ఒమిక్రాన్​ ఎంత పని​ చేసిందంటే.. | Corona Virus: WHO Reacts On Omicron Variant Cases And Deaths | Sakshi
Sakshi News home page

ఒమిక్రాన్​ ప్రభావం మరీ ఘోరం! ఎంతగా డ్యామేజ్​ చేసిందంటే..

Published Wed, Feb 9 2022 2:08 PM | Last Updated on Wed, Feb 9 2022 2:08 PM

Corona Virus: WHO Reacts On Omicron Variant Cases And Deaths - Sakshi

కరోనా వేరియేంట్లలో ప్రమాదకరం కాకపోయినా.. వేగంగా ఇన్​ఫెక్షన్​లతో వెల్లువలా కేసులు పెరగడానికి కారణమైంది ఒమిక్రాన్​. కిందటి ఏడాది చివర్లో మొదలైన ఒమిక్రాన్​ విజృంభణ.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది.  ప్రస్తుతం చాలా దేశాల్లో కేసుల తగ్గుముఖంతో సాధారణ ప్రజానీకానికి సడలింపులు, ఆంక్షల ఎత్తివేతతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్​పై ఓ లెక్క అంటూ రిలీజ్​ చేసింది డబ్ల్యూహెచ్​వో.. 

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ను నవంబర్​ చివర్లో కరోనా వేరియెంట్​గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయని WHO ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మరణాలు నమోదు అయ్యాయని తెలిపింది. విషాదానికి మించినది ఈ పరిణామం అని ఈ గణాంకాలపై వ్యాఖ్యానించారు ఆరోగ్య సంస్థ మేనేజర్​ అబ్ది మహముద్​.

 

ప్రమాదకరమైన డెల్టా వేరియెంట్​ తర్వాత ఒమిక్రాన్​.. ప్రపంచంపై తన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రమాదకరమైంది కాకపోయినా.. త్వరగతిన వ్యాపిస్తూ కేసుల సంఖ్యను పెంచేసింది. కరోనా వేరియెంట్లు వచ్చి తగ్గిన పేషెంట్లపై మరికొంత కాలం ప్రభావం చూపిస్తుండగా.. ఒమిక్రాన్​ మాత్రం సుదీర్ఘకాలం చూపించే అవకాశం ఉండడం గమనార్హం. కరోనా మొదలైనప్పటి నుంచి తీవ్రస్థాయిలో రేంజ్​లో కేసులు వెల్లువెత్తడం ఒమిక్రాన్​ వల్లే అయ్యింది. అనధికారికంగా ఈ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ, ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం మాత్రమే ఇది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కరోనాలో ఒమిక్రాన్​ చివరి వేరియెంట్​ కాకపోవచ్చని, ఒకవేళ తర్వాత వేరియెంట్​ గనుక పుట్టుకొస్తే.. దాని తీవ్రత మరింత దారుణంగా ఉండబోతుందంటూ డబ్ల్యూహెచ్​వో ఇదివరకే ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.

 

COVID-19 డిసెంబర్ 2019 లో చైనాలో కరోనా వైరస్​ పుట్టిందని ప్రకటించినప్పటి నుంచి.. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లమందికిపైగా కరోనా(వివిధ వేరియెంట్లు) బారినపడ్డారు. మొత్తం 57 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. ఇందులో భారత్​ నుంచి మరణాలు ఐదు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్​లో భాగంగా ఇప్పటిదాకా పది బిలియన్లకు పైగా వ్యాక్సిన్​ డోసులు ప్రజలకు అందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement