death rate
-
Maharashtra: కరోనా మృతుల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం!
ముంబై: కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ మృతుల సంఖ్యపై ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. వివిధ ప్రభుత్వ ఆరోగ్య శాఖలు వేర్వేరు సంఖ్య వెల్లడించడంతో అయోమయ పరిస్ధితి నెలకొంది. దీంతో అసలు మృతుల సంఖ్య ఎంత.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక శాఖ 1,39,007 మంది అని వెల్లడించగా మరోశాఖ 1,48,404 అని పేర్కొంది. కరోనా మృతుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉంది. ఆ తరువాత స్ధానంలో కేరళ రాష్ట్రం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. మూడు దశల్లో వచ్చిన కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు ఏకంగా 1,39,007 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇందులో అధిక శాతం కుటుంబ పెద్ద దిక్కు, కుటుంబంకోసం సంపాదించే వారే ఉన్నారు. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలో 2020 మార్చిలో కరోనా వైరస్ విజృంభించడం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్ అమలుచేసింది. 2020 మార్చి నుంచి 2021 అక్టోబర్ వరకు రాష్ట్రంలో 1,39,007 మంది కరోనా కారణంగా మృతి చెందారని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 92,212 మంది పురుషులు, మిగతా మహిళలు, పిల్లలున్నారు. కాని సార్వజనిక ఆరోగ్య విభాగానికి చెందిన సిబ్బంది ఈ నెలలో నిర్వహించిన తాజా అ ధ్యయనంలో 1,48,404 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ రా ష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది. కరోనా కారణంగా మృతి చెందిన వారిలో పురుషుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ అందులో కుటుంబ పెద్ద దిక్కు, సంపాధించే వారే అధికంగా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి ఇద్దరిని కోల్పోయినవారున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 851 మంది పిల్లలు అనాధలయ్యారు. అప్పట్లో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తల్లిదండ్రులను కోల్పొయి ఇలా అనాధలైన పిల్లలకు సాయం చేసింది. ప్రత్యేక పథకం ద్వారా ఆనాథ పిల్లల పేరట రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసింది. వీటి ద్వారా ఈ పిల్లలకు ప్రతీ నెల రూ.1,225 సాయం అందుతుంది. అంతేగాకుండా పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా అనాథలైన ఈ పిల్లలకు 23 ఏళ్ల వయసొచ్చే సరికి బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే ముంబై అగ్రస్ధానం... ఆరోగ్య శాఖ అందించిన గణాంకాల ప్రకారం కరోనా మృతుల్లో రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాలతో పోలిస్తే ముంబై ప్రథమ స్ధానంలో ఉంది. రా్ర‹Ù్టరంలో కరోనా రోగుల సంఖ్య 81,35,620 ఉండగా అందులో ఒక్క ముంబైలోనే 11,53,951 ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా రోగులు 98.17 శాతం కోలుకోగా, మృత్యు రేషియో 1.82 ఉందని ఆరోగ్య శాఖ గుణంకాలు చెబుతున్నాయి. ‘టీకా’ చట్టపరమైన బాధ్యత కాదు... ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ప్రజలను కచ్చితంగా ప్రోత్సహిస్తుందని, అయితే టీకాలు వేయడం ప్రభుత్వాల చట్టపరమైన బాధ్యత కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. వ్యాక్సిన్ వల్ల ఎవరైనా దుష్ప్రభావాలకు లోనైతే ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మార్చి 22న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి తమ ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు ప్రజా సౌకర్యాలను ఉపయోగించకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం తరపున ఏఏజీ అమిత్ ఆనంద్ తివారీ, దీని వెనుక గొప్ప ప్రజా ప్రయోజనం ఉందని చెప్పారు. బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి, తద్వారా కరోనా ఇన్ఫెక్షన్ మరింత విస్తరించబోదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఆయన ఉదహరించారు, ఇందులో రాష్ట్రాలు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ పొందాలని కోరాయి. కరోనా వ్యాక్సినేషన్ మ్యుటేషన్‌ను నివారిస్తుందని, వ్యాక్సిన్ లేని వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉందని కేంద్రం చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి సమ్మతి ఇచ్చిన వ్యక్తికి పూర్తిగా సమాచారం ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తదు. పరిహారం కోసం పిటిషనర్లు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 2న విచారణ సందర్భంగా, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ విధానాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచింది, ఇది శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి ఉందని, అయితే ఎవరినీ బలవంతంగా టీకాలు వేయించుకోలేమని పేర్కొంది. కానీ ప్రభుత్వ నిబంధనలు అయితే ప్రయాణానికి టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. -
మేలో దేశాన్ని వణికించిన కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: సెకండ్ వేవ్‌లో ఏప్రిల్‌నాటి కోవిడ్ సంక్షోభ రికార్డులను తిరగరాస్తూ కరోనా మే నెలలో ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. నెల ప్రారంభంలో విజృంభించిన కరోనా నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టింది. కేవలం మే నెలలో దేశంలో 90,10,075 పాజిటివ్ కేసులు, 1,20,042 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య, కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య తగ్గనప్పటికీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువకు దిగిరావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. మార్చి 1వ తేదీన దేశంలో 12,286 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కరోనా విస్తృతి విపరీతంగా పెరిగి ఏప్రిల్ 6వ తేదీన 1.15 లక్షల కొత్త కేసులొచ్చాయి. తర్వాత కరోనా సంక్రమణ వేగం ఒక్కసారిగా ఊపందుకోవడంతో మేలో రోజువారీ కొత్త కేసులు 4 లక్షల మార్క్‌ను దాటేశాయి. మార్చి 1తో పోలిస్తే 67 రోజుల తర్వాత మే 6 న ఈ సంఖ్య 34 రెట్లు పెరిగి 4.14 లక్షలు దాటింది. గత 24 రోజుల్లో 63% తగ్గిన పాజిటివ్ కేసులు మే 6 తర్వాత దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత 24 రోజుల్లో రోజు వారీ పాజిటివ్ కేసులు 63% తగ్గి నెలాఖరున 1,27,510 కేసులు నమోదయ్యాయి. 