పుష్కలమైన లిక్విడిటీ, బలమైన సెంటిమెంట్ ఉన్న కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్... వర్ధమాన మార్కెట్లను అధిగమించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ ఇన్వెస్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ‘‘గత కొన్ని వారాలుగా జరుగుతున్న ర్యాలీ వల్ల కొన్ని షేర్లలో కరెక‌్షన్ జరిగే అవకాశం ఉన్నందున మార్కెట్ ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంది. అలాగే కరెక‌్షన్ అయ్యే షేర్లను మేము కొనుగోలు చేసేందుకు ఇష్టపడతాము. అలాంటి షేర్లు వచ్చే నెలల్లో అధిక అప్‌సైడ్ ర్యాలీ చేసేందుకు అవకాశం ఉంది.’’ అని మోర్గాన్ స్లాన్టీ తన నివేదికలో తెలిపింది.
మార్చి కనిష్టస్థాయి నుంచి బీఎస్‌ఈ ఇండెక్స్ 34శాతం లాభపడింది. అయితే ఏడాది ప్రాతిపాదికన 15శాతం క్షీణించింది. ఎంఎస్‌సీఐ వర్థమాన మార్కెట్ల ఇండెక్స్‌తో పోలిస్తే భారత మార్కెట్ 9.7శాతం పతనాన్ని చవిచూసింది. ఇటీవల కనిష్టస్థాయి నుంచి ఇండియా స్టాక్ మార్కెట్ ఓలటాలిటి తగ్గింది. అయితే ఇప్పటికీ ఓలటాలిటీ గరిష్టంలోనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చిలో 8.4బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్న తర్వాత మే, జూన్ నెలల్లో దేశీయ ఈక్విటీలను తిరిగి కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment