cheapest
-
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.చౌకైన రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. ఇక ఇతరర ప్రయోజనాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 30 ఉచిత SMSల సౌకర్యాన్ని కూడా ఆనందివచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. మరో మైలురాయి!ధర తగ్గిన మరో ప్లాన్ కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతోపాటు బీఎస్ఎన్ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్లలో మరొకదాని ధరను కూడా తగ్గించింది. రూ. 1999 ప్లాన్ ధరను రూ. 100 తగ్గించి ఇప్పుడు రూ. 1899కే అందిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600GB డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉన్నాయి. -
చౌకలో ఫుడ్, క్యాబ్.. ఇలా బుక్ చేసుకోండి
అందరిలోనూ రోజువారీ ఖర్చులపై ఆందోళన పెరిగిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ఆహారం, ప్రయాణాల కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే కొన్ని యాప్‌లను వినియోగించడం ద్వారా చౌకగా ఆహార, ప్రయాణ సేవలను అందుకోవచ్చు. తద్వారా ప్రతి నెలా కొంతవరకూ సొమ్ము ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి? అవి మీకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవల యష్ తివారీ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో చౌకగా ప్రయాణాన్ని అందించే క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు. విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఉచితం. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు క్యాబ్ కంపేర్(Cab Compare). ఈ ఒక్క యాప్‌లో ఓలా, ఉబెర్, ర్యాపిడోలలో మన ప్రయాణ ఛార్జీలను పరిశీలించి, మనకు చౌకగా అనిపించిన దానిని ఎన్నుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే ఐదు లక్షలకుపైగా యూజర్లు వినియోగిస్తున్నారు. పైగా దీనికి మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అదే సమయంలో ఈ యాప్.. యూజర్ల గోప్యతకు సంబంధించి అనేక భద్రతా ఫీచర్లను కూడా జోడించింది.ఇక చౌకగా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే క్రేవియో(Craveo) అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ కూడా ‘క్యాబ్ కంపేర్’ మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో మీ జొమాటో లేదా స్విగ్గీ ఖాతాను జోడించడం ద్వారా చౌకైన ఆహారం ఎక్కడ లభిస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా క్రేవియో యాప్‌ని తెరిచాక ఖాతాను జోడించే ఎంపికను పొందుతారు. దీని సాయంతో జొమాటో, స్విగ్గీలలో ఎక్కడ చౌకగా ఆహారం దొరుకుతోందో తెలుసుకోవచ్చు. మరెందుకాలస్యం? ఈ యాప్‌లను ఒకసారి వినియోగించి చూడండి. -
ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!
ఇది ప్రపంచంలోనే కారుచౌక ధరకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. అలాగని ఇదేదో మారుమూల నిరుపేద దేశంలోనిది కాదు. అగ్రరాజ్యమైన అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలోని పాంటియాక్లో ఉందిది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసుకుంటే, మరీ ఇంత చౌకా అని నోరెళ్లబెడతారు. దీని ధర కేవలం ఒక్క డాలరు మాత్రమే! అంటే, రూ.82.74 అన్నమాట. క్రిస్టఫర్ హ్యూబెల్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ ఇంటిని ఒక డాలరు కనీస ధరకు అమ్మనున్నట్లు ప్రకటన విడుదల చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ప్రకటన వెలువడిన తర్వాత చాలామంది ఈ ఇంటిని కొనుక్కోవడానికి ముందుకొస్తున్నారని హ్యూవెల్ తెలిపాడు. ఈ ఇంటిని 1956లో నిర్మించారు. ఇరవై ఏళ్ల కిందట ప్రస్తుత యజమాని ఈ ఇంటిని 10వేల డాలర్లకు (రూ.8.27 లక్షలు) కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుల పోటీ వల్ల ప్రస్తుతం ఈ ఇంటికి 40 వేల నుంచి 50 వేల డాలర్ల (రూ.33.09 లక్షల నుంచి రూ.41.36 లక్షల) వరకు ధర పలకవచ్చని హ్యూవెల్ అంచనా. (చదవండి: తోకతో రికార్డు కొట్టేసింది...) -
ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!
ఇప్పటి వరకు 'దినార్, రియాల్, ఫౌండ్, యూరో, డాలర్' వంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలను గురించి తెలుసుకుని ఉంటారు. అయితే ఈ కథనంలో ప్రపంచంలో టాప్ చీపెస్ట్ కరెన్సీలు ఏవి? ఇండియన్ కరెన్సీతో వాటికున్న వ్యత్యాసం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. చీపెస్ట్ కరెన్సీ కలిగిన టాప్ 5 దేశాలు.. 👉ఇరానియన్ రియాల్ (IRR) 👉వియత్నామీస్ డాంగ్ (VND) 👉సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) 👉లావో/లావోషియన్ కిప్ (LAK) 👉ఇండోనేషియా రుపియా (IDR) ఇరానియన్ రియాల్ (IRR) ఇరాన్ కరెన్సీ ఇరానియల్ రియాల్ అనేది ప్రపంచంలో చీపెస్ట్ కరెన్సీలలో ఒకటి. అయితే ఇదే పేరుతో ఉన్న ఒమాని రియాల్ అనేది ప్రపంచంలో ఖరీదైన కరెన్సీలలో ఒకటిగా ఉంది. ఇండియన్ ఒక్క రూపాయి 511 ఇరానియల్ రియాల్స్‌కి సమానం. కాగా ఒక అమెరికన్ డాలర్ 42,275 ఇరానియల్ రియాల్స్‌కి సమానం అని తెలుస్తోంది. ఈ దేశంలో రాజకీయ అశాంతి, వ్యాపారం, తలసరి జీడీపీ కారణంగా ఈ దేశ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది. వియత్నామీస్ డాంగ్ (VND) వియత్నాం చారిత్రాత్మకంగా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కింద పనిచేస్తోంది, అయితే ఆర్థిక వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతం తక్కువ విలువ గల కరెన్సీ కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 291 వియత్నామీస్ డాంగ్స్ భారతీయ కరెన్సీ రూపాయికి సమానం. ఒక అమెరికన్ డాలర్ 24,085 వియత్నామీస్ డాంగ్స్కి సమానం. వియాత్నం ఆర్ధిక వ్యవస్థ 2024కి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటోంది. వినాశకరమైన అంతర్యుద్ధంతో సహా పశ్చిమ ఆఫ్రికాలో కుంభకోణాలు, అవినీతి కారణంగానే ఆ దేశ కరెన్సీకి విలువ తగ్గినట్లు సమాచారం. భారత రూపాయి 238 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం, కాగా అమెరికన్ డాలర్ 19,750 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? లావో/లావోషియన్ కిప్ (LAK) 1952 నుంచి కూడా లావోషియన్ కిప్ కరెన్సీకి విలువ చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఒక ఇండియన్ రూపీ 239 లావోషియన్ క్లిప్‌లలో సమానం, ఒక అమెరికన్ డాలర్ 19,773 లావోషియన్ క్లిప్లకి సమానం కావడం విశేషం. కాగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఇది ఒకటిగా ఉంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా! ఇండోనేషియా రుపియా (IDR) గత ఏడు సంవత్సరాలుగా ఇండోనేషియా రూపాయి విలువలో ఎలాంటి మెరుగుదల లేదు. విదేశీ మారక నిల్వలు క్షీణించడం, కరెన్సీని కాపాడుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ వైఫల్యం కారణమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే భారతీయ కరెన్సీ రూపాయికి 184 ఇండోనేషియా రూపాయలకు సమానం. అదే విధంగా ఒక అమెరికన్ డాలర్ 15,225 ఇండోనేషియా రూపాయలకు సమానం. ప్రస్తుతం పారిశ్రామిక కార్యకలాపాలలో ఇండోనేషియా కొంత వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. -
కేవలం రూ. 83కే ఇండిపెండెంట్ హౌస్.. ఎక్కడంటే?
ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందో అందరికి బాగా తెలుసు. ఆఖరికి అద్దెకు ఉండాలన్నా వేలకు వేలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కేవలం రూ. 100 కంటే తక్కువ అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని ఒక ఇల్లు కేవలం ఒక డాలర్ కంటే తక్కువ (దాదాపు రూ. 83) అని తెలుస్తోంది. ఈ వార్త నిజమే అని చెబుతున్నారు. అది కూడా ఇండిపెండెంట్ హౌస్ కావడం గమనార్హం. ఇది 724 చదరపు అడుగుల విస్తీరణంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు బహుశా ఇదే అయి ఉంటుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! ఈ చీపెస్ట్ హౌస్ ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నట్లు, దీనిని 1956లో నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ ఇంటిని బాగు చేయడానికి కనీసం 25వేల నుంచి 45వేల డాలర్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని వేలం వేయనున్న జిల్లో సంస్థ పేర్కొంది. మొత్తానికి ఇల్లు ఎంత శిధిలావస్థలో ఉన్నా కేవలం రూ. 83 లభించడం చాలా అరుదైన విషయం. -
Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో, టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను దేశంలోనే అతి చవకైనదిగా కంపెనీ ప్రకటించింది ఆకట్టుకునే ప్రీమియం డిజైన్, వర్చువల్లీ క్రీజ్ ఫ్రీ ఫోల్డబుల్ మెయిన్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ భారత మార్కెట్లో రూ.88,888 ప్రారంభ ధరతో విడుదలంది. సింగిల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై పరిచయ ఆఫర్ కూడా ఉంది. స్పెషల్ డిస్కౌంట్‌తో ధర రూ.77,777 వద్ద ఏప్రిల్ 12న అందుబాటుల ఉంది. దీంతో పాటు హెచ్డీబీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రెండు సంవత్సరాల వారంటీతో పాటు, ఫాంటమ్ వీ ఫోల్డ్ రూ. 5,000 విలువైన ఉచిత ట్రాలీ బ్యాగ్, కొనుగోలు చేసిన ఆరు నెలల్లోపు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, స్టాండ్‌తో కూడిన ఉచిత ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్ లభించనుంది. ఫాంటమ్ వీఫోల్డ్కి గట్టి పోటీగా భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,998గాఉంది. ఫాంటమ్ వీఫోల్డ్స్పెసిఫికేషన్స్: 6.42-అంగుళాల LTPO, ఔటర్ AMOLED డిస్ప్లేను. ప్రాథమిక లోపలి స్క్రీన్ 2296 X 2000 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్ప్లే. ఫోన్ కంటెంట్ ఆధారంగా 120Hz రిఫ్రెష్ రేట్ వరకు వేరియబుల్తో వస్తుంది.ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్-రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని టెక్నో కంపెనీ చెప్పింది. హుడ్ కింద MediaTek ఫ్లాగ్షిప్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ఉంది. ఈ చిప్సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో లభ్యం. ట్రిపుల్ రియర్ కెమెరా 50 ఎంపీ ప్రైమరీ కెమెరా , 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50ఎంపీ 2x పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. అలాగే ఔటర్ డిస్ప్లేలో 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లేలో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాలున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ , చక్కటి ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లను పొందుపరిచింది. (బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్) కాగా టెక్నో ఇటీవల MWC 2023లో తన తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్వ వీ ఫోల్డ్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజగా కంపెనీ ఎట్టకేలకు దీనిని భారతదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫాంటమ్ వీ ఫోల్డ్ దేశంలో అత్యంత సరసమైన ఫుల్-స్క్రీన్ ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ( ఇదీ చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) -
చౌక తయారీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: చైనా, వియత్నాం దేశాలను వెనక్కి నెట్టేసి.. భారత్ ప్రపంచంలోనే అత్యంత చౌక తయారీ కేంద్రంగా అవతరించింది. ఈ విషయాన్ని యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకటించింది. మొత్తం 85 దేశాలకు గాను, మెరుగైన దేశంగా భారత్ 31వ ర్యాంకును సొంతం చేసుకుంది. వ్యాపార స్వేచ్ఛ విషయంలో 37వ స్థానాన్ని ఆక్రమించింది. తయారీ వ్యయాల పరంగా భారత్ 100 స్కోరు సాధించింది. పన్నుల పరంగా అనుకూలతలో 100కు గాను 16.2 స్కోరు లభించింది. అవినీతి రహితంలో 18.1 స్కోరు, పారదర్శక ప్రభుత్వ విధానాల విషయంలో 3.5 స్కోరు మాత్రమే సాధించింది. ఆదాయం సమానత్వంలో 1.9, భద్రతలో 4.3 శాతం స్కోరు లభించింది. -
ఒక్క రూపాయి ప్లాన్‌పై జియో యూటర్న్! కారణం ఏంటంటే..
కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే సంచలనానికి తెర లేపింది రిలయన్స్ జియో. అయితే ఒక్క రోజులోనే ఉస్సూరుమనిపిస్తూ ఆ ఆఫర్‌ను సవరించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. మంగళవారం రాత్రి దాటాక మైజియో మొబైల్ యాప్‌లో గప్‌చుప్‌గా వాల్యూ ప్లాన్ కింద ఈ ఆఫర్‌ను చేర్చింది జియో. ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటాను, 30 రోజుల వాలిడిటీతో అందించింది. అయితే 24 గంటల తర్వాత ఆ ప్లాన్ మాయమైంది. దాని ప్లేస్‌లో 1రూ. రీచార్జ్‌తో కేవలం 10 ఎంబీ.. అదీ ఒక్కరోజూ వాలిడిటీతో సవరించింది. దీంతో చాలామంది రిలయన్స్ జియో ప్రకటన వార్తలను ఫేక్‌గా భావించారు. అయితే జియో ఈ ప్యాక్‌ను ఆఫర్ చేసిన విషయం వందకు వంద శాతం వాస్తవం. ప్యాక్ ఎందుకు సవరించారనే దానిపై రిలయన్స్ జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తోటి టెలికామ్ సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలే జియో వెనక్కి తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ(జియో)తో సహా టారిఫ్‌లను పెంచేశాయి. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకున్నాయి కూడా. అయితే ఏ టెలికాం సంస్థ కూడా ఇంత చీప్‌గా డేటా ప్యాక్‌ను ఆఫర్ చేయట్లేదన్న విషయాన్ని సైతం టెలికాం రెగ్యులేటరీ బాడీ ‘ట్రాయ్’ జియో మేనేజ్మెంట్ వద్ద లేవనెత్తినట్లు ట్రాయ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో జియో తన చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్‌ను సైలెంట్‌గా మార్చేసింది. అయితే ఆ సమయానికి ఎవరైతే 1రూ. 100 ఎంబీ ప్యాక్‌కు రీఛార్జ్ చేశారో వాళ్లకు మాత్రం ప్లాన్‌ను వర్తింపజేస్తూ జియో ఊరట ఇచ్చింది. చదవండి: జియో యూజర్లకు 20 శాతం క్యాష్‌బ్యాక్! ఎలాగంటే.. -
రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతి చౌక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్ఐ కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు. అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డిఎస్జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్ఐ స్కాన్‌కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్‌ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్ఐ యంత్రాలు చొప్పున ఉన్నట్టు ప్రకటించారు. After a low-cost dispensary, Gurudwara Bangla Sahib is now slated to open a cheap diagnostic facility. An ultrasound will cost Rs. 150 & an MRI Scan Rs. 50! 🙏 pic.twitter.com/oZLKQblUTa — Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 5, 2020 -
రెమ్‌డెసివిర్ : చౌక మందు లాంచ్
సాక్షి,ముంబై: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ కాడిలా లిమిటెడ్ అతి తక్కువ ధరలో ఔషధాన్ని తీసుకొచ్చింది. గిలియడ్ సైన్సెస్ యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది. 100 ఎంజీ ఇంజక్షన్ ధరను సుమారు 2,800 రూపాయలు (37.44డాలర్లు)గా ధర నిర్ణయించింది. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రెమ్‌డాక్ బ్రాండ్ పేరుతో దీన్ని విక్రయించనున్నామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్, సిప్లా, మైలాన్ ఎన్ వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తరువాత యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసిన ఐదవ సంస్థగా జైడస్ నిలిచింది. అలాగే భారతదేశంతో సహా 127 దేశాలలోరెమ్డెసివిర్ పంపిణికి డాక్టర్ రెడ్డీస్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో గిలియడ్ లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా దేశంలో వైరస్ బారిన పడిన మొత్తం కేసుల సంఖ్య 2.33 మిలియన్లను దాటగా, మరణించిన వారి సంఖ్య 46,091 గా ఉంది. -
అతి చవకైన స్మార్ట్ టీవీ లాంచ్
న్యూడిల్లీ: మితాషి కంపెనీ అతి చవకైన స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. తన పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా కొత్త ఉత్ప్త్తులను మార్కెట్లో పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో 32, 39 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీలకు వినియోగదారులకు భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధరను రూ. 22,990గాను, 39 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీధరను రూ. 39,990గా ను నిర్ణయించింది. ఇవి రెండూ ఆన్లైన్ రీటైలర్ అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించనున్నాయి. అమెజాన్ లో ప్రత్యేక ఆఫర్లో రూ. 20,990, రూ. 34,990 ధరలకే విక్రయిస్తోంది. అలాగే దేశీయంగా ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉన్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మూడు సంత్సరాల వ్యారెంటీ కూడా అందిస్తోంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే...ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, కర్వ్డ్ స్క్రీన్ డైనమిక్ కాంట్రాస్ట్ నిష్పత్తి 300000: 1. 1గిగాహెర్ట్స్ కోర్టెక్స్ఏ7 ప్రాసెసర్ విత్ మాలి 400 x 2 జీపీయూ . 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ , మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్ ద్వారా దీన్ని విస్తరించుకునే సదుపాయం కూడా. ఇంకా ఫేస్బుక్, స్కైప్ ఇతర యాప్‌లు ప్రీలోడెడ్ విత్ డబుల్ స్పీకర్స్. వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్పీ, ఈథర్నెట్ కనెక్టివిటీ సదుపాయం. సరసమైన ధరల్లో ప్రపంచ టెక్నాలజీని అందించడమే తమ లక్ష్యమని మితాషి ఎడ్యూటైన్మెంట్ చైర్మన్, ఎండీ, రాకేష్ దుగర్ తెలిపారు. కర్వ్డ్ స్మార్ట్ ఎల్ఈడీ సిరీస్‌లో తొలి టీవీలను లాంచ్ చేసినట్టు చెప్పారు. -
భారత్ లో అదే అత్యంత చౌక నగరం!
కోల్ కతాః ప్రవాసితులు నివసించేందుకు వీలుగా, ఇండియలోని మిగిలిన నగరాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ఒకప్పుడు సామాన్యులు సైతం బతికేందుకు వీలుగా, చౌకగా ఉండే నగరంగా పేరొందిన ముంబై ప్రస్తుతం ఆస్థానాన్ని కోల్పోయి అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయిందని సర్వేల్లో తేలింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ప్రస్తుతం కోల్ కతా అతి చౌక నగరంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో హాంకాంగ్ అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందిన కొద్ది రోజుల్లోనే ముంబైలోని అద్దెలు ఢిల్లీతో పోలిస్తే సుమారు 18 శాతం పెరిగిపోయినట్లు సర్వేలద్వారా తెలుస్తోంది. భారతదేశంలో సామాన్యులకు, ప్రవాసితులకు అందుబాటులో, తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ నిర్వహించిన సంవత్సరాంతపు సర్వేల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరు విదేశీయులకు అందుబాటులో ఉంటుందని, అతి తక్కువ ఖర్చుతో కోల్ కతాలో సామాన్యులు సైతం జీవించేందుకు వీలుందని సర్వే చెప్తోంది. మెర్సర్స్ 2016 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఖర్చు ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో టాప్ ర్యాంక్ లో నిలువగా, రెండో స్థానంలో లువాండా, అంగోలా రాజధాని మోపడం లు ఉన్నాయి. జురిచ్, సింగపూర్ లు మూడు, నాలుగు స్థానాల్లో నిలువగా, గతేడాది ఆరోస్థానంలో ఉన్న టోక్యో ఈసారి ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఎక్కువ ఖర్చుగల నగరాల్లో మొదటిస్థానాన్ని 82 వ ర్యాంకుతో ముంబై ఆక్రమించింది. ఆ తర్వాత ర్యాంకులు 130 ఢిల్లీ, 158 చెన్నై ఆక్రమించగా... కోల్ కతా 194, బెంగళూరు 180 ర్యాంకులతో తక్కువ ఖర్చుగల నగరాలుగా గుర్తింపు పొందాయి. మెర్సర్స్ సంస్థ ప్రతియేటా మార్చి నెల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పై సర్వే నిర్వహించి, మే, జూన్ ప్రాంతాల్లో ర్యాంకులను వెల్లడిస్తుంది. ఏ నగరంలోనైనా వస్తువులు మరియు సేవలు, హౌసింగ్ ఆధారంగానే జీవన వ్యయాన్ని అంచనావేస్తామని, మూడేళ్ళుగా ముంబై, ఢిల్లీకన్నా ఐదు కేటగిరీల్లో అత్యంత ఖరీదైన నగరంగా ఉంటోందని మెర్సర్ సంస్థ గ్లోబల్ మొబిలిటీలో.. ప్రిన్సిపాల్ ఇండియా ప్రాక్టీస్ లీడర్ గా పనిచేస్తున్న రుచికా పాల్ తెలిపారు.