![Tablet Sales Increase in India](/styles/webp/s3/article_images/2024/09/1/tab-sales.jpg.webp?itok=ThkudC6v)
2024 ఏప్రిల్ - జూన్ మధ్యలో భారతదేశంలో ట్యాబ్ సేల్స్ భారీగా పెరిగినట్లు 'ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్' (IDC) వెల్లడించింది. మూడు నెలల్లో 1.84 మిలియన్ యూనిట్ల ట్యాబ్ విక్రయాలు జరిగినట్లు.. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 128.8 శాతం పెరిగినట్లు సమాచారం.
వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ ట్రాకర్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసింది. ఇది విక్రయాలు గణనీయంగా పెరగడానికి దోహదపడిందని తెలుస్తోంది. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌లు అన్నీ కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మొత్తం ట్యాబ్ విక్రయాలలో.. 23.6 శాతం వాటాతో ఏసర్ గ్రూప్ మొదటి స్థానంలో.. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో శామ్‌సంగ్, యాపిల్ వంటివి ఉన్నాయి. నాలుగో స్థానంలో లెనోవో ఉంది. షియోమీ ఐదో స్థానంలో నిలిచింది.
కీలకమైన విద్యా ఒప్పందాలు, చిన్న & మధ్య తరహా వ్యాపారం విభాగం ఊపందుకోవడంతో వాణిజ్య విభాగం పటిష్టంగా మారింది. దీంతో ట్యాబ్స్ వినియోగం భారీగా పెరిగిందని దక్షిణాసియా డివైసెస్ రీసెర్చ్ మేనేజర్ భరత్ షెనాయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment