Gilead Sciences
-
రెమిడెసివిర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ, కరోనా చికిత్సలో ప్రధానమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌కు ఏర్పడిన తీవ్ర కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుండి రెమిడెసివిర్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో 4,50,000 మోతాదులను దిగుమతి చేసుకోనుంది. మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్ వయల్స్‌ను శుక్రవారం రిసీవ్ చేసుకోనుంది. దేశంలో భారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో రెమిడెసివర్ దిగుమతులపై దృష్టిపెట్టడంతో పాటు ఇప్పటికే దేశీయంగా ఈ ఔషధం ఎగుమతిని కేంద్రం నిషేధించింది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, యు ఈజిప్టు ఫార్మా మేజర్ ఇవా ఫార్మా సంస్థలనుంచి వీటిని కొనుగోలు చేయనుంది. రాబోయే ఒకటి రెండు రోజుల్లో గిలియడ్ సైన్సెస్ నుంచి భారత్‌కు 75వేల నుంచి లక్ష వయల్స్ వస్తాయని, మే 15లోగా లక్ష వయల్స్ చేరుతాయని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ తాజాగా ప్రకటించింది. వెల్లడించింది. అలాగే ఎవా ఫార్మా తొలుత పది వేల వయల్స్ దేశానికి అందించనుంది. జూలై వరకు ప్రతీ15 రోజులకొకసారి 50వేల వయల్స్‌ను వరకు మనదేశానికి పంపిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు ప్రస్తుత కొరత నేపథ్యంలో ఈ ఔషద్ ఉత్పత్తులను పెంచడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని 7 దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03 కోట్ల వయల్స్‌కు పెంచాయి. కాగా గత ఏడు రోజులలో (21-28 ఏప్రిల్) దేశవ్యాప్తంగా మొత్తం 13.73 లక్షల వయిల్స్ సరఫరా చేయగా, రోజువారీ రెమిడెసివర్ సరఫరా ఏప్రిల్ 11 న 67,900 డి ఏప్రిల్ 28 న 2.09 లక్షలకు పెరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా శుక్రవారం ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,86,452 కొత్త కోవిడ్-19 కేసులు, 3,498 మరణాలు సంభవించాయి. 2,97,540 రోగులు డిశ్చార్జ్ అయ్యారు. -
కరోనా రోగులకు రెమిడెసివిర్ ఇవ్వొద్దు: డబ్ల్యూహెచ్‌వో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో ప్రాచుర్యం పొందిన యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం సస్పెండ్ చేసింది. కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని డబ్ల్యూహెచ్‌వో తాజాగా తెలిపింది. ఆస్పత్రిలో చేరిన కోవిడ్ రోగులకు రెమిడెసివిర్ ఇవ్వొద్దని వైద్యులకు సూచించింది. ఈ ఔషధంతో రోగుల ప్రాణాలు కాపాడగలమనడానికి ఆధారాలు లేవని పేర్కొంది. కాగా ఇప్పటివరకు కోవిడ్-19 కి వ్యతిరేకంగా ఆమోదించబడిన ఏకైక చికిత్స గా రెమిడెసివిర్ ఉంది. భారతదేశంలో, రిమిడెవిర్ సరఫరాను పెంచడానికి అనేక ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. -
కోవిడ్-19 ఔషధానికి డబ్ల్యూహెచ్‌వో షాక్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సోకినవారికి విరివిగా వినియోగిస్తున్న ఔషధాలలో రెమ్‌డెసివిర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రధానంగా ఆసుపత్రులలో చేరిన రోగులలో ఈ ఔషధం ఎలాంటి గుణమూ చూపించడంలేదని డబ్ల్యూహెచ్‌వో ప్యానల్ పేర్కొంది. సాలిడారిటీ ట్రయల్స్‌లో ఈ అంశాలు బయటపడినట్లు తెలియజేసింది. రెమ్‌డెసివిర్ ఔషధ వినియోగం వల్ల మరణాల సంఖ్య తగ్గడం లేదా మెకానికల్ వెంటిలేషన్ అవసరాన్ని తగ్గించడం, త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించలేదని నివేదిక అభిప్రాయపడింది. దీంతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు ఈ ఔషధాన్ని వినియోగించవద్దంటూ సూచించింది. ఆసుపత్రులలో 28 రోజులపాటు నిర్వహించిన సాలిడారిటీ ట్రయల్స్‌లో ఈ విషయాలు గమనించినట్లు తెలియజేసింది. అమెరికాసహా 50 ప్రపంచ దేశాలలో రెమ్‌డెసివిర్ ఔషధాన్ని కోవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ప్యానల్ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్-19 చికిత్సలో ఈ ఔషధాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు సైతం వినియోగించడం గమనార్హం. గిలియడ్ ఏమంటున్నదంటే రెమ్‌డెసివిర్ ఔషధ తయారీ కంపెనీ గిలియడ్ సైన్సెస్ సాలిడారిటీ ట్రయల్స్ ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. ఈ ఔషధాన్ని ఆసుపత్రులలో చేరిన రోగుల చికిత్సలో వినియోగించేందుకు పలు జాతీయ సంస్థలు మార్గదర్శకాలను జారీ చేసినట్లు ప్రస్తావిస్తోంది. ఈ అంశాలను డబ్ల్యూహెచ్‌వో నిర్లక్ష్యం చేయడం తమను నిరాశపరచినట్లు పేర్కొంది. వెల్కూరీ బ్రాండుతో కంపెనీ రెమ్‌డెసివిర్ ఔషధాన్ని విక్రయిస్తోంది. వెల్కూరీని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు కోవిడ్-19 చికిత్సలో నమ్మకంగా వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. కోవిడ్-19 రోగుల చికిత్సలో వినియోగించేందుకు యాంటీవైరల్ ట్రీట్మెంట్కింద అనుమతులు పొందిన తొలి ఔషధం వెల్కూరీ అని తెలియజేసింది. కాగా.. రెమ్‌డెసివిర్ ఔషధ అమ్మకాలతో కనిపిస్తున్న అనిశ్చితి కారణంగా ఇటీవల కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం గమనార్హం. గ్రూప్ సమీక్ష ఇలా అంతర్జాతీయ స్థాయిలో నాలుగు ప్రాంతాల నుంచి 7,000 మందికిపైగా రోగుల పరీక్షలలో క్రోడీకరించిన డేటా ఆధారంగా రెమ్‌డెసివిర్ ఔషధంపై మార్గదర్శకాలను జారీ చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో గైడ్లైన్ డెవలప్మెంట్ గ్రూప్(జీడీజీ) ప్యానల్ వెల్లడించింది. అయితే రెమ్‌డెసివిర్ ఔషధ క్లినికల్ పరీక్షలను సమర్థించింది. కొంతమంది రోగులపై చేపట్టిన పరీక్షలలో కనిపిస్తున్న ఫలితాల కారణంగా వీటిని సమర్థిస్తున్నట్లు తెలియజేసింది. -
ఆ డ్రగ్ ప్రభావం చూపడం లేదు: డబ్ల్యూహెచ్ఓ
జెనివా: కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాలేదు. ఇతర వ్యాధుల చికిత్స కోసం వాడుతున్న కాంబినేషనల్ డ్రగ్స్‌ని ప్రస్తుతం కోవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కోవిడ్ ట్రీట్మెంట్ కోసం వాడుతున్న రెమెడిసివర్ ఔషధంతో అతి తక్కువ లేదా అసలు ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. రెమెడిసివర్ తీసుకున్న రోగులు కోలుకోవడం లేదా వారి జీవితకాలం పెరగడం వంటి ఫలితాలు కనిపించలేదని డబ్ల్యూహెచ్ఓ సర్వే తెలిపింది. కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించిన మొట్ట మొదటి యాంటీవైరల్ మందు రెమెడిసివర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చికిత్సలో భాగంగా దీన్ని కూడా ఉపయోగించారు. ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్ఓ సర్వే తెలిపిన విషయాలు కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ దేశాలలో దాదాపు 11,266 మంది కోవిడ్ రోగుల మీద రెమెడిసివర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, యాంటీ-హెచ్ఐవీ డ్రగ్ లోపినావిర్/రిటోనావిర్, ఇంటర్ఫెరాన్ల కాంబినేషన్లను ఉపయోగిస్తున్నారు. (షాకింగ్ : ఆ వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత ) ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ వీటి ప్రభావాలను అంచనా వేయడానికి సాలిడారిటీ ట్రయల్ నిర్వహించింది. దీనిలో తెలిసింది ఏంటంటే రెమెడిసివర్తో సహా మిగిలిన ఔషధాలు కోవిడ్ రోగులకు ఇచ్చే 28 రోజుల కోర్సులో అతి తక్కువ ప్రభావం లేదా అసలు ఎలాంటి ప్రభావం చూపలేదని అధ్యాయనం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో అమెరికా గిలియడ్, రెమెడిసివర్‌పై చేసిన ప్రయోగాల్లో ప్లాసిబో తీసుకునే వారితో పోలీస్తే ఈ ఔషధం తీసుకున్న కోవిడ్ రోగుల్లో.వారు కోలుకునే సమయాన్ని ఐదు రోజులకు తగ్గించినట్లు తెలిపింది. వీరు 1,062 మీద పరీక్షించారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ ఇందుకు విరుద్ధమైన అంశాలు వెల్లడించడం గమనార్హం. ఈ సందర్భంగా గిలియడ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘డబ్ల్యూహెచ్ఓ డాటా అస్థిరంగా ఉంది. పీర్-రివ్యూ జర్నల్స్‌లో ప్రచురించబడిన మల్టిపుల్ రాండమైజ్డ్, నియంత్రిత అధ్యయనాల నుంచి మరింత బలమైన సాక్ష్యాలు రెమెడిసివిర్ క్లినికల్ ప్రయోజనాన్ని ధృవీకరిస్తాయి’ అని తెలిపారు. (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!) డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ బుధవారం మాట్లాడుతూ, ‘జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో, హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినావిర్ / రిటోనావిర్ పనికిరానివని తేలింది. దాంతో వాటిని నిలిపివేశాము. అయితే 30కి పైగా దేశాల్లో 500 ఆస్పత్రుల్లో ఇతర పరీక్షలు కొనసాగుతున్నాయి’ అన్నారు. -
కరోనా: డా.రెడ్డీస్ కొత్త ఔషధం
సాక్షి, హైదరాబాద్ : కరోనా నివారణకు సంబంధించి దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ రెమ్‌డెసివిర్ కొత్త ఔషధాన్ని లాంచ్ చేసింది. కోవిడ్ -19 రోగుల చికిత్సకు గాను భారతదేశంలో 'రెడిక్స్' బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 100 మి.గ్రా పరిమాణంలో రెడిక్స్ మందును లాంచ్ చేసినట్టు పేర్కొంది. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) కరోనా రోగుల అవసరాలను తీర్చగల ఉత్పత్తుల అభివృద్ధిలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని కంపెనీ బ్రాండెడ్ మార్కెట్స్ (ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్) సీఈఓ ఎంవీ రమణ చెప్పారు. రోగులకు క్లిష్టమైన ఔషధం రెడిక్స్ ను తీసుకురావడం తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు. రెమ్‌డెసివిర్ సంస్థ గిలియడ్ సైన్సెస్ తో డా. రెడ్డీస్ చేసుకున్న లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం భారత్‌తో సహా 127 దేశాలు ఈ డ్రగ్ తయారీకి, విక్రయాలకు అనుమతి ఉంది. తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగుల చికిత్స కోసం భారతదేశంలో పరిమిత అత్యవసర ఉపయోగం కోసం రెమ్‌డెసివిర్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. -
రెమ్‌డెసివిర్ : చౌక మందు లాంచ్
సాక్షి,ముంబై: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ కాడిలా లిమిటెడ్ అతి తక్కువ ధరలో ఔషధాన్ని తీసుకొచ్చింది. గిలియడ్ సైన్సెస్ యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది. 100 ఎంజీ ఇంజక్షన్ ధరను సుమారు 2,800 రూపాయలు (37.44డాలర్లు)గా ధర నిర్ణయించింది. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రెమ్‌డాక్ బ్రాండ్ పేరుతో దీన్ని విక్రయించనున్నామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్, సిప్లా, మైలాన్ ఎన్ వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తరువాత యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జెనరిక్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసిన ఐదవ సంస్థగా జైడస్ నిలిచింది. అలాగే భారతదేశంతో సహా 127 దేశాలలోరెమ్డెసివిర్ పంపిణికి డాక్టర్ రెడ్డీస్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో గిలియడ్ లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా దేశంలో వైరస్ బారిన పడిన మొత్తం కేసుల సంఖ్య 2.33 మిలియన్లను దాటగా, మరణించిన వారి సంఖ్య 46,091 గా ఉంది. -
‘రెమ్‌డెసివిర్ ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం’
ఢిల్లీ : హెటిరో ఫార్మా తయారుచేసిన యాంటి వైరల్ రెమ్‌డెసివిర్ మందు కరోనా మరణాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో తేలిందని గిలియడ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే రెమ్‌డెసివిర్ మందుపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత రానుందని సంస్థ పేర్కొంది. తాజాగా జరిపిన విశ్లేషణలో కరోనా నుంచి కోలుకున్న 312 మంది నుంచి సమాచారం సేకరించాము. దీంతో పాటు వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న 818 మంది రోగులపై రెమ్‌డెసివిర్ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందన్నది అధ్యయనం చేసినట్లు గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. కరోనాతో బాధపడుతున్న రోగులకు 5 నుంచి 10 రోజులు పాటు రెమ్‌డెసివిర్ మందు డోజేజ్ విధానంలో అందించారని దాని వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదని అధ్యయనంలో తేలింది..కానీ ప్లేసిబో తో రెమ్‌డెసివిర్‌ను పోల్చిచూడలేదని స్పష్టం చేసింది. (వికృత చర్య : మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది) రెమ్‌డెసివిర్ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల్లో 74.4 శాతం మంది 14 రోజుల్లో కోలుకుంటున్నారని తేలింది. కాగా రెమ్‌డెసివిర్ మందుతో చికిత్స పొందిన రోగుల మరణాల రేటు 14 రోజుల్లో 7.6 శాతంగా ఉంటే.. అదే ఆ మందు తీసుకోనివారు మరణాల రేటు 12.5 శాతంగా ఉంది. గత ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ప్లేసిబో ఇచ్చిన రోగుల కంటే రెమ్‌డెసివిర్ ఇచ్చిన రోగులు 31 శాతం వేగంగా కోలుకున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే రెమ్‌డెసివిర్ మందుపై ఒక స్పష్టత వస్తుందని గిలియడ్ సంస్థ పేర్కొంది.(వ్యాక్సిన్: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!) -
వైరస్‌కు చెక్!- బ్యాంకింగ్ భేష్
ప్రధానంగా బ్యాంకింగ్ రంగ కౌంటర్లు లాభాల దుమ్ము రేపడంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు బలమొచ్చింది. మరోపక్క ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ రూపొందిస్తున్న ఔషధం మరింత ప్రభావం చూపుతున్నట్లు వెలువడిన వార్తలు కరోనా వైరస్ కట్టడికి సహకరించగలవన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా వారాంతాన డోజోన్స్ 369 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 26,075 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 33 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,185 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 70 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 10,617 వద్ద స్థిరపడింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో నాస్డాక్ ఆరుసార్లు సరికొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం! వెరసి గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ దాదాపు 2 చొప్పున బలపడగా.. నాస్డాక్ మరింత అధికంగా 4 శాతం జంప్‌చేసింది. 1500 డాలర్లకు గత నెలలో కార్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ జోరు కొనసాగుతోంది. వారాంతాన 7 శాతం జంప్‌చేసి 1503 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి 1500 డాలర్ల మార్క్‌ను తాకింది. ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ టెస్లా షేరు 259 శాతం ర్యాలీ చేయగా.. ఈ నెలలోనే 39 శాతం లాభపడటం విశేషం! ఇక వచ్చే వారం క్యూ2 ఫలితాలు విడుదల చేయనున్న బ్యాంకింగ్ దిగ్గజాలు సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్ 6.5-5.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గోల్డ్‌మన్ శాక్స్ టార్గెట్ ధరను పెంచడంతో నెట్‌ఫ్లిక్స్ 8 శాతం దూసుకెళ్లింది. దశలవారీగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించడంతో క్రూయిజ్‌ల కంపెనీ కార్నివాల్ కార్ప్ దాదాపు 11 శాతం పురోగమించింది. ఈ బాటలో యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్లు సైతం 5.5 శాతం చొప్పున ఎగశాయి. ఫార్మా ప్లస్ కోవిడ్-19 రోగులపై క్లినికల్ పరీక్షలలో రెమ్‌డెసివిర్ మరింత ప్రభావం చూపుతున్న వార్తలతో గిలియడ్ సైన్సెస్ షేరు 2.2 శాతం లాభపడింది. డిసెంబర్‌కల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ సిద్ధంకావచ్చని వెల్లడించిన నేపథ్యంలో బయోఎన్‌టెక్ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసింది. -
కోవిడ్‌పై కొత్త ఆయుధం!
వాషింగ్టన్: కోవిడ్ చికిత్సకు వాడుతున్న రెమిడెస్విర్ మందు రూపురేఖలు మార్చేందుకు అమెరికన్ కంపెనీ గిలియాడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నాడుల్లోకి నేరుగా ఎక్కించడం కాకుండా నెబ్యులైజర్ సాయంతో ఊపిరి ద్వారా శరీరాలోకి ప్రవేశించేలా చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. తద్వారా రెమిడెస్‌విర్‌ను ఆసుపత్రుల్లోనే అందించాల్సిన అవసరం తప్పిపోతుంది. కోవిడ్–19 చికిత్సకు ప్రస్తుతానికి ఏ మందు అందుబాటులో లేని నేపథ్యంలో ఎబోలా వైరస్ చికిత్సకు ఉపయోగించిన రెమిడెస్విర్, జలుబు కోసం తయారైన ఫావిపిరవిర్‌లను ప్రయోగాత్మకంగా వాడుతున్న విషయం తెలిసిందే. తీవ్రస్థాయి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో రెమిడెస్‌విర్‌ను ఇవ్వాలన్నది ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి. ఆస్తమా లక్షణాలను మందగింప జేసేందుకు వాడే నెబ్యులైజర్ ద్వారా రెమిడెస్‌విర్‌ను అందించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పద్ధతిలో ఇచ్చే మందు సక్రమంగా పనిచేస్తుందా? ఆశించిన ఫలితాలు ఇస్తుందా? లేదా? అన్నది పరిశీలిచేందుకు గిలియాడ్ తొలిదశ ప్రయోగాలు మొదలుపెట్టింది. సుమారు 60 మంది రోగులకు కొత్త పద్ధతిలో మందు అందించి పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చేరాల్సినంత స్థాయిలో అనారోగ్యం లేనివారిపై జరిగే ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతానికే నేరుగా మందు వెళుతుందని తద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు గిలియాడ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెర్దాడ్ పార్సే తెలిపారు. -
కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నామని సోమవారం ప్రకటించింది. (రెమ్‌డెసివిర్ : మైలాన్‌కు అనుమతి) దేశంలో వినియోగానికి ‘డెస్రెం’ పేరుతో ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు మైలాన్ తెలిపింది. గిలియడ్ సైన్సెస్ కుచెందిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు 4,800 రూపాయలు (64.31డాలర్లు) చొప్పున ఈ నెలలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ‘డెస్రెం’ పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్) కాగా సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సిప్లాకు చెందిన సిప్రెమిని 5,000 రూపాయల కన్నా తక్కువ ధరకే అందివ్వనుండగా, హెటెరో కోవిఫోర్ ఔషధం ధరను 5,400 రూపాయలకు నిర్ణయించింది. మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ప్రపంచంలోని కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో మూడవ స్థానంలో ఉన్న ఇండియాలో సోమవారం నాటికి 697,413 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మరణించిన వారి సంఖ్య 20వేలకు చేరువలో ఉంది. -
రెమ్‌డెసివిర్ : మైలాన్‌కు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ తయారీ, మార్కెట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ మేజర్ మైలాన్ లాబ్స్‌కు అనుమతి లభించింది. అమెరికా పార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్‌కు చెందిన ఈ ఔధషం తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మైలాన్‌కు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (కరోనా టీకా: మరో కీలక అడుగు) కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు అత్యవసర వినియోగానికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ తయారీకి, మార్కెటింగ్‌కు మైలాన్‌కు అవకాశం దక్కింది. తాజా అనుమతితో ఔషధ తయారీకి మైలాన్ శరవేగంగా సన్నద్ధమవుతోంది. దీంతో దేశంలో మూడు కంపెనీలకు ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని తయారు చేసి విక్రయించే అధికారం లభించింది. మిగతా రెండు కంపెనీలు హెటిరో, సిప్లా. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్) కాగా గిలియడ్ సైన్సెస్ యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ మార్కెటింగ్‌కు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి పంపిణీ చేయడానికి మైలాన్‌తో పాటు సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో, బీఆర్డీ అనే ఐదు ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
కరోనా: రెమ్‌డెసివిర్ మొత్తం మాకే!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా రెమ్‌డెసివిర్ మందుపై గుత్తాధిపత్యానికి రంగం సిద్ధం చేస్తోంది. కోవిడ్–19 చికిత్సకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఈ మందును భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికన్ కంపెనీ గిలియాడ్ ఉత్పత్తి చేస్తున్న రెమ్‌డెసివిర్ సుమారు ఐదు లక్షల డోసులకు ఆర్డర్లు ఇచ్చేసింది. అమెరికా ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ఇతర దేశాలకు కీలకమైన మందు లభించదని లివర్‌పూల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ హిల్ తెలిపారు. గతంలో ఎబోలా వైరస్ చికిత్స కోసం అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్ కోవిడ్–19 చికిత్సకు కొంతమేరకు ఉపయోగపడుతుందని, తీవ్ర లక్షణాలు ఉన్న వారు కొంచెం వేగంగా కోలుకునేలా చేస్తుందని ఇటీవలే స్పష్టమైంది. గిలియాడ్ గతంలో సుమారు 1.40 లక్షల డోసులను పరీక్షల కోసమని పలుదేశాలకు పంపిణీ చేసింది. ఈ డోసులన్నింటినీ ఇప్పటికే వాడేశారు. ఈ నేపథ్యంలో గిలియాడ్ జూలై నెల మొత్తమ్మీద ఉత్పత్తి చేసే డోసులతోపాటు ఆగస్టు, సెప్టెంబరు నెలల ఉత్పత్తిలో 90 శాతం వరకూ ఉండే ఐదు లక్షల డోసుల రెమ్‌డెసివిర్ మందును అమెరికా కొనుగోలు చేయడం గమనార్హం. ‘‘అమెరికన్లకు రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉండేలా చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గిలియాడ్తో అద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు’’ అని అమెరికా వైద్యశాఖ మంత్రి అలెక్స్ అజార్ తెలిపారు. కోవిడ్–19 చికిత్స కోసంరెమ్డెసివిర్ డోసులు కనీసం ఆరు తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఖరీదు దాదాపు రూ.2.5 లక్షల వరకూ ఉంటుందని అంచనా. పేటెంట్ హక్కులున్న కారణంగా లైసెన్సు పొందిన కంపెనీలు మాత్రమే ఈ మందును తయారు చేయగలవు. -
కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్
వాష్టింగ్టన్ : కరోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఔషధ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ కు చెందిన రెమ్డిసివిర్ ఔషధాన్ని మొత్తం కొనుగోలు చేసింది. మూడునెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్న మొత్తం మందును అమెరికా సొంతం చేసుకుంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.(కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక) ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కావాల్సిన రెమ్డిసివిర్ ఔషధాన్ని తమకే విక్రయించాల్సిందిగా డోనాల్డ్ ట్రంప్ సర్కార్ అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకుందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజార్ ప్రకటించారు. సుమారు 5లక్షలకు పైగా డోస్‌ల కొనుగోలుకు గిలియడ్‌తో డీల్ కుదిరినట్టు చెప్పారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో తయారయ్యే 90 శాతం రెమిడిసివిర్ ఔషధం అమెరికాకు దక్కనుందన్నారు. తద్వారా అమెరికాలో అవసరమైన ప్రతీ కరోనా రోగికి ఈ ఔషధం అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారినుంచి అమెరికా ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆజార్ వెల్లడించారు. కాగా కోవిడ్-19 చికిత్సకు గాను అమెరికాలో లైసెన్సింగ్ అధికారులు ఆమోదించిన మొట్టమొదటి ఔషధం రెమ్‌డెసివిర్. చదవండి : కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు -
యూరోప్‌లో గిలియడ్‌కు గ్రీన్‌సిగ్నల్
కోవిడ్-19 పేషంట్లకు వినియోగించేందుకు వీలుగా రెమ్‌డెసివిర్ ఔషధానికి యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యూఎస్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్స్ రూపొందించిన ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని వ్యాధి తీవ్రతతో ఇబ్బందిపడుతున్న రోగులకు మాత్రమే వినియోగించేందుకు యూరోపియన్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఓకే చెప్పింది. తద్వారా కోవిడ్-19 చికిత్సకు యూరోపియన్ యూనియన్‌లో తొలిసారిగా ఔషధ వినియోగానికి అధికారిక ఆమోదం లభించినట్లయ్యిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో కోవిడ్-19 బారినపడి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేషంట్లకు రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ అనుమతించింది. అత్యవసరమైతేనే కోవిడ్-19 సోకడంతో న్యుమోనియో తలెత్తి ఆక్సిజన్ అవసరమైన పేషంట్లకు మాత్రమే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని వినియోగించాలని ఈయూ రెగ్యులేటరీ స్ఫష్టం చేసింది. అదికూడా 12 ఏళ్ల వయసుపైబడిన వారికి మాత్రమే వినియోగించేందుకు పర్మిషన్ ఇచ్చింది. తద్వారా పలు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. కరోనా వైరస్ సోకి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర ప్రాతిపదికన రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు గత నెలలో యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ సైతం అనుమతించిన విషయం విదితమే. ఆరోగ్యం క్షీణిస్తున్న పేషంట్లలో మాత్రమే ఈ ఔషధం ఫలితాలనిస్తున్నట్లు తొలి అధ్యయనాల్లో వెల్లడైనట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి దశ రోగుల్లో ప్రభావం అంతంతమాత్రమేనని వివరించాయి. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ పరీక్షలలో ఉన్నట్లు తెలియజేశాయి. దేశీయంగా రెమ్‌డెసివిర్ ఔషధానికి పలు ఫార్మా కంపెనీలు నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్స్‌లను పొందాయి. జాబితాలో దేశీ ఫార్మా దిగ్గజాలు సిప్లా, హెటెరో ల్యాబ్స్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ జైడస్ కేడిలా ఉన్నాయి. ఈ బాటలో ఇటీవల సుమారు 127 దేశాలలో ఈ ఔషధ మార్కెటింగ్ కోసం డాక్టర్ రెడ్డీస్ సైతం లైసెన్స్‌ను పొందింది. -
సిప్లా- ఆర్ఐఎల్.. రికార్డుల హోరు
సెంటిమెంటు బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా జంప్ చేసింది. 35,211ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 158 పాయింట్లు బలపడి 35,890 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఓవైపు ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, మరోపక్క ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. వివరాలు చూద్దాం.. సిప్లా లిమిటెడ్ కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ప్రయోగాత్మక ఔషధం రెమ్డిసివిర్ తయారీ, విక్రయాలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ నుంచి అనుమతి లభించినట్లు సిప్లా లిమిటెడ్ పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 692ను అధిగమించడం ద్వారా రికార్డ్ గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 665 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ రూపొందించిన రెమ్‌డెసివిర్‌కు జనరిక్ ఔషధ తయారీ, విక్రయాలకు అనుమతి లభించినట్లు సిప్లా పేర్కొంది. సెప్రెమీ పేరుతో ఈ ఔషధాన్ని అత్యవసర ప్రాతిపదికన మాత్రమే వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలియజేసింది. అమెరికాలో కరోనా వైరస్ సోకిన రోగులకు అత్యవసర చికిత్స నిమిత్తం రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ అనుమతిని గిలియడ్ పొందింది. ఈ ఔషధానికి గిలియడ్ నుంచి నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్స్‌ను సిప్లా గత నెలలోనే సంపాదించిన విషయం విదితమే. రిలయన్స్ జోరు డిజిటల్, టెలికం అనుబంధ విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ సంస్థలపెట్టుబడులు వెల్లువెత్తిన నేపథ్యంలో జోరందుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత 2.6 శాతం ఎగసి రూ. 1804ను అధిగమించింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ప్రస్తుతం 0.5 శాతం లాభంతో రూ. 1768 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ షేరు 104 శాతం దూసుకెళ్లింది. మార్చి 23న ఈ షేరు రూ. 884 వద్ద కనిష్టానికి చేరాక ర్యాలీ బాట పట్టింది. గత మూడు రోజుల్లోనే ఆర్ఐఎల్ షేరు 12 శాతం ర్యాలీ చేసింది. తద్వారా తాజాగా రూ. 11 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది. దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక కంపెనీ 150 బిలియన్ డాలర్ల విలువను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం! -
రెమ్‌డెసివిర్: డా. రెడ్డీస్ కీలక ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వైరస్ కట్టడికి ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లుగా భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ తయారీ, మార్కెటింగ్‌కి సంబంధించి భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గిలియడ్‌తో నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందంపై డా. రెడ్డీస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ సహా 127 దేశాల్లో రెమ్‌డెసివిర్ రిజిస్ట్రేషన్, తయారీ, మార్కెటింగ్ చేసే వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని గిలియడ్ సైన్సెస్ డా. రెడ్డీస్‌కు అందిస్తుంది. కాగా దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, బయోకాన్ ఆర్మ్ సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జైడస్ కాడిలా లిమిటెడ్, ఈజిప్టుకు చెందిన ఇవా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వంటి మరో నాలుగు సంస్థలతో తయారీ లైసెన్సు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గిలియడ్ సైన్సెస్ తెలిపింది. అమెరికా, ఇండియా సహా మరికొన్ని దేశాల్లో కోవిడ్ -19 చికిత్సలో ప్రయోగత్మక ఔషధంగా భావిస్తున్న రెమ్డిసివిర్.. అత్యవసర వినియోగ అధికారాన్ని (ఇయుఎ) పొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.(అమెరికన్ సంస్థతో జొమాటో ఒప్పందం..) ఇదిలా ఉండగా.. దేశీయంగా సిప్లా లిమిటెడ్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్, మైలాన్ సంస్థలో ఇప్పటికే గిలియడ్ సంబంధిత భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. పాకిస్తాన్‌కు చెందిన ఫిరోజాన్స్ లాబొరేటరీస్‌తో సహా మొత్తం మొత్తం తొమ్మిది కంపెనీలతో ఈ డ్రగ్ తయారీ ఒప్పందాలను చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 127 దేశాలలో పంపిణీ కోసం రెమ్‌డెసివిర్‌ను తయారు చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ఉత్పత్తిని మరింత త్వరగా పెంచడానికి , వారి ఉత్పత్తులకు వారి సొంత ధరలను నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది. -
రెండు ఫార్మా దిగ్గజాలు విలీనం!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిరోధానికి వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో ముందు వరుసలో వున్న రెండు ఫార్మా దిగ్గజ కంపెనీలు విలీనం కాబోతున్నాయనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఔషధ తయారీలో దిగ్గజ కంపెనీలు, ప్రత్యర్థుల అయిన అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్, బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా విలీన చర్చల్లో ఉన్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా, గిలియడ్ కంపెనీని సంప్రదించిందని విశ్వనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు చేసింది. అయితే ఈ అంచనాపై గిలియడ్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తిరస్కరించారు. ఇది ఇలా ఉంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని, ఆక్స్ఫర్డ్ ప్రయోగ పరీక్షల ఫలితాలు వచ్చేసరికే 200 కోట్ల డోసులను పంపిణీకి సిద్ధంగా ఉంచాలనేది తమ లక్ష్యమని ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియట్ ప్రకటించారు. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోివిడ్-19 ప్రయోగాత్మక వ్యాక్సిన్ (ఏజెడ్‌డీ1222)ను సెప్టెంబరుకల్లా 200కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామన్నారు. (కరోనా: రెమ్డిసివిర్ వాడేందుకు భారత్ అంగీకారం) కాగా గిలియడ్, ఆస్ట్రాజెనెకా ఇంకా అనేక ఇతర ఔషధ తయారీదారులు వ్యాక్యిన్ రూపకల్పనలో తలమునకలై వున్నాయి. ఎలీ లిల్లీ అండ్ కో, ఫైజర్, మెర్క్ అండ్ కో తదితర కంపెనీలు కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి పోటీ పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రస్తుతం 100కి పైగా ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. మరోవైపు గిలియడ్ యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌ను దేశంలో మార్కెటింగ్ చేసుకునేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
కరోనా: ఎమర్జెన్సీ డ్రగ్‌కు భారత్ అంగీకారం
న్యూఢిల్లీ: మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేని కరోనాను నివారించడం ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు కోవిడ్‌ను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తయారు చేయడంలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కరోనా రోగులకు అత్యవసర పరిస్థితిలో రెమ్డిసివిర్ ఔషధాన్ని వాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. "ఎమర్జెన్సీ సమయాల్లో ఈ ఔషధాన్ని వినియోగించేందుకు జూన్ 1న అనుమతులిచ్చాం. అయితే ఐదు డోసులు మాత్రమే ఇవ్వాలి" అని డ్రగ్స్ కంట్రోలర్ జెనరల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ మందు మొదటి క్లినికల్ ట్రయల్స్‌లోనే కోవిడ్ పేషెంట్లపై మెరుగైన ప్రభావం చూపినట్లు తేలింది. దీంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీని వినియోగానికి గత నెలలోనే ఆమోదం తెలిపింది. (విస్తృత ప్రయోగ దశకు కరోనా టీకా) అయితే అత్యవసర సమయంలోనే దీన్ని వినియోగించాలని పేర్కొంది. అటు జపాన్ ప్రభుత్వం కూడా అత్యవసర ప్రాతిపదికన కోవిడ్-19 బారినపడిన వారి చికిత్సకు వినియోగిస్తోంది. యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ ఇటీవల దేశీ ఫార్మా రంగ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్‌తో నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాలను చేసుకుంది. ఫలితంగా ఈ కంపెనీలు రెమ్డిసివిర్ను దేశీయంగా తయారు చేసి అందుబాటులోకి తేనుంది. ఇదిలా వుండగా మంగళవారం నాటికి దేశంలో 1,98,706 కరోనా కేసులు నమోదయ్యాయి. (దేశీ వినియోగానికి రెమ్‌డెసివిర్ ఔషధం!) -
రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్‌కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే అమెరికా, జపాన్‌లో ప్రత్యేక అనుమతిని పొందిన ఈ సంస్థ తాజాగా తన మందును భారత్‌లో కూడా విక్రయించాలనుకుంటోంది. భారత్‌లో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కోవిడ్-19 చికిత్సలో సమర్ధవంతంగా పని చేస్తుందని గిలియడ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెమెడిసివిర్ మార్కెటింగ్ అధికారాన్ని కోరుతూ కేంద్ర ప్రామాణిక ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ)కు గిలియడ్ దరఖాస్తు చేసింది. రెమెడిసివిర్ ప్రీ-క్లినికల్, క్లినికల్ అధ్యయనాల పూర్తి డేటా తమ వద్ద ఉందని, దీన్ని పరిశీలించి, సంబంధిత అనుమతులు మంజూరు చేయాలని రెమెడిసివిర్ పేటెంట్దారు అయిన గిలియడ్ కోరినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీడీఎస్ సీఓ నిపుణుల కమిటీ సహాయంతో దీన్ని పరిశీలించనుంది. ఈ సిఫారసుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని సంస్థ అధికారి వెల్లడించినట్టు సమాచారం. (అక్టోబరు చివరకు కరోనా వ్యాక్సిన్ : ఫైజర్) రెండు భారతీయ ఔషధ సంస్థలు సిప్లా, హెటెరో ల్యాబ్స్ భారతదేశంలో రెమిడెసివిర్ తయారీ, అమ్మకాలకు అనుమతి కోరుతూ డ్రగ్ రెగ్యులేటర్‌కు ఇటీవల దరఖాస్తు చేశాయి. అంతేకాకుండా రెమెడిసివిర్ క్లినికల్ ట్రయల్స్ రద్దు చేయాలని, తద్వారా రోగులకు వేగంగా అందుబాటులోకి తేవాలని కోరాయి. అయితే ఈ దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయని నియంత్రణ సంస్థ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు రెమిడెసివిర్ తయారీ, పంపిణీకిగాను సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ హెటెరోతో సహా కొన్ని దేశీయ ఫార్మా సంస్థలతో గిలియడ్ ప్రత్యేకమైన లైసెన్సింగ్ ఒప్పందాలను ఇప్పటికే కుదుర్చుకుంది. యుఎస్ క్లినికల్ డేటా ఆధారంగా , జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ డ్రగ్ వినియోగానికి మే 7న ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా 2019 న్యూ డ్రగ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పరిస్థితులలో క్లినికల్ ట్రయల్స్‌ను రద్దు చేయడంతోపాటు రెమిడెసివిర్ వినియోగానికి అనుమతి లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా వైరస్ రోగులలో రెమెడిసివిర్ మందు ఇచ్చినప్పుడు ఇద్దరిలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. అటు ఆసుపత్రిలో చేరిన రోగులకు రెమెడిసివిర్ వినియోగించాలని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూఎస్ ఎఫ్‌డీఏ) ఇయుఎ జారీ చేసిన సంగతి తెలిసిందే.