జెనీవా: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వేరియంట్ బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్‌వో నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ తెలిపారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని వెల్లడించారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని పేర్కొన్నారు.
(చదవండి: సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. వారంలో ఆ రోజు పూర్తిస్థాయి లాక్‌డౌన్)
అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని.. హాస్పిటల్స్‌లో చేరే పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత వేరియంట్లు తీవ్రమైన న్యూమోనియాకు దారితీసి ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్ శ్వాస వ్యవస్థ పైభాగంలో ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని చెప్పారు. ఇది ఒకరమైన మంచి వార్తే అయినప్పటికీ, దానిని నిరూపించడానికి మాకు మరిన్ని అధ్యయనాలు అవసరమని డాక్టర్ అబ్దీ మహముద్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడినట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
(చదవండి: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం ఆ రాష్ట్రంలోనే.. వెల్లడించిన కేంద్రం)
Comments
Please login to add a commentAdd a comment