సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో ప్రాచుర్యం పొందిన యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం సస్పెండ్ చేసింది. కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని డబ్ల్యూహెచ్‌వో తాజాగా తెలిపింది. ఆస్పత్రిలో చేరిన కోవిడ్ రోగులకు రెమిడెసివిర్ ఇవ్వొద్దని వైద్యులకు సూచించింది. ఈ ఔషధంతో రోగుల ప్రాణాలు కాపాడగలమనడానికి ఆధారాలు లేవని పేర్కొంది.
కాగా ఇప్పటివరకు కోవిడ్-19 కి వ్యతిరేకంగా ఆమోదించబడిన ఏకైక చికిత్స గా రెమిడెసివిర్ ఉంది. భారతదేశంలో, రిమిడెవిర్ సరఫరాను పెంచడానికి అనేక ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment