ఢిల్లీ : హెటిరో ఫార్మా తయారుచేసిన యాంటి వైరల్ రెమ్‌డెసివిర్ మందు కరోనా మరణాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో తేలిందని గిలియడ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే రెమ్‌డెసివిర్ మందుపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత రానుందని సంస్థ పేర్కొంది.
తాజాగా జరిపిన విశ్లేషణలో కరోనా నుంచి కోలుకున్న 312 మంది నుంచి సమాచారం సేకరించాము. దీంతో పాటు వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న 818 మంది రోగులపై రెమ్‌డెసివిర్ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందన్నది అధ్యయనం చేసినట్లు గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. కరోనాతో బాధపడుతున్న రోగులకు 5 నుంచి 10 రోజులు పాటు రెమ్‌డెసివిర్ మందు డోజేజ్ విధానంలో అందించారని దాని వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదని అధ్యయనంలో తేలింది..కానీ ప్లేసిబో తో రెమ్‌డెసివిర్‌ను పోల్చిచూడలేదని స్పష్టం చేసింది. (వికృత చర్య : మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది)
రెమ్‌డెసివిర్ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల్లో 74.4 శాతం మంది 14 రోజుల్లో కోలుకుంటున్నారని తేలింది. కాగా రెమ్‌డెసివిర్ మందుతో చికిత్స పొందిన రోగుల మరణాల రేటు 14 రోజుల్లో 7.6 శాతంగా ఉంటే.. అదే ఆ మందు తీసుకోనివారు మరణాల రేటు 12.5 శాతంగా ఉంది. గత ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ప్లేసిబో ఇచ్చిన రోగుల కంటే రెమ్‌డెసివిర్ ఇచ్చిన రోగులు 31 శాతం వేగంగా కోలుకున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే రెమ్‌డెసివిర్ మందుపై ఒక స్పష్టత వస్తుందని గిలియడ్ సంస్థ పేర్కొంది.(వ్యాక్సిన్: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!)
Comments
Please login to add a commentAdd a comment