సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు బుధవారం నాటికి 80 లక్షల మార్క్‌కు చేరువ కాగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1,20,000కు పెరిగింది. 43,893 తాజా పాటిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 79,90,322కు ఎగబాకింది. ఇక తాజాగా వైరస్ కారణంగా బుధవారం 508 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరణాల్లో 79 శాతం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ కోవిడ్-19 మరణాలు లేని మిజోరంలో తొలిసారిగా వైరస్ బారినపడి 62 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 మరణాలు పెరుగుతున్నా ప్రతి పదిలక్షల జనాభాలో వైరస్ మరణాలు ప్రపంచంలోనే భారత్‌లో అతితక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. చదవండి : భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అప్పుడే!
కోవిడ్ మరణాల్లో ప్రపంచ సగటు 148 కాగా, భారత్‌లో ఇది కేవలం 87కే పరిమితమవడం ఊరట కలిగిస్తోంది. భారత్‌లో రోజురోజుకూ కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం సానుకూల పరిణామమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 43,893 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 58,439 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment