సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు డాక్టర్ హన్స్ క్లూజీ చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే యూరోప్‌లో 70 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, దీని ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో ఈ అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇన్‌ఫెక్షన్లు రెండింతలు అయినట్లు తెలుస్తోంది. యూరోప్‌లో 8 వారాల్లోగా సగం మందికి ఒమిక్రాన్ సోకుతుందని సియాటిల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ సంస్థ వెల్లడించినట్లు డాక్టర్ క్లూజీ తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. 2,46,780 కేసులతో యూకే తొలి స్థానంలో ఉండగా.. 66,563 కేసులతో డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్‌లో 4,868 ఒమిక్రాన్ కేసులున్నాయి.
(చదవండి: వాసనతో ప్రమాదం పసిగట్టి గోల్డ్ మెడల్ అందుకున్న చిట్టి హీరో.. ఇక లేడు)
Comments
Please login to add a commentAdd a comment