OnePlus 10 Pro Price in India Leaked Ahead of Launch - Sakshi
Sakshi News home page

OnePlus 10 Pro: లీకైన వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో ధ‌ర.. ఎంతో తెలుసా?

Published Mon, Mar 28 2022 7:09 PM | Last Updated on Mon, Mar 28 2022 7:27 PM

OnePlus 10 Pro Price In India Leaked Ahead Of Launch - Sakshi

గతకొంత కాలంగా మొబైల్ ప్రియులను ఉరిస్తున్న వ‌న్‌ప్ల‌స్ 10ప్రో భార‌త్‌లో మార్చి 31న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మార్చి 31 రాత్రి 7:30 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ట్విటర్ వేదికగా పేర్కొంది. అయితే, కంపెనీ మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్‌ ధ‌రను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇప్పటికే ఈ ఫోన్ ధ‌ర‌, ఫీచ‌ర్లు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ధ‌రను ప్రముఖ టిప్ స్టర్ ట్విటర్ వేదికగా లీక్ చేయడమే గాక, మొదటి సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది అనేది కూడా పేర్కొన్నాడు. దీంతో, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ ఫోన్ గురించే ఎక్కువగా చ‌ర్చ న‌డుస్తోంది.

వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో ధ‌రలు(అంచనా)
ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో విడుదలైన వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫీచ‌ర్ల‌తోనే భార‌త్‌లో కూడా లాంచ్ కానున్నట్టు సమాచారం. దీనిలో ఈ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జ‌న‌ర‌ల్ 1 ఎస్‌ఓసీ ఉండనుంది. ఈ సమాచారాన్ని టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో బేసిక్ వేరియంట్ ధర రూ.66,999 కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.71,999గా ఉంది. ఏప్రిల్ 5 నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ భార‌త్‌లో ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కంటే ముందు లాంచ్ చేసిన వ‌న్‌ప్ల‌స్ 9 ప్రో ఫోన్ బేసిక్ వేరియంట్ ధ‌ర రూ.64,999గా ఉంటే, టాప్ ఎండ్ మోడ‌ల్ ధ‌ర రూ.69,999గా ఉంది.

వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో స్పెసిఫికేషన్స్(అంచనా)

  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్యూహెచ్‌డీ ప్ల‌స్ 6.7-అంగుళాల డిస్​ప్లే ఉండనుంది.
  • క్వాల్‌క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జ‌న‌ర‌ల్ 1 ప్రాసెసర్
  • 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ సెకండరీ కెమెరా, 8 ఎంపీ స్నాపర్ కెమెరా
  • 32 -మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ కెమెరా
  • 80W సూపర్​ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ గల 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
  • వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో బేసిక్ వేరియంట్ ధర రూ.66,999
  • వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.71,999

(చదవండి: కనక వర్షం కురిపిస్తున్న ఆ టాటా కంపెనీ షేర్లు..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement