
భారత్‌లో గత 17 త్రైమాసికాల్లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్‌లో షావోమీ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అయితే అనూహ్యంగా మార్కెట్ వాటాను షావోమీ వేగంగా కోల్పోతుందని మార్కెట్ పరిశోధన సంస్థ కానాలిసిస్ పేర్కొంది.
కంపెనీల మధ్య పోటీ..!
షావోమీ పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. సరఫరా గొలుసు పరిమితులతో 2020 క్యూ1 నుంచి ఇప్పటివరకు షావోమి 8 శాతం మార్కెట్ వాటా తగ్గింది. క్యూ1 2020లో, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ 29 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అప్పటి నుంచి మార్కెట్ గ్రాఫ్ నెమ్మదిస్తోంది. 2021 క్యూ 4లో 21 శాతం మార్కెట్ వాటాను షావోమీ సొంతం చేసుకుంది. అయినప్పటికీ, షావోమీ 2021 క్యూ 4లో భారత్‌లో 9.3 మిలియన్ యూనిట్లను షిప్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిక్యంలో ఉందని కెనాలిస్ తెలిపింది.
కాంపోనెంట్ కొరత..!
స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ విశ్లేషకుల ప్రకారం.. షావోమీ మాస్-మార్కెట్ ఎంట్రీ-లెవల్ విభాగంలో కాంపోనెంట్ కొరతతో మార్కెట్ వాటా దెబ్బతింది. షావోమీ ప్రత్యర్ధి బ్రాండ్లు Unisoc అనే కొత్త చిప్‌సెట్ ప్లేయర్‌తో మార్కెట్ వాటాలో వేగంగా లాభపడుతున్నాయి. యూనిసోక్ చిప్‌సెట్స్‌తో పలు బ్రాండ్స్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ డిమాండ్‌ను తీర్చగలిగాయి.
చదవండి: జియో నుంచి మరో సంచలనం..! అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..! ధర ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment