సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. దేశంలో క్రియాశీలకంగా ఉన్న కేసులను తొలిసారిగా మహమ్మారి నుంచి కోలుకున్న కేసులు అధిగమించాయి. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 1,35,206కు పెరగ్గా ప్రస్తుతం 1,33,000 మంది వైరస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా వైరస్ రికవరీ రేటు 48.8 శాతానికి ఎగబాకింది. ఇక గడిచిన 24 గంటల్లో 9985 తాజా కేసులు వెలుగుచూడటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,583కు పెరిగింది.
మహమ్మారితో 279 మంది తాజాగా మరణించగా మొత్తం మరణాల సంఖ్య 7745కు పెరిగిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 50 లక్షల మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో అమెరికా, బ్రెజిల్, రాష్యా, బ్రిటన్‌ల తర్వాత ఐదో స్ధానంలో భారత్ నిలిచింది. ఒక్కరోజులో 9000కు పైగా కేసులు నమోదవడం భారత్‌లో వరుసగా బుధవారం ఎనిమిదో రోజు కావడం గమనార్హం. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటివరకూ 90,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో గత ఏడాది డిసెంబర్‌లో మహమ్మారి వెలుగుచూసిన 84,000కు పైగా కేసులను మహారాష్ట్ర అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment