.. అల్ట్రా ప్రీమియం కేటగిరీ ఫోన్లు 60–66 శాతం ఎగిశాయి. డిమాండ్ తగ్గుదల, 2022 నుంచి నిల్వ లు పెరిగిపోవడం, వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటం, మార్కెట్ నిరాశావహంగా కనిపిస్తుండటం తదితర అంశాలు క్యూ1లో విక్రయాలు మందగించడానికి కారణమైనట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. దీనితో షిప్మెంట్ల తగ్గుదల వరుసగా మూడో త్రైమాసికంలోనూ కొనసాగగా, క్యూ1లో అత్యధికంగా క్షీణత నమోదైనట్లు వివరించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లలో 5జీ ఫోన్ల వాటా ఏకంగా 43 శాతానికి చేరింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో వరుసగా రెండో త్రైమాసికంలోనూ శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. టాప్ 5జీ బ్రాండ్‌గా కూడా కొనసాగుతోంది. ఏ సిరీస్ 5జీ ఫోన్లు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాయి. మొత్తం షిప్మెంట్లలో వీటి వాటా 50 శాతం దాకా నమోదైంది. ఎస్23 సిరీస్ ఆవిష్కరణతో మార్చి క్వార్టర్లో శాంసంగ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ (ధర రూ. 45,000 పైగా) 247 శాతం వృద్ధి చెందింది. ► యాపిల్ షిప్మెంట్లు 50 శాతం పెరగ్గా మార్కెట్ వాటా 6 శాతంగా నమోదైంది. మొత్తం ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 30,000 స్థాయి) 36 శాతం, అల్ట్రా–ప్రీమియం సెగ్మెంట్లో 62 శాతం వాటా దక్కించుకుంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి కొత్తగా ఫైనాన్స్ స్కీమును ప్రారంభించడం, లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను ఆఫ్‌లైన్‌లోను గణనీయంగా ప్రమోట్ చేస్తుండటం ఇందుకు దోహదపడింది. ► మార్చి త్రైమాసికంలో షిప్మెంట్లు 3 శాతం క్షీణించినప్పటికీ 17 శాతం మార్కెట్ వాటాతో వివో రెండో స్థానంలో కొనసాగుతోంది. షావో మీ షిప్ మెంట్లు 44 శాతం పడిపోగా, 16 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. ► వన్‌ప్లస్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. క్యూ1లో 72 శాతం వృద్ధి చెందింది. ► స్థానిక బ్రాండ్లలో రూ. 10,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో లావా మెరుగ్గా రాణించింది. 29 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న మూడో బ్రాండ్‌గా నిల్చింది. ► రూ. 20,000 – 30,000 ధర పలికే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు 33 శాతం క్షీణించగా, రూ. 10,000 – 20,000 సెగ్మెంట్ 34 శాతం తగ్గింది. ఇక రూ. 10,000 లోపు ఫోన్లు 9 శాతం క్షీణత నమోదు చేశాయి. ► వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రమోషనల్ ఆఫర్లు నడిచే సమయంలో డిమాండ్ గణనీయంగా ఉంటోంది. రిపబ్లిక్ డే సమయంలో డిమాండ్ బాగా కనిపించింది. అయి తే సేల్స్ వ్యవధి ముగిసిపోగానే భారీగా పడిపోయింది. విక్రేతలు ప్రస్తుతం కొత్త మోడల్స్‌ను తెచ్చిపెట్టుకోవడం కంటే ఉన్న నిల్వలను వదిలించుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ► 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. వినియోగదారులు అప్‌గ్రేడ్ అవుతుండటంతో 5జీ ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో 43 శాతం వాటాను దక్కించుకున్నాయి. ► రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. 5జీకి అప్‌గ్రేడేషన్ వేగవంతం అవుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, పండుగల సీజన్ మొదలైన వాటి కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు పుంజుకుంటాయని అంచనా. -
ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది. చైనాలోని జెంగ్జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్‌మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్‌కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్జౌ యాపిల్‌కు ఎంతో కీలకమైన ప్లాంట్‌లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్‌లో ఐఫోన్ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్‌ఫోర్స్ గత వారం జెంగ్జౌ ప్లాంట్‌లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం. మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్జౌ ప్లాంట్‌లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. -
విండ్ ఫాల్ టాక్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
-
విండ్‌ఫాల్ టాక్స్ కోత: వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్ టాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది డీజిల్, క్రూడ్ ఆయిల్, జెట్ ఇంధన రవాణాపై విండ్‌ఫాల్ పన్ను తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. డీజిల్, విమాన ఇంధన రవాణాపై లీటర్‌కు 2 రూపాయలు పన్ను తగ్గుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది, ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోలుపై రూ.6 (లీటరుకు) ఎగుమతి పన్నును కూడా రద్దు చేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును కూడా దాదాపు 27 శాతం తగ్గించింది. టన్నుకు 23,250 రూపాయల నుంచి తగ్గించి రూ.17 వేలుగా ఉంచింది. అంతర్జాతీయంగా చమురు రేట్టు తగ్గడంతో దేశీ చమురు ఉత్పత్తి దారులు, రిఫైనర్లపై విండ్‌ఫాల్ పన్నును తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. విండ్‌ఫాల్ టాక్స్ విధించిన ఒక నెలలోపే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు నేటి (జూలై 20) నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు, ఎగుమతులపై సుంకాల కోత పెట్రోలియం రంగానికి భారీ ఊరటనిస్తుందని పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఫలితంగా రిలయన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ లాంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రయోజనం సమకూరనుంది. ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లి పుంజుకున్నాయి. చాలాకాలం తరువాత ఇటీవల 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ ధర మళ్లీ పైకెగసింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 107.23 డాలర్లు పలుకుతోంది. -
అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం!
ప్రముఖ కొరియర్ సంస్థ గరుడవేగ కొత్త సవాల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (T.A.T.A) నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ కోసం 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు 15 అడుగుల చార్మినార్, 18 అడుగుల ఓరుగల్లు స్తూపాల నమూనాలను తమ కొరియర్ సంస్థ ద్వారా పంపేందుకు రంగం సిద్ధం చేసింది. కష్టసాధ్యమైన పనిలో భాగమైనందుకు గరుడవేగ ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతోకలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను అందిస్తోంది గరుడవేగ సంస్థ (GarudaVega - ships all over the world). ఎంతో నమ్మకమైన, ఖచ్చితమైన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న సంస్థ గరుడవేగా. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఒరిస్సా, చంఢీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో గరుడవేగ సేవలు అందిస్తోంది. గరుడవేగా కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా మీరు అమెరికానుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి పార్శిల్/కొరియర్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు గరుడవేగా సేవలు అందుతాయి. డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసు కూడా ఉన్నాయి. మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం ఉన్నది. కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అన్ని షిప్మెంట్ సర్వీసులకు మీరు గరుడవేగా వారిని వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. "ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఆప్తులందరినీ కలుపుతూ, వారి మధ్య దూరాలను తగ్గిస్తూ, బంధాలను నిలబెడుతూ, ఒక వారధిలా నిలబడుతున్న సంస్థ గరుడవేగా. మా సేవలు వినియోగించుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము-గరుడవేగ, గరుడబజార్’’ (అడ్వెర్టోరియల్) -
గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమల ధరలు పెరగడంతో దరల్ని కట్టేడి చేసే దిశగా కేంద్రప్రభుత్వం మే 13 నుంచి గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఐతే ఆ నిషేధం ఇంకా అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను అనుమతించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. కస్టమ్స్ పరీక్షల కోసం అప్పగించిన గోధుమ సరుకులు మే13 లోపు రిజర్వ్ చేయబడి ఉంటే అటువంటి సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక ఈజిప్టు ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈజిప్టుకు వెళ్లే గోధుమ సరుకును కూడా కేంద్రం అనుమతించిందని తెలిపింది. దేశంలోని మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికే కాకుండా పోరుగు దేశాలకు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ ఎగుమతులను అనుమతిస్తున్నట్లు కూడా తెలిపింది. (చదవండి: మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల) -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షేర్ పోయినా..భారత్‌లో కింగ్ మాత్రం ఆ కంపెనీనే..!
భారత్‌లో గత 17 త్రైమాసికాల్లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్‌లో షావోమీ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అయితే అనూహ్యంగా మార్కెట్ వాటాను షావోమీ వేగంగా కోల్పోతుందని మార్కెట్ పరిశోధన సంస్థ కానాలిసిస్ పేర్కొంది. కంపెనీల మధ్య పోటీ..! షావోమీ పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. సరఫరా గొలుసు పరిమితులతో 2020 క్యూ1 నుంచి ఇప్పటివరకు షావోమి 8 శాతం మార్కెట్ వాటా తగ్గింది. క్యూ1 2020లో, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ 29 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అప్పటి నుంచి మార్కెట్ గ్రాఫ్ నెమ్మదిస్తోంది. 2021 క్యూ 4లో 21 శాతం మార్కెట్ వాటాను షావోమీ సొంతం చేసుకుంది. అయినప్పటికీ, షావోమీ 2021 క్యూ 4లో భారత్‌లో 9.3 మిలియన్ యూనిట్లను షిప్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆధిక్యంలో ఉందని కెనాలిస్ తెలిపింది. కాంపోనెంట్ కొరత..! స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ విశ్లేషకుల ప్రకారం.. షావోమీ మాస్-మార్కెట్ ఎంట్రీ-లెవల్ విభాగంలో కాంపోనెంట్ కొరతతో మార్కెట్ వాటా దెబ్బతింది. షావోమీ ప్రత్యర్ధి బ్రాండ్లు Unisoc అనే కొత్త చిప్సెట్ ప్లేయర్‌తో మార్కెట్ వాటాలో వేగంగా లాభపడుతున్నాయి. యూనిసోక్ చిప్సెట్స్తో పలు బ్రాండ్స్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ డిమాండ్‌ను తీర్చగలిగాయి. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..! ధర ఎంతంటే..? -
‘రాడ్‌టెప్’కు మరిన్ని నిధులు కేటాయించాలి
ఎగుమతిరంగం 2022–23 బడ్జెట్లో తమకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతోంది. రీయింబర్స్మెంట్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ (రాడ్‌టెప్) పథకానికి కేటాయింపులు పెంచాలని కోరింది. ప్లాస్టిక్ తుది ఉత్పత్తుల దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు సుంకాలు పెంచాలని.. దేశీ తోలు పరిశ్రమకు ప్రోత్సాహకంగా ముడి సరుకుల దిగుమతులకు సుంకాల మినహాయింపు కావాలని డిమాండ్ చేసింది. లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించేందుకు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల అవసరాన్ని తెలియజేసింది. ఎంఎంస్ఎంఈలకు ప్రోత్సాహకంగా పార్ట్నర్షిప్ సంస్థలు, ఎల్ఎల్పీలపై పన్నును తగ్గించాలని బడ్జెట్ ప్రతిపాదనల కింద కేంద్ర ఆర్థిక శాఖకు భారతీయ ఎగుమతి దారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) సూచించింది. భారత్ కోసం ప్రత్యేకంగా షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేసేలా పెద్ద సంస్థలను ప్రోత్సహించాలని, అప్పుడు విదేశీ సంస్థలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. రవాణా వ్యయ భారం ‘‘ఎగుమతుల రంగం పెరిగిపోయిన రవాణా వ్యయాల రూపంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. విదేశీ మార్కెటింగ్ అన్నది పెద్ద సవాలుగా మారింది. ఎంఎస్ఎంఈలకు ఈ వ్యయ భారం మరితంగా ఉంటుంది. ఎగుమతిదారుల కోసం ద్వంద్వ పన్ను మినహాయింపు పథకం తీసుకురావాలి. కాకపోతే రూ.5 లక్షల వరకు పరిమితి ఇందులో విధించొచ్చు’’అని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్‌సహాయ్ తెలిపారు. ఎగుమతి మార్కెట్‌కు రాడ్‌టెప్ పథకం కీలకమైనదని, దీనికింద ప్రస్తుతం కేటాయింపులు రూ.40,000 కోట్లుగానే ఉన్నట్టు ముంబైకి చెందిన ఎగుమతిదారు, టెక్నో క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శారదా కుమార్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈ వాస్తవాన్ని గుర్తించి మరిన్ని కేటాయింపులు చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులపై (ఫినిష్డ్ గూడ్స్) కనీసం 5 శాతం సుంకాన్ని విధించాలని ప్లాస్టిక్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్ అరవింద్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ‘‘ఉదాహరణకు పీవీసీ రెజిన్‌పై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. వ్యాల్యూ యాడెడ్ పీవీసీ ఉత్పత్తులపైనా ఇంతే మేర సుంకం అమల్లో ఉంది’’ అని వివరించారు. తోలు రంగానికి చేయూత.. తోలు వస్త్రాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల దిగుమతులపై పన్ను మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టాలని కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) చైర్మన్ సంజయ్‌లీఖ డిమాండ్ చేశారు. దీంతో ముడిసరుకుల ఆధారితంగా ఉత్పత్తులు దేశీయంగానే తయారయ్యే అవకాశాన్ని ఏర్పాటు కల్పించినట్టు అవుతుందన్నారు. ఫరీదా గ్రూపు చైర్మన్ రఫీఖ్ అహ్మద్ కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేవారు. కార్మిక ఆధారిత తోలు రంగానికి ప్రోత్సాహంతో మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. -
అమ్మకాల్లో దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..!
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2021 మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో వీటి వాటా 22 శాతంగా నమోదైంది. కన్సల్టెన్సీ సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రూపొందించిన ఇండియా మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ సమీక్ష నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మూడో త్రైమాసికంలో 20 పైగా 5జీ సామర్థ్యాలున్న స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీలు ఆవిష్కరించాయి. అందుబాటు ధర, లభ్యత తదితర అంశాలు 5జీ విక్రయాలకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. వన్‌ప్లస్, ఒప్పో, రియల్మీ, శాంసంగ్, వివో వంటి దిగ్గజ బ్రాండ్లు 5జీ స్మార్ట్ఫోన్లకు ప్రాధాన్యమిస్తుండటం, వినియోగదారులు కూడా భవిష్యత్ అవసరాల కోసం వీటి వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త తరం ఫోన్లకు డిమాండ్ పెరుగుతోందని సీఎంఆర్ అనలిస్ట్ శిప్రా సిన్హా తెలిపారు. ఈ అయిదు బ్రాండ్లు కలిసి 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో 3 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే స్మార్ట్ఫోన్లను విక్రయించినట్లు వివరించారు. వివో టాప్.. 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో 18 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్రస్థానంలో ఉండగా, 16 శాతం వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. సరఫరాపరమైన సమస్యలు, విడిభాగాలు.. లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైన సవాళ్లు నాలుగో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని సీఎంఆర్ తెలిపింది. ఏడాది మొత్తం మీద చూస్తే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 5–8 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు డిజిటల్‌కు మారే క్రమంలో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ కొనసాగుతుందని వివరించింది. మరిన్ని ముఖ్యాంశాలు .. సరఫరాపరమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో మూడో త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 47 శాతం పెరిగాయి. సుమారు 5 కోట్ల పైగా అమ్ముడయ్యాయి. షావోమీ 23 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్ (18 శాతం), వివో (15 శాతం), రియల్‌మి (15 శాతం), ఒప్పో (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వన్‌ప్లస్ విక్రయాలు 68 శాతం, యాపిల్ అమ్మకాలు 32 శాతం పెరిగాయి. సూపర్ ప్రీమియం (రూ. 50,000–1,00,000) సెగ్మెంట్లో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ట్రాన్సిషన్ గ్రూప్ బ్రాండ్ల (ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో) మొత్తం అమ్మకాలు 18 శాతం, స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 36 శాతం పెరిగాయి. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ విక్రయాలు 21 శాతం క్షీణించి 2.4 కోట్లకు పరిమితమయ్యాయి. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇంత తక్కువ..! -
స్మార్ట్‌ఫోన్ విక్రయాల రికార్డు, టాప్ బ్రాండ్ ఇదే
సాక్షి, ముంబై : దసరా, దీపావళి పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. అన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త లాంచ్‌లు, డిస్కౌంట్లు, పండుగ ప్రత్యేక ఆఫర్లతో ఈ వృద్ధి నమోదైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రమోషన్లు ఈ పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచడంతో కీలకంగా నిలిచిందని కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు అన్షిక జైన్ చెప్పారు. ఒకవైపు దేశీయంగా ఆటో, రియల్టీ సహా పలురంగాల్లో మందగమనం కొనసాగుతోంటే..స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్ 2019 త్రైమాసికంలో రెండంకెల (10 శాతం) వృద్దితో అత్యధికంగా 49 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఫలితంగా ఈ విభాగంలో మందగమనం ఆందోళనలను అధిగమించిందని ఇటీవల వెల్లడించిన ఒక నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఈ విక్రయాల్లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో వివిధ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కౌంటర్ పాయింట్ వెల్లడించిన వివరాల ప్రకారం షావోమి మార్కెట్ వాటా 26 శాతంటాప్‌లో నిలిచింది. 20 శాతం వాటాతో శాంసంగ్ , 17 శాతంతో వివో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా రియల్ మీ 16 శాతం, ఒప్పో వాటా 8 శాతంగా సాధించాయి. అయితే ఇటావల ధరలను తగ్గించిన నేపథ్యంలో ఆపిల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఐఫోన్ 11 తో పాటు ఎక్స్ఆర్ మోడల్లో ధరల తగ్గింపు కారణంగా ఆపిల్ టాప్ 10 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలోకి ప్రవేశించింది. అయితే నెంబర్ వన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా వన్ ప్లస్ నిలిచింది. మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ అమ్మకాలు రెండింతలు పెరిగాయి. క్షీణించిన ఫీచర్ ఫోన్ మార్కెట్ స్మార్ట్ ఫోన్ల కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు అంతంతమాత్రమే. మూడో త్రైమాసికంలో దాదాపు 37 శాతం తగ్గిపోయాయి. ఫీచర్ ఫోన్ విభాగంలో శాంసంగ్ మార్కెట్ వాటా 22 శాతం, ఐ టెల్ వాటా 16 శాతం, లావా వాటా 16 శాతం, నోకియా 12 శాతం, కార్బన్ 7 శాతంగా నమోదైంది. అయితే ఇటెల్, లావా కార్బన్ కంపెనీలు సానుకూల వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. వాస్తవానికి, 2019 మూడవ త్రైమాసికంలో ఇటెల్ రెండవ ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. -
డిజిటల్ చెల్లింపులకు గరుడవేగ ప్రోత్సాహం, స్పెషల్ డిస్కౌంట్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భారతీయులకు సుపరిచితమైన గరుడవేగ, గరుడ బజార్ నూతన సంవత్సరం సందర్భంగా కొత్తగా డిజిటల్ సేవలను పరిచయం చేస్తోంది. కేంద్రప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల పథకానికి సంస్థ ప్రోత్సాహాన్నందిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డుల ఆన్ లైన్ చెల్లింపులను అనుమతిస్తోంది. అన్ని ప్రదేశాల్లో ఆక్సిస్ పే , పే టీఎం ద్వారా మొబైల్ అండ్ ఇంటర్నెట్ చెల్లింపులను పే పాల్ ద్వారా అన్ లైన్ చెల్లింపులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికాలో దేశీయంగా అంతర్జాతీయంగా, అమెరికా నుంచి భారత్ షిప్పింగ్ సేవలను కొత్తగా ప్రారంభించిన సేవలను విస్తరిస్తున్నట్టు గరుడ వేగ అధిపతి కృష్ణ మందలపు ఒక ప్రకటనలో తెలిపారు. గరుడ బజార్ ద్వారా హ్యాపీ హాలిడేస్ అనే కూపన్ ద్వారా 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ కోసం హ్యాపీ హాలిడేస్ డిస్కౌంట్ కోడ్ వాడాలని సూచించారు. అమెరికాకు కేజీకి రూ.400(కనీసం 40 కిలోలు) చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచంలో విశ్వసనీయ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ గా చాలా నమ్మకమైన సమర్థమైన అద్భుతమైన కస్టమర్ సేవల్న అందిస్తున్నట్టు గరుడ వేగ తెలిపింది. తమ గరుడ బజార్ ద్వారా ప్రస్తుతం కేజీకి రూ. 299 ధరలతో ఇండియా నుంచి ప్రపంచంలో ముఖ్యమైన అమెరికా, బ్రిటన్, యూఏఈ, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్య తూర్పు సహా 200 ఇతర దేశాల్లో సేవల్ని అందిస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు వారు అనుబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ తమ స్వస్థలాల నుంచి తెప్పించిన రుచికరమైన పిండివంటలు, స్నాక్స్, స్వీట్లను.. బహుమతులను ఇచ్చి కుటుంబసభ్యులను సంతోషపెట్టి తామూ సంతోషిస్తారు. విదేశాల్లో భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సొంతూరులోని వారివారి కుటుంబాలకు బహుమతులు పంపుకోవచ్చని తెలిపింది. అలాగే పండుగ ఆనందాన్ని మిస్ కాకుండా ఇంటినుంచి రుచికరమైన స్నాక్స్, స్వీట్లు అందించుకోవచ్చని పేర్కొంది. ఈ టోకెన్ల ద్వారా వారి ప్రేమాభిమానాలకు దూతలుగా పనిచేస్తుండటం తమ అదృష్టమని తెలిపింది. ఇకముందుకూడా వినియోగదారుల ప్రేమ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు తమ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచేందుకు మీ విలువైన అభిప్రాయాలు సలహాలను అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు.