ఎంతో సులభంగా...
కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ట్యాబ్‌ల్లో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. మారుతున్న ప్రజల అవసరాలు, యువత అమితంగా ఇష్టపడడంతో ఏటా ట్యాప్‌ల అమ్మకాలను పరుగుపెట్టిస్తున్నాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు, లాప్‌టాప్‌లతో పోల్చితే ధర తక్కువగా ఉండడం ట్యాబ్స్ దృష్టిమరల్చడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీనికితోడు అరచేతిలో ఇమిడిపోయే సౌలభ్యం, ఎక్కడైనా వాడుకోవడానికి వీలు ఉండడంతో ట్యాబ్స్‌పై క్రేజీని మరింత పెంచుతూ ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేస్తున్నాయి.
అందరికీ అందుబాటులో..
ట్యాబ్‌లు వివిధ కంపెనీల వారీగా దాదాపు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ వాడకం.. గేమ్స్ ఆడుకోవడమే కాకుండా సిమ్ వేసుకుని ఫోన్ తరహాలో ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులో ఉండడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
మ్యూజిక్, వీడియో లోడింగ్, ఇంటర్‌నెట్ సెర్చింగ్, ఈ మెయిల్ పంపుకోవడం, ఈ బుక్స్ చదవడం, పత్రికలు చదవడం, వ్యాపారులకు ఆన్‌లైన్ పర్చేసింగ్, బిల్లింగ్, ట్రేడింగ్‌కు ట్యాబ్‌లు ఉపయోగపడుతున్నాయి. యువత సోషల్ నెట్‌వర్క్‌ను అంటిపెట్టుకుంటున్న తరుణంలో ట్యాబ్‌ను మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అవి మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
పెరుగుతున్న బిజినెస్
జిల్లాలో ట్యాబ్స్ బిజినెస్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల ప్రాంతాల్లో ట్యాబ్స్ బిజినెస్ ఊపందుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ట్యాబ్స్ వరకు అమ్మడవగా.. ఇందులో నగరంలోనే 2500 వరకు అమ్ముడవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
పిల్లలకు బహుమతులుగా..
చాలామంది పిల్లలకు బహుమతులుగా ఇస్తుంటారు. పుట్టిన రోజు, ఇతర శుభకార్యాలకు కూడా ట్యాబ్స్ బహుమతులుగా ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. దీంతో ట్యాబ్స్ ఎక్కువ స్థాయిలో పిల్లలే వాడుతున్నారు. ట్యాబ్స్ మిగతా మొబైల్స్‌తో పోల్చితే గేమ్స్ ఆడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటున్నాయంటున్నారు తల్లిదండ్రులు.
ట్యాబ్స్‌దే.. హవా..
Published Tue, Aug 19 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement