
ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చాయి. ఇకపై ట్రై-ఫోల్డ్ ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి. శామ్‌సంగ్ కంపెనీ ఈ రకమైన ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ దీనికి 'గెలాక్సీ జీ ఫోల్డ్' అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఒకే ఒక్క ట్రై-ఫోల్డ్ ఫోన్ 'హువావే మేట్ ఎక్స్‌టి'. కాగా దీనికి శామ్‌సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ ప్రత్యర్థిగా నిలువనుంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది శామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లతో పాటు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.
కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ మొబైల్.. హువావే మేట్ XT కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.49 ఇంచెస్ కవర్ డిస్‌ప్లే, 9.96 ఇంచెస్ మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ కొలతలు మేట్ ఎక్స్‌టి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పరిమాణంలో కొంచెం పెద్దది. లాంచ్ అయినప్పటికీ, గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయిన వెంటనే అమ్మకానికి రాకపోవచ్చు. గెలాక్సీ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది.
శామ్‌సంగ్ ఈ గెలాక్సీ జి ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎస్ పెన్ అందించనుంది. పెరుగుతున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌తో పోటీ పడటానికి శామ్‌సంగ్ ఈ ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ధరలు, లాంచ్ డేట్ వివరాలు వంటివి అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment