Omicron Variant Updates
-
భారత్‌లో ఎండెమిక్ స్టేజ్‌కు కరోనా
భారత్‌లో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. ఆందోళన అక్కర్లేదని అంటున్నారు ఆరోగ్యశాఖ అధికారులు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే చాలని ప్రజలకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే రాబోయే రెండు వారాల్లో భారత్‌లో కేసులు విపరీతంగా పెరుగుతాయని, ఆ తర్వాత గణనీయంగా తగ్గిపోతాయని చెబుతున్నారు. రాబోయే 10-12 రోజుల్లో ఎండెమిక్ స్టేజ్(స్థానిక దశ)కు కేసుల సంఖ్య చేరుకోవచ్చు. ఆ తర్వాత కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది. అంతేకాదు కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగా ఉన్నాయని, రాబోయే రోజుల్లోనూ ఇది ఇలాగే కొనసాగుతుందని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో 21.6 శాతం, మార్చిలో 35.8 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. ఎండెమిక్ అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రజల మధ్య శాశ్వతంగా ఉండిపోయే స్థితి. "ఎండెమిక్‌గా మారి, పూర్తిగా అంతం కాని ఎన్నో వ్యాధులు ఇప్పుడు మన మధ్యే ఉన్నాయి. అవి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఎండెమిక్‌గా మారుతాయి. అంటే తట్టు, సాధారణ ఫ్లూ, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, మశూచి లాంటి వ్యాధులు. పాండెమిక్ అంటే ప్రజల్లో తీవ్రంగా సోకి, పెద్ద ఎత్తున వ్యాపించే ఒక వ్యాధి. ఇక ఎండెమిక్ అంటే జనాల మధ్యే ఉంటూ, ఎక్కువకాలం పాటు అలా ఉండిపోయే వ్యాధి. భారత్‌లో కొత్తగా ఏడు వేలకు పైగా కేసులు -
అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే?
చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ వస్తూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఆల్ఫా, డెల్టా అంటూ తీవ్రమైన వేరియెంట్ల రూపంలో అనేక మంది ఉసురు తీశాయి. మూడో వేవ్‌గా వచ్చిన ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదుగానీ ఇంతలోనే ఒమిక్రాన్ తాలూకు మరో సబ్–వేరియెంట్ అయిన ఎక్స్‌బీబీ 1.5 వచ్చి అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లోని ఇంటికొకరు చొప్పున అమెరికాలో నివాసముంటూ... రోజూ కొన్ని లక్షల మంది యూఎస్ నుంచి ఇండియాకీ, ఇక్కణ్ణుంచి మళ్లీ యూఎస్‌కు వెళ్తూ వస్తూ, పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఈ సబ్ వేరియెంట్ ప్రమేయం (రెలవెన్స్) ఏమిటీ, ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ప్రతి జీవీ తన మనుగడ కోసం కొత్త మ్యూటేషన్స్‌తో ముందుకంటే మరింత సమర్థమైన జీవిగా పరిణామం చెందడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఒమిక్రాన్ సబ్–వేరియెంట్ కూడా జన్యుపరమైన మార్పులను చేసుకుంటూ 500 కంటే ఎక్కువ రూపాలను సంతరించుకుంది. ఈ ఎక్స్‌బీబీ 1.5 కూడా ఇలాంటి ఓ కొత్త సబ్–వేరియెంటే! ఎక్స్‌బీబీ 1.5 అనే ఈ తాజా సబ్–వేరియెంట్... రెండు రకాల వేరియంట్స్ కలిసినందువల్ల, మరో కొత్త వేరియంట్ గా మారింది. అంటే... బీజే–1 (బీఏ.2.10.1.1) అనే ఒక వేరియంటూ, అలాగే బీఏ.2.75 (బీఏ.2.75.3.1.1.1) మరో వేరియెంట్ల కలయిక వల్ల ‘ఎక్స్‌బీబీ’ అనే ఈ సబ్–వేరియంట్ పుట్టుకొచ్చింది. అది మరొక మ్యుటేషన్‌కి గురికావడంతో తాజాగా తన ప్రభావం చూపిస్తున్న ఈ ‘ఎక్స్‌బీబీ – 1.5’ తయారయింది. ఈ సబ్–వేరియెంట్ పుట్టుకకు కారణమైన మ్యుటేషన్‌ని ‘ఎఫ్486పీ’ అని పిలుస్తున్నారు. దీనికి ఓ ముద్దుపేరూ ఉంది... ఎక్స్‌బీబీ 1.5కి ఓ ముద్దు పేరూ ఉంది. ‘క్రాకాన్’ అన్నది దీని పెట్‌నేమ్. అంటే ‘సముద్ర భూతం’ అని అర్థం. అయితే... ఈ నిక్–నేమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇవ్వలేదు. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీనికా పేరు పెట్టారు. ఇందుకో కారణం కూడా ఉంది. అదేమిటంటే... ఒమిక్రాన్‌కు ఉన్న అనేక వేరియంట్ల కంటే కూడా... ఈ ‘ఎక్స్‌బీబీ–1.5’ అన్నది మానవ వ్యాధినిరోధక వ్యవస్థను (ఇమ్యూనిటీని) తప్పించుకోవడంలో దిట్ట అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ఎక్స్‌బీబీ 1.5’ సబ్–వేరియెంట్... మునుపటి వేరియంట్ల కంటే మరింత తేలిగ్గా, మరింత బలంగా ‘ఏసీఈ2 రిసెప్టార్’లతో అనుసంధానితమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే వారు ఈ సబ్–వేరియంట్‌కు ‘క్రాకన్’ అనే నిక్–నేమ్ ఇచ్చారు. మనదేశంలో ఎక్స్‌బిబి 1.5 వ్యాప్తికి అవకాశమెంత? ఇప్పుడు ప్రపంచంలోని ఓ మూల నుంచి మరో మూల వరకు రాకపోకలు మామూలైపోయాయి. ప్రపంచమో పల్లెటూరుగా మారినందుకే ఇప్పుడు భూగోళాన్ని ‘గ్లోబల్ విలేజ్’ అంటూ అభివర్ణిస్తున్నారు. పెద్ద ఎత్తున పెరిగిన రవాణా, రాకపోకలూ, వలసల వంటి వాటివల్ల ఈ కొత్త వేరియంట్ అమెరికా నుంచి అన్ని ప్రాంతాలకూ, ఆ మాటకొస్తే మన దేశానికి సైతం పాకే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఒకసారి భారత్‌కు వచ్చాక మన దేశవాసులు ఈ ఎక్స్‌బిబి 1.5 తో ఎలాంటి ఇబ్బందులకు లోనవుతారనే విషయాన్ని అంచనా వేయడానికి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడానికి లేదు. ఒమిక్రాన్ కారణంగా మన దేశవాసుల్లో కరోనా పట్ల ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా వచ్చింది. అందువల్ల వేగంగా విస్తరించినప్పటికీ ఈ ‘ఎక్స్ బి బి 1.5’ మన దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తుందనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని చెప్పవచ్చు. అందుకే ఈ వేరియంట్ వల్ల మనదేశవాసులంతా భయాందోళనలకు గురికావలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ వ్యాధినిరోధక శక్తి కాస్తంత తక్కువగా ఉన్నవారు, ఇతరత్రా వ్యాధులతో ఇప్పటికీ బాధడుతున్నవారు మాత్రం ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది? అమెరికాలోని వ్యాధుల నిపుణురాలు (ఎపిడిమియాలజిస్టు) అయిన మేరియా వాన్ కెర్కోవ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ వచ్చిన అన్ని కరోనా వైరస్ల కన్నా ఈ ఎక్స్‌బీబీ 1.5 చాలా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది. అంతేకాదు ప్రస్తుతం దీని ప్రభావం అమెరికాతో పాటు మరో 29 దేశాలలో కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘అందువల్ల అమెరికా మాత్రమే కాకుండా మిగతా అన్ని దేశాల ప్రజలతో పాటు అమెరికా నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల ప్రజలూ, విమాన ప్రయాణీకులందరూ మునపటిలాగే మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు చేపట్టడం అవసరం’’ అంటూ ఆమె (మేరియా) పేర్కొన్నారు. ఇక గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం బూస్టరు డోసులు తీసుకోవాలంటూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ సూచిస్తోంది. నిర్ధారణ పరీక్షలు గతంలో మాదిరిగానే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గాని రాపిడ్ టెస్టుల్లో గాని ఈ వేరియంట్ కూడా తక్కిన ఒమిక్రాన్ వేరియంట్లలా బయటపడుతుంది. ఈ వేరియంట్ లక్షణాలేమిటి? మిగతా కరోనా వేరియెంట్లు, ఒమిక్రాన్ మాదిరిగానే ఎక్స్‌బిబి 1.5 కూడా... జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు కలగజేస్తుంది. వృద్ధుల్లోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి (ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్)లోనూ, ఇప్పటికే ఇతరత్రా తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలున్న(కో–మార్బిడిటీ)వారిలో ఈ వేరియెంట్ కాస్తంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉండవచ్చు. అంతే తప్ప మిగతా వారందరిలో ఇదో చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి తగ్గిపోయే అవకాశాలే చాలా ఎక్కువ. మందులేమిటీ/ నివారణ ఏమిటి? ఈ వేరియెంట్‌కు ‘మోనోక్లోనల్ యాంటీ బాడీ’ ఇంజక్షన్లు పనిచేయవు. ఇప్పటికే భారతదేశంలో అనుమతి పొందిన ‘పాక్స్ లోవిడ్’ ట్యాబ్లెట్లు ఈ సబ్–వేరియంట్‌కి కాస్తంత సమర్థంగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఇప్పుడు అందుబాటులో ఉన్న బై వాలెంట్ కరోనా వ్యాక్సిన్లు దీని నుంచి రక్షణ కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక గతంలో మాదిరిగానే మాస్కులు ధరించడం, సబ్బుతోగానీ, శ్యానిటైజర్లతోగానీ చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, ఇంటినీ, పరిసరాలను డిస్–ఇన్ఫెక్టెంట్లతో తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమూహాల్లోకి, గుంపుల్లోకి (క్రౌడ్స్‌లోకి) వేళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలను పాటిస్తే చాలు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
కరోనా XBB వేరియంట్ గుప్పిట్లో భారత్.. ముప్పు తప్పదా?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సబ్ వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుండడం అందుకు బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశోధన సంస్థ, సార్స్ కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియ్ ఇన్సకాగ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌బీబీ వేగంగా విస్తరిస్తోందని సోమవారం ఓ బులిటెన్ విడుదల చేసింది. ఎక్స్‌బీబీతో పాటు బీఏ.2.75, బీఏ.2.10 సైతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిపింది. ‘ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీఏ 2.75 ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, వ్యాధి వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనల్లో ఎలాంటి పెరుగుదల లేకపోవటం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్, దాని ఉప రకాలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. XBB అనేది భారత దేశం అంతటా ప్రస్తుతం ప్రభావం చూపుతున్న అత్యంత ప్రబలమైన వేరియంట్. నమోదవుతున్న కేసుల్లో 63.2 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్‌వే. బీఏ.2.75 కేసులు 46.5 శాతం, ఎక్స్‌బీబీ దాని ఉపరకాలు 35.8 శాతం ఉన్నాయి. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1ల వ్యాప్తిపై ఇన్సకాగ్ నిశితంగా పరిశీలిస్తోంది.’ అని బులిటెన్‌లో పేర్కొంది ఇన్సకాగ్. ఇదీ చదవండి: ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి -
కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!
జెనీవా: చైనాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభణతో వచ్చే మూడు నెలల్లో దేశ జనాభాలోని 60 శాతం మంది వైరస్‌బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు సూచించారు. వైరస్ బారినపడే అవకాశం ఉన్న వారికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వారాంతంలో నిర్వహించే మీడియో సమావేశంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కోవిడ్ విజృంభణతో చైనాలో తలెత్తుతున్న పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. వ్యాధి వ్యాప్తి తీవ్రత, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, ఐసీయూల అవసరం వంటి వివరాలు సమర్పించాలి. దేశవ్యాప్తంగా వైరస్ బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ మద్దతుగా నిలుస్తుంది. క్లినికల్ కేర్, ఆరోగ్య వ్యవస్థ భద్రతకు మా మద్దతు కొనసాగుతుంది.’ - డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ 2020 నుంచి కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తోంది చైనా. జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది. అయితే, ప్రజాగ్రహంతో ఎలాంటి ప్రకటన చేయకుండానే డిసెంబర్ తొలినాళ్లలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది బీజింగ్ ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: Lockdown: కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ.. -
భారత్‌లోకి చైనా వేరియంట్ ఎంట్రీ.. అప్పుడే మూడు కేసులు..
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కారణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా ఆ వేరియంట్ భారత్‌కూ వ్యాపించటం కలకలం సృష్టిస్తోంది. చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో మరో కేసు వెలుగు చూసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వేరియంట్‌పై వివరాలు వెల్లడించారు నిపుణులు. బీఎఫ్7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ వ్యాప్తిలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్లపై నిఘా పెట్టడం చాలా కీలకమని పేర్కొన్నారు. చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగటం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవటం వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. బీఎఫ్.7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రజల్లోని రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి ఉప రకం. దీనికి ఒకరి నుంచి ఒకరికి సోకే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ బీఎఫ్7 వేరియంట్‌ను అమెరికా, యూకే, ఐరోపా దేశాల్లోనూ గుర్తించారు. విమానాశ్రయాల్లో హైఅలర్ట్.. చైనా సహా విదేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోకి వచ్చే వారికి రాండమ్‌గా కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల కోసం ఉన్న మార్గదర్శకాలు యథాతథంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన -
వామ్మో.. 20 రోజుల్లో 20లక్షల మందికి కరోనా పాజిటివ్!
లండన్: కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ భయాందోళనలు పెంచుతున్నాయి. బ్రిటన్‌లో కొద్ది రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క ఇంగ్లాండ్‌లోనే ప్రతి 30 మందిలో ఒకరికి కోవిడ్ ఉన్నట్లు ద గార్డియన్ వెల్లడించింది. గడిచిన వారంలోనే 17 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇంగ్లాండ్ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.’ అని కోవిడ్-19 సర్వే చేపట్టిన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సారా క్రాఫ్ట్ తెలిపారు. ముందు ముందు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, యూకే ఆరోగ్య విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. అక్టోబర్ 17 వరకు 7,809 మంది చేరినట్లు తెలిసింది. కోవిడ్-19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బీఏ.5 పరివర్తనం చెంది ఒమిక్రాన్ బీక్యూ1.1 కొత్త వేరియంట్ ఉద్భవించింది. ప్రస్తుతం బీక్యూ1.1 వేరియంట్ రోగనిరోధక శక్తి కళ్లుగప్పి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 300లకుపైగా ఒమిక్రాన్ సబ్వేరియంట్లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: Gujarat Polls: ఆ సీట్లలో బీజేపీ ఒక్కసారి కూడా గెలవలే.. కారణమేంటి? -
ప్రమాదకరంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. శీతాకాలంలో విజృంభణ!
లండన్: కరోనా వైరస్‌లో(సార్స్–కోవ్–2) కొత్తగా పుట్టుకొచ్చిన బీఏ.2.75.2 అనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. ఇది మనుషుల రక్తంలోని ప్రతిరక్షకాల (యాంటీబాడీలు) నుంచి సమర్థంగా తప్పించుకున్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్–19 యాంటీబాడీ చికిత్సలను కూడా తట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ అంటువ్యాధుల పత్రికలో ప్రచురించారు. ప్రస్తుత శీతాకాలంలో కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అందుకే ముందుజాగ్రత్తగా అప్డేటెడ్ టీకాలు తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని పరిశోధకులు సూచించారు. కరోనా ఒమిక్రాన్‌లోని బీఏ.2.75 అనే వేరియంట్ ఉత్పరివర్తనం చెందడంతో బీఏ.2.75.2 ఉప వేరియంట్ పుట్టినట్లు కనిపెట్టారు. ఈ ఏడాది మొదట్లోనే ఇది బయటపడింది. కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైతే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేమన్నది పరిశోధకులు మాట. కోవిడ్–19 బారిన పడే అవకాశం అధికంగా ఉన్నవారికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్! -
'బీఏ5 వేరియంట్' కలవరం.. మూడు డోసులు తీసుకున్నా ఇన్ఫెక్షన్
కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త రూపంలో మానవాళిని భయపెడుతోంది ఈ మహమ్మారి. కొద్ది రోజులుగా భారత్‌తో పాటు పలు దేశాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌పై విస్తుపోయే విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల, గతంలో వైరస్ బారినపడి కోలుకోవటం వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తిని సైతం ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.5 హరిస్తోందని తేల్చారు. వారాల వ్యవధిలోనే మళ్లీ సోకుతోందని వెల్లడించారు. బీఏ.4తో పాటు బీఏ.5 వేరియంట్ కారణంగానే భారత్, అమెరికా, యూకే, ఇటలీ, చైనాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని అంచనాకు వచ్చారు. కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్ ప్రమాదకరంగా మారుతోంది. సులభంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతోంది. 'ఈ వేరియంట్ ఎందుకు ప్రమాదకరంగా మారుతోందంటే.. గతంలో వచ్చిన ఇమ్యూనిటీని ఎదుర్కొని సులభంగా శరీరంలోకి ప్రవేశించటమే. 2020లో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్ బీఏ1 వేరియంట్ బారినపడి కోలుకోగా వచ్చిన రోగనిరోధక శక్తి సైతం ఎలాంటి రక్షణ కల్పించదు' అని తెలిపారు కాలిఫోర్నియా యూనివర్సిటిలో పని చేస్తున్న అంటువ్యాధులు నిపుణులు బ్లూమ్‌బెర్గ్. ఇటీవల సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక సైతం బీఏ5 వేరియంట్‌పై హెచ్చరించింది. మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్ మళ్లీ సోకుతున్నట్లు పేర్కొంది. రోగనిరోధక శక్తిని రహస్యంగా ఎదురుకునే వేరియంట్‌గా అభివర్ణించారు లండన్‌లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు. గతంలోని వేరియంట్ల కంటే ప్రమాదకరమని, ఈ వేరియంట్‌ను ఇమ్యూన్ వ్యవస్థ గుర్తించలేకపోతోందని వెల్లడించారు. ఇదీ చదవండి: 'సూపర్ మూన్'గా జాబిల్లి.. మరో రెండ్రోజుల్లోనే.. -
డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా సబ్‌వేరియంట్ కలకలం
షాంఘై: కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు నగర హెల్త్ కమిషన్ డిప్యూటీ డెరెక్టర్ జావో డాండన్ వెల్లడించారు. రెండు నెలల అనంతరం షాంఘై నగరంలో జూన్ మొదటివారంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానికంగా వ్యాప్తి చెందుతున్న కేసుల సంఖ్య పెరిగినట్లు జావో వివరించారు. దీంతో షాంఘైలో నివాసముండే వారికి జులై 12-14 మధ్య రెండు రౌండ్ల కరోనా పరీక్షలు నిర్వహించిననున్నట్లు చెప్పారు. విదేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ BA.5 రకాన్ని చైనాలో తొలిసారి మే 13న షాంఘై నగరంలో గుర్తించారు. ఉగాండ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో ఇది బయటపడింది. ఇప్పుడు అందులోనే సబ్వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో ఇప్పటివరకు మొత్తం 2,26,610 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 5,226 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో 2,20,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,004 యాక్టివ్ కేసులున్నాయి. -
Corona Virus: 110 దేశాల్లో వెల్లువలా కరోనా కేసులు
జెనీవా: కరోనా వైరస్.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు. కేవలం రూపం మాత్రమే మార్చుకుంటోంది అంతే. ప్రస్తుతం 110 దేశాల్లో కేసులు వెల్లువలా పెరిగిపోతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మహమ్మారి మారుతోంది కానీ అది ముగియలేదు. #COVID19 వైరస్‌ని ట్రాక్ చేయగల మా(డబ్ల్యూహెచ్‌వో) సామర్థ్యం ముప్పు అంచుకి చేరుకుంది. ఒమిక్రాన్, దాని నుంచి పుట్టుకొస్తున్న వేరియెంట్లను ట్రాక్ చేయడం, విశ్లేషించడం చాలా కష్టతరంగా మారుతోంది. కాబట్టి ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ ప్రకటించారు. బీఏ.4, బీఏ.5.. కేసులు వెల్లువలా పెరిగిపోతున్నాయ్. కానీ, కొత్త వేరియెంట్ల జాడను ట్రేస్ చేయలేకపోతున్నాం. వాటిలో ముప్పు కలిగించే వేరియెంట్లు లేకపోలేదు. దాదాపు 110 దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల గతంతో పోలిస్తే.. 20 శాతం అధికంగా పెరిగిపోయాయి. కేవలం డబ్ల్యూహెచ్‌వో పరిధిలోని ఆరు రీజియన్లలో మూడింటిలో మరణాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించడం ఒక్కటే రాబోయే ముప్పును తగ్గించగలదు. గత 18 నెలల నుంచి.. 12 బిలియన్ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ డోసుల ప్రక్రియ పూర్తైంది. కనీసం 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని.. తద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమో, జరగబోయే నష్ట తీవ్రతను తగ్గించడమో చేసుకోవచ్చని ప్రపంచ దేశాలకు పిలుపు చేయాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపు ఇచ్చింది. మరోవైపు భారత్‌లోనూ 14వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదు అవుతుండడం చూస్తున్నాం. -
దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం
ఢిల్లీ: భారత్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన దేశంలోనూ వెలుగు చూడడం ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌లో బీఏ.4, బీఏ.5 సబ్‌వేరియెంట్ కేసులు బయటపడినట్లు ఇన్సాకాగ్ (INSACOG) ప్రకటించింది. బీఏ.4 కేసులు తెలంగాణ, తమిళనాడులో వెలుగు చూడగా.. బీఏ.5 కేసు తెలంగాణలోనే బయటపడిందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియెంట్లో ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు.. కరోనాలో ఇప్పటిదాకా అత్యంత వేగవంగా వైరస్‌ను వ్యాప్తి చెందించేవిగా పేరొందాయి. దక్షిణాఫ్రికా నుంచి దీని విజృంభణ మొదలైందని తెలిసిందే. అయితే ఒమిక్రాన్ ప్రధాన వేరియంట్ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి ద్వారా సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. ఇన్సాకాగ్ ఆదవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. తమిళనాడులో 19 ఏళ్ల యువతిలో బీఏ.4 ఉపవేరియెంట్ బయటపడిందని, అలాగే తెలంగాణలో (హైదరాబాద్ ఎయిర్పోర్ట్) సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లోనూ ఈ ఉపవేరియెంట్ వెలుగు చూసింది. మరోవైపు తెలంగాణలోనే 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 ఉపవేరియెంట్ కనుగొన్నట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఈ వృద్ధుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, పైగా వ్యాక్సినేషన్ ఫుల్‌గా పూర్తికాగా, కేవలం స్వల్పకాలిక లక్షణాలే బయటపడినట్లు తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు.. కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు. భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సబ్ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ.. మరిన్ని వేరియెంట్లు.. అందులో ప్రమాదకరమైనవి ఉండే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం).. కరోనా వేరియెంట్ల కదలికలపై, కేసుల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించే కేంద్ర ఆధీన విభాగం. చదవండి: శారీరకంగా కలవడం వల్లే వైరస్ విజృంభణ! -
దక్షిణ కొరియాలో కొవిడ్ విలయతాండవం
-
చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
-
ఒమిక్రాన్ ఎంత పని చేసిందంటే..
కరోనా వేరియేంట్లలో ప్రమాదకరం కాకపోయినా.. వేగంగా ఇన్ఫెక్షన్లతో వెల్లువలా కేసులు పెరగడానికి కారణమైంది ఒమిక్రాన్. కిందటి ఏడాది చివర్లో మొదలైన ఒమిక్రాన్ విజృంభణ.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో కేసుల తగ్గుముఖంతో సాధారణ ప్రజానీకానికి సడలింపులు, ఆంక్షల ఎత్తివేతతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్‌పై ఓ లెక్క అంటూ రిలీజ్ చేసింది డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ను నవంబర్ చివర్లో కరోనా వేరియెంట్‌గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయని WHO ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మరణాలు నమోదు అయ్యాయని తెలిపింది. విషాదానికి మించినది ఈ పరిణామం అని ఈ గణాంకాలపై వ్యాఖ్యానించారు ఆరోగ్య సంస్థ మేనేజర్ అబ్ది మహముద్. ప్రమాదకరమైన డెల్టా వేరియెంట్ తర్వాత ఒమిక్రాన్.. ప్రపంచంపై తన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రమాదకరమైంది కాకపోయినా.. త్వరగతిన వ్యాపిస్తూ కేసుల సంఖ్యను పెంచేసింది. కరోనా వేరియెంట్లు వచ్చి తగ్గిన పేషెంట్లపై మరికొంత కాలం ప్రభావం చూపిస్తుండగా.. ఒమిక్రాన్ మాత్రం సుదీర్ఘకాలం చూపించే అవకాశం ఉండడం గమనార్హం. కరోనా మొదలైనప్పటి నుంచి తీవ్రస్థాయిలో రేంజ్లో కేసులు వెల్లువెత్తడం ఒమిక్రాన్ వల్లే అయ్యింది. అనధికారికంగా ఈ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ, ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం మాత్రమే ఇది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కరోనాలో ఒమిక్రాన్ చివరి వేరియెంట్ కాకపోవచ్చని, ఒకవేళ తర్వాత వేరియెంట్ గనుక పుట్టుకొస్తే.. దాని తీవ్రత మరింత దారుణంగా ఉండబోతుందంటూ డబ్ల్యూహెచ్‌వో ఇదివరకే ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. COVID-19 డిసెంబర్ 2019 లో చైనాలో కరోనా వైరస్ పుట్టిందని ప్రకటించినప్పటి నుంచి.. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లమందికిపైగా కరోనా(వివిధ వేరియెంట్లు) బారినపడ్డారు. మొత్తం 57 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. ఇందులో భారత్ నుంచి మరణాలు ఐదు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా పది బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందాయి. -
ఒమిక్రాన్ రోగనిరోధక శక్తి డెల్టానూ ఎదుర్కొంటోంది
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డెల్టాతో పాటు ఇతర వేరియెంట్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్ వచ్చే అవకాశమే లేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మొత్తం 39 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్ రెండు డోసులు తీసుకున్నారు. ఆరుగురు అసలు టీకాలు వేసుకోలేదు. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్య యనం పేర్కొన్నది. ఒమిక్రాన్ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే అధ్య యనం చేయడం ఇందుకు కారణం కావచ్చని అభిప్రాయపడింది. -
తెలంగాణ: వచ్చేవారంలో పతాకస్థాయికి ఒమిక్రాన్.. తగ్గేది మాత్రం అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వచ్చే వారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుందని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే వారం తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండు మూడు వారాల్లో పీక్కు చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పడుతుందన్నారు. మానవుడి పుట్టుక తర్వాత ఇంత వేగంగా విస్తరించిన వైరస్ లేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత, వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 80 శాతం మందికి వైరస్... మీజిల్స్ వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది అనుకున్నాం. కానీ ఒమిక్రాన్ దానిని మించిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది వైరస్ బారినపడతారు. 50 నుంచి 80 శాతం వేగంతో విస్తరిçస్తున్నందున త్వరగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దగ్గు, జలుబు తుంపర్ల ద్వారా ఇది విస్తరిస్తుంది. మాస్క్ లేకుండా ఉంటే మరింత వేగంగా విస్తరిస్తుంది. ఇళ్లలో ఒకరికి వస్తే ఇతరులకూ వ్యాపిస్తుంది. (చదవండి: ఆటలు వద్దు.. సూచనలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్) ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్ చేయదు ఒమిక్రాన్ సోకినప్పుడు ఎక్కువ కేసుల్లో లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. గొంతులో ముక్కులో ఉండే వైరస్ ఇది. ఊపిరితిత్తులను ఇన్పెక్ట్ చేయదు. డెల్టా మందులు పనికిరావు డెల్టాకు వాడే మందులు ఒమిక్రాన్‌కు పనికిరావు. డెల్టాకు స్టెరాయిడ్స్, రెమిడిసివిర్, మోనొక్లోనాల్ యాంటీబాడీస్ ఉపయోగించాం. కానీ ఒమిక్రాన్‌కు ‘మాన్లువిరపిర్’అనే మాత్ర వేసుకోవాలి. ఇది ఎం తో సురక్షితమైంది. మొదటి రెండ్రోజులు జ్వరం అ లాగే ఉంటే ఈ మందు వేయొచ్చు. కానీ గర్భిణిలు, త్వరలో ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఇవ్వకూడదు. ఈ మందు తీసుకున్న ఆరు నెలల వరకు ప్రెగ్నెన్నీ కో సం ప్రయత్నించకూడదు. కొందరు అనుభవం లేని డాక్టర్లు ఇప్పటికీ అనవసరంగా క్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు. డెల్టానా, ఒమిక్రానా తెలుసుకోవచ్చు ఎస్ జీన్ ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్చేస్తే అందులో ఒమిక్రానా లేదా డెల్టా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షలు ప్రభుత్వంలో అందుబాటులో లేవు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో కొన్నిచోట్ల చేస్తున్నారు. మేము మా ఆస్పత్రిలో రూ.1,200 తీసుకుని ఔట్ పేషెంట్లకు, అవసరమైన వారికి కూడా చేస్తున్నాం. డోలో వేసుకుంటే చాలు: ఒమిక్రాన్‌లో జ్వరం వస్తే డోలో వేసుకుంటే సరిపోతుంది. ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండి, చివరి 24 గంటల్లోపు జ్వరం లేకుంటే సాధారణ జీవనంలోకి రావొచ్చు. డోలో వేసుకున్నా రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇది సోకితే భవిష్యత్తులో కోవిడ్ రాదు ఒమిక్రాన్ వచ్చిపోయిన వారికి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఏళ్లపాటు ఉంటుందంటున్నారు. మళ్లీ భవిష్యత్తులో కోవిడ్ రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఒమిక్రాన్ వచ్చినవారికి డెల్టా వేరియంట్ వచ్చే అవకాశం ఉండదు. కానీ డెల్టా వచ్చిన వారికి ఒమిక్రాన్ వస్తుంది. బూస్టర్‌తో మెరుగైన రక్షణ రెండు వ్యాక్సిన్ల తర్వాత బూస్టర్ తీసుకోవాలని సూచిస్తున్నాం. మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఒమిక్రాన్ వచ్చినా 90 శాతం మందికి ఐసీయూకు వెళ్లే ప్రమాదం ఉండదు. మరణాలు ఉండవు. అలసట, తలనొప్పి ఉంటాయి ఒమిక్రాన్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నాలుగు వారాల వరకు అలసట, తలనొప్పి, ఆందోళనతో కూడిన మానసిక స్థితి ఉంటుంది. ఒమిక్రాన్ వైరస్ వెన్నెముక ద్రవంలోకి చేరుకొని, తర్వాత మెదడుకు చేరుకొని అక్కడ వాపు తీసుకొస్తుంది. దీనివల్ల నాలుగైదు వారాలు పై సమస్యలు వస్తాయి. నిద్ర సరిగా పట్టక పోవడం ఉంటుంది. పిల్లలు తట్టుకుంటున్నారు పిల్లలు ఒమిక్రాన్‌ను తట్టుకుంటున్నారు. ఎవరికీ ఏమీ కావట్లేదు. తల్లిదండ్రులు భయపడి పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. 10% కంటే తక్కువ ఐసీయూ ఆక్యుపెన్సీ హైదరాబాద్‌లో మాలాంటి ఐదారు పెద్దాసుపత్రుల్లోని ఐసీయూల్లో 10 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉంది. కొందరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని కోరుకుంటూ వస్తున్నారు. కొందరు కొత్త మందుల కోసం వస్తున్నారు. మన ప్రభుత్వాలను అభినందించాలి మన దేశంలో వ్యాక్సినేషన్ బాగా జరగడం వల్ల మరణాలు పెద్దగా లేవు. మరణించేవారిలో 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వ్యాక్సినేషన్‌తో ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణ , ఏపీల్లో పీహెచ్‌సీల్లో సైతం వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వాలను అభినందించాలి. (చదవండి: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?) -
మన చేతుల్లోనే... చేతల్లోనే...
ఒక దుర్వార్త... ఆ వెంటనే ఓ శుభవార్త. కరోనాపై దేశంలో తాజాగా వినిపిస్తున్న విషయాలివి. విజృంభిస్తున్న కరోనా మూడోవేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశలో ఉందని ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్2 జీనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియమ్) ఆదివారం హెచ్చరించింది. కరోనా ప్రమాద స్థాయి ఇప్పటికీ అలానే ఉందనీ అప్రమత్తం చేస్తోంది. ఇది ఎవరూ ఇష్టపడని వార్త. కాగా, భయపెడుతున్న ఈ థర్డ్ వేవ్‌కు ఫిబ్రవరి మధ్యకల్లా తెరపడుతుందని ప్రభుత్వ వర్గాల తాజా మాట. ప్రతి ఇంటా ఒకరికి ఇద్దరు జ్వరం, జలుబు లాంటి కరోనా లక్షణా లతో బాధ పడుతున్న వేళ ఇది చెవికి ఇంపైన మాట. రానున్న పక్షం రోజుల్లో ఈ వేవ్ తారస్థాయికి చేరుతుందనే ఐఐటీ మద్రాసు ప్రాథమిక అంచనాతో అప్రమత్తత తప్పనిసరి అని అర్థమవుతోంది. గత తొమ్మిదివారాల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది ఒమిక్రాన్ బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్క. 170కి పైగా దేశాలకు పాకిన ఈ వేరియంట్, వేవ్ విస్తృతికి ఇదే ఉదాహరణ. అలాగే, ఒమిక్రాన్ పోతే ఇక ప్రపంచానికి కరోనా పీడ విరగడ అయినట్టేనని అందరిలో నెలకొంటున్న ఉదాసీనత పెద్ద పొరపాటు. ఒమిక్రాన్ తర్వాత మరిన్ని కొత్త వేరియంట్లు రావ చ్చంటూ డబ్యూహెచ్ఓ చేసిన తాజా ప్రకటన ఓ పారాహుషార్. మన దేశంలో ఇప్పటికీ రోజుకు 3 లక్షల కేసుల పైనే వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 20కి పైనే ఉంది. ఢిల్లీ, ముంబయ్ లాంటి నగరాల్లో ముందుగానే తడాఖా చూపిన థర్డ్ వేవ్ అక్కడ కాస్తంత తగ్గుముఖం పట్టినా, దేశంలోని పలుచోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు విస్తరిస్తూ ఉండడం ఆందోళనకరం. వేర్వేరు భౌగోళిక పరిస్థితులున్న విశాల భారతావనిలో అంతటా ఒకేసారి కరోనా ఉద్ధృతి కనిపించి, ఒకేసారి తగ్గి పోదనే విషయం గమనంలో ఉంచుకోవడం అవసరం. పెరుగుతున్న కేసులతో వైద్యం మొదలు అన్ని రంగాల్లో సిబ్బంది తగ్గి, పని ఒత్తిడి పెరుగు తుండడం మరో పెద్ద చిక్కు. ఒక పక్క డెల్టా ప్రభావం పూర్తిగా పోలేదనీ, నూటికి 10 – 20 కేసులు ఆ వేరియంట్వీ ఉన్నాయనీ ఓ అంచనా. డెల్టా ఉండగానే ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది గనక రెండిందాలా జాగ్రత్త తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశంలో ఇప్పటికి 162 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేయడం సంతోషకరం. దేశంలో 15 ఏళ్ళ పైబడినవారిలో ఇప్పటికి 67.2 శాతం మందికి పూర్తిగా, 91.3 శాతం మందికి కనీసం ఒక డోసు వేసినట్టు లెక్క. కానీ, దురదృష్టవశాత్తూ లోటుపాట్లూ లేకపోలేదు. తొలి డోసే వేస్తున్నా, రెండో డోసు టీకా వేస్తున్నట్టు సర్టిఫికెట్లలో నమోదు చేయడం లాంటి వార్తలు రాజధానుల్లో సైతం రావడం నివ్వెరపరుస్తోంది. చిత్తశుద్ధి లేకుండా లెక్క ల్లోనే టీకా డోసులు చూపించడమనే తప్పిదానికి పాల్పడితే, అది మొదటికే మోసం తెస్తుంది. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకుంటే తప్ప, ఏ ఒక్కరూ సురక్షితం కాదని ప్రపంచమే ఘోషిస్తున్న వేళ కాకి లెక్కలకు దిగితే కష్టం. జనాన్ని మోసం చేయచ్చేమో కానీ, జాలి లేని మహమ్మారిని మోసం చేయలేం. జీవనం దెబ్బతినకుండా ప్రజల్లో, ఆర్థిక వ్యవస్థలో ధైర్యం కలిగించాల్సింది పాలకులైతే, మహమ్మారిని సైతం జయించగలమని ఆత్మవిశ్వాసం ప్రోది చేయాల్సింది వైద్యనిపుణులు. రోజుకో మాట, పూటకో రకం ప్రోటోకాల్... సందేహాలకు దారి తీస్తున్నాయి. మోల్నుపిరావర్ లాంటి ఔష ధాల వాడకంపై వచ్చిన పరస్పర భిన్నమైన ఆదేశాలే అందుకు నిదర్శనం. కోట్ల జనాభా కారణంగా రోగానికి సత్వర చికిత్సపై పరిశోధకులపై ఒత్తిడి ఉండడం సహజమే కానీ, పరిశోధనా ఫలితాలు మన అవసరాలకు తగ్గట్టుగానే ఉండాలని ఒత్తిడి పెడితే సరి కాదు. సెకండ్ వేవ్‌లో లాగా థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరం రాకపోవడం సంతోషించాల్సిందే. కానీ, ఒమిక్రాన్ సాధారణ జ్వరం – జలుబు లాంటిదేననీ, మహమ్మారి కాస్తా మామూలు జలుబులా మారిపోతోందనీ అతి ప్రచారం నిర్లక్ష్యానికి బాటలు వేస్తోంది. పాక్షిక నిజమైన ఆ ప్రచారాన్ని పట్టుకొని, అశ్రద్ధ చూపితే అది ప్రమాదమని నిపుణుల మాట. మరి, ఈ సీరియస్ విషయం జనంలోకి మొదటి ప్రచారమంత బలంగా వెళుతోందా అన్నది ప్రశ్న. తొందరపడి ముందే కూసిన కోయిలలా చేస్తే కష్టం, నష్టం మనకే! మన దేశంలో కరోనా మొదటి వేవ్‌కు కారణమైన ఆల్ఫా వేరియంట్ కన్నా, రెండో వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువ చూపింది. 18 ఉత్పరివర్తనాలున్న డెల్టాతో పోలిస్తే, 50 మ్యుటేషన్లున్న ఒమిక్రాన్ 70 రెట్లు అధికంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌తో ప్రాణహాని లేదని నిర్లక్ష్యంగా తిరిగి, వ్యాప్తిని పెరగనిస్తే చిక్కే. ఒమిక్రాన్ నుంచి కొత్త వేరియంట్లు తలెత్తే ప్రమాదం ఉంది. టీకా వేసుకున్నా సరే దెబ్బ కొడుతున్న ఒమిక్రాన్‌తో పోలిస్తే, ఆ కొత్తవి మునుపటి డెల్టాలా తీవ్రమైనవి కావచ్చని వైద్యుల హెచ్చరిక. అందుకే, థర్డ్ వేవ్ విజృంభణ వేళ అలకు ఎదురెళ్ళ కుండా, తల వంచుకొని తప్పించుకోవాలి. చేజేతులా కొత్త వేరియంట్‌కు కారణం కారాదు. కరోనా అనంతర దీర్ఘకాలిక కోవిడ్ ఇబ్బందులుంటాయనీ విస్మరించరాదు. కరోనా లెక్కల్లో మనం ఒక అంకె మాత్రమే. కానీ, మన కుటుంబానికి... మనమే సర్వస్వం. తోటివారి పట్ల కూడా బాధ్యతతో కరోనా జాగ్రత్తలు పాటించడమే ప్రస్తుత కర్తవ్యం. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా లాంటి మధ్యాదాయ దేశాల్లో సైతం టీకాకరణ 10 శాతం లోపలే అయింది. ఈ ఏడాది మధ్యకల్లా ప్రతి దేశంలో కనీసం 70 శాతం జనాభాకు టీకాలేయడం పూర్తయితేనే, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ సురక్షితం! -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: న్యూజిలాండ్ ప్రధాని పెళ్లి వాయిదా!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. లక్షలాది కొత్త పాజిటివ్ కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్లతో.. పలు దేశాలు అప్రమత్తమై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీకెండ్ లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లో కరోనా వైరస్, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ ఆంక్షలు.. ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డర్న్ పెళ్లికి అడ్డొచ్చాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని జెసిందా ప్రకటించారు. క్లార్క్ గేఫోర్డ్, జెసిందా ఇద్దరు స్నేహితులు. ఇప్పటికే జెసిందా, గేఫోర్డ్ కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో మరోసారి తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం వివాహ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ప్రధాని జెసిందా ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని.. ప్రజలతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాతో ఇబ్బందులను అనుభవిస్తున్నవారిలో తాను కూడా చేరానని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
లక్షల్లో కేసులు.. ఒమిక్రాన్‌పై ఇన్సాకాగ్ కీలక అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని తెలిపింది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు ఇన్సాకాగ్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు బహిర్గతం కావడంలేదు. మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని ఇన్సాకాగ్ పేర్కొంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. (చదవండి: కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే) భారీగా కేసులు ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,33,533 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,87,205 కు పెరిగింది. రెండో వేవ్ (35 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు) తర్వాత ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి. వైరస్ బాధితుల్లో తాజాగా 525 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో అత్యధికంగా కేరళ నుంచి 132 మంది, మహారాష్ట్ర నుంచి 48 మంది బాధితులు ఉన్నారు. గత 24 గంటల్లో 2,59,168 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 17.78 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 93.18 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల 5.57 శాతం. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. (చదవండి: పిల్లల్ని బడికి పంపించేది లేదు! ) -
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2 లక్షల 58వేల 89 కేసులు నమోదయ్యాయి. 385 మంది మృతి చెందారు. లక్షా 58వేల 750 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8వేల 209కి చేరింది. దేశంలో ప్రస్తుతం 16 లక్షల 54వేల 361 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరిగింది. భారత్‌లో ఇప్పటివరకు 157 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. చదవండి: ఆర్థిక వృద్ధిబాటలో అవరోధాలు -
దేశంలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్
-
South Africa: నో లాక్డౌన్! ఆంక్షల్లేవ్.. కరోనా వైరస్‌తో కలిసి జీవిస్తాం..
No lockdown In South Africa: కోవిడ్ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. లాక్డౌన్ కానీ, క్వారంటైన్ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని దక్షిణాఫ్రికా తాజాగా మీడియాకు తెల్పింది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెల్పింది. ఆంక్షల విధింపు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఇతర సామాజిక అంశాలపై ప్రమాదకర ప్రభావాన్ని చూపుతున్నాయని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు జనవరి 9న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్ -19 ఆంక్షలను ప్రభుత్వం గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని, అవి కేవలం నామమాత్రపు ప్రయోజనాలను మాత్రమే ఇస్తాయన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకూ 93 వేల కోవిడ్ మరణాలు సంభవించగా, 33,60,879 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,02,476 కోవిడ్ యాక్టీవ్ కేసులున్నాయి. మొత్తం 35 లక్షల (3.5 మిలియన్లు) కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే! దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ నాలుగో వేవ్‌లో కొట్టుమిట్టాడుతోంది. కొత్త వేరియంట్ దాటికి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతుంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అధిక స్థాయి లాక్డౌన్లకు వెళ్లకుండా, తక్షణ ఆరోగ్య ముప్పు పొంచి ఉందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపిందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌కు ముందు వచ్చిన కోవిడ్ మూడు వేవ్‌లు సహజ సంక్రమణల ద్వారా రోగనిరోధక శక్తి బలం పుంజుకుందని వారు తెలిపారు. ఒమిక్రాన్ ప్రమాదాన్ని టీ సెల్ ఇమ్యునిటీ ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ దేశంలో తక్కువ స్థాయిలో నమోదవుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని అధిక రిస్క్ గ్రూపుల కోసం బూస్టర్ డోస్‌లతో సహా వ్యాక్సినేషన్ ప్రక్రియలను పెంచడం, ఐసోలేషన్ వంటి ఆచరణాత్మక విధానాలను ప్రభుత్వం ఎంచుకోవాలని నిపుణులు సూచించారు. చేతి పరిశుభ్రత, థర్మల్ స్క్రీనింగ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకపోవడం, వెంటిలేషన్ లేని ఇండోర్ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, తగినంత వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవడంపై అక్కడి ప్రభుత్వ దృష్టి నిలిపింది. చదవండి: కన్నీళ్లకు కరగని తాలిబన్లు! అతని కళ్ల ముందే.. -
Corona Update: కరోనా కల్లోలం.. కొత్తగా 2.71 లక్షల కేసులు
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. దేశంలో తాజాగా 2,71,202 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 314 మంది మృతి చెందారు. శనివారంతో(జనవరి 15) పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య 2,369గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377గా ఉంది. మరోవైపు కేసుల పాజిటివ్ రేటు 16.28%గా ఉంది. ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7,743గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 156.76 కోట్లు పూర్తి చేసుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 66 లక్షల డోసుల్ని అందించారు. ముంబై నగరంలో జనవరి 15న పది వేల కొత్త కేసులు, 11 మరణాలు సంభవించాయి. వ్యాక్సినేషన్‌కి ఏడాది పూర్తి #1YearOfVaccineDrive.. భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవియా ప్రకటించారు. आज विश्व के सबसे बड़े टीकाकरण अभियान को 1 वर्ष पूर्ण हो गया है। PM @NarendraModi जी के नेतृत्व में शुरू हुआ यह अभियान 'सबके प्रयास' के साथ आज दुनिया का सबसे सफल टीकाकरण अभियान है। मैं सभी स्वास्थ्य कर्मियों, वैज्ञानिकों व देशवासियों को बधाई देता हूँ। #1YearOfVaccineDrive pic.twitter.com/IvoX3Z9Nso — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022 -
చైనాలో పెరుగుతున్న ఒమిక్రాన్.. మరో సిటీలో లాక్డౌన్
బిజింగ్: చైనాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్‌లో ఒమిక్రాన్ కేసులను గుర్తించిన అనంతరం లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చైనాలో లాక్డౌన్ విధించిన మూడో నగరమిది. కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అన్యాంగ్ నగరంలోని ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు సూచించారు. నగరవాసుల వాహనాల వినియోగాన్ని నిషేధించారు. సోమవారం ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకగా, మంగళవారం మరో 58 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు జియాన్, యుజౌవు నగరాలను చైనా లాక్‌డౌన్‌తో దిగ్భంధించిన విషయం తెలిసిందే. -
Deltacron: మరో కొత్త వేరియంట్ డెల్టాక్రాన్!
కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతుంటే.. మరొకవైపు కొత్త వేరియంట్ వెలుగుచూసింది. సైప్రస్‌లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీనికి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు. ఇందులో డెల్టా వేరియంట్ లక్షణాలు, ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ప్రస్తుతానికి డెల్టాక్రాన్‌గా పేరుపెట్టారు. ఇంకా శాస్త్రీయంగా పేరుపెట్టాల్సి ఉంది. అయితే కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పాలమని మరికొందరు అంటున్నారు. సైప్రస్‌లో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన బాధితుల నుంచి కొన్ని నమూనాలు, సాధారణ జనం నుంచి కొన్ని నమూనాలు సేకరించిన తర్వాత దీనిని కనుగొన్నారు. కాగా, దీని మ్యూటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని ఈ వేరియంట్‌ను కనుగొన్న సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు లియోండస్ కోస్టిక్రిస్ తెలిపారు. -
Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం నాటికి 300 మిలియన్ల (30 కోట్లు)కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు నివేదికలు తెల్పుతున్నాయి. మరోవైపు డజన్ల కొద్ది దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తోంది. హాస్పిటల్లో పెరిగిన ఐదేళ్లలోపు పిల్లల చేరికలు వాక్సిన్‌కు అర్హత వయసులేని వారికి సంబంధించిన డేటాను అమెరికా శుక్రవారం విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత కొద్దివారాలుగా కోవిడ్ మహమ్మారి బారినపడ్డ ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రుల్లో చేరడం పెరిగిందని తెల్పింది. అందోళనకరమైన ఈ తాజా పరిణామం దృష్ట్యా పిల్లలకు టీకాల అవసరం ఎంతైన ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. గత నెల (డిసెంబర్) మధ్యకాలం నుంచి దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల రేటు ప్రతి లక్ష పిల్లల్లో 2.5 నుంచి 4 కంటే ఎక్కువ నమోదవుతుంది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో ఈ రేటు లక్షమందికి గాను 1గా నమోదవుతుందని మొత్తం 14 రాష్ట్రాల్లో 250 ఆసుపత్రుల్లో సీడీసీ సేకరించిన సమాచారం ప్రకారం తయారు చేసిన డేటా తెల్పుతోంది. నాలుగో డోస్ అవసరం లేదు: యూకే మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి నాలుగో డోస్ వ్యాక్సిన్ తీసుకోవల్సిన అవసరం లేదని బ్రిటీష్ ఆరోగ్య అధికారులు (యూకే) శుక్రవారం తెలిపారు. మూడో డోస్ తీసుకున్న 3 నెల్ల తర్వాత 65 అంతకంటే ఎక్కవ వయసున్న వృద్ధులు ఆసుపత్రుల్లో చేరడం దాదాపు 90 శాతం తగ్గిందని యూకే హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ తెల్పింది. కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లు దాటాయి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 300 మిలియన్లను దాటింది. కాగా గత వారం రోజుల్లో డజన్ల కొద్దీ దేశాలలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అధికారిక ఏఎఫ్‌పీ గణాంకాల ప్రకారం గడచిన ఏడు రోజుల్లో మొత్తం 34 దేశాల్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో యూరప్‌కు చెందినవి 18 దేశాలుకాగా, ఆఫ్రికాలో ఏడు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్కవారంలోనే 13.5 మిలియన్ల కొత్త కేసులు నమోదవ్వడాన్నిబట్టి కోవిడ్ ఉధృతి ఎంత వేగంగా ఉందో తెలుస్తోంది. మరణాల సగటు రేటు మాత్రం మూడు శాతం పడిపోయింది. యుఎస్, యుకె, కెనడా, ఇజ్రాయెల్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం 70 శాతం కంటే తక్కువగా ఉందని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ అథారిటీ శుక్రవారం తెలిపింది. ఐతే గతంలో వచ్చిన వేరియంట్లకంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, తక్కువ ప్రమాదకారి అని తెలియజేసింది. చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు -
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ ఒమిక్రాన్ దెబ్బకు మళ్లీ పునరాలోచనలో పడ్డాయి.ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన ఓ రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం జనవరి 7 నుండి జనవరి 31 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, సబ్- ఆర్డినేట్ కార్యాలయాలు 50శాతం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కార్యాలయాలకు హాజరయ్యే ఉద్యోగుల ఎంపిక విధానాన్ని సంబంధింత డిపార్ట్మెంట్/ కార్యాలయాల ఉన్నతాధికారులు నిర్ణయించుకోవచ్చని' సాధారణ పరిపాలన, పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ లు జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. అయితే, ప్రత్యేక సహాయ కమిషనర్, ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వాహణ అథారిటీ, పోలీస్,అగ్నిమాపక, ఆరోగ్యం, మున్సిపల్ సేవలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ముఖ్యమైన కార్యాలయాలు,సేవలను పరిధి నుండి మినహాయించింది. ఈ విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఒడిశా ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఒడిశా సబార్డినేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి అన్ని నియామక సంస్థల కార్యాలయాల్లో 75 శాతం మంది ఉద్యోగులు పనిచేస్తారని తెలిపారు. రోస్టర్‌లో విధుల్ని కేటాయించని అధికారులు, సిబ్బంది రెగ్యులర్, పెండింగ్ పనులకు హాజరు కావడానికి వారికి అందించిన వీపీఎన్తో ఇంటి నుండి పని చేయాలని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. డిజెబిలిటీ ఉన్న ఉద్యోగులు, గర్భిణీ స్త్రీలైన ఉద్యోగులు ఇంటి వద్దనుంచి పనిచేయాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
బీఅలర్ట్: ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు
WHO Alert World On Omicron variant As Serious Issue: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృభిస్తుంది. అయితే చాలా దేశాలు ఈ వేరియంట్‌ని చాలా తేలికగా తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఇది అంత పెద్ద ప్రమాదకారి కాదని కొట్టిపారేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ మేరకు డబ్ల్యుహెచ్వో చీఫ్ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఒకవైపు డెల్టా వేరియంట్‌తో పోటీపడుతూ ఒమిక్రాన్ వేగంగా విజృభిస్తుంది. అంతేకాదు మరోవేపు కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం వ్యవధిలో 71 శాతం కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారాయన. పైగా ఆస్పత్రులు కొత్త వేరియెంట్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. నిజానికి డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తక్కువ తీవ్రతతో ఉన్నట్లు కనిపించడంతో తీవ్రత లేదని భావిస్తున్నారంతా. కానీ, అది వాస్తవం కాదు. ఒమిక్రాన్ తీవ్రత వల్లే ఆస్పతి పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి సైతం సంక్రమించడం ఆందోళన కలిగిస్తోందని, మరోవైపు ప్రాణాలు పోయే ముప్పు సైతం పొంచి ఉందని టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!) వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదని, వ్యాక్సిన్ కేవలం రక్షణ వలయం లాంటిదని చెప్తున్నారాయన. అంతేకాదు కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి సునామీలా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సెలవుల వల్ల కేసులు పెరగ్గా.. కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో పలు దేశాలు విఫలం అయ్యాయని, అందుకే కేసులు రికార్డు స్థాయిలో పెరుగతున్నాయని అన్నారు. ఈ ఏడాది ప్రతి దేశం కూడా 70% వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. "ఒమిక్రాన్ కరోనా వైరస్ చివరి వేరియెంట్ కాదు. ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేం. ఒమిక్రాన్ వేరియంట్‌ను నుండి తమను తాము రక్షించుకోవడానికి వారు ఇప్పటికే తీసుకుంటున్న చర్యలను మరింత వేగవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి" అని ప్రపంచాన్ని కోరారు. అయితే తాము 2022 ఏడాది చివరిలో కూడా ఈ కరోనా గురించి ఇంకా ప్రసంగించే పరిస్థితి ఏర్పడితే.. అంతకన్నా విషాదం ఇంకోకటి ఉండదు అని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఆవేదనగా చెప్పారు. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) -
ఒమిక్రాన్: జస్ట్ క్యాన్సిలేషన్స్తోనే రూ.200 కోట్ల నష్టం!
కరోనా దెబ్బకు ఆర్థికంగా దాదాపు ప్రతీ రంగం కుదేలు అయ్యింది. ముఖ్యంగా ప్రయాణాలు, కొవిడ్ రూల్స్ కారణంగా భారీగా నష్టపోయిన వాటిల్లో ఒకటి హాస్పిటాలిటీ సెక్టార్(ఆతిథ్య రంగం). అయితే పూర్వవైభవం సంతరించుకుందని సంబురపడే లోపే.. ఈ రంగంపై మరో పిడుగు పడింది. అది ఒమిక్రాన్ రూపంలో. తాజాగా ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు ఆతిథ్య రంగాన్ని మంచి సీజన్లో చావు దెబ్బ తీస్తున్నాయి. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో ఆతిథ్య రంగానికి వాటిల్లిన నష్టం లక్షల కోట్ల రూపాయల్లోనే!. అందునా వారం రోజుల వ్యవధిలో సుమారు 200రూ. కోట్లు నష్టపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ నష్టం కేవలం బుకింగ్ క్యాన్సిలేషన్ ద్వారా వాటిల్లింది కావడం. యస్.. డిసెంబర్ 25 నుంచి జనవరి 31 మధ్య ఆతిథ్య రంగం ఈ మేర నష్టం చవిచూసింది. క్రిస్మస్, న్యూఇయర్‌తో పాటు వెడ్డింగ్స్, ఇతరత్ర ఈవెంట్స్ రద్దు ద్వారానే ఈ నష్టం వాటిల్లిందని ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాంచి సీజన్ మీదే.. కరోనా సీజన్లో బుకింగ్‌లు లేక పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ వెలవెలబోయాయి. నెలలపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో కోలుకోలేని దెబ్బ పడింది. 8 శాతం బిజినెస్ శాశ్వతంగా మూతపడింది కూడా!. తద్వారా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో భారీ నష్టమే వాటిల్లింది. అయితే రెండు వేవ్‌లు అన్-సీజన్లో రావడంతో ఆతిథ్య రంగంపై నష్టం మరీ ఘోరంగా అయితే లేదు. కానీ, ఇప్పుడు వేడుకల సమయం. పైగా పెళ్లిళ్ల సీజన్. వ్యాక్సినేషన్ కూడా నడుస్తుండడంతో వ్యాపారాలు గాడిన పడతాయని అంతా భావించారు. ఇప్పుడేమో ఒమిక్రాన్ వల్ల పరిస్థితి ఊహించిన విధంగా లేదు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లింది.. మునుముందు ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న దానిపై లెక్కలు కట్టే పనిలో ఉంది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్. అందుకే నష్టస్థాయి ఊహించినదానికంటే ఘోరంగా ఉండొచ్చనే ఆందోళనలో ఆతిథ్య రంగం ఉందని ఎఫ్హెచ్ఆర్ఏఐ సెక్రటరీ ప్రదీప్ శెట్టి చెబుతున్నారు. ఒమిక్రాన్ వల్లే.. అక్టోబర్ 2021 నుంచి హోటల్స్, రెస్టారెంట్ల బుకింగ్‌లు పెరుగుతూ వస్తుండడంతో హాస్పిటాలిటీ రంగానికి మంచి రోజులు వచ్చినట్లు భావించారంతా. డిసెంబర్ రెండో వారం నాటికి ఈ బుకింగ్‌లు ఏకంగా 80-90 శాతానికి చేరాయి( కార్పొరేట్ హోటల్స్‌లో అయితే అది 50 శాతం మార్క్ దాటింది). కానీ, కొత్త వేరియెంట్ ప్రభావంతో పరిస్థితి తలకిందులైంది. డిసెంబర్ 25 నుంచి హోటల్స్ ఆక్యుపెన్సీ, రేట్లు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి. ఆంక్షలు-కర్ఫ్యూలు, ఆక్యుపెన్సీ నిబంధనలు, కస్టమర్ల భయాందోళనల నడుమ అప్పటికే అయిన బుకింగ్స్ దాదాపు 60 శాతం మేర రద్దయ్యాయి. కరోనా తొలినాళ్లలోలాగా ఇప్పుడు మళ్లీ పది నుంచి 15 శాతం ఆక్యుపెన్సీతో హోటల్స్ బిజినెస్ నడుస్తోంది. మునుముందు కఠిన ఆంక్షలు విధిస్తే.. ఈ కాస్త ఆక్యుపెన్సీ కూడా ఉండకపోవచ్చనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వ సాయం! ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందో అనే ఆందోళన ఆతిథ్య రంగంలో నెలకొంది. మరోవైపు రెస్టారెంట్లలోకి అడుగుపెట్టేవాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని, డిసెంబర్లో 50 శాతం ఉన్న అమ్మకాలు, ఆదాయాలు.. ఇప్పుడు కేవలం 10-20 శాతానికి పడిపోయాయని ఎఫ్హెచ్ఆర్ఏఐ అంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మద్దతు కోరుకుంటోంది ఆతిథ్య రంగం. భౌతిక దూరం ఇతరత్ర కొవిడ్ రూల్స్ పాటిస్తామని, ప్రతిగా తమకు ఊరట-మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది ఎఫ్హెచ్ఆర్ఏఐ. అదే విధంగా ఉద్యోగుల జీతభత్యాల భారంగా మారుతున్న తరుణంలో.. పన్నులు తగ్గింపులాంటి మినహాయింపులు ఆశిస్తోంది కూడా. సంబంధిత వార్త: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండవచ్చంటే.. -
కరోనా మళ్లీ ఉగ్రరూపం.. దేశంలో కొత్తగా 90వేలపైగా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 325 మంది కరోనాతో మరణించగా, 19,206 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరొకవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో ఇప్పటివరకు 2,630 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ కేసులు పెరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: ఒమిక్రాన్ మిగతా వాటిలా కాదు.. శ్వాస వ్యవస్థ పైభాగంలో ఎఫెక్ట్ ఉంటుంది: డబ్ల్యూహెచ్‌వో #Unite2FightCorona#OmicronVariant ➡️ 90,928 New Cases reported in last 24 hours. pic.twitter.com/hCg8vLC5ni — Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2022 ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,43,41,009 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బరినపడి 4,82,876 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,85,401 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రోజువారి పాజిటివ్ రేటు 6.43 శాతంగా ఉంది. డిసెంబర్ 28న దాదాపు 9 వేలకు పైగా కేసులు నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/XLFKXylyRO pic.twitter.com/HqiNuPTlIZ — Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2022 -
విజృంభిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా కేసులు ఎన్నంటే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 534 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,43,21,803 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బరినపడి 4,82,551 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,14,004 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రోజువారి పాజిటివ్ రేటు 4.18 శాతంగా ఉంది. -
ఒమిక్రాన్ సాధారణ జ్వరం మాత్రమే: యోగి
లక్నో: కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం అది కేవలం సాధారణ వైరల్ జ్వరం లాంటిదేనంటూ కొట్టిపారేశారు. ‘ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న విషయం వాస్తవమే. రెండోవేవ్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కాస్త బలహీనమైందనే విషయం కూడా నిజమే. ఇది సాధారణ వైరల్ జ్వరం. ఇతర వ్యాధులకు మాదిరిగా దీనికి ముందు జాగ్రత్తలు, అప్రమత్తత అవసరం’ అని చెప్పారు. -
Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు!
ముంబై: జనవరి మూడో వారం నాటికి మహారాష్ట్రలో రెండు లక్షల కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు కావచ్చని అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. ప్రదీప్ వ్యాస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ మూడో వేవ్ ప్రమాదకారి కాదని ప్రజలు నిర్లక్ష్యం వహించడం తగదని, వ్యాక్సిన్ వేయించుకోనివారికి ప్రాణాంతకం కావొచ్చని, వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా మహారాష్ట్రలో శనివారం నాడు 9,170 కరోనావైరస్ కొత్త కేసులు నమోదవ్వగా, ఏడుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత 11 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివాహాలు, సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియల హాజరుపై గురువారం కొత్త ఆంక్షలు ప్రకటించింది. తాజా ఆంక్షల ప్రకారం వివాహాలు లేదా ఏదైనా ఇతర సామాజిక, రాజకీయ లేదా మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 50 మందికి మించకూడదు. అలాగే అంత్యక్రియలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 20కి పరిమితం చేయబడింది. సోమవారంనాటికి దేశంలోనే అధిక సంఖ్యలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. చదవండి: Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా! -
టీకా ప్రాప్తిరస్తు! 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్ వ్యాక్సిన్..
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లాలో టీనేజర్స్‌కు టీకాలు వేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీని కోసం నేటి నుంచి 7వ తేదీ వరకూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) లోతేటి శివశంకర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆదివారం తన చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15–18 ఏళ్ల మధ్య వయస్సు (టీనేజ్) వారందరికీ టీకాలు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, విద్యాశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కాలేజీలో డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి టీకా వేయించాలన్నారు. టీకాపై అపోహలు వీడేలా, పిల్లల తల్లిదండ్రులను చైతన్య వంతం చేసి, అందరికీ టీకా వేయాలన్నారు. కరోనా నివారణకు టీకానే వజ్రాయుధం అని ప్రజలకు వివరించాలని సూచించారు. 430 కాలేజీల గుర్తింపు.. ►గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని కాలేజీలలో టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ►దీనికిగానూ జిల్లాలోని 1,285 సచివాలయాల పరిధి లో 430 కాలేజీలను గుర్తించామని జేసీ చెప్పారు. ►ఇందులో 2.02 లక్షల మంది టీనేజ్ వయస్సు వారు ఉన్నారని.. స్కూల్ టీచర్లు, కళాశాలల ప్రిన్సిపాల్స్, పిల్లల తల్లిదండ్రులతో సమన్వయ పరచుకుని అర్హులందరికీ టీకాలు వేయాలన్నారు. ►కోవిడ్ టీకా తీసుకునేటప్పుడు ఆహారం తిని వేసుకునేలా చూడాలన్నారు. ►కోవ్యాగ్జిన్ టీకా 1.28 లక్షల డోస్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని ఇప్పటికే పీహెచ్‌సీలకు తరలించినట్లు తెలిపారు. అక్కడ నుంచి సచివాలయాలకు వ్యాక్సిన్ పంపనున్నట్లు తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల గుర్తింపు.. జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు 45వేల మంది ఉన్నారన్నారు. వీరిలో రెండో డోసు వేసుకొని ఫిబ్రవరి నాటికి 9 నెలలు పూర్తి అయ్యే వారు 22 వేల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ ఈ నెల 10, 11, 12 తేదీల్లో బూస్టర్ డోస్ వేసేందుకు సిద్ధం చేశామన్నారు. సమావేశంలో డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎం. సుహాసిని, ఇతర అధికారులు పాల్గొన్నారు. చదవండి: Omicron surge: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరిక లేఖ -
Omicron alert: ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది.. విస్మరించొద్దు: ఆరోగ్య శాఖ హెచ్చరిక
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా వీడిపోలేదు.. కొత్త రూపాల్లో కంగారెత్తిస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మన దేశం, రాష్ట్రంలో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవతున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం ఒకింత ఉదాసీనత కనిపిస్తోంది. పండుగ సీజన్ కావడంతో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరిగేస్తున్నారు.. శానిటైజర్ వాడటం మానేశారు.. షాపింగ్ మాల్స్, దుకాణాల్లో గుంపులుగుంపులుగా ఉంటూ కొనుగోళ్లు చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా రద్దీ తీవ్రంగా కనిపిస్తోంది. వైరస్‌కు ఇదే అదునుగా మారి, విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసులు తగ్గుముఖం.. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 10 నుంచి 20 వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, యాక్టివ్ కేసులు సైతం 200 కంటే తక్కువగానే ఉన్నాయి. ఒక్కో రోజు జీరో మరణాలు కూడా నమోదవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం కోవిడ్ అడ్మిషన్స్ బాగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 10 మంది మాత్రమే కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగాలంటే, అది మన చేతుల్లోనే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పెనలా వచ్చే అవకాశం.. గత ఏడాది మే నెలలో డెల్టా వేరియంట్ ఉగ్రరూపం దాల్చడం చూశాం. వేలాది మంది దాని బారిన పడి, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 30 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ, పొరుగు జిల్లాలో కేసులున్నాయి. అమెరికాలో ప్రస్తుతం వేరియంట్ విజృంభిస్తోంది. ఉత్తర భారతదేశంలో సైతం రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. పండుగ సీజన్లు ముగిసిన తర్వాత మనకు కూడా రావచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉన్నా, వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పని సరిగా.. కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కును ధరించాలని, చేతులకు తరచూ శానిటైజర్ రాసుకుంటూ, భౌతిక దూరం పాటించాలంటున్నారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకోవాలి.. ప్రస్తుతం జిల్లాలో వయస్సు 18 ఏళ్లు నిండిన వారందరికీ మొదటి డోస్ కరోనా టీకాలు వేయడం పూర్తి చేశారు. రెండో డోసు సైతం దాదాపు 78 శాతం పూర్తయ్యింది. మిగలిన వారికి సైతం టీకాలు వేయడంతో పాటు, ప్రస్తుతం 15–18 ఏళ్ల మధ్య వయస్సు వారికి సోమవారం నుంచి ఐదు రోజుల పాటు టీకాలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో టీకాలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషన్ డోస్ టీకా వేయనున్నారు. అప్రమత్తంగా ఉందాం.. ఒమిక్రాన్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పాజిటివ్ కేసుల ట్రేసింగ్‌తో పాటు.. వారి ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్‌లను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నాం. ప్రజలు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమైన అంశాలు. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ -
రాష్ట్రంలో థర్డ్ వేవ్.. వెల్లడించిన మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్, కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల పెరుగుతున్న కమ్రంలో.. రాష్ట్రంలో కోవిడ్ థర్డ్‌వేవ్ వచ్చిందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగితే.. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొక తప్పదని ఇప్పటికే నిపుణులు హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొక తప్పదని సీఎం అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనాపై పోరాడాగలమని శివరాజ్ సింగ్ చెప్పారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతుందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భోపాల్, ఇండోర్ నగరాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 124 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరమైన ఇండోర్‌లో 62 కేసులు, భోపాల్‌లో 27 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. -
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి
-
Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు!
భువనేశ్వర్: ఓ వైపు కరోనా భీభత్సం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి వెరసి విద్యాసంస్థలు తెరవాలనే నిర్ణయానికి గండి పండింది. ఒడిశా రాష్ట్రంలో ప్రాధమిక పాఠశాలలను తెరవాలనే నిర్ణయం మరోమారు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 1 నుంచి 5 తరగతులకు చెందిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ఒడిసా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు వివిధ పాఠశాలలను సందర్శించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఎస్ఆర్ దాష్ తెలిపారు. ఐతే 6 నుంచి 10 తరగతుల పిల్లలు మాత్రం యథాతథంగా ఫిజికల్ క్లాసులకు హాజరుకావాలని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్‌కు కట్టుబడి షెడ్యూల్ ప్రకారం ఆఫ్‌లైన్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ బులెటన్ ప్రకారం గడచిన రెండు నెలల్లో కన్నా నిన్న ఒక్క రోజే 424 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆదివారం తెల్పింది. కొత్తగా కరోనా సోకిన పేషంట్లలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు దాదాపు 67 మంది ఉన్నట్లు బులెటన్ తెల్పుతోంది. చదవండి: Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..! -
ఒకేసారి 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
-
కోవిడ్ బాధితులకు స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి: అరవింద్ కేజ్రీవాల్
-
Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..!
ప్యారిస్: మహమ్మారి వ్యాప్తి చెందినప్పట్నుంచి శనివారం నాటికి కోటికి పైగా కరోనా ఇన్ఫెక్షన్లు నమోదైన దేశాల్లో ఫ్రాన్స్ 6వ దేశంగా అవతరించినట్లు అధికారిక సమాచారం. గడచిన 24 గంటల్లో ఫ్రాన్స్‌లో 2,19,126 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యినట్లు ఫ్రాన్స్ హెల్త్ అధారిటీస్ నివేదిక విడుదల చేశాయి. వరుసగా నాలుగో రోజు కూడా రెండు లక్షలకు పైగా కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యినట్లు ఈ నివేదిక తెల్పుతోంది. 10 మిలియన్లకుపైగా కరోనా కేసులు నమోదైన అమెరికా, భారత్, బ్రెజిల్, బ్రిటన్, రష్యా దేశాల సరసన తాజాగా ఫ్రాన్స్ చేరింది. దీంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాబోయే కొన్ని వారాలు కష్టతరంగా మరొచ్చని హెచ్చరికలు జారీ చేశాడు. ఐతే పెరుగుతున్న పాజిటివిటీ కేసుల దృష్ట్యా దేశంలో మరిన్ని ఆంక్షల విధింపుకు బదులు ప్రజల స్వేచ్ఛను పరిమితం చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచనలివ్వడం గమనార్హం. సోమవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో 6-11 సంవత్సరాల పిల్లలతో సహా, ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం తప్పనిసరని అక్కడి ప్రభుత్వం ముందే హెచ్చరించింది. కాగా గడచిన 7 రోజుల వ్యవధిలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో కేసులు పుట్టుకొచ్చాయి. కేవలం ఒక్క నెలలో ఐదు రెట్లు పెరిగాయి. 24 గంటల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 96కు పెరిగింది. అలాగే కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 24 గంటల్లో 110 పెరగగా, ఆ సంఖ్య 123,851కి చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్ మరణాల్లో 12వ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఆ దేశంలో మే 14 నుండి అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయి. చదవండి: ‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే.. -
దేశంలో భారీగా పెరుగుతున్న వైరస్ కేసులు
-
రోజురోజుకీ పెరుగుతున్న వైరస్ వ్యాప్తి .. 27 వేలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత్‌లోనూ ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 94 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి చేరింది. 560మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 460, ఢిల్లీలో 351 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. దేశంలో 23 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో 21శాతం పెరుగుదల కనిపిస్తుంది. ఇక ఒక్క రోజే 284 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,89,132కి చేరింది. ఇప్పటి వరకు 4,81,770 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,22,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: పడగ విప్పిన ఒమిక్రాన్! -
తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 12 కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి, తీవ్రత లేని దేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. తాజాగా నమోదైన 12 కేసులతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య 52కు చేరింది. మరోవైపు కరోనా కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. శనివారం కొత్తగా 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ పేర్కొంది. -
‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే..
Pregnant woman in Israel was found to be infected with ‘florona’: ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌లో మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ తొలి ‘ఫ్లొరోనా’ కేసు నమోదయ్యినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం మీడియాకు వెల్లడించింది. ఓ గర్భిణీ స్త్రీలో మొదటి కేసు వెలుగు చూసినట్లు తెలిపింది. ఐతే ఆమె ఇంతవరకూ వ్యాక్సిన్ వేయించుకోలేదని స్పష్టం చేసింది. ఇది కొత్త రకం వెరియంట్ కాదని, ఒకే సమయంలో ఫ్లూ, కోవిడ్లకు చెందిన రెండు రకాల వైరస్లు శరీరంలోకి ప్రవేశించడం వల్ల రోగనిరోధకత వ్యవస్థ విచ్ఛిన్నమై ఫొరోనా సోకి ఉండవచ్చని ఇజ్రాయెల్ వైద్యులు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని వారాలుగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో అది ఉద్భవించి ఉండవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కొత్త వ్యాధి వ్యాప్తి కట్టడికి పూనుకుంది. ఇమ్యునిటీ వ్యవస్థను బలపరిచేందుకు శుక్రవారం నుంచే కోవిడ్ 19 నాలుగో డోస్ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించింది. అలాగే అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించింది. ఇక మూడో డోస్ వేసి 4 నెలలు గడుస్తున్న కారణంగా రోగనిరోధకత తగ్గిన వ్యక్తుల కోసం బూస్టర్ డోస్‌లు వేసున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అక్కడి వైద్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఒక్క గురువారం నాడే 5000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏమిటీ ఫ్లొరోనా? ఫ్లొరోనా అనేది కోవిడ్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు ఒకే సమయంలో శరీరంలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన డబుల్ ఇన్ఫెక్షన్. ఫ్లొరోనా వ్యాధి లక్షణాలివే.. ఫ్లొరోనా వ్యాధి తాలూకు లక్షణాలు కొంత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు డేటా తెలుపుతోంది. ఐతే కోవిడ్-19 లక్షణాలతోపాటు గుండె కండరాలలో నొప్పి/మంట వంటి అదనపు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే న్యుమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలతోపాటు, మయోకార్డిటిస్‌కు కూడా దారితీయవచ్చు. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే రోగి మృతి చెందే ప్రమాదం కూడా ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌తో పాటు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ సిఫార్సు చేస్తోంది. ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో రోగనిరోధకత పాత్ర ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఫ్లొరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇమ్యునిటీని పెంపొందించుకునేందుకు బూస్టర్ డోసులు వేసుకోవడంతోపాటు, ఇతర జాగ్రత్తలు కూడా విధిగా పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ -
Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’
Highest ever surge in world న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు శర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను తక్షణమే సమీక్షించాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం శనివారం లేఖలు రాసింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, హెల్త్ కేర్ సౌకర్యాలను పెంచడంతోపాటు ఆక్సిజన్ లభ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని సెక్రెటరీ రాజేష్ భూషణ్ లేఖల్లో పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం నిన్న ఒక్క రోజులోనే (డిసెంబర్ 31న) అత్యధికంగా 16,764 కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 70 రోజులతో పోల్చితే పెద్ద మొత్తంలో నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు ఐరోపా, అమెరికా దేశాలు గత కొన్ని వారాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరిగినట్లు నివేదించాయి. తాజా పరిణామాలన్నీ కూడా వైరస్ అధిక వ్యాప్తినే సూచిస్తున్నాయని సెక్రెటరీ లేఖలో ఉటంకించారు. చదవండి: 12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్.. శనివారం ఉదయం నాటికి దేశంలో మిక్రాన్ సంఖ్య 1,431 మార్క్‌ను దాటింది. 5 రాష్ట్రాల్లో 100 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలాగే 22,775 కోవిడ్ కేసులు నమోదుకాగా, 406 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నందువల్ల హెల్త్ కేర్ ఫెసిలీటీస్ కొరత ఏర్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది. తేలికపాటి నుండి మితమైన లక్షణాలున్న రోగుల కోసం రాష్ట్రాలు హోటల్ వసతిని కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది.హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలు, కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి రాష్ట్రాలను కోరింది. గ్రామీణ ప్రాంతాలు, పీడియాట్రిక్ కేసులపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. జ్వరాలు, ఒళ్లు నొప్పులతో వస్తున్న రోగులందరికీ కోవిడ్ టెస్ట్లుచేయాలని కోరింది. అంతేకాకుండా చాలా మంది ఒమిక్రాన్ రోగులు లక్షణరహితంగా ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారు. ఐతే రోగులను సకాలంలో గుర్తించకపోతే, కుటుంబ సభ్యులకు సంక్రమణ ప్రమాదం ఎక్కువని తెల్పింది. ఈ మేరకు కోవిడ్ కేసులు ఆకస్మికంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు! -
ఏం చేయాలో తెలియదు.. మా పెళ్లికి రాకండి అంటూ ఆహ్వానాలు!
సాక్షి, ముంబై: పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వారికి కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఆంక్షలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పెళ్లికి రావాలని ఆహ్వానించిన బంధువులను ఇప్పుడు రావద్దని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, ఖాళీ మైదానాల బుకింగ్ ఫుల్ అయ్యాయి. గత సంవత్సరం లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్న అనేక వివాహాలు ఇప్పుడు జరిపించేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా అదుపులోకి వచ్చిందన్న భావనతో నిశ్చితార్ధాలు పూర్తిచేసుకుని లగ్న పత్రికలు కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్, క్యాటరింగ్, మంగళ వాయిద్యాలు, లౌడ్ స్పీకర్లు తదితరాలను బుకింగ్ చేసుకున్నారు. దగ్గరి, దూరపు బంధువులకు, మిత్రులకు, పరిచయస్తులకు పత్రికలు పంపిణీ చేశారు. నగదు, కట్నకానుకలు సైతం సిద్ధం చేసుకున్నారు. పెళ్లికి హాజరయ్యేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు రైల్వే, బస్ టికెట్లు సైతం బుకింగ్ చేసుకున్నారు. అయితే ఈలోపే కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పడగ విప్పడంతో కొత్త పేచీ మొదలైంది. ఒమిక్రాన్ ప్రభావం రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే ముంబైలోనే అధికంగా ఉంది. ఒమిక్రాన్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆంక్షలు విధించే పనిలో నిమగ్నమైంది. అందుకు జనాలు పెద్దసంఖ్యలో పోగయ్యే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను లక్ష్యంగా చేసుకుంది. పెళ్లి ఏసీ ఫంక్షన్ హాలులో జరిగితే వధూవరుల తరఫునుంచి కేవలం 50 మందిని మాత్రమే ఆహ్వానించాలని నిబంధన విధించింది. అంతేగాకుండా ఖాళీ మైదానంలో నిర్వహిస్తే మైదానం సామర్ధ్యాన్ని బట్టి 25 శాతం మించకుండా ఆహ్వానించాలని నిర్ధేశించింది. ఇక్కడ చదవండి: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేకంగా కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించింది. దీంతో ఏం చేయాలో తెలియక వధూవరుల కుటుంబసభ్యులు ఆందోళనలో పడిపోయారు. కేవలం దగ్గరి బంధువులు మినహా, ఆహ్వానించిన దూరపు బంధువులందరికీ, మిత్రులకు పెళ్లికి రావద్దని ఫోన్ చేసి చెబుతున్నారు. వివాహాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలతో క్యాటరింగ్ సర్వీసు యజమానులు ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయారు. వచ్చిన ఆర్డర్లన్నీ రద్దు కావడంతో మొదటికే మోసం వచ్చిందని క్యాటరింగ్ యజమానులు వాపోతున్నారు. 2022 జనవరిలో సంక్రాంతి పర్వదినం తరువాత కూడా అనేక ముహూర్తాలున్నప్పటికీ.. అప్పటికీ ఒమిక్రాన్ పరిస్ధితి అదుపు తప్పితే ఏకంగా శుభకార్యాలు రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అనేక మంది నిశ్చితార్ధాలు పూర్తిచేసుకుని పెళ్లి పత్రికలు ముద్రించుకున్నారు. అకస్మాత్తుగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో వారు ఇబ్బందుల్లో పడిపోయారు. -
ఇంటర్నేషనల్ జ్యులయరీ ఎగ్జిబిషన్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్
ముంబై: ‘ఇండియా ఇంటర్నేషనల్ జ్యులయరీ షో సిగ్నేచర్’ (ఐఐజేఎస్)ను వాయిదా వేస్తున్నట్టు జెమ్ అండ్ జ్యులయరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. జవనరి 6 నుంచి 9 వరకు ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాలని లోగడ జీజేఈపీసీ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెంచుకుని వాయిదా వేసినట్టు జీజేఈపీసీ చైర్మన్ కొలిన్‌షా తెలిపారు. ప్రదర్శనకు అన్ని అనుమతులు లభించాయని, ప్రదర్శనదారులు, దేశ, విదేశాల నుంచి వచ్చే కొనుగోలు దారులు, సభ్యులు, సహచరులతో మాట్లాడిన తర్వాత వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. -
పంజా విసిరిన కోవిడ్.. భారీగా నమోదైన కేసులు, 275 రోజుల్లో ఇదే అత్యధికం
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాలతో వణికిపోతున్న వేళ భారత్‌పై కోవిడ్ మరోసారి పంజా విసిరింది. గడిచిన 24 గంటల్లో 22,775 కేసులు నమోదయ్యాయి. గత 275 రోజుల్లో ఇదే అత్యధికం. వైరస్ బాధితుల్లో 8,949 మంది కోలుకోగా.. 406 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళ (353)కు చెందినవారే ఉన్నారు. భారత్‌లో ప్రస్తుతం 1,04,781 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఒమిక్రాన్ అప్డేట్ దేశంలో కొత్తగా 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1431 కి చేరినట్టు ఆరోగ్య శాఖ శనివారం నాటి హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. బాధితుల్లో 488 మంది కోలుకున్నట్టు తెలిపింది. 454 కేసులతో మహారాష్ట్ర, 351 కేసులతో ఢిల్లీ, 118 కేసులతో తమిళనాడు, 115 కేసులతో గుజరాత్, 109 కేసులతో కేరళ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
Omicron: నైట్ కర్ఫ్యూ ఎత్తివేత! ఎందుకో తెలుసా..
కేప్ టౌన్: గడచిన ఏడు రోజులతో పోలిస్తే గత వారంలో దాదాపు 30 శాతం ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు తగ్గాయని దక్షిణాఫ్రికా తాజాగా వెల్లడించింది. ఒమిక్రాన్‌కు బయపడి యూరఫ్, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిస్తున్న నేపధ్యంలో నాలుగో వేవ్ తగ్గుముఖం పట్టడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యు ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. మరణాలు కూడా పెద్దగా నమోదు కాలేదని, వ్యాక్సినేషన్ పెద్ద సంఖ్యలో చేపట్టడం మూలంగా నాలుగో వేవ్ నుంచి బయటపడ్డామని తాజా ఆరోగ్య డేటా నేపథ్యంలో ఆంక్షలు సడలించాలని నిర్ణయించుకున్నట్లు దక్షిణాఫ్రికా ఈ మేరకు మీడియాకు తెల్పింది. సార్స్- కోవ్ 2 వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ నవంబర్‌లో మొదటిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. చదవండి: కొత్తొక వింత.. పాతొక రోత! డిసెంబరు 25 నాటికి నమోదైన కేసులతో పోల్చితే, అంతకు ముందు వారాల్లో దాదాపు 1,27,753 కేసులు వచ్చాయని, ఆ సంఖ్య 29.7% తగ్గిందని ప్రభుత్వం తెల్పింది. సడలించిన ఆంక్షల మేరకు వెయ్యి మందితో ఇండోర్ మీటింగ్‌లు, రెండు వేల మంది సామర్ధ్యంతో ఔట్‌డోర్ మీటింగ్‌లు నిర్వహించుకోవచ్చు. అలాగే లైసెన్సులున్న మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల తర్వాత కూడా తెరచుకోవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. అలా చేయని పక్షంలో క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని సూచించింది. కాగా గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ 100కి పైగా దేశాలకు వ్యాపించిందని, వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులతో పాటు కరోనా సోకిన వారిలో కూడా కొత్త వేరియంట్ వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చదవండి: డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో.. -
మళ్ళీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి
-
Omicron Death : భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు..
-
భారీగా నమోదవుతున్న కేసులు.. ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి
Omicron Community Spread In Delhi సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేనివారు కొత్త వేరియంట్ బారినపడుతున్నారని ఆయన తెలిపారు. తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం పాజిటివ్ శాంపిల్స్‌లో 46శాతం ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే కేసులు గణనీయంగా పెరుగుతున్నా వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇదిలాఉండగా... 320 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. 450 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆంక్షలపై ఆగ్రహం మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అమలుచేస్తున్న ఆంక్షలపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహ్రాలీ-బదర్‌పుర్ రోడ్డు రోడ్డును దిగ్బంధించడమే కాకుండా.. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టారు. ఎల్లో అలర్ట్ అమల్లో ఉన్నందున 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ బస్సులు సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ల వద్దే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు ఆగ్రహానికి లోనయ్యారు. బస్సులపై దాడులు చేశారు. (చదవండి: ‘మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63) -
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులపై నేడు హైకోర్టులో విచారణ
-
భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం?
ముంబై: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో కోవిడ్‌కు చికిత్స పొందుతూ ఈ నెల 28న గుండెపోటుతో మృతిచెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. చదవండి: భారత్‌తో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు అయితే, బాధితుడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం చేసిన పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. కానీ, ఆరోగ్య నిపుణులు మాత్రం ఆ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టుగా నిర్ధారణ కావడంతో దేశంలో తొలి ఒమిక్రాన్ మరణంగా వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరణించిన వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉందని, నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాడని పేర్కొంది. ‘బాధితుడు మరణానికి కోవిడ్ కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించింది’ అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 190 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారునున్నారు. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. -
దేశంలో మొదటి ఒమిక్రాన్ మరణం
-
భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు
న్యూడిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. తాజాగా దేశంలో 309 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1270కు చేరింది. మహారాష్ట్ర అత్యధికంగా 450కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీలో 320 పాజటివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 109, గుజరాత్లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46,కర్ణాటకలో 34 మంది ఒమక్రాన్ బాధితులు ఉన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో 374మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. 23 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,764 మంది కోవి్ బారిన పడగా.. 220 మంది మహమ్మారితో మరణించారు. చదవండి: ఒక్కరోజులో 24.39 లక్షలు.. ఒక్క గంటలో 2.79 లక్షలు.. ఐటీ ఫైలింగ్‌లో రికార్డ్ ! -
వ్యాక్సిన్ రోగ నిరోధకత 9 నెలలే.. సెకండ్ డోస్ కూడా వేయించుకోండి: ఆరోగ్య శాఖ
Covid 19 vaccination immunity period: కోవిడ్ వాక్సిన్ డోస్, వైరస్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్, మరణాల రేటు తగ్గించేందుకేనని కేంద్రం అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఈ రోజు (గురువారం) మీడియా సమావేశంలో స్పష్టం చేసింది. పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత రోగ నిరోధకత 9 నెలల వరకు ఉంటుందని, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లన్నీ మనదేశంతో సహా, ఇజ్రాయెల్, యూఎస్, యూరప్, యూకే, చైనా నుంచి వచ్చినప్పటికీ ప్రాథమికంగా వ్యాధిని ఎదుర్కొనేవే కానీ వ్యాధిని పూర్తిగా నిరోధించవు. ముందు జాగ్రత్తగా తీసుకునే కోవిడ్ డోసులు.. వ్యాధి తీవ్రతను తగ్గించడం, ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల రేటులను తగ్గించడానికేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) డైరెక్టర్ జనరల్ డా. బలరాం భార్గవ తెలిపారు. మన దేశంలోని వయోజన జనాభాలో దాదాపు 90% మందికి మొదటి డోస్ టీకాలు పూర్తయ్యాయి. ఐతే టీకాలు వేయించుకున్న వారిలో కొంతమందికి ముందుగా రోగ లక్షణ అంటువ్యాధులు ఉన్నందు వల్ల చాలా మందిలో సార్స్-కోవ్ 2 యాంటిజెన్‌కు సంబంధించి కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. మరికొందరికి గుర్తించబడని లక్షణ రహిత అంటువ్యాధులు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 10 నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా అర్హులైన వారికి ఫోన్ ఎస్సెమ్మెస్ సందేశాలు పంపడం ద్వారా విస్తృత టీకా కవరేజీని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ -
ఓమిక్రాన్ పై రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలి
-
ఒకే రోజు 10వేల కేసులు పెరిగాయి.. వచ్చే 2,3 వారాల్లో కేసులు పెరుగుతాయి
-
ఒమిక్రాన్.. వచ్చే 2,3 వారాలు అత్యంత కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరంగా వ్యాప్తిస్తోంది. ఎటువంటి ప్రయాణ చరిత్ర, ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోంది. తాజాగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులపై రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా ఆయన గురువారం మాట్లాడుతూ.. తెలంగాణలో త్వరలోనే ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని, ఇది థర్డ్‌వేవ్ ప్రారంభానికి సూచిక అని తెలిపారు. చదవండి: ఒమిక్రాన్ ఉగ్రరూపం.. 1000కి చేరువలో కేసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. యూకే, యూఎస్ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ(263), మహారాష్ట్రలు(252) మొదటి రెండు స్థానంలో ఉన్నాయి. తరువాత గుజరాత్, రాజస్థాన్, కేరళ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది. బుధవారం ఒక్క రోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తదితరులు ఉన్నారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్ -
ఒమిక్రాన్ ఉగ్రరూపం.. 1000కి చేరువలో కేసులు
న్యూఢిల్లీ : ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్‌లోనూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000కి సమీపిస్తోంది. తాజాగా కేసులతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 961కి చేరింది. వీరిలో 320 మంది కోలుకున్నారు. అత్యధికంగా 263 కేసులతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. 252 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మొత్తం 22 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఈ వేరియంట్ పాకింది. భారీగా పెరిగిన కోవిడ్ కేసులు అదే విధంగా భారత్‌లో కరోనా వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. గత కొంత కాలంగా రోజువారీ కేసులు 10వేలకు దిగువన నమోదవుతుండగా.. నిన్న ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 13,154 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఈ సంఖ్య ముందు రోజు కంటే 43శాతం అధికంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 82,402 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకు 3.48 కోట్ల మంది వైరస్ బారిన పడగా.. రికవరీలు 3.42 కోట్లకు చేరాయి. చదవండి: వామ్మో.. చుక్క పడకపోతే ఎలా... కరోనా టీకా వద్దంటే వద్దు.. -
కరోనా విలయతాండవం: ఒక్కరోజులో ఐదు లక్షల కేసులు.. సగం ఒమిక్రాన్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో లెక్క నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఒక్క అమెరికాలోనే అదీ ఒక్కరోజులో ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం, అందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ అందించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 5, 12, 000 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం విశేషం. అమెరికాలో ప్యాండెమిక్ విజృంభణ మొదలయ్యాక నమోదు అయిన కేసుల సంఖ్య ఇదే హయ్యెస్ట్. మొత్తంగా ఇప్పటివరకు 54 మిలియన్ల కేసులు ఇప్పటిదాకా నమోదు అయ్యాయి. ఇంతకు ముందు కరోనా హయ్యెస్ట్ కేసుల సంఖ్య 2, 94, 015గా(ఈ ఏడాది జనవరి 8న) నమోదు అయ్యింది. డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 58 శాతం(దాదాపు సగం కంటే ఎక్కువ) ఒమిక్రాన్ కేసులే ఉన్నట్లు చెబుతోంది. ఒమిక్రాన్ కంటే ముందు డెల్టా వేరియెంట్ మూలంగానే అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం డెల్టా వేరియెంట్ కేసులేనని సీడీసీ చెబుతోంది. కొవిడ్-19 కారణంగా గడిచిన ఒక్కరోజులో 1,762 మంది పేషెంట్లు చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 8,42,000 చేరింది. ప్రస్తుతం అమెరికాలో కోటి పంతొమ్మిది లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నాలుగు కోట్ల 32 లక్షల మందికిపైగా కోలుకున్నారు. భారత్‌లోనూ ఇదే పరిస్థితి? ఓవైపు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడం, మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ బాధితుల సంఖ్యా పెరిగిపోతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో ఒమిక్రాన్ విజృంభణ ఒక్కసారిగా పెరిగిపోవచ్చని చెప్తున్నారు ప్రొఫెసర్ పాల్ కట్టూమన్. ‘‘రాబోయే కొద్దిరోజుల్లో భారత్ కీలక దశలోకి ప్రవేశించనుంది. కొన్ని వారాల్లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు తారాస్థాయికి చేరుకుంటాయి. కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్ వేగం ఎక్కువగా ఉండడం. బహుశా అది ఈ వారం పదిరోజుల నుంచే జరగొచ్చు కూడా. అయితే అమెరికా స్థాయిలో ఉంటుందా? లేదా? అనేది రెండు వారాల్లో తెలిసిపోతుంది. బూస్టర్ డోసులతో కట్టడికి ప్రయత్నించినా.. ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం కష్టమే. జాగ్రత్తలు పాటించడం ద్వారా పరిస్థితి చేజారకుండా కాపాడుకోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు ఆయన. భారత్‌లో కొవిడ్ ట్రాకర్‌ను రూపొందించిన పరిశోధకుల్లో కట్టూమన్ కూడా ఉన్నారు. డిసెంబర్ 24 దాకా ఆరు రాష్ట్రాల్లో తీవ్రతను గుర్తించిన కొవిడ్ ట్రాకర్.. 26వ తేదీ నాటికి ఆ సంఖ్యను 11 రాష్ట్రాలకు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ రెండు నగరాల్లో దీనస్థితి కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరాల్లో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఒక్క కాలిఫోర్నియాలోనే 50 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గోల్డెన్ స్టేట్‌లో 86 వేలమందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో సీడీసీ కాలిఫోర్నియాను ‘హై ట్రాన్స్మిషన్’ జోన్‌గా ప్రకటించింది. మరోవైపు న్యూయార్క్ నగరంలో చిన్నపిల్లలు వైరస్ బారినపడుతుండడంతో దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ తీవ్రత మరింత ఉదృతంగా ఉండొచ్చని సీడీసీ డైరెక్టర్ రోచెల్లె వాలెన్‌స్కై అంచనా వేస్తున్నారు. డెల్టా వేరియెంట్ బారినపడ్డ పేషెంట్లకు చికిత్స భయంభయంగానే నడుస్తోంది. అయితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండడంతో సాధారణ చికిత్సకే పరిమితం అవుతున్నారు వైద్యులు. మరోవైపు ఐసోలేషన్ సమయాన్ని పది నుంచి ఐదు రోజులకు కుదించింది అమెరికా ప్రభుత్వం. చదవండి: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు -
ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టిన మరునాడే భారీగా కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 128 ఒమిక్రాన్ కేసులు బయటపడగా.. ఒక్క ఢిల్లీలో 73 నమోదయ్యాయి. దీంతో 238 కేసులతో హస్తిన తొలి స్థానంలో నిలవగా... 167 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781 కి చేరింది. బాధితుల్లో 241 మంది కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని తెలిపింది. (చదవండి: వైరస్‌ను ఏమార్చి హతమారుస్తుంది.. ఎవరికి మంచిది? ఎవరికి వద్దు?) భారీగా పెరిగిన కోవిడ్ కేసులు కొద్ది రోజులుగా కోవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపించగా నిన్న భారీగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9,195 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 44 శాతం అధికంగా కేసులు నమోదవడం గమనార్హం. ఇక మొత్తం బాధితుల్లో తాజాగా 302 మంది మృతి చెందగా.. 7,347 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.40 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 77,002 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. (చదవండి: బూస్టర్‌కు డాక్టర్ సర్టిఫికెట్ అక్కర్లేదు) -
దేశంలో మరో 75 ఒమిక్రాన్ కేసులు.. 653 కు చేరిన మొత్తం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకీ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వెల్లడైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 653కు చేరింది. బాధితుల్లో 186 కోలుకున్నారని ఆరోగ్య సంక్షేమ శాఖ మంగళవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. 167 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో.. 165 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నాయి. కోవిడ్ అప్డేట్ గడిచిన 24 గంటల్లో భారత్‌లో 6,358 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల్లో 6,450 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడ్డవారిలో 293 మంది మృతి చెందారు. దేశంలో 75,456 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.40 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య సంక్షేమ శాఖ బులెటిన్‌లో తెలిపింది. -
పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..
ఫ్రాన్స్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, యూరప్ దేశాల్లో రోజురోజుకు పరిస్థితి చేజారేలా కనిపిస్తోందని డబ్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 24 న ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసినప్పటినుంచి, ఇప్పటి వరకు 108 దేశాల్లో పంజా విసిరింది. ముఖ్యంగా ఐరోపాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఒక్కరోజులోనే తొలిసారిగా లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరికలు కూడా రెట్టింపయ్యాయి. గడచిన వారంలో ప్రతి వంద మందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ బయటపడుతోంది. అంతేకాకుండా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక ఇన్ఫెక్షలు ఒమిక్రాన్‌తో సంబంధం కలిగి ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ మరింత డామినెట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కోవిడ్ 19 ఉధృతిపై సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా.. -
వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా..
First Omicron Death In Australia: ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో సోమవారం మొదటి ఒమిక్రాన్ మరణం సంభవించింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 6 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్టు ధృవీకరించింది. కాగా పశ్చిమ సిడ్నీలోని ఓ వృద్ధాప్య సంరక్షణ కేంద్రంలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి (80)గా గుర్తించారు. సదరు వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెల్పింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్లో సోమవారం ఒక్కరోజులోనే 6,324 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంటెన్సివ్ కేర్‌లో 55 మంది ఉండగా, మొత్తం 524 మంది అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం నుంచి న్యూ సౌత్ వేల్స్లో కొత్త ఆంక్షలు అమల్లోకొచ్చాయి. బార్లు, రెస్టారెంట్లలో వ్యక్తుల మధ్య 2 చదరపు మీటర్ల దూరం పాటించవల్సిందిగా పేర్కొంది. సిబ్బంది కొరత కారణంగా కోవిడ్ -19కి గురైన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజార్డ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దేశాల్లో ఒమిక్రాన్ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే! తాజాగా ఆస్ట్రేలియాలో కూడా మరో మరణం నమోదుకావడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు దేశాల్లో ఒమిక్రాన్ మృతి కేసులు సంభవించినట్లు తెలస్తోంది. కాగా 108 దేశాల్లో కొత్త వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. చదవండి: మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే! -
ఒమిక్రాన్ అప్డేట్స్: ఒక్కరోజే 156 కొత్త కేసులు, మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 156 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 578కి చేరింది. బాధితుల్లో 151 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సోమవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఢిల్లీ తొలిస్థానానికి చేరింది. దేశరాజధానిలో ఒక్కరోజే 63 కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్లో 49, రాజస్థాన్‌లో 43 కేసులు ఉన్నట్టు ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో సోమవారం రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. కేసులు పెరిగితే మరిన్ని ఆంక్షలు అమలుచేసేందుకు కేజ్రీవాల్ సర్కార్ ప్రణాళిక సిద్ధంచేసింది. (చదవండి: అప్రమత్తమైన ఢిల్లీ.. రాత్రి 11 నుంచి 5 వరకు కర్ఫ్యూ) కోవిడ్ కేసులు ఇక కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,531 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల్లో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 7,141 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 75,841 యాక్టివ్ కేసులున్నాయి. (చదవండి: ఆ డాక్టర్ భార్యకూ ఒమిక్రాన్.. తెలంగాణలో ఇది మొదటిసారి) -
ఖమ్మంలో తొలి ఒమిక్రాన్ కేసు.. హైదరాబాద్ నుంచి వచ్చిన యువతికి
సాక్షి, ఖమ్మం: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇన్నాళ్లూ విదేశాల నుంచి వచ్చినవారిలోనే వైరన్ ను గుర్తించగా, ఇప్పుడు ప్రైమరీ కాంటాక్టులు సైతం ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలోనే తెలంగాణ 44 పాజిటివ్ కేసులతో మూడో స్థానంలో ఉంది. వీరిలో 10 మంది కోలుకోగా, ప్రస్తుతం తెలంగాణలో 34 ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది. పట్టణంలోని వైరారోడ్డులో ఓ అపార్ట్మెంట్లో నివసించే 21ఏళ్ళ యువతికి ఓమిక్రాన్ నిర్దారణ అయ్యింది. ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మంలో తన ఇంటికి వచ్చిన యువతికి జలుబు, దగ్గు ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేసుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఒమిక్రాన్ లక్షణాలు కూడా కనిపించడంతో హైదరాబాద్ వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపగా ఒమిక్రాన్ అని తేలింది. వెంటనే యువతిని అధికారులు హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. కాగా ఖమ్మం యువతితో కలిపి తెలంగాణలో ఇవాళ కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44 కి పెరిగింది. కొత్తగా నమోదైన మూడు కేసుల్లో రెండు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులు కాగా, ఒకటి ఒమిక్రాన్ పేషేంట్ కాంటాక్ట్‌కు చెందినది. ఇటీవల ఒక విదేశీయుడి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌కు ఒమిక్రాన్ సోకగా ఆదివారం ఫలితాల్లో ఆ వైద్యుడి భార్యకూ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొదటిసారి ఒమిక్రాన్ రెండో కాంటాక్ట్‌కు కూడా వ్యాపించినట్లు తేలింది. ఇది ప్రమాదకరమైన పరిణామమని వైద్యులు చెబుతున్నారు. -
ఆ డాక్టర్ భార్యకూ ఒమిక్రాన్.. తెలంగాణలో ఇది మొదటిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఒక విదేశీయుడి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌కు ఒమిక్రాన్ సోకగా ఆదివారం ఫలితాల్లో ఆ వైద్యుడి భార్యకూ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొదటిసారి ఒమిక్రాన్ రెండో కాంటాక్ట్‌కు కూడా వ్యాపించినట్లు తేలింది. ఇది ప్రమాదకరమైన పరిణామమని వైద్యులు చెబుతున్నారు. ఆ డాక్టర్ భార్యతో సహా ఆదివారం రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. (చదవండి: 15–18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు.. హైదరాబాద్‌కు ఊరట) ఒమిక్రాన్ సోకిన ఇద్దరిలో ఒకరు సోమాలియా దేశస్తుడు కాగా మరొకరు కెన్యా వ్యక్తి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 44కు పెరిగింది. ఇందులో 10 మంది రికవర్ అయ్యారు. కాగా ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 248 మంది రాగా వీరిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఈ ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా? లేదా? గుర్తించేందుకు ప్రయోగశాలకు వీరి నమూనాలను పంపారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 109 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,80,662కు పెరిగింది. కరోనాతో ఒకరు మృతిచెందగా.. ఇప్పటి వరకు మొత్తం 4,022 మంది మృతిచెందారు. (చదవండి: కేపీహెచ్‌బీ కాలనీ.. హాస్టల్లో యువతి ఆత్మహత్య ) -
ఒమిక్రాన్‌పై ఊరటనిచ్చే విషయం.. కేసులు తక్కువ, రికవరీ ఎక్కువ.. ఇంకా
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాలతో వణికిపోతున్న తరుణంలో ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఇప్పటివరకు మనదేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని, వారికి చికిత్సలు కూడా అందించాల్సిన అవసరం లేదని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన తరువాత త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. (చదవండి: లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు) తగ్గిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజూ పెద్ద మొత్తంలో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసుల్లో కొద్దిగా తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7 కేసులు మాత్రమే రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 422 కు చేరగా.. బాధితుల్లో ఇప్పటివరకు 130 మంది కోలుకున్నారని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 6,987 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో 7,091 మంది తాజాగా కోలుకున్నారు. వైరస్ బాధితుల్లో మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి:12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!) -
2 రోజుల కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిమానాలు అక్షరాలా రూ. 1.5 కోట్లు!
Omicron Scare న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 180 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ హెల్త్ బులెటన్ శుక్రవారం తెలియజేసింది. జూన్ 16 తర్వాత నిన్న ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ దృష్ట్యా కోవిడ్ ప్రోటోకాల్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఐతే గడచిన రెండు రోజుల వ్యవధిలో ప్రొటోకాల్ ఉల్లంఘనల వల్ల సుమారు 1.5 కోట్ల రూపాయల జరిమానాను వసూలు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని పేర్కొంది. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, గుమిగూడినందుకు గాను ఈ జరిమానాలు విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కాగా గత 24 గంటల్లో దేశంలో 7,189 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 415 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో, 115 మంది కోలుకున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, ఢిల్లీలో 79, గుజరాత్లో 43, తెలంగాణాలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి. చదవండి: మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం.. -
ప్రపంచం పై మళ్లీ పంజా విసురుతోన్న కరోన
-
ఒమిక్రాన్ అప్డేట్స్: 57 కొత్త కేసులు.. 415 కు చేరిన మొత్తం సంఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కోవిడ్ కేసులు థర్డ్‌వేవ్‌కు సంకేతంగా నిలుస్తుండగా.. ఒమిక్రాన్ వ్యాప్తి సైతం పరుగులు పెడుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 57 ఒమిక్రాన్ కేసులు రికార్డు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 415కు చేరింది. బాధితుల్లో 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర (108) తొలి స్థానంలో ఉంది. 79 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమలవుతున్నాయి. ఇక కోవిడ్ కేసుల వివరాలు పరిశిలిస్తే.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,189 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,79,815 కు చేరింది. ప్రస్తుతం భారత్‌లో 77,032 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ బాధితుల్లో తాజాగా 15 వేల మంది కోలుకున్నారు. 387 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. (చదవండి: Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!) -
జడుపు ఒద్దు, జాగ్రత్త ముఖ్యం
దాదాపు రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచమంతటికీ చెబుతున్న పాఠం! తాజా వైవిధ్యం ‘ఒమిక్రాన్’ విషయంలో పొల్లుపోని అక్షర సత్యం. వైరస్ బారినపడి భంగపోకుండా విరుగుడు కార్యాచరణకు తిరుగులేని బ్రహ్మాస్త్రం! తూర్పు దేశాల్లో వాతావరణం చూశాక, ఇక్కడ అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అందరూ చేస్తున్న హెచ్చరిక ఇదే! ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్ని వాయిదా వేయాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ర్యాలీల్ని, సభల్ని రద్దు చేయించాలని న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్నీ కోరింది. వచ్చేవారం క్షేత్ర పర్యటన చేసి నిర్ణయిస్తామని ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. ఎన్నికలు వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు. రాత్రి పూట కర్ఫ్యూని యూపీ ప్రభుత్వం అప్పుడే ప్రకటించేసింది. క్రిస్టమస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల దృష్ట్యా ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలిచ్చాయి. దేశంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో పాటు పాలకులు, న్యాయస్థానాలు పౌరసమాజాన్ని ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో, ఈ దిశలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. తూర్పులోని అమెరికా, ఐరోపా దేశాలలో కేసుల ఉధృతి పెరిగిన క్రమంలోనే మన దేశంలోనూ కేసుల సంఖ్య పెరగడం గడచిన రెండేళ్లుగా రివాజయింది. ఆఫ్రికాలో మొదలై అత్యంత వేగంగా నూరు దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వ్యాప్తి అమెరికా, ఐరోపాను వణికిస్తోంది. రోజువారీ కోవిడ్ కొత్త కేసులు అమెరికాలో 2.65 లక్షలకు చేరాయి. కిందటి వారం రోజుల సగటు 1.88 లక్షల కేసులుగా నమోదయింది. ఇక బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్)లో రోజువారీ కొత్త కేసులు 1.22 లక్షలు కాగా, కిందటి వారం సగటు 96 వేల కేసులు. ఇప్పటివరకు వచ్చిన కరోనా అన్ని వైవిధ్యాల కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండి, కొత్త కేసుల్లో వాటి శాతం రమారమి పెరుగుతోంది. మన దేశంలో కోవిడ్ రెండో అల ఉధృతి తీవ్రంగా ఉన్నపుడు జరిగిన భారీ నష్టం మనందరికీ గుర్తుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కేసులు సంఖ్య ఇబ్బడి–ముబ్బడిగా పెంచి, ఇపుడు మూడో అలను మనమే రేపిన వాళ్లమౌతాం! ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అసాధారణమని, అత్యంత వేగవంతమని అన్ని అధ్య యనాలూ తేల్చాయి. ఆఫ్రికా, అమెరికా, బ్రిటన్లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే ధృవీకరించింది. దాన్ని నిజం చేస్తూ, దేశంలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా, ముఖ్యంగా భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వైవిధ్యంతో పోలిస్తే ఒమిక్రాన్ ‘అంత ప్రమాదకారి కాదు’ అనే నివేదికలు వస్తున్నాయి. వైరస్ సోకినా, ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో ఉండాల్సిన అవసరం వచ్చేది తక్కువ కేసుల్లోనే! అలా అని నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్–19 తొలి అల తీవ్రత మందగిస్తున్నపుడు ప్రజానీకం చూపిన అలసత్వానికి దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనల్ని పాటించ కుండా, ‘ఇంకెక్కడి కోవిడ్...?’ అని పౌరులు చూపిన విచ్చలవిడితనం, నిర్లక్ష్యం నికర ఫలితం... రెండో అల ఉధృతి! దేశం అల్లాడిపోయింది. నెల వ్యవధిలో లక్షమందిని కోల్పోయిన పాడు కాలం, కళ్ల జూశాం! ఇపుడైనా... నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శరీరంలోకి జొరబడ్డ వైరస్ పరిమాణం–ఉధృతి పెరిగితే ఎవరికైనా ప్రమాదమే! అప్పటికే ఇతరేతర జబ్బులున్న వాళ్లకు ఇది అత్యంత ప్రమాదకరం. ఏ టీకా తీసుకోని వారూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు 140 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. దేశ జనాభాలో అర్హులైన (18 ఏళ్లు పైబడ్డ) వారిలో 60 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడగా, మొత్తమ్మీద 89 శాతం మంది అర్హులకు కనీసం ఒక డోసైనా టీకా ఇచ్చినట్టయింది. ఈ కార్యక్రమాన్ని వేగిరపరచాలని, త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ‘జనం బతికుంటే, ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు తర్వాతైనా పెట్టుకోవచ్చు’అంటూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయం నూరుపాళ్లు సత్యం! అధికరణం 21 ద్వారా రాజ్యాంగం భరోసా ఇచ్చిన మనిషి జీవించే హక్కును ఉటంకిస్తూ ఆయనీ వ్యాఖ్య చేశారు. విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టే రాష్ట్రాల సరిహద్దుల్లో, బస్స్టేషన్లలో, రైల్వేస్టేషన్లలోనూ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ స్ఫూర్తిని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌరసమాజం కూడా చిత్తశుద్దితో స్వీకరించాలి. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కనబరచాలి. న్యాయస్థానాలు నిర్దేశించినట్టు, ప్రభుత్వాలు ఆదేశిస్తు న్నట్టు, మనమంతా గ్రహిస్తున్నట్టు... చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, మూతి ముసు గులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా చేయాలి. పండుగలు, పబ్బాల గురించి మతాలకతీతంగా ఆలోచించాలి. ఏ పండుగలైనా ప్రజల ప్రాణాలకన్నా మిక్కిలి కాదు. సభలు, సమావేశాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం కష్టమౌతుంది కనుక వాటిని నిలువరించాలి. ఈ విషయం నిర్లక్ష్యం చేస్తే, న్యాయస్థానమే చెప్పినట్టు... పరిస్థితులు రెండో అల విపరిణామాల్ని మించే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! -
ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది: కేంద్రం
ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోందంటూ రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పండుగ-సెలవుల సీజన్ కావడంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఇదివరకే అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పెరుగుతున్న కేసుల వివరాలను వెల్లడిస్తూ.. మరోసారి అప్రమత్తం చేసింది. తాజాగా శుక్రవారం సాయంత్రం దేశంలో నమోదైన Omicron Cases వివరాల్ని యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ ప్రెస్మీట్లో వెల్లడించారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 358 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. ఇందులో 244 యాక్టివ్ కేసులు ఉన్నట్లు, 114 మంది పేషెంట్లు ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో అధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణ 38, తమిళనాడు 34, కర్ణాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్ 22 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. హర్యానా, ఒడిషా, జమ్ము కశ్మీర్, ఏపీ, యూపీ, ఛండీగఢ్, లడక్‌లలో కేసులు నమోదు అయ్యాయి. The top five states with the highest number of active cases, at the moment, are Kerala, Maharashtra, Tamil Nadu, West Bengal and Karnataka: Union Health Secretary Rajesh Bhushan on COVID19 pic.twitter.com/G0fwBQ95f2 — ANI (@ANI) December 24, 2021 ఒక్కరోజులో 122కేసులు రావడం ఆందోళన కలిగించే అంశమని కేంద్రం ప్రకటించింది. వారం కిందట వంద కేసులు, మంగళవారం నాటికి 200 కేసుల మార్క్‌ను చేరుకోగా.. శుక్రవారం నాటికే 350 మార్క్ దాటడం విశేషం. కేసుల్లో 27 శాతం పేషెంట్లు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, స్థానికంగానే వ్యాప్తిచెందిందని వెల్లడించింది. అంతేకాదు 91 శాతం ఒమిక్రాన్ పేషెంట్లు వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లే కావడం గమనార్హం. ఈ తరుణంలో బూస్టర్షాట్ చర్చలు పరిశీలిస్తోంది కేంద్ర ఆరోగ్యశాఖ. ఇక మొత్తం 108 దేశాల్లో లక్షన్నర కేసులు ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించినవి వెలుగుచూశాయి. యూకేలోనే 90వేలు, డెన్మార్క్‌లో 30వేలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఒమిక్రాన్‌కు సంబంధించి 26 మరణాలు నమోదు అయ్యాయి. డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ప్రభావం తక్కువే అయినా.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ఒమిక్రాన్.. యూపీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తాం: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్
నల్లకుంట (హైదరాబాద్): ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. కోర్టు నుంచి ఆర్డర్ కాపీ అందలేదని, అందిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామన్నారు. ఎయిర్‌పోర్టులో అందరికీ టెస్టులు చేస్తున్నామని చెప్పారు. టెస్టుల సంఖ్య పెంచాల్సిందిగా సీఎం చెప్పినట్లు తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఈఎల్) సహకారంతో విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి (డీడీహెచ్)లో రూ.5 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐసీయూ భవనం, ఆపరేషన్ థియేటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎంఈఈఎల్ డైరెక్టర్లు పి.సుధారెడ్డి, పి.రమారెడ్డి, డీడీహెచ్ ఆర్సీ చైర్మన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడారు. మహిళల విద్య కోసం స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఎంతో కృషి చేశారని, ఆమె ఆశయాలను అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. నెల లేదా 2 నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు ఫ్రంట్‌లైన్ వారియర్లకు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు, చిన్నపిల్లలకు టీకా వేసే విషయమై కేంద్రం స్పందించడం లేదని మంత్రి చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్ డోసులు ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఈ నెలాఖరులో ఢిల్లీలో జరిగే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని, ఆ సందర్భంగా మరోసారి కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో లేకుండా ఇక నుంచి నెల లేదా రెండు నెలలకు ఒకసారి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మొత్తం 236 ఒమిక్రాన్ కేసుల్లో 104 మంది కోలుకున్నారు: ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా ఓ మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన జనాభాలో దాదాపు 60 శాతానికిపైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు ఈరోజు మంత్రి మన్సుఖ్ మాండావియా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దేశంలోని వయోజన జనాభాలో 89 శాతం మంది ఫస్ట్ డోస్ వాక్సిన్ వేయించుకున్