సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో, టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను దేశంలోనే అతి చవకైనదిగా కంపెనీ ప్రకటించింది ఆకట్టుకునే ప్రీమియం డిజైన్, వర్చువల్లీ క్రీజ్ ఫ్రీ ఫోల్డబుల్ మెయిన్ డిస్‌ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది.
టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ భారత మార్కెట్లో రూ.88,888 ప్రారంభ ధరతో విడుదలంది. సింగిల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై పరిచయ ఆఫర్ కూడా ఉంది. స్పెషల్ డిస్కౌంట్‌తో ధర రూ.77,777 వద్ద ఏప్రిల్ 12న అందుబాటుల ఉంది. దీంతో పాటు హెచ్‌డీబీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రెండు సంవత్సరాల వారంటీతో పాటు, ఫాంటమ్ వీ ఫోల్డ్ రూ. 5,000 విలువైన ఉచిత ట్రాలీ బ్యాగ్, కొనుగోలు చేసిన ఆరు నెలల్లోపు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, స్టాండ్‌తో కూడిన ఉచిత ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్ లభించనుంది. ఫాంటమ్ వీఫోల్డ్‌కి గట్టి పోటీగా భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,998గాఉంది.
ఫాంటమ్ వీఫోల్డ్‌స్పెసిఫికేషన్స్: 6.42-అంగుళాల LTPO, ఔటర్ AMOLED డిస్‌ప్లేను. ప్రాథమిక లోపలి స్క్రీన్ 2296 X 2000 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లే. ఫోన్ కంటెంట్ ఆధారంగా 120Hz రిఫ్రెష్ రేట్ వరకు వేరియబుల్‌తో వస్తుంది.ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్-రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని టెక్నో కంపెనీ చెప్పింది. హుడ్ కింద MediaTek ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్ ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో లభ్యం.
ట్రిపుల్ రియర్ కెమెరా 50 ఎంపీ ప్రైమరీ కెమెరా , 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50ఎంపీ 2x పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. అలాగే ఔటర్ డిస్‌ప్లేలో 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్నర్ ఫోల్డబుల్ డిస్‌ప్లేలో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాలున్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ , చక్కటి ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్‌లను పొందుపరిచింది. (బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్)
కాగా టెక్నో ఇటీవల MWC 2023లో తన తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్వ వీ ఫోల్డ్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజగా కంపెనీ ఎట్టకేలకు దీనిని భారతదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫాంటమ్ వీ ఫోల్డ్ దేశంలో అత్యంత సరసమైన ఫుల్-స్క్రీన్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.
( ఇదీ చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment