జెనివా: ధూమపానం(పొగ త్రాగేవారు) చేసేవారిలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) స్పష్టం చేసింది. స్మోకింగ్‌ను వదిలేయాలని.. దీంతో కరోనా రిస్క్ తగ్గుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసన్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన ''క్విట్ టొబాకో క్యాంపెయిన్'' కార్యక్రమంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము చేపట్టిన క్విట్ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో అన్ని దేశాలు చేతులు కలపాలని కోరారు. దీనిపై ప్రజలకు అవసరమైన సమాచారం, సపోర్ట్, టూల్స్ అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో నేరుగా పనిచేస్తున్నట్లు టెడ్రోస్ పేర్కొన్నారు.
చదవండి:
చైనాలో దడపుట్టిస్తున్న కొత్తరకం స్రెయిన్
Comments
Please login to add a commentAdd a comment