సాక్షి,ముంబై: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ కాడిలా లిమిటెడ్ అతి తక్కువ ధరలో ఔషధాన్ని తీసుకొచ్చింది. గిలియడ్ సైన్సెస్ యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది. 100 ఎంజీ ఇంజక్షన్ ధరను సుమారు 2,800 రూపాయలు (37.44డాలర్లు)గా ధర నిర్ణయించింది. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రెమ్‌డాక్ బ్రాండ్ పేరుతో దీన్ని విక్రయించనున్నామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది.
హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్, సిప్లా, మైలాన్ ఎన్ వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తరువాత యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసిన ఐదవ సంస్థగా జైడస్ నిలిచింది. అలాగే భారతదేశంతో సహా 127 దేశాలలోరెమ్‌డెసివిర్ పంపిణికి డాక్టర్ రెడ్డీస్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో గిలియడ్ లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా దేశంలో వైరస్ బారిన పడిన మొత్తం కేసుల సంఖ్య 2.33 మిలియన్లను దాటగా, మరణించిన వారి సంఖ్య 46,091 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment