తీవ్ర వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న చైనా టపాసులను దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినా వాటి దిగుమతులపై మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. పాకిస్తాన్‌కు అండగా ఉంటుందన్న కోపంతో చైనా అన్ని ఉత్పత్తులను దేశంలో బహిష్కరించాలంటూ సోషల్ మీడియా గత నెల నుంచి చేస్తున్న విస్తృత ప్రచారం కూడా ఈ టపాసుల దిగుమతులను మాత్రం అరికట్టలేకపోతుంది. దేశంలో ఏడాదికి 3,750 కోట్ల రూపాయల టపాసుల వ్యాపారం కొనసాగుతుండగా, అందులో చైనా టపాసులే 2,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసుకుంటున్నాయంటే అక్రమంగా వాటి దిగుమతులు ఏ స్థాయిలో సాగుతున్నాయో తెలిసిపోతోంది.