26 రెట్లు పెరిగిన కరోనా మరణాలు దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య భయపెడుతోంది. మార్చి 1న దేశంలో 92 మరణాలు సంభవించగా, మే 18వ తేదీన దేశంలో అత్యధికంగా 4,529 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా దేశంలో సగటున రోజువారీ మరణాల సంఖ్య 3523గా నమోదవుతోంది. మార్చి నెలలో 5,766, ఏప్రిల్ నెలలో 48,926, మే నెలలో 1,20,042 కరోనా మరణాలు సంభవించాయి. గత 54 రోజుల్లోనే అతి తక్కువ కేసులు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 1,27,510 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ కేసులు రావడం గత 54 రోజుల్లో ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు పెరిగింది. గత 24 గంటల్లో 2,795 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,31,895కు పెరిగింది. ఇంత తక్కువ మరణాలు నమోదవడం గత 35 రోజుల్లో ఇదే తొలిసారి. దేశంలో గత 24 గంటల్లో 2,55,287 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,59,47,629కు పెరిగింది. రికవరీ రేటు 92.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18,95,520కు చేరుకుంది. 43 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షల దిగువన నమోదైంది. కరోనా పాజిటివిటీ రేటు 6.62%గా నమోదైంది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. -
WHO: పొగ తాగేవారు కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ
జెనివా: ధూమపానం(పొగ త్రాగేవారు) చేసేవారిలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్వో) స్పష్టం చేసింది. స్మోకింగ్‌ను వదిలేయాలని.. దీంతో కరోనా రిస్క్ తగ్గుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసన్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన ''క్విట్ టొబాకో క్యాంపెయిన్'' కార్యక్రమంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన క్విట్ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో అన్ని దేశాలు చేతులు కలపాలని కోరారు. దీనిపై ప్రజలకు అవసరమైన సమాచారం, సపోర్ట్, టూల్స్ అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో నేరుగా పనిచేస్తున్నట్లు టెడ్రోస్ పేర్కొన్నారు. చదవండి: చైనాలో దడపుట్టిస్తున్న కొత్తరకం స్రెయిన్ మరోముప్పు.. కరోనా హైబ్రిడ్ -
భారత్‌లో కరోనా కల్లోలం: కాస్త ఊరటనిచ్చే కబురు!
న్యూఢిల్లీ: భారత్‌ను చిగురుటాకులా వణికిస్తూ... కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ కాస్త ఊరట కలిగించేలా కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో కోవిడ్-19 మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపింది. కాగా కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం దేశవ్యాప్తంగా 14.02 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 3.54 లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక సోమవారం కొత్తగా 2.20 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలో, తాజాగా కేంద్రం ప్రకటనతో సెకండ్ వేవ్‌లో కరోనా తన ప్రతాపం చూపిస్తున్నా ఇప్పటి వరకూ మరణాల రేటు 1 శాతం మాత్రమే ఉందని, 99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో మరణాల రేటు 1.12 శాతం ఉంటే, 98.88 శాతం మంది కరోనా నుంచి రికవరీ అవుతున్నారని, వారిలో ఎక్కువ శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సెకండ్ వేవ్ ప్రారంభంలో 37శాతం మందికి వెంటిలేషన్ అవసరం కాగా, ఇప్పుడు 28 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో తగ్గుతున్న కేసుల కంటే నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్ గా ఉన్న మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చదవండి: పాజిటివ్ రాకున్నా, లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చాల్సిందే! -
మరోసారి విజృంభిస్తున్న కరోనా!
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా అధికమవుతోంది. గత 24 గంటల్లో 62,714 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు... 312 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,552కు చేరుకుంది. ఈ ఏడాది ఒక రోజు మరణాల్లో ఇదే అత్యధికం. అత్యధిక కేసులు మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ ప్రభావం ఆర్థిక రంగంపై పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇక బెంగళూర్‌లో చిన్నారులకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. పదేళ్లలోపు వయసున్న పిల్లలు ఈ నెలలో 470 మందికిపైగా కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. -
చలికాలంలో కరోనా పంజా
ఢిల్లీ : కరోనా వేవ్‌లతో పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడం ఆయా దేశాలకు పెను సవాల్‌గా మారడంతో విదేశీయులను వారి మాతృ దేశాలకు పంపిస్తున్నాయి. ఢిల్లీలో కరోనాతో రికార్డు స్థాయిలో ఒకేరోజు 131 మంది చనిపోయారు. కొన్ని మార్కెట్లు మూసివేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించగా తాజాగా మాస్కులు లేకుండా ప్రజలు బయట సంచరిస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో రెండో దశను కూడా దాటి మూడో దశకు వైరస్ వ్యాప్తి చేరుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. మిగతా రాష్ట్రాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గుజరాత్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా... కోవిడ్ సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో గుజరాత్లో పంచాయితీ ఎన్ని కలను వాయిదా వేయడం గమనార్హం. అమెరికాలో కేసులు తగ్గక పోవ డంతో లాస్ ఏంజెలిస్‌లో మొదటిసారి రాత్రిపూట కర్ఫూ విధించడంతో పాటు.. మూడు వారాల లాక్డౌన్ దిశగా సన్నద్ధమవు తున్నారు. యూకే లాంటి దేశాల్లో క్రిస్మస్ వేడుకలను 5 రోజులకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ టీకాను ఆవిష్కరించినా మన దేశ పరిస్థితులకు అది ఎంతమేర సరిపోతుందనే సందేహాలున్నాయి. -
కరోనా అప్డేట్ : 80 లక్షలకు చేరువైన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు బుధవారం నాటికి 80 లక్షల మార్క్‌కు చేరువ కాగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1,20,000కు పెరిగింది. 43,893 తాజా పాటిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 79,90,322కు ఎగబాకింది. ఇక తాజాగా వైరస్ కారణంగా బుధవారం 508 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణాల్లో 79 శాతం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ కోవిడ్-19 మరణాలు లేని మిజోరంలో తొలిసారిగా వైరస్ బారినపడి 62 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 మరణాలు పెరుగుతున్నా ప్రతి పదిలక్షల జనాభాలో వైరస్ మరణాలు ప్రపంచంలోనే భారత్‌లో అతితక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. చదవండి : భారత్‌లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అప్పుడే! కోవిడ్ మరణాల్లో ప్రపంచ సగటు 148 కాగా, భారత్‌లో ఇది కేవలం 87కే పరిమితమవడం ఊరట కలిగిస్తోంది. భారత్‌లో రోజురోజుకూ కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం సానుకూల పరిణామమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 43,893 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 58,439 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. -
కోవిడ్-19 : మృతుల్లో 45 శాతం వారే!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో మరణాల ముప్పు వృద్ధులకే అధికంగా ఉంటుందన్న అంచనాలు సరైనవి కావని, 60 సంవత్సరాల లోపు వయసున్న వారికీ కోవిడ్-19తో ముప్పు అధికమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా విశ్లేషణలు స్పష్టం చేశాయి. భారత్‌లో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో 45 శాతం మంది 60 సంవత్సరాలలోపు వారేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్‌తో మరణించిన వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్యే అధికంగా ఉందని ఈ విశ్లేషణ వెల్లడించింది. 44-60 ఏళ్ల వయసు వారిలో మరణాల సంఖ్య 35 శాతం కాగా, 26-44 వయసు వారిలో మరణాల సంఖ్య 10 శాతంగా ఉందని పేర్కొంది. 60 సంవత్సరాలు పైబడిన వారిలో కరోనా మరణాల రేటు 53 శాతంగా నమోదైంది. ఇక 17 సంవత్సరాల లోపు యువతలో కరోనా మరణాలు కేవలం 1 శాతం ఉండగా, 18-25 సంవత్సరాల వయసు వారిలోనూ మరణాల రేటు కూడా 1 శాతంగా నమోదైంది. వయో వృద్ధులతో పాటు పలు వ్యాధులతో బాధపడే వారికి కరోనా వైరస్ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 44-60 సంవత్సరాల వయసు వారిలో కరోనా మరణాలు ఆందోళనకరమని, తాము యువకులం కావడంతో తమకు వైరస్ సోకదని, వైరస్ సోకినా తాము కోలుకోగలమని భావిస్తారని, అలాంటి అపోహలు సరైందికాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. ఇక పలు వ్యాధులతో బాధపడేవారికి కోవిడ్-19తో ముప్పు అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 45-60 ఏళ్ల వయసు వారిలో వివిధ వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలు 13.9 శాతంగా నమోదయ్యాయి. ఎలాంటి ఇతర వ్యాధులు లేని వారిలో మరణాల సంఖ్య 1.5 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇతర వ్యాధులతో చోటుచేసుకున్న మరణాలు 24.6 శాతం కాగా, ఇతర వ్యాధులు లేని వారిలో మరణాల రేటు 4.8 శాతంగా ఉంది. 45 ఏళ్ల లోపు వారిలో ఇతర వ్యాధులతో బాధపడుతూ 8.8 శాతం మరణించగా, ఇతర వ్యాధులు లేనివారిలో మరణాల రేటు కేవలం 0.2 శాతంగా ఉంది. గుండె జబ్బులు, ప్రధాన అవయవాల మార్పిడి జరిగిన వారు, క్యాన్సర్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల రేటు 1.53 శాతంగా ఉందని ఆయన వివరించారు. చదవండి : ‘కో ఇన్ఫెక్షన్’పై జర జాగ్రత్త! -
ఊరట : 1.7 శాతానికి తగ్గిన మరణాల రేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువవగా, మరణాల రేటు దిగిరావడం సానుకూల పరిణామమని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తొలి వారంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించేవారి సంఖ్య 2.15 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 1.7 శాతానికి దిగివచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5000లోపు కోవిడ్-19 కేసులున్నాయని, లక్షద్వీప్‌లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని వెల్లడించారు. దేశంలో 62 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. 70 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతితక్కువగా భారత్‌లో ప్రతి పదిలక్షల మందిలో 3102 కోవిడ్-19 కేసులే వెలుగుచూశాయని చెప్పారు. రష్యా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని భారత్‌లో తయారీ, మూడో దశ పరీక్షల కోసం రష్యా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. చదవండి : మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా? -
77.32 శాతానికి పెరిగిన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రికార్డుస్ధాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నా మహమ్మారి నుంచి కోలుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 73,642 మంది కోవిడ్-19 రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 32,00,000 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 77.32 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు కోవిడ్-19 మరణాల రేటు 1.72 శాతానికి తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొంది. కోవిడ్-19 నుంచి కోలుకునే రోగుల సంఖ్య రోజూ పెరుగుతోందని, గత రెండురోజులుగా రోజుకు 70,000 మందికి పైగా ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా టెస్టులను ముమ్మరం చేయడంతో ప్రాథమిక దశలోనే కోవిడ్-19ను గుర్తించి చికిత్స అందించడం ద్వారానే సానుకూల ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 90632 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 1065 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి : వ్యాక్సిన్ పంపిణీ ఇలా.. -
ఆగని కరోనా ఉద్ధృతి
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి దూకుడు ఆగడం లేదు. మంగళవారం తాజాగా మరో 69,921 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,166కు చేరుకుంది. గత 24 గంటల్లో 819 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 65,288 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 28,39,882 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,85,996గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.29శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి ఇది 76.94 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.77 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 31 వరకు 4,33,24,834 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 10,16,920 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గతం వారం రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 1,583 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గత రెండు వారాల్లో 1.22కోట్ల పరీక్షలు జరిపారు. దేశంలోని మొత్తం పరీక్షల్లో కేవలం తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనే 34 శాతం పరీక్షలను చేశారని కేంద్రం తెలిపింది. దేశంలో ప్రతి మిలియన్ మందికి 31,394 పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. 30 నిమిషాల్లో ఫలితం.. కరోనా ఉందో లేదో కేవలం 30 నిమిషాల్లో తేల్చే పోర్టబుల్ మెషీన్ ప్రొటోటైప్‌ను అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. రిజల్ట్ కూడా మొబైల్ కు మెసేజ్ వచ్చేలా, సంబంధిత అధికారులకు కూడా సమాచారం వెళ్లేలా తయారు చేసినట్లు వారు తెలిపారు. ఈ పరిశోధకుల సమూహంలో ఓ భారతీయ మూలాలున్న శాస్త్రవేత్త కూడా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు పీఎన్ఏఎస్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరికరాల వల్ల కోవిడ్ నిర్థారణ సులువవుతుందని బయో ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రషీద్ బాషిర్ తెలిపారు. నిర్ధారణ కోసం గొంతు నుంచి తీసిన ద్రవాన్ని ఇందులో ఉపయోగించనున్నారు. ఆర్టీ–పీసీఆర్‌తో పోల్చదగ్గ ఫలితాలు ఈ ల్యాంప్ పరికరం ద్వారా వచ్చినట్లు వెల్లడించారు. గొంతు నుంచి కాకుండా, లాలాజలం నుంచి నిర్ధారణ పరీక్ష చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌పై విముఖత! 25 శాతం మందిది అదేమాట: అంతర్జాతీయంగా వయోజనుల్లో నలుగురిలో ఒకళ్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖతతో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్‌పై భయాలు, పనితీరుపై సందేహాలతో వందకు 25 మంది వ్యాక్సినేషన్‌పై సుముఖంగా లేనట్లు తెలిపింది. అయితే ఇలా విముఖత చూపుతున్నవారు ఇండియాలో కేవలం 13 శాతం మందేనని పేర్కొంది. దాదాపు 27 దేశాల్లో సుమారు 20వేల మంది వయోజనులను ప్రపంచ ఆర్థిక ఫోరమ్– ఇప్సాస్ సర్వే చేశాయి. ఈ సంవత్సరంలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని చైనా, సౌదీ, ఇండియాల్లో ఎక్కువమంది ఆశాభావం వ్యక్తం చేసినట్లు సర్వే తేల్చింది. మొత్తం మీద 59 శాతం మంది ఈ ఏడాది టీకా రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దాదాపు పావువంతుమంది వ్యాక్సిన్‌పై నమ్మకం లేదనడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్ అందివ్వాలన్న లక్ష్యాన్ని దెబ్బతీయవచ్చని డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి అర్నౌడ్ బెర్నెట్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ కావాలని ఎక్కువగా 97 శాతం మంది చైనాలో కోరుకోగా, తర్వాత స్థానాల్లో బ్రెజిల్(88 శాతం), ఆస్ట్రేలియా(88 శాతం), ఇండియా(87 శాతం) వాసులు ఉన్నారు. వ్యాక్సిన్‌పై అపనమ్మకం ఎక్కువగా రష్యా(54 శాతం), పోలెండ్(56 శాతం), హంగరీ(56 శాతం), ఫ్రాన్స్(59 శాతం)వాసుల్లో ఉంది. అయితే ఎక్కువ దేశాల్లో వ్యాక్సిన్ కావాలనే వారు వద్దనే వారి కన్నా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని ఈ సర్వే తెలిపింది. వ్యాక్సిన్ వద్దనుకునేందుకు కారణాల్లో దుష్ప్రభావాలపై భయం ప్రధమస్థానంలో ఉంది. -
ఇలా చేస్తే 2 లక్షల మరణాలు నివారించవచ్చు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ని తుదముట్టించే వ్యాక్సిన్ ఏది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివి పాటిస్తే.. వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చనే సంగతి అనుభవపూర్వకంగా తెలిసి వస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన మోడలింగ్ అధ్యాయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి కఠినంగా పాటిస్తే.. 2020 డిసెంబరు నాటికి భారతదేశంలో రెండు లక్షల కరోనా మరణాలను నివారించవచ్చని తెలిపింది. కేసుల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని అధ్యాయనం వెల్లడించింది. అంతేకాక భారత్ లాంటి అధిక జనాభా కల దేశంలో మహమ్మారి విజృంభణ ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయలేం కాబట్టి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి ఇండియాలో అత్యవసరమని అధ్యాయనం స్పష్టం చేసింది. (చదవండి: 69% మందికి లక్షణాల్లేవ్..!) ఇప్పటికే ఢిల్లీ వంటి కొన్ని పట్టణాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి మంచి ఫలితాలిచ్చాయంది. ఈ అధ్యాయనం ప్రకారం భారతదేశంలో ఆగస్టు నాటికి కరోనా మరణాల సంఖ్య 60 వేల పై చిలుకు ఉండగా.. డిసెంబరు, 2020 నాటికి 2,91, 145 మంది కోవిడ్ బారిన పడి మరణిస్తారని మోడలింగ్ అధ్యాయనం అంచాన వేసింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది. -
భారత్‌కు మరో 100 వెంటిలేటర్లు అందించిన అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19పై భారత్ పోరాటానికి ఊతమిస్తూ అమెరికా ప్రభుత్వం బుధవారం భారత్‌కు రెండో విడత 100 వెంటిలేటర్లను అందచేసింది. భారత ప్రభుత్వం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో సమన్వయం ద్వారా అమెరికా వెంటిలేటర్లను భారత్‌కు అందించిందని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కరోనా వైరస్ కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నా వ్యాధి నుంచి రికార్డుస్ధాయిలో రోగులు కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య బుధవారం నాటికి 20 లక్షలు దాటింది. దీంతో రికవరీ రేటు 73.64 శాతానికి ఎగబాకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణాల రేటు సైతం 1.91 శాతానికి తగ్గిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6,76,514 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకూ మహమ్మారి నుంచి 20,37,870 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. కాగా, భారత్‌లో ఇప్పటివరకూ 3,17,42,782 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్ధాయిలో 8,01,518 కరోనా టెస్టులు జరిగాయని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 64,531 తాజా కేసులు వెలుగుచూడగా 1092 మంది మరణించారు. చదవండి : మనకు తొలి వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా నుంచే! -
ఊరట : 70.77 శాతానికి పెరిగిన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా మహమ్మారి బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పుంజుకోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 17 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రికవరీ రేటు 70.77 శాతానికి పెరిగిందని పేర్కొంది. దేశంలో కోవిడ్-19 మరణాల రేటు మరింత తగ్గి 1.96 శాతంగా నమోదైందని తెలిపింది. భారీగా రికవరీలు చోటుచేసుకుంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 27.27 శాతం కేసులే యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య 10 లక్షలకు పైగా అధికమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇక గడిచిన 24 గంటల్లో 56,383 మంది వైరస్ నుంచి కోలుకున్నారని, రికవరీల సంఖ్య 16,95,982కు చేరిందని గణాంకాలు పేర్కొన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,53,622 యాక్టివ్ కేసులున్నాయి. ఈనెల 12 వరకూ 2,68,45,688 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్ పేర్కొంది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 8,30,391 కరోనా టెస్టులు జరిగాయని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 66,999 తాజా పాజిటివ్ కేసులతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,637కు చేరింది. మహమ్మారితో ఒక్క రోజులోనే 942 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. చదవండి : నిల్వ చేసిన కోడి రెక్కల్లో కరోనా: చైనా -
ఆరో రోజూ.. 50 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో సోమవారం కొత్తగా 52,050 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. గత 24 గంటల్లో 803 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 12,30,509కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,298గా ఉంది. గత ఆరు రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజా 803 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 266 మంది మరణించారు. కర్ణాటక నుంచి 98, ఆంధ్రప్రదేశ్ నుంచి 63, పశ్చిమబెంగాల్ నుంచి 53, ఉత్తర ప్రదేశ్ నుంచి 48, ఢిల్లీ నుంచి 17, తెలంగాణ నుంచి 23, గుజరాత్ నుంచి 22 మంది మరణించారు. ఆగస్టు 2 వరకు 2,08,64,750 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 6,61,892 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. జూలైలో ఏకంగా 1,05,32,074 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 66.31 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.10 శాతానికి పడిపోయిందని తెలిపింది. 10 రాష్ట్రాల్లోనే.. దేశంలోని మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 82 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. అంతేగాక 50 జిల్లాల్లోనే 66 శాతం కేసులు ఉన్నాయి. మరణించిన వారిలో 50 శాతానికిపైగా 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారని తెలిపారు. 45 నుంచి 60 సంవత్సరాల వయసులో వారిలో 37 శాతం మంది మరణించారని, 26 నుంచి 44 సంవత్సరాల వయసువారిలో 11 శాతం మరణించారని చెప్పారు. మరణించిన పురుషుల శాతం 68గా ఉండగా, మహిళల శాతం 32గా ఉందన్నారు. ప్రతిరోజూ మిలియన్ మందిలో 149 పరీక్షలు జరుగుతున్నాయన్నారు. -
ఊరట : 2.10 శాతానికి తగ్గిన మరణాల రేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు అత్యల్పంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు 2.10 శాతంగా ఉందని వ్యాధి నుంచి పెద్దసంఖ్యలో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయని గడిచిన 24 గంటల్లో 6 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేపట్టామని చెప్పారు. ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా టెస్టులు జరిగాయని వెల్లడించారు. ప్రతి పది లక్షల మందిలో 15,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. రికవరీ రేటు 66.31 కాగా, కరోనా పాజిటివిటీ రేటు 11 శాతంగా నమోదైందని తెలిపారు. ఇక కరోనా మరణాల్లో 50 శాతం 60 ఏళ్ల వయసుపైబడిన వారు కాగా, 45-60 ఏళ్లలోపు వారు 37 శాతం ఉన్నారని వెల్లడించారు.మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 18 లక్షల 50 వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 52,050 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే మొత్తం 803 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా 44,306 మంది డిశ్చార్జ్ అయ్యారు. చదవండి : కరోనా కట్టడిలో ఢిల్లీ సక్సెస్ అయిందా? -
కరోనా రికవరీ రేటు 64%
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారినపడి, చికిత్సతో కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు 14,83,156 కాగా, 9,52,743 మంది పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. అంటే 64.24 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. రికవరీ రేటు 40 రోజుల క్రితం 53 శాతంగా ఉండేది. కరోనా మరణాల రేటు కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. జూన్ 18న 3.33 శాతం కాగా, ప్రస్తుతం 2.25 శాతంగా నమోదైంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది స్వల్పమే కావడం సానుకూలాంశం. కరోనా కొత్త కేసులు, మరణాలు కొంత తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా 47,703 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 654 మంది బాధితులు మరణించారు. దేశంలో మొత్తం మరణాలు 33,425కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలియజేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,96,988. కడుపులో బిడ్డకూ కరోనా మహారాష్ట్రలోని పుణే నగరంలో కరోనా బాధితురాలైన తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ కూడా వైరస్ బారినపడింది. ససూన్ జనరల్ ఆసుపత్రిలో మే నెల చివరి వారంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. ఈ తరహా కేసు భారత్‌లో ఇదే మొదటిదని వైద్యులు పేర్కొన్నారు. -
'చంద్రబాబుకు మైండు సరిగా పనిచేయడం లేదు'
సాక్షి, అమరావతి : చంద్రబాబుకు మైండు సరిగా పనిచేయడం లేదని అందుకే రోజూ చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. రాష్ట్రంలో కరోనాతో సెకనుకు ఒకరు చొప్పున చనిపోతున్నారంటున్న చంద్రబాబు.. దానికి రుజువులు చూపించాలంటూ డిమాండ్ చేశారు.కరువు, చంద్రబాబు కవల పిల్లలని.. ఒకపక్క రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతుంటే అది చూసి బాబు ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తన ఇంద్రభవనంలో కూర్చొని ఎల్లో మీడియా ద్వారా రోజు విషం కక్కుతున్న బాబు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని తేలిందంటూ శ్రీదేవి విమర్శించారు. -
అంచనా లోపమే శాపం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా బెంబేలెత్తిస్తోంది. గత ఐదు నెలల్లో ఈ వైరస్ కారణంగా వంద మందికి పైగా వైద్యులు మరణించారు. కరోనా పట్ల అవగాహన లేక ఆ మహమ్మారిని చిన్న విషయంగా భావించడం, తగు రక్షణ చర్యలు తీసుకోకపోవడం, భౌతిక దూరం వంటి మార్గదర్శకాలను విస్మరించడం, పీపీఈ కిట్లను ఉపయోగించడంలో వైఫల్యం, నిరూపితం కాని మందులు తీసుకోవడం వంటివి ఆయా డాక్టర్ల మరణాలకు కారణమని తేలింది. అలాగే ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు కలిగి ఉండటం, ఆసుపత్రి వెలుపల తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కారణమని నిర్ధారించారు. ‘ఏ హండ్రెడ్ లైవ్స్ లాస్ట్: డాక్టర్ డెత్స్ ఇన్ ఇండియా టైమ్స్ ఆఫ్ కోవిడ్–19’అనే అంశంపై ఓ అధ్యయనం జరిగింది. దానిపై డాక్టర్ రాజీవ్ జయదేవన్ అనే నిపుణుడు దేశంలో 108 మంది డాక్టర్ల మరణాల నుంచి నేర్చుకున్న పాఠాల పేరుతో తాజాగా ఒక అధ్యయన పత్రాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం మరణించిన వారి సగటు వయసు 55గా ఉండటం గమనార్హం. ఒక 22 ఏళ్ల యువ వైద్యుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇక చనిపోయిన నర్సుల సగటు వయస్సు 42.7 ఏళ్లు. వారిలోనూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ డాక్టర్ల మరణాలకు కారణమేంటి? ఇక డాక్టర్ల మరణాలకు తరచుగా పీపీఈ కిట్ల వాడకంపైనే దృష్టి పెట్టి చర్చిస్తాం. కానీ అనేక కారణాలున్నాయని గుర్తించాలి. పై వాటితోపాటు ఇతర అంశాలు కూడా కారణాలుగా నిలుస్తున్నాయి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ, ట్రయాజ్, క్రౌడ్ కంట్రోల్, టెలిమెడిసిన్, ఆడిట్స్, పీపీఈల లభ్యత, వాటి నాణ్యత, వెంటిలేషన్ సౌకర్యం లేని భవనాల్లో వైద్య సేవలు అందించడం, ఏరోసోల్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకునే చర్యలు కూడా కారణంగా ఉంటున్నాయి. అలాగే వారిలో ఏర్పడే మానసిక ఒత్తిడిని సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం కూడా కనిపిస్తుంది. ► కరోనా రోగికి ఆపరేషన్ చేయడం వల్ల సర్జన్, అనస్థీషియన్, ఇతర సహాయకులకు కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుంది. ► లక్షణాలు లేని కరోనా పాజిటివ్ సహోద్యోగి నుంచి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహోద్యోగులు దగ్గరగా ఉండి మాట్లాడేటప్పుడు ఇది జరుగుతుంది. ► ఆపరేషన్ థియేటర్లలో నిర్దిష్ట ప్రొటోకాల్‌ను పాటించడం లేదు. అధిక రిస్క్ ఎక్స్పోజర్ ప్రాంతాల్లో సిబ్బంది సంఖ్యను అపరిమితంగా ఉంచడం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. ► రోగులకు నిర్దిష్ట సమయాలు లేవు. ఇతర వైద్య సిబ్బంది భౌతిక దూరం, చేతి పరిశుభ్రతను అమలు చేయడం లేదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉండటం లేదు. కన్సల్టింగ్ గదులు ఇరుకుగా, తక్కువ వెంటిలేషన్‌తో ఉంటున్నాయి. ► నర్సులు, ఫార్మసిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు, ఫిజియోథెరపిస్టులు, అంబులెన్స్ డ్రైవర్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది, బిల్లింగ్, రిసెప్షన్ సిబ్బంది ఇతరుల నుంచి వైరస్ వ్యాప్తికి గురవుతుంటారు. ► వైద్యులు తమ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని రక్షించడానికి నాయకత్వ పాత్ర పోషించడంలో చాలా చోట్ల వైఫల్యం కనిపిస్తుంది. ఫోన్లలో మాట్లాడటం, వీడియో కాల్ ద్వారా వారికి తగిన ఆదేశాలు ఇవ్వడంలో వైఫల్యం కనిపిస్తుంది. ► కొన్ని చోట్ల సుదీర్ఘ సమావేశాలు జరుగుతున్నాయి. అత్యంత ఇరుకైన గదుల్లో నిర్వహించడం వల్ల సూక్ష్మ బిందువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలుసుకోవడం ముఖ్యం. కానీ చాలాచోట్ల వైద్యులు, ఉన్నత స్థాయి అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. ► బాగా కనిపించే సహోద్యోగి లేదా స్నేహితుడు వైరస్‌ను మోస్తున్నారని తెలుసుకోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. ► ఇక ఇతరులతో కారులో ప్రయాణించేటప్పుడు ఏసీలు వేసుకొని ప్రయాణిస్తుంటారు. గ్లాసులు దించరు. ► దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 138 మంది ఆరోగ్య కార్యకర్తల మరణాలు సంభవించాయి. వాటిలో ఆత్మహత్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి ఉంటే కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరముంది. మానసిక, శారీరక అలసట రోడ్డు ప్రమాదాలకు దోహదం చేస్తుంది. అలాంటి కారణాలతో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు, ఒక అంబులెన్స్ డ్రైవర్ ప్రమాదాల్లో మరణించారు. ► ఆసుపత్రుల్లో సాధారణ పడకలు, ఐసీయూలు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్న పలువురు వైద్యులకు చికిత్స చేయలేని పరిస్థితి ఏర్పడింది. అనేక సందర్భాల్లో వారు పడకల కోసం ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది. ► కరోనాతో దేశంలో ఒక డాక్టర్, అతని భార్య చనిపోయారు. వీరు 60 ఏళ్లలోపువారే. ఏం చేయాలి? ► చాలా మంది లక్షణాలు లేకుండా వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడంలో సిబ్బందికి సెంటినెల్ పరీక్ష అవసరం. సెంటినెల్ టెస్టింగ్ అనేది లక్షణాలు లేనప్పుడు, అధిక రోగులున్న ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అవసరం. సెంటినెల్ పరీక్ష లేకుండా వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం అసాధ్యం. ► ఆపరేషన్ సమయంలో సిబ్బంది ప్రామాణిక కరోనా ప్రొటోకాల్‌ను అనుసరిస్తే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. ► ప్రారంభ లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ, ఏదైనా తీవ్రతరం కావడానికి జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం. లేకుంటే సీరియస్ అయ్యే ప్రమాదముంది. ► ఇది కొత్త వ్యాధి కాబట్టి, ఇతర అనారోగ్యాలకు దీనికి తేడా ఉంది. గత అనుభవాల ఆధారంగా మాత్రమే చికిత్స చేయమని పట్టుబట్టకుండా, తాజా మార్గదర్శకాలను అనుసరించాలి. ► అనేక మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది మహమ్మారిని తక్కువ చేసి చూస్తున్నారు. అటువంటి వైఖరి ఉన్న వ్యక్తులు తమకు మాత్రమే కాదు, సహోద్యోగులకు, కుటుంబానికి, సమాజానికి అన్యాయం చేసినట్లే.. మహమ్మారి ఒక బూటకమని, భౌతికదూరం అనవసరం అని నమ్ముతూ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 5 నెలల్లో వంద మందికిపైగా డాక్టర్లు దేశంలో మరణించారనేది వాస్తవం. దీన్ని గుర్తుంచుకోవాలి. ► అత్యధిక జనాభా కలిగిన దేశంలో రోగుల రద్దీ అనివార్యమే. అందువల్ల టోకెన్, అపాయింట్మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. టెలిమెడిసిన్, వైద్యులకు షిఫ్ట్‌ల వారీగా పనిచేయించడం అవసరం. కానీ చాలాచోట్ల ఇవి అమలు కావడం లేదు. -
మరణాలు ఒక శాతమే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారిలో 1 శాతం రోగులే మృత్యువాతపడుతున్నారని ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 66 శాతం మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారని, 33 శాతం మంది రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. కరోనా రోగులను గుర్తించేందుకు సరైన పరీక్షలు నిర్వహించడం లేదని, వైద్యులకు పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ పలువురు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం..నివేదిక ఇవ్వాలని ఆదేశించి న నేపథ్యంలో డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం నివేదిక సమర్పించారు. ఈనెల 15 నాటికి 2,08,666 మం దికి పరీక్షలు చేశామని, గతంలో ప్రతి పది లక్షల మందిలో 2,530 మందికి పరీక్షలు చేయగా, ఇటీవల ఆ సంఖ్యను 5,961 మందికి పెంచామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో జోన్లు, సర్కిల్స్, వార్డుల వారీగా పాజిటివ్ కేసుల సమాచారాన్ని వైద్య, ఆరోగ్య శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం చేయాలని కాలనీ అసోసియేషన్లకు విజ్ఞప్తి చేశామన్నారు. ఐసీఎంఆర్ అనుమతి మేరకు రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు చేస్తున్నాయని, ప్రభుత్వ ల్యాబ్‌లలో ఉచితంగా పరీక్ష చేస్తుండగా, ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.2,200కు చేస్తున్నారని పేర్కొన్నారు. గత 20 రోజుల్లో 1,37,732 మందికి పరీక్షలు చేశామన్నారు. రెండు లక్షల ర్యా పిడ్ యాంటిజెన్ పరీక్ష కిట్లు తెప్పించి రాష్ట్రవ్యాప్తంగా 870 పీహెచ్సీ కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని, ఐసీఎంఆ ర్ నిబంధనల మేరకు కరోనా రోగులను కలిసిన వారికి 5వ, 10వ రో జున పరీక్షలు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9, రాష్ట్రవ్యాప్తంగా 52 ప్రభుత్వ ఆసుపత్రులను, 57 ప్రైవేటు ఆసుపత్రులను కరోనా చికిత్స కోసం గుర్తించామన్నారు. గాంధీ ఆసుపత్రిలో బెడ్స్ సంఖ్య ను 1,012 నుంచి 1,890కి పెంచామన్నారు. ఇందులో 500 ఐసీయూ, 700 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని, 350 వెంటిలేటర్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. 665 నూతన పోస్టులను మంజూరు చేశామని, త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులను ఏ, బీ గ్రూపులుగా విభజించామని, ఒక గ్రూపు వారం పనిచేస్తే మరోవారం క్వా రంటైన్‌లో ఉంటుందన్నారు. వసతి కావాలని కోరిన వారికి గాం ధీలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 9 నాటికి 87,757 పీపీఈ కిట్లకుగాను 80,851 ఉపయోగించగా, 6,906 అందుబాటులో ఉన్నాయని, 1,81,040 ఎన్–95 మాస్కులకుగాను 1,63,590 ఉపయోగించామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 61, రాష్ట్రవ్యాప్తంగా 349 కంటైన్మెంట్ జోన్లను గుర్తించామన్నారు. -
తగ్గిన మరణాల రేటు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్ 17వ తేదీన 3.36 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.43 శాతానికి పడిపోయిందని పేర్కొంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించింది. దేశంలో 24 గంటల్లో మరో 37,148 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 11,55,191కు చేరుకున్నాయని తెలిపింది. యాక్టివ్ కేసులు 4,02,529 కాగా, కోలుకున్న బాధితుల సంఖ్య కూడా 7,24,577కు చేరుకుని, రికవరీ రేటు 62.72 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌తో ఒక్క రోజులోనే మరో 587 మంది మృతి చెందడంతో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 28,084కు చేరుకుంది. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ రేటు జాతీయ స్థాయి 8.07 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. రోజుకు ప్రతి 10 లక్షల జనాభాకు 140 పరీక్షలు చేస్తే పాజిటివ్ రేటు క్రమంగా 5కు, అంతకంటే తక్కువకు దిగి వస్తుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19తో ప్రతి 10 లక్షల మందిలో సరాసరిన 77 మంది చనిపోతుండగా, భారత్‌లో అది 20.4 మాత్రమేనని కేంద్రం పేర్కొంది. ఈ నెల 20వ తేదీ వరకు దేశంలోని వివిధ ల్యాబ్‌ల్లో 1,43,81,101 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. -
ఊరట : తగ్గిన మరణాల రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. ప్రభుత్వాల చొరవతో కరోనా మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 2.5 శాతం దిగువకు పడిపోయిందని తెలిపింది.కంటెయిన్మెంట్ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం, పెద్దసంఖ్యలో టెస్టులు నిర్వహించడం, మెరుగైన చికిత్సా విధానాలతో దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. భారత్‌లో కరోనా మరణాల రేటు క్రమంగా దిగివస్తూ ప్రస్తుతం 2.49 శాతానికి పడిపోయిందని, ఇది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేట్లలో ఒకటని తెలిపింది. పలు రాష్ట్రాలు వ్యాధి సోకే ముప్పున్న వృద్ధులు, గర్భిణులు, ఇతర వ్యాధులు కలిగిన వారిని గుర్తించేందుకు సర్వేలు నిర్వహించాయని కరోనా కట్టడికి ఇది ఉపకరించిందని పేర్కొంది. రిస్క్ అధికంగా ఉన్న వ్యక్తులపై నిరంతర పరిశీలనతో పాటు వ్యాధిని ముందే గుర్తించగలిగి చికిత్స అందించడంతో మరణాల రేటు తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, పెరూ, చిలీ, మెక్సికో, దక్షిణాప్రికా, బ్రిటన్, పాకిసాఓ్తన్, స్పెయిన్ వంటి దేశాలు కలిపి భారత్‌లో కోవిడ్ 19 కేసుల కంటే 8 రెట్లు అధికంగా కేసులు నమోదు చేశాయని వెల్లడించింది. భారత్‌లో మరణాల రేటు కంటే ఈ దేశాల్లో మరణాల రేటు 14 రెట్లు అధికమమని పేర్కొంది. చదవండి : కరోనాతో కన్నడ నటుడు మృతి కరోనా కట్టడికి క్షేత్రస్ధాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు వంటి ఆరోగ్య సిబ్బంది అహరహం శ్రమించారని దీంతో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో 38,902 కోవిడ్-19 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరుకోగా 6,77,422 మంది కోలుకున్నారు. ఇక ఈ వ్యాధితో తాజాగా 543 మంది మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 26,816కు ఎగబాకింది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 23,672 మంది కోలుకున్నారు. -
అమ్మ పదిలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాతృత్వపు మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గింది. దేశంలో అత్యంత తక్కువ ఎంఎంఆర్ నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2016–18 ఏళ్ల మధ్య దేశంలో నమోదైన ఎంఎంఆర్పై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పెషల్ బులెటిన్ విడుదల చేసింది. జాతీయస్థాయి సగటు ఎంఎంఆర్ లక్షకు 113గా ఉండగా అందులో అత్యంత తక్కువ ఎంఎంఆర్ నమోదైన రాష్ట్రం కేరళ (43). ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (46), తమిళనాడు (60), తెలంగాణ (63) నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సగటు ఎంఎంఆర్ 67గా నిలిచింది. అస్సాంలో ఎంఎంఆర్ అత్యంత ఎక్కువగా 215గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గతం కంటే తక్కువ... రాష్ట్రంలో ఎంఎంఆర్ క్రమంగా తక్కువగా నమోదవుతోంది. 2015–17 మధ్య ఎంఎంఆర్ 76గా ఉంటే ఇప్పుడు 63కు తగ్గింది. తెలంగాణలో 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్‌తో ఎంఎంఆర్ తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ప్రభుత్వం రూ. 12 వేల నుంచి రూ. 13 వేల వరకు ఇస్తుండటం తెలిసిందే. అలాగే తల్లీబిడ్డల సంరక్షణకు వివిధ రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తోంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అలాగే గతంలో ఇళ్ల వద్ద జరిగే ప్రసవాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ ప్రారంభానికి ముందు అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హయాంలో ప్రసూతి దవాఖానాల్లో ప్రారంభించిన లేబర్ రూంలు, ఇతర మౌలిక సదుపాయాల వల్ల కూడా ఎంఎంఆర్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఐరాస లక్ష్యాన్ని చేరుకున్నాం 15–49 ఏళ్ల వయసులోని మాతృత్వపు మహిళల్లో జరిగే మరణాలను ఎంఎంఆర్ కింద లెక్కిస్తారు. గర్భధారణ, ప్రసవం లేదా గర్భస్రావం సమయంలో జరిగే మరణాలను ఎంఎంఆర్‌గా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ‘మాతృత్వపు మరణం అంటే గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత 42 రోజుల్లోపు ఏదైనా కారణంతో చనిపోవడం’. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ప్రకారం ఎంఎంఆర్‌ను 70కన్నా తగ్గించడంకాగా దీన్ని మొదటిసారి రాష్ట్రం సాధించడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. -
పాము కాటు భారత్‌లోనే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పాముకాటుతో సంభవిస్తున్న మరణా ల్లో 50% భారత్‌లోనే నమోదవుతున్నా యి. గత ఇరవై ఏళ్లలో దేశంలో 12 లక్షల మంది అంటే ఏడాదికి 6 వేల వంతున.. మృత్యువాత పడినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ప్రధానంగా జూన్–సెప్టెంబర్ మధ్య ఈ పరిస్థితి ఎక్కువుందని తేలిం ది. గతంలోని ‘మిలియన్ డెత్ స్టడీ’ నివేదిక గణాంకాల ఆధారంగా దేశ, విదేశీ నిపుణులు నిర్వహించిన అధ్యయనాన్ని‘ఓపెన్–యాక్సెస్ జర్నల్ ఈ–లైఫ్’తాజా సంచికలో ప్రచురిం చారు. ఈ పరిశీలన ప్రకారం 2001–14 మధ్య 70% పాముకాటు మరణాలు బి హార్, మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ, ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌లోనే చోటుచేసుకున్నాయి. భారత్‌లో ఎక్కువగా రస్సెల్స్ వైపర్స్, 8 రకాల క్రే ట్స్, 4 రకాల నాగుపాముల కాటు కారణంగా మరణాలు సంభవిస్తున్న ట్టు వెల్లడైంది. వేగంగా చికిత్స అందించ కే మరణాలకు ఆస్కారం ఏర్పడుతోం దని పరిశీలకులు తేల్చారు. -
‘రెమ్‌డెసివిర్ ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం’
ఢిల్లీ : హెటిరో ఫార్మా తయారుచేసిన యాంటి వైరల్ రెమ్‌డెసివిర్ మందు కరోనా మరణాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో తేలిందని గిలియడ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే రెమ్‌డెసివిర్ మందుపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత రానుందని సంస్థ పేర్కొంది. తాజాగా జరిపిన విశ్లేషణలో కరోనా నుంచి కోలుకున్న 312 మంది నుంచి సమాచారం సేకరించాము. దీంతో పాటు వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న 818 మంది రోగులపై రెమ్‌డెసివిర్ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందన్నది అధ్యయనం చేసినట్లు గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. కరోనాతో బాధపడుతున్న రోగులకు 5 నుంచి 10 రోజులు పాటు రెమ్‌డెసివిర్ మందు డోజేజ్ విధానంలో అందించారని దాని వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదని అధ్యయనంలో తేలింది..కానీ ప్లేసిబో తో రెమ్‌డెసివిర్‌ను పోల్చిచూడలేదని స్పష్టం చేసింది. (వికృత చర్య : మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది) రెమ్‌డెసివిర్ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల్లో 74.4 శాతం మంది 14 రోజుల్లో కోలుకుంటున్నారని తేలింది. కాగా రెమ్‌డెసివిర్ మందుతో చికిత్స పొందిన రోగుల మరణాల రేటు 14 రోజుల్లో 7.6 శాతంగా ఉంటే.. అదే ఆ మందు తీసుకోనివారు మరణాల రేటు 12.5 శాతంగా ఉంది. గత ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ప్లేసిబో ఇచ్చిన రోగుల కంటే రెమ్‌డెసివిర్ ఇచ్చిన రోగులు 31 శాతం వేగంగా కోలుకున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే రెమ్‌డెసివిర్ మందుపై ఒక స్పష్టత వస్తుందని గిలియడ్ సంస్థ పేర్కొంది.(వ్యాక్సిన్: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!)