
జెనివా: కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త అందించింది. కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని 90 శాతం మందిలో కొంత మేర రోగనిరోధక శక్తి పెంపొందినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్‌కు గురికావటం లేక వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచంలోని 90 శాతం మందిలో కోవిడ్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది’ అని తెలిపారు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్.
కోవిడ్-19 మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని, అయితే, వైరస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోల్ అధనోమ్. వైరస్‌పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. అంతకు ముందు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: Viral Video: భయానక దృశ్యం.. చెరువులో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి
Comments
Please login to add a commentAdd a comment