Tabs sales
-
భారత్‌లో పెరిగిన ట్యాబ్ సేల్స్.. కారణం ఇదే
2024 ఏప్రిల్ - జూన్ మధ్యలో భారతదేశంలో ట్యాబ్ సేల్స్ భారీగా పెరిగినట్లు 'ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్' (IDC) వెల్లడించింది. మూడు నెలల్లో 1.84 మిలియన్ యూనిట్ల ట్యాబ్ విక్రయాలు జరిగినట్లు.. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 128.8 శాతం పెరిగినట్లు సమాచారం.వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ ట్రాకర్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసింది. ఇది విక్రయాలు గణనీయంగా పెరగడానికి దోహదపడిందని తెలుస్తోంది. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌లు అన్నీ కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.మొత్తం ట్యాబ్ విక్రయాలలో.. 23.6 శాతం వాటాతో ఏసర్ గ్రూప్ మొదటి స్థానంలో.. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో శామ్సంగ్, యాపిల్ వంటివి ఉన్నాయి. నాలుగో స్థానంలో లెనోవో ఉంది. షియోమీ ఐదో స్థానంలో నిలిచింది. కీలకమైన విద్యా ఒప్పందాలు, చిన్న & మధ్య తరహా వ్యాపారం విభాగం ఊపందుకోవడంతో వాణిజ్య విభాగం పటిష్టంగా మారింది. దీంతో ట్యాబ్స్ వినియోగం భారీగా పెరిగిందని దక్షిణాసియా డివైసెస్ రీసెర్చ్ మేనేజర్ భరత్ షెనాయ్ అన్నారు. -
ట్యాబ్‌ల విక్రయంలో శామ్సంగ్ను దాటేసిన ఐబాల్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు అత్యధిక ట్యాబ్‌లు విక్రయించిన సంస్థగా ఐబాల్ నిలిచిందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలి పింది. శామ్సంగ్ను తోసిరాజని, ఐబాల్ ఈ స్థానాన్ని సాధించిందని ఐడీసీ పేర్కొంది. డిసెంబర్ క్వార్టర్‌కు భారత్‌లో మొత్తం 9.6 లక్షల ట్యాబ్‌లు విక్రయమయ్యాయని పేర్కొంది. మొత్తం ట్యాబ్‌ల విక్రయాల్లో ఐబాల్ వాటా 15.6 శాతంగా ఉందని తెలిపింది.2013 క్యూ4లో ఐబాల్ మార్కెట్ వాటా 4.5% మాత్రమేనని వివరించింది. 2013, 3వ క్వార్టర్లో 22 శాతంగా ఉన్న శామ్సంగ్ వాటా 2014 క్యూ4లో 12.9 శాతానికి పడిపోయిందని తెలిపింది. 2014సెప్టెంబర్ క్వార్టర్‌కు భారత ట్యాబ్‌ల మార్కెట్లో శామ్సంగ్, మైక్రోమ్యాక్స్‌ల తర్వాత 3వ స్థానంలో ఐబాల్ ఉందని పేర్కొంది. తక్కువ ధరలకే ట్యాబ్‌లను అందించడం ఐబాల్‌కు లాభించిందంది. కాగా భారత ట్యా బ్ల మార్కెట్లో తమదే అగ్రస్థానమని శామ్సంగ్ ప్రతినిధి పేర్కొన్నారు. -
ట్యాబ్స్దే.. హవా..
ఎంతో సులభంగా... కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ట్యాబ్‌ల్లో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. మారుతున్న ప్రజల అవసరాలు, యువత అమితంగా ఇష్టపడడంతో ఏటా ట్యాప్‌ల అమ్మకాలను పరుగుపెట్టిస్తున్నాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లతో పోల్చితే ధర తక్కువగా ఉండడం ట్యాబ్స్ దృష్టిమరల్చడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీనికితోడు అరచేతిలో ఇమిడిపోయే సౌలభ్యం, ఎక్కడైనా వాడుకోవడానికి వీలు ఉండడంతో ట్యాబ్స్‌పై క్రేజీని మరింత పెంచుతూ ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేస్తున్నాయి. అందరికీ అందుబాటులో.. ట్యాబ్‌లు వివిధ కంపెనీల వారీగా దాదాపు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ వాడకం.. గేమ్స్ ఆడుకోవడమే కాకుండా సిమ్ వేసుకుని ఫోన్ తరహాలో ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులో ఉండడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మ్యూజిక్, వీడియో లోడింగ్, ఇంటర్నెట్ సెర్చింగ్, ఈ మెయిల్ పంపుకోవడం, ఈ బుక్స్ చదవడం, పత్రికలు చదవడం, వ్యాపారులకు ఆన్లైన్ పర్చేసింగ్, బిల్లింగ్, ట్రేడింగ్‌కు ట్యాబ్‌లు ఉపయోగపడుతున్నాయి. యువత సోషల్ నెట్‌వర్క్‌ను అంటిపెట్టుకుంటున్న తరుణంలో ట్యాబ్‌ను మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అవి మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. పెరుగుతున్న బిజినెస్ జిల్లాలో ట్యాబ్స్ బిజినెస్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల ప్రాంతాల్లో ట్యాబ్స్ బిజినెస్ ఊపందుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ట్యాబ్స్ వరకు అమ్మడవగా.. ఇందులో నగరంలోనే 2500 వరకు అమ్ముడవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. పిల్లలకు బహుమతులుగా.. చాలామంది పిల్లలకు బహుమతులుగా ఇస్తుంటారు. పుట్టిన రోజు, ఇతర శుభకార్యాలకు కూడా ట్యాబ్స్ బహుమతులుగా ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. దీంతో ట్యాబ్స్ ఎక్కువ స్థాయిలో పిల్లలే వాడుతున్నారు. ట్యాబ్స్ మిగతా మొబైల్స్‌తో పోల్చితే గేమ్స్ ఆడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటున్నాయంటున్నారు తల్లిదండ్రులు.