ట్యాబ్‌ల విక్రయంలో శామ్‌సంగ్‌ను దాటేసిన ఐబాల్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు అత్యధిక ట్యాబ్‌లు విక్రయించిన సంస్థగా ఐబాల్ నిలిచిందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలి పింది. శామ్‌సంగ్‌ను తోసిరాజని, ఐబాల్ ఈ స్థానాన్ని సాధించిందని ఐడీసీ పేర్కొంది. డిసెంబర్ క్వార్టర్‌కు భారత్‌లో మొత్తం 9.6 లక్షల ట్యాబ్‌లు విక్రయమయ్యాయని పేర్కొంది. మొత్తం ట్యాబ్‌ల విక్రయాల్లో ఐబాల్ వాటా 15.6 శాతంగా ఉందని తెలిపింది.2013 క్యూ4లో ఐబాల్ మార్కెట్ వాటా 4.5% మాత్రమేనని వివరించింది.
2013, 3వ క్వార్టర్‌లో 22 శాతంగా ఉన్న శామ్‌సంగ్ వాటా 2014 క్యూ4లో 12.9 శాతానికి పడిపోయిందని తెలిపింది. 2014సెప్టెంబర్ క్వార్టర్‌కు భారత ట్యాబ్‌ల మార్కెట్లో శామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్‌ల తర్వాత 3వ స్థానంలో ఐబాల్ ఉందని పేర్కొంది. తక్కువ ధరలకే ట్యాబ్‌లను అందించడం ఐబాల్‌కు లాభించిందంది. కాగా భారత ట్యా బ్‌ల మార్కెట్లో తమదే అగ్రస్థానమని శామ్‌సంగ్ ప్రతినిధి పేర్కొన్నారు.