మరోసారి విజృంభిస్తున్న కరోనా! | Rising Covid Cases In Maharashtra, Punjab Matter Of Grave Concern: Centre | Sakshi
Sakshi News home page

మరోసారి విజృంభిస్తున్న కరోనా!

Published Mon, Mar 29 2021 1:40 AM | Last Updated on Mon, Mar 29 2021 1:40 AM

Rising Covid Cases In Maharashtra, Punjab Matter Of Grave Concern: Centre - Sakshi

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా అధికమవుతోంది. గత 24 గంటల్లో 62,714 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు... 312 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,552కు చేరుకుంది. ఈ ఏడాది ఒక రోజు మరణాల్లో ఇదే అత్యధికం. అత్యధిక కేసులు మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్‌ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.  

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ ప్రభావం ఆర్థిక రంగంపై పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇక బెంగళూర్‌లో చిన్నారులకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. పదేళ్లలోపు వయసున్న పిల్లలు ఈ నెలలో 470 మందికిపైగా కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement