India Market
-
టాటా మోటార్స్ తో కలిసి జాయింట్ వెంచర్?
-
గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో , ఫీచర్లు చూస్తే!
Infinix gt 10 pro: ఇన్ఫినిక్స్ ఇండియా తాజాగా జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్ గేమింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ధరలో దీన్ని లాంచ్ చేసింది. సుపీరియర్ ప్రాసెసింగ్ పవర్, కూల్ టెక్నాలజీ,10-బిట్ FHD+AMOLED డిస్ప్లేను దీన్ని తీసుకు రావడం విశేషం. రియర్ కెమెరా ద్వారా 4K వీడియో రికార్డింగ్, సెల్ఫీ కెమెరా 2K వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు AI ఫిల్మ్ మోడ్‌ను కూడా జోడించింది. ఇండియాలోదీని లాంచింగ్ ప్రైస్ రూ. 19,999గా ఉంది. అయితే బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా, ప్రస్తుతం రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటు,తొలి 5,000 మంది కస్టమర్లు ప్రో గేమింగ్ కిట్‌ను కూడా అందుకునోఛాన్స్ ఉంది. సైబర్ మెకా డిజైన్, రంగు మార్చే వెనుక ప్యానెల్, 6.67 ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. 108 ఎంపీ అల్ట్రా క్లియర్ ట్రిపుల్ కెమెరా, ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 5జీ సిమ్ దీనిలో ఉన్నట్లు సంస్థ సీఈవో అనీష్ కపూర్ తెలిపారు. ఇది సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుందని పేర్కొన్నారు. జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 1300ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునేసదుపాయం 5000mAh బ్యాటరీ -
ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Oppo A78 4g: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లో మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. మిడ్ రేంజ్లో ఒప్పో ఏ సిరీస్‌లో 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఏ78 4జీ స్మార్ట్‌ఫోన్ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్లో 50MP ప్రధాన కెమెరా, భారీ బ్యాటరీ,చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను జోడించింది. ఒప్పో ఏ78 మోడల్ 5జీ వెర్షన్ ఎనిమిది నెలల క్రితమే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) కస్టమర్లు మెయిన్‌లైన్ రిటైల్ అవుట్లెట్ల నుండి గరిష్టంగా 10శాతం (రూ. 1,500) క్యాష్‌బ్యాక్ , SBI కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డ్ వంటి ప్రముఖ బ్యాంకుల నుండి 3 నెలల వరకు నో-కాస్ట్ EMI. ఆన్లైన్ స్టోర్ల నుండి రూ. 500 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. (హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్, ఏకంగా పదివేలు!) ధర, ఆఫర్స్ ఒప్పో ఏ78 4జీ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.22,999. ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.17,499కే లభిస్తోంది. ఆక్వాగ్రీన్, మిస్ట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 ఒప్పో ఏ78 4జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ColorOS 13.1 8 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ పొట్రెయిట్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్ వూక్ చార్జర్ Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 -
సరికొత్త టెక్నాలజీతో వివో వై36 లాంచ్: ధర తక్కువే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. 50 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో వివో వై సిరీస్‌లో వివో వై 36 కెమెరాను భారత మార్కెట్లో తీసు కొచ్చింది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌లైట్-రీడబుల్ డిస్ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు! వివో వై36 ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేయ్ వేరియంట్ రూ. 16,999గా నిర్ణయించింది. 'డైనమిక్ డ్యూయల్ రింగ్' డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ వైబ్రాంట్ గోల్డ్ మెటోర్ బ్లాక్ అనే రెండు రంగులలో వస్తుంది. ICICI & HDFC కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు వివో వై36 ఫీచర్లు 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 50+2 ఎంపీ రియర్‌కెమెరా ఆరా స్క్రీన్ లైట్‌తో 16MP ఫ్రంట్ కెమెరా 5000mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ (Global Chess League 2023 ఆనంద్ VS ఆనంద్: మహీంద్ర ట్వీట్ వైరల్) Here's another reason to amp up your style! Bringing you the all-new vivo Y36 with Stylish Glass Design and 44W Flash Charge. Buy now!#ItsMyStyle #vivoY36 pic.twitter.com/BI4ngPIJwi — vivo India (@Vivo_India) June 22, 2023 -
Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో, టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను దేశంలోనే అతి చవకైనదిగా కంపెనీ ప్రకటించింది ఆకట్టుకునే ప్రీమియం డిజైన్, వర్చువల్లీ క్రీజ్ ఫ్రీ ఫోల్డబుల్ మెయిన్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ భారత మార్కెట్లో రూ.88,888 ప్రారంభ ధరతో విడుదలంది. సింగిల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై పరిచయ ఆఫర్ కూడా ఉంది. స్పెషల్ డిస్కౌంట్‌తో ధర రూ.77,777 వద్ద ఏప్రిల్ 12న అందుబాటుల ఉంది. దీంతో పాటు హెచ్డీబీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రెండు సంవత్సరాల వారంటీతో పాటు, ఫాంటమ్ వీ ఫోల్డ్ రూ. 5,000 విలువైన ఉచిత ట్రాలీ బ్యాగ్, కొనుగోలు చేసిన ఆరు నెలల్లోపు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, స్టాండ్‌తో కూడిన ఉచిత ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్ లభించనుంది. ఫాంటమ్ వీఫోల్డ్కి గట్టి పోటీగా భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,998గాఉంది. ఫాంటమ్ వీఫోల్డ్స్పెసిఫికేషన్స్: 6.42-అంగుళాల LTPO, ఔటర్ AMOLED డిస్ప్లేను. ప్రాథమిక లోపలి స్క్రీన్ 2296 X 2000 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్ప్లే. ఫోన్ కంటెంట్ ఆధారంగా 120Hz రిఫ్రెష్ రేట్ వరకు వేరియబుల్తో వస్తుంది.ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్-రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని టెక్నో కంపెనీ చెప్పింది. హుడ్ కింద MediaTek ఫ్లాగ్షిప్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ఉంది. ఈ చిప్సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో లభ్యం. ట్రిపుల్ రియర్ కెమెరా 50 ఎంపీ ప్రైమరీ కెమెరా , 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50ఎంపీ 2x పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. అలాగే ఔటర్ డిస్ప్లేలో 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లేలో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాలున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ , చక్కటి ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లను పొందుపరిచింది. (బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్) కాగా టెక్నో ఇటీవల MWC 2023లో తన తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్వ వీ ఫోల్డ్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజగా కంపెనీ ఎట్టకేలకు దీనిని భారతదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫాంటమ్ వీ ఫోల్డ్ దేశంలో అత్యంత సరసమైన ఫుల్-స్క్రీన్ ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ( ఇదీ చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) -
2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!
సాక్షి,ముంబై: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్. కియా ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనం ఈవీ 6 2023 వెర్షన్ బుకింగ్‌లను షురూ చేస్తోంది. ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. 2023 ఈవీ6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీటీ లైన్ , జీటీ GT లైన్ AWD. వీటి ధరలు వరుసగా రూ. 60.95 లక్షలు, రూ. వరుసగా 65.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) గత ఏడాది తమ పాపులర్ కారును అందుకోలోలేకపోయిన వారి కోసం తమ డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించామనీ, మార్కెట్లో అద్భుతమైన పనితీరుతో ఈవీ6 ప్రీమియం ఈవీ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతుందనే విశ్వసాన్ని కియా ఇండియా సీఎండీ తే జిన్ పార్క్ ప్రకటించారు. 2022లో 432 యూనిట్ల విక్రయించిన కంపెనీ, 150 kW హై-స్పీడ్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రస్తుతం ఉన్న 15 డీలర్‌షిప్‌ల నుండి మొత్తం 60 అవుట్లెట్లకు విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. (2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే) -
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 50-70 శాతం వరకూ ఉండనుంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏసీఎంఏ సదస్సు సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. ఈ నివేదిక ప్రకారం ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఎలక్ట్రిక్ ద్వి, త్రిచక్ర వాహనాల విషయంలో ఆకర్షణీయ అంశంగా ఉండనుంది. దేశీయంగా ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో విద్యుదీకరణ నెమ్మదిగా ఉండనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లతో (ఐసీఈ) నడిచే వాహనాల ఆధిపత్యమే కొనసాగనుంది. 2030 నాటికి కొత్త వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 10-15 శాతం, విద్యుత్ వాణిజ్య వాహనాల వాటా 5-10 శాతంగా ఉండనుంది. (బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?) నివేదిక ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమనేది వాహనాల పరిశ్రమ దిశను మార్చేయనుంది. యూరప్, చైనా మార్కెట్లు ఈ మార్పునకు సారథ్యం వహించనుండగా, మిగతా ప్రపంచ దేశాలు వాటిని అనుసరించనున్నాయి. ఈ దశాబ్దం మధ్య నాటికి భారత్, చైనాలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గరిష్ట స్థాయికి పుంజుకోనున్నాయి. సమీప కాలంలో సరఫరాపరమైన అంతరాయాలు ఎదురైనప్పటికీ వాహనాల పరిశ్రమకు దీర్ఘకాలికంగా అవకాశాలు అత్యంత ఆశావహంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పరిశ్రమ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ సాంప్రదాయ మార్కెట్లకే పరిమితం కాకుండా కొత్త మార్కెట్లకు కూడా ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. (Swiggy, Zepto: లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!) -
కరెక్షన్లో షేర్లు కొంటాం: మోర్గాన్ స్టాన్లీ
పుష్కలమైన లిక్విడిటీ, బలమైన సెంటిమెంట్ ఉన్న కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్... వర్ధమాన మార్కెట్లను అధిగమించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ ఇన్వెస్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ‘‘గత కొన్ని వారాలుగా జరుగుతున్న ర్యాలీ వల్ల కొన్ని షేర్లలో కరెక్షన్ జరిగే అవకాశం ఉన్నందున మార్కెట్ ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంది. అలాగే కరెక్షన్ అయ్యే షేర్లను మేము కొనుగోలు చేసేందుకు ఇష్టపడతాము. అలాంటి షేర్లు వచ్చే నెలల్లో అధిక అప్‌సైడ్ ర్యాలీ చేసేందుకు అవకాశం ఉంది.’’ అని మోర్గాన్ స్లాన్టీ తన నివేదికలో తెలిపింది. మార్చి కనిష్టస్థాయి నుంచి బీఎస్ఈ ఇండెక్స్ 34శాతం లాభపడింది. అయితే ఏడాది ప్రాతిపాదికన 15శాతం క్షీణించింది. ఎంఎస్సీఐ వర్థమాన మార్కెట్ల ఇండెక్స్‌తో పోలిస్తే భారత మార్కెట్ 9.7శాతం పతనాన్ని చవిచూసింది. ఇటీవల కనిష్టస్థాయి నుంచి ఇండియా స్టాక్ మార్కెట్ ఓలటాలిటి తగ్గింది. అయితే ఇప్పటికీ ఓలటాలిటీ గరిష్టంలోనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చిలో 8.4బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్న తర్వాత మే, జూన్ నెలల్లో దేశీయ ఈక్విటీలను తిరిగి కొనుగోలు చేస్తున్నారు. -
బైక్ చాల్లే... క్యాబ్ ఎందుకు?!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బోడ బోడ, హబల్ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్ షేరింగ్! ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన బైక్ షేరింగ్ ఇక్కడా దూసుకుపోతోంది. ఇపుడు బైక్ షేరింగ్ పరిశ్రమ సరికొత్త ఉపాధి, ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బైక్ షేరింగ్ మార్కెట్ 10 బిలియన్ డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో తొలిసారిగా ద్విచక్ర వాహనాలకు పబ్లిక్ సర్వీస్ ట్యాక్సీగా అనుమతినిచ్చింది గోవా రాష్ట్రమే. ఆ తర్వాత హరియాణా, మిజోరాం, వెస్ట్ బెంగాల్ ఈ కోవలోకి వచ్చాయి. తెలంగాణ, రాజస్తాన్, యూపీల్లోనూ కమర్షియల్ బైక్ ట్యాక్సీలకు అనుమతులున్నాయి. ప్రస్తుతం ఉబర్ మోటో, రాపిడో, ఓలా బైక్ ట్యాక్సీ, డ్రైవజీ, మోబిసీ, బైక్సీ, బౌన్స్, బాక్సీ, రెన్ట్రిప్, వోగో, టాజో, రోడ్పండా, ఆన్బైక్స్, పీఎస్బ్రదర్స్, రాయల్ బ్రదర్స్, వీల్‌స్ట్రీట్ వంటివి ఈ రంగంలో ఉన్నాయి. ఎలా పనిచేస్తాయంటే...? బైక్ యజమాని తన పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్సు, బీమా వంటి వివరాలను కంపెనీకి సమర్పించాలి. వాటిని సమీక్షించి.. బైక్‌ను తన షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేస్తుంది. మనకు కావాల్సినపుడు బుకింగ్‌ను తీసుకోవచ్చు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్‌ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. కస్టమర్ బైక్‌ను బుక్ చేయగానే.. డ్రైవర్ ఎవరు? అతని ప్రొఫైల్? ఎంత సమయంలో వస్తుంది? చార్జీ? వంటి వివరాలన్నీ వస్తాయి. కెప్టెన్ తలకు హెల్మెట్ పెట్టుకొని.. కస్టమర్‌కు కూడా ఒక హెల్మెట్‌ను తెస్తాడు. కస్టమర్‌ను గమ్య స్థానంలో డ్రాప్ చేయగానే అప్పటికప్పుడే కెప్టెన్ బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుంది. రియల్ టైమ్ రైడ్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్స్, బైక్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి బైక్ షేరింగ్‌లో ఉంటాయి. మహిళల కోసం ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ కంపెనీ కంట్రోల్‌తో అనుసంధానమై ట్రాకింగ్ చేస్తుంటుంది. ఎందుకింత డిమాండ్? ఓలా, ఉబర్ క్యాబ్ సంస్థలు ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో చాలా మంది డ్రైవర్లు అన్‌లిస్ట్ అవుతున్నారు. దీంతో వీకెండ్స్‌లో, రద్దీ సమయంలో క్యాబ్స్ దొరకటం లేదు. ఇది బైక్ షేరింగ్ కంపెనీలకు కలిసొస్తుందని ర్యాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంకా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. నగరాల్లో క్యాబ్‌తో పోల్చితే బైక్‌పై త్వరగా గమ్యానికి చేరుకోవటం, ధర 40–60% తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లతో ఎంట్రీ.. ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేకపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలకు బైక్ షేరింగ్ కంపెనీలు పరిష్కారం చూపిస్తున్నాయి. యువత, ఉద్యోగులు, ఐటీ నిపుణులు బైక్ షేరింగ్‌ను వినియోగిస్తున్నారు. యూనివర్సిటీలతో, పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని కూడా షేరింగ్ సేవలను అందిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగటం కూడా బైక్ షేరింగ్ పరిశ్రమ వృద్ధికి కారణమని చెప్పొచ్చు. ర్యాపిడో, మొబిసీ, వోగో, జైప్ వంటి స్టార్టప్స్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను వినియోగిస్తున్నాయి. సవాళ్లూ ఉన్నాయ్.. ప్రస్తుతం బైక్ షేరింగ్ కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో చాలా కంపెనీలు సేవలను నిలిపేస్తుండగా కొన్ని వ్యాపార విధానాల్ని మార్చుకుంటున్నాయి. డాట్, టువీల్జ్, రిడ్జీ, హెడ్‌లైట్, హెబోబ్, జిగో వంటివి బెంగళూరులో సేవలను నిలిపేశాయి. ఎంట్యాక్సీ, బైక్సీ, యాయా వంటివి పబ్లిక్ షేరింగ్ నుంచి డెలివరీ దిశగా వ్యాపారాన్ని మార్చుకున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బైక్ షేరింగ్‌కు ప్రత్యేక చట్టాలు లేవు. కమర్షియల్ బైక్ ట్యాక్సీకి లైసెన్స్ లేకపోవటం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవటంతో చాలా స్టార్టప్స్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు బైక్ షేరింగ్‌ను నిషేధం విధించాయి. రహదారుల పరిస్థితులు, మహిళల భద్రత, ప్రమాదాల రేట్లు ఎక్కువగా ఉండటం వంటివి నిషేధానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి.. హైదరాబాద్‌లో ఓలా, ఉబర్, రాపిడో, వోగో, బౌన్స్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి. గత ఏడాది కాలంగా నగరంలో బైక్ షేరింగ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏడాదిలో 30–40 శాతం పెరిగినట్లు ర్యాపిడో ప్రతినిధి చెప్పారు. బిజీ వేళల్లో క్యాబ్స్ దొరకకపోవటం, ధర ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, మెట్రో రెండో కారణమని చెప్పారు. మెట్రో నుంచి వచ్చి 3–4 కి.మీ. వెళ్లేందుకు బైక్ వాడుతున్నారని చెప్పారాయన. లక్ష మంది డ్రైవర్లతో రోజుకు లక్ష రైడ్స్ జరుపుతున్న రాపిడోకు... హైదరాబాద్‌లో 15వేల మంది డ్రైవర్లు, 20వేల రైడ్స్ ఉన్నట్లు సమాచారం. బైక్ షేరింగ్‌లో మహిళలూ యాక్టివే.. గడిచిన ఏడాదిగా బైక్ షేరింగ్ డ్రైవర్స్‌గా మహిళలు కూడా నమోదవుతున్నారు. ర్యాపిడోలో 25% మహిళా కెప్టెన్లు ఉన్నారు. బైక్ షేరింగ్‌లో డ్రైవర్ అనే చిన్నచూపు ఉండదు. మన బైక్‌ను ఇతరులకు షేర్ చేస్తూ హెల్ప్ అవుతున్నామనే భావన ఉంటుందని ర్యాపిడో తొలి మహిళ రైడర్ గాయత్రి ఆకుండి తెలిపారు. మహిళా కెప్టెన్‌కు మహిళా కస్టమర్‌నే ఇస్తారు. రైడర్ నంబరు, ఫొటో ఏమీ కనిపించదు. ‘‘నేను ఫుల్ టైం డ్రైవర్ని కాదు. ఉదయం 7–10 గంటల వరకు రైడ్స్ తీసుకుంటా. తర్వాత యాప్ ఆఫ్ చేసి వర్క్‌లోకి వెళ్లిపోతా. నెలకు 150–200 రైడ్స్ తీసుకుంటా. నెలకు రూ.2,400–3,000 అదనపు ఆదా యం వస్తుంది. హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా చేశా. 2 సినిమాలకు డిజైనర్‌గా పనిచేస్తున్నాను’’ అని గాయత్రి చెప్పారు. -
నాడే భారత్ బిగ్ మార్కెట్!
సాక్షి, న్యూఢిల్లీ : నాడు పలు ప్రపంచ దేశాల వర్తకులు సముద్ర మార్గాన వచ్చి భారత్‌తో జరిపిన వాణిజ్య లావాదేవీల గురించి ప్రస్తావనకు వచ్చిందంటే చాలు మనకు నాటి వలసపాలకులు గుర్తుకు వస్తారు. ముందుగా పోర్చుగీసు, ఆ తర్వాత డచ్, ఫ్రెంచ్, చివరకు బ్రిటీష్ వర్తకులు మలబార్, గోవా, గుజరాత్, బెంగాల్ సముద్ర మార్గాల ద్వారా భారత్‌తో వ్యాపారం నిర్వహించడానికి వచ్చి వ్యాపార సంస్థల పేరుతో ఇక్కడే స్థిరపడడం, మన రాజకీయాల్లో జోక్యం చేసుకొని మనల్నే పాలించడం గుర్తుకురాక తప్పదు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఏ బడి పిల్లవాడిని అడిగినా ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్ వ్యాపారులు దాదాపు రెండు వందల సంవత్సరాలు మనల్ని పాలించారని చెబుతాడు. నాటి వలసపాలన చీకటి రోజులు గుర్తుకు రావడం వల్ల అంతకుముందు పలు ప్రపంచ దేశాలు, భారత్ మధ్య భారీ ఎత్తున జరిగిన సముద్ర వాణిజ్యం గురించి పూర్తిగా మరచిపోతాం, పోయాం. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే భారత్, ఇతర దేశాల మధ్య భారీ ఎత్తున సముద్ర మార్గాన వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. పైగా నాడు ఆవిరితో నడిచే ఓడలు లేవు. కేవలం గాలి వాటున నడిచే చిన్న, మధ్యతరహా నౌకలు ఉండేవి. ఎండకాలంలో నైరుతి, చలిగాలంలో ఈశాన్య దిశ గాలులు ఏటవాలున నాటి వాణిజ్య తెరచాపల పడవలు ప్రయేణించేవి. ఆయా ప్రాంతాల్లోని దేశాలతోని వాణిజ్యం నెరపేవి. మొదట గ్రీకు వర్తకులు ఈజిప్లు, తూర్పు ఆఫ్రికా, దక్షిణ అరేబియా, భారత్‌తో వ్యాపారం నిర్వహించేవారు. వీరు తూర్పు ఆఫ్రికా తీరం నుంచి, అరేబియా ద్వీపకల్పం, పర్సియన్ గల్ఫ్ నుంచి, రెండు మార్గాల ద్వారా భారత్‌కు వచ్చేవారు. పలు మధ్యధరా సముద్ర తీర దేశాలు కూడా భారత్‌తో వర్తకం నిర్వహించేవి. విదేశీ సముద్ర వర్తకులు ఎక్కువగా హిందూ మహా సముద్ర నుంచి భారత్‌కు చేరుకునేవారు. అప్పట్లో భారత్‌తో భారుచ్ రేవు పట్టణం వాణజ్యానికి ప్రధాన కేంద్రం. మధ్యధరా సముద్ర తీర దేశాలు, భారత్, పర్షియా, ఆఫ్రికా, చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. భారత్‌లోని దాదాపు 20 రేవు పట్టణాలు నాడు వాణిజ్యానికి పేరు పొందాయి. భారత్‌లోని మలబార్ తీరం నుంచి విదేశాలకు భారీ ఎత్తున మిరియాలు ఎగుమతయ్యేవి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాస్కోడిగామ భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి కూడా ‘బ్లాక్ గోల్డ్’గా అభివర్ణించే మిరియాలే కారణమట. నాడు భారత్ నుంచి మిరియాలతోపాటు ఇతర మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతోపాటు వివిధ రకాల అత్తర్లలో కలిపే సువాసన మూలకాలు, పత్తి, ఏనుగు దంతాలు, ముత్యాలు, చైనీస్ సిల్స్ భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి. ఇక అరబ్ వ్యాపారులతోపాటు భారతీయ వ్యాపారులు కూడా బియ్యం, నువ్వుల నూనె, నెయ్యి, చక్కెర, కాటన్ గుడ్డలు విక్రయించేవారు. ఇటలీ, అరబ్ వైన్లు, ఆలివ్ నూనె, వెండి, గాజు పాత్రలతోపాటు భారతీయులు బానిస సంగీత కళాకారులు, వేశ్య వృత్తి కోసం అమ్మాయిలను కొనుగోలు చేసేవారు. రోమన్ బంగారు, వెండి నాణెలను భరతీయులు కొనుగోలు చేసేవారు. అటు సముద్ర దొంగలు, ప్రకృతి విలయాలను ఎదురొడ్డి నాడు వర్తకులు వ్యాపారం నిర్వహించాల్సి వచ్చేది. వస్తు మార్పిడి, నాటి నాణెంల ద్వారా వ్యాపార లావాదేవీలు నడిచేవి. ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయంటే.. ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ’ పేరిట ఒకటవ శతాబ్దంలో, అంటే 1900 సంవత్సరాల క్రితం, వాస్కోడిగామా భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి 1400 ఏళ్ల ముందు ఓ గ్రీకు రచయిత గ్రీకు భాషలో చేతితో రాసిన పుస్తకం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవ శతాబ్దంలో పైటపడిన ఆ రాతపతిని బ్రిటీష్ మ్యూజియలంలో భద్రపరిచారు. దాన్ని లింకన్ కాసన్ ఇటీవల ఆంగ్లంలోకి అనువదించారు. నాడు ఏయే దేశాలు ఏయే సముద్ర మార్గం గుండా భారత్‌కు వచ్చి వర్తకాన్ని నిర్వహించేవి. భారత్‌లో ప్రసిద్ధి చెందిన రేవులు, మార్కెట్లు, వాటి వివరాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. 1550 రూపాయల ధర కలిగిన ఈ పుస్తకాన్ని 33 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గించి విక్రయించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆన్లైన్ వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి. -
మార్కెట్లోకి ‘ట్రెండ్ ఈ’ ఎలక్ట్రిక్ స్కూటర్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అవన్ మోటార్స్.. ‘ట్రెండ్ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ.56,900 కాగా, డబుల్ బ్యాటరీ స్కూటర్ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం–అయాన్ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్ బ్యాటరీ స్కూటర్ గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, డబుల్ బ్యాటరీ స్కూటర్ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సంస్థ ప్రకటించింది. రూ.1,100 చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ప్రీ–బుకింగ్స్ సమయంలో ఈ స్కూటర్స్‌కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు. -
‘ట్రయంఫ్’ కొత్త బైక్‌లు...
న్యూఢిల్లీ: బ్రిటన్ సూపర్‌బైక్ బ్రాండ్ ట్రయంఫ్ రెండు మోడళ్లలో కొత్త వేరియంట్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్ట్రీట్ ట్విన్, స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా తెలిపింది. వీటి ధరలు రూ.7.45 లక్షల నుంచి రూ.8.55 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్) ఉన్నాయని కంపెనీ జనరల్ మేనేజర్ షౌన్ ఫారూఖ్ పేర్కొన్నారు. ఈ రెండు బైక్‌లను 900 సీసీ హై–టార్క్ ప్యారలాల్ ట్విన్ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు. స్ట్రీట్ ట్విన్ బైక్ ధర రూ.7.45 లక్షలని, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర రూ.8.55 లక్షలని తెలిపారు. ఈ బైక్‌ల ‘పవర్’ను 18 శాతం పెంచామని, దీంతో వీటి పవర్ 65 పీఎస్‌కు పెరిగిందని వివరించారు. పవర్ పెంపుతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ వేరియంట్లను అందిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల తయారీ వారంటీని (కిలోమీటర్లతో సంబంధం లేకుండా) ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలల్లో మరిన్ని వేరియంట్లు.. రానున్న మూడు నెలల్లో మరిన్ని కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని షారూఖ్ తెలిపారు. భారత 500 సీసీ కేటగిరీ బైక్‌ల్లో ప్రస్తుతం తమ మార్కెట్ వాటా 16 శాతంగా ఉందని వివరించారు. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియమ్ బైక్ బ్రాండ్ తమదేనని ఆయన తెలిపారు. -
దేశీ మార్కెట్లోకి చైనా కార్ల కంపెనీ
ఎంజీ కార్ బ్రాండ్‌తో వస్తున్న ఎస్ఏఐసీ 2019 నుంచి తయారీ కార్యకలాపాలు న్యూఢిల్లీ: చైనా ఆటోమొబైల్ దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ తాజాగా భారత్ మార్కెట్లో అడుగుపెడుతోంది. ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) వాహనాలను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్ల తయారీ కోసం భారత్‌లో సొంత ప్లాంటు ఏర్పాటు చేయనుంది. తయారీ ప్లాంటుకు అనువైన ప్రదేశంపై కసరత్తు జరుగుతోందని, 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా పేరిట పూర్తి అనుబంధ సంస్థ ద్వారా భారత కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది. వాన్గార్డ్ మాజీ గ్లోబల్ సీవోవో రాజీవ్ చాబా ఈ సంస్థకు ప్రెసిడెంట్, ఎండీగా ఉంటారు. అలాగే వాహన పరిశ్రమలో సీనియర్ పి. బాలేంద్రన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 100బిలియన్ డాలర్లు పైగా వార్షికాదాయంతో ఫార్చూన్ గ్లోబల్ 500 లిస్టులో ఎస్ఏఐసీ 46వ స్థానంలో ఉంది. 2008లో కొనుగోలు చేసిన బ్రిటిష్ బ్రాండ్ ఎంజీతో పాటు రోవీ, మాక్సస్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. 2009లో జనరల్ మోటార్స్(జీఎం) దివాలా అంచున నిల్చినప్పుడు దాని భారత విభాగంలో ఎస్ఏఐసీ 50% వాటాలు కొనుగోలు చేసింది. తర్వాత జీఎం మళ్లీ తన వాటాలు తిరిగి కొనుగోలు చేసింది. జీఎం గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో ఉత్పత్తి నిలిపివేయడంతో ఆ ప్లాంటు కొనుగోలు చేసేందుకు ఎస్ఏఐసీ ఆసక్తి కనపర్చింది. అయితే, లాంఛనంగా ఇంకా ఒప్పందం కుదుర్చుకోలేదు. -
ఐదేళ్ల తర్వాత కూడా టీసీఎస్....
న్యూఢిల్లీ : టాప్-3 ప్రపంచ ఐటీ బ్రాండ్సులో చోటు దక్కించుకున్న ఐటీ దిగ్గజం టీసీఎస్ దేశీయ మార్కెట్లో తన లీడర్ షిప్ పొజిటిష్పై పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తోంది. ఐదేళ్ల తర్వాత కూడా కంపెనీ మరింత స్ట్రాంగ్ గానే మారుతుందని టీసీఎస్ కొత్త సీఈవో రాజేష్ గోపినాథన్ భరోసా వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగంలో సాంకేతికను అందిపుచ్చుకోవడంతో తాము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఇండియాలో తామెప్పుడూ లీడర్లమేనని రాజేష్ గోపినాథన్ పేర్కొన్నారు. మరే ఇతర ఐటీ కంపెనీలకు రాని రెవెన్యూలను తమకు వస్తున్నాయని, రెవెన్యూల్లో తామే అతిపెద్ద షేర్‌ను ఆర్జిస్తున్నట్టు తెలిపారు. ముంబాయి ప్రధాన కార్యలయంగా నడుస్తున్న ఈ కంపెనీ పొందే 6 శాతం గ్లోబల్ రెవెన్యూలో ఎక్కువ శాతం ఇండియా నుంచే వస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల తర్వాత కూడా టీసీఎస్ ప్రస్తుతమున్న దానికంటే మరింత స్ట్రాంగ్‌గానే మారుతుందని గోపినాథ్ తన విజన్‌ను వివరించారు. దేశంలో డిజిటల్ సదుపాయాలను మరింత విస్తరించడానికే కంపెనీ ముందంజలో ఉంటుందని చెప్పారు. కంపెనీ ముందున్న అతిపెద్ద సవాళ్లలో డిజిటల్ ఒకటని పేర్కొన్నారు. -
దుమ్ము రేపుతున్న చైనా టపాసులు
-
దుమ్ము రేపుతున్న చైనా టపాసులు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న చైనా టపాసులను దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినా వాటి దిగుమతులపై మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. పాకిస్తాన్‌కు అండగా ఉంటుందన్న కోపంతో చైనా అన్ని ఉత్పత్తులను దేశంలో బహిష్కరించాలంటూ సోషల్ మీడియా గత నెల నుంచి చేస్తున్న విస్తృత ప్రచారం కూడా ఈ టపాసుల దిగుమతులను మాత్రం అరికట్టలేకపోతుంది. దేశంలో ఏడాదికి 3,750 కోట్ల రూపాయల టపాసుల వ్యాపారం కొనసాగుతుండగా, అందులో చైనా టపాసులే 2,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసుకుంటున్నాయంటే అక్రమంగా వాటి దిగుమతులు ఏ స్థాయిలో సాగుతున్నాయో తెలిసిపోతోంది. చైనా టపాసులను కాల్చడం వల్ల వాతావరణంలోకి అధిక మొత్తంలో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని, వీటి వల్ల ప్రజలకు శ్వాసకోశ, ఊపిరితిత్తుల జబ్బులు సంక్రమిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలోని వివిధ రాష్ట్రాలు చైనా టపాసుల దిగుమతులపై నిషేధం విధించాయి. ముఖ్యంగా అధిక కాలుష్యంతో బాధపడుతున్న ఢిల్లీ నగరం ఈ సారి చైనా దిగుమతులను అరికట్టేందుకు 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఢిల్లీతోపాటు ముంబై, చెన్నై, లూధియానా నగరాల గుండా దేశవ్యాప్తంగా చైనా టపాసులు రవాణా అవుతున్నాయి. దీపావళిని దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో జరిపిన దాడుల్లో 11 కోట్ల రూపాయల చైనా టపాసులను, ఈ ఏడాది మొత్తంగా 20 కోట్ల రూపాయల టపాసులను స్వాధీనం చేసుకున్నామని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వర్గాలు తెలియజేశాయి. ఏడాదికి రెండువేల కోట్ల రూపాయల చైనా టపాసుల వ్యాపారం జరుగుతుండగా, అందులో పట్టుకున్నది ఏ పాటిదని తమిళనాడు ఫైర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జీ అరిబూబెన్ వ్యాఖ్యానించారు. క్రీడా వస్తువులు, ఫర్నీచర్, పిల్లల ఆటబొమ్మలు, కాఫీ మగ్గుల కంటేనర్లలో చైనా టపాసులు దిగుమతి అవుతున్నాయని ఆయన అన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా సిండికేట్లు పని చేస్తున్నాయని ఆరోపించారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టపాసులను దేశీయ మార్కెట్లో విక్రయించడం వల్ల 500 శాతం లాభాలు వస్తుండడంతో వీటి అక్రమ దిగుమతికి దేశానికి చెందిన వ్యాపారులు ఎగబడుతున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని అస్సాం ఫైర్ వర్క్స్ వ్యాపారి తెలిపారు. చైనా టపాసుల్లో నాసిరకం పదార్థాలను వాడడం, అక్కడ చీప్ లేబర్ అందుబాటులో ఉండడం వల్ల ఆ టపాసులు తక్కువ ధరకు దొరకుతాయని ఆయన అన్నారు. వాస్తవానికి చైనా నుంచి ఈ టపాసుల అక్రమ దిగుమతి ఏడాదంతా కొనసాగుతూ ఉంటుందని, అయితే అధికారులు మాత్రం దీపావళి పండుగ సందర్భంగానే దాడులు చేస్తుండడం వల్ల పెద్ద ప్రభావం లేకుండా పోతోందని ఆయన చెప్పారు. పెళ్లిళ్లు, కొత్త సంవత్సరం వేడుకలకు ఎక్కువగా చైనా టపాసులే అందుబాటులో ఉంటున్నాయని, ఒక్క దీపావళి సమయంలో తప్పిస్తే మిగతా సమయంలో దేశీయ మార్కెట్ నుంచి ఎలాంటి పోటీ ఉండదు కనుక చైనా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోందని వివరించారు. దీపావళి పండుగ ముగిసిన తర్వాత నుంచి చైనా నుంచి దిగుమతులు ప్రారంభమవుతాయని, తనకు తెల్సినంత వరకు ఏప్రిల్ నెలలో ఎక్కువ దిగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. -
కాస్ట్లీ బైక్
-
రూ.1,999 లకే స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్ల జీవీ మొబైల్స్ కంపెనీ తన తొలి స్మార్ట్‌ఫోన్ ను అత్యంత చౌకగా గురువారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. జేఎస్పీ20 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,999 అని మొబైల్స్ కంపెనీ సీఈఓ పంకజ్ ఆనంద్ చెప్పారు. భారత్‌లో అత్యంత చౌకగా లభ్యమయ్యే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఇదేనని పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్లో 3.5 అంగుళాల స్ర్కీన్, 1 గిగా హెర్ట్స్ ప్రాసెసర్, 128 ఎంబీ ర్యామ్, 256 ఎంబీ మెమొరి, 32జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరి, 2 మెగా పిక్సెల్ కెమెరా, 1350 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ ఫోన్ ను అమెజాన్ డాట్ ఇన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని వారి కోసం కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో తమ ప్రతినిధులు ఈ ఫోన్ కొనుగోలులో సాయం చేస్తారని వివరించారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే మరికొన్ని కొత్త డివైస్‌లను రానున్న వారాల్లో అందించనున్నామని తెలిపారు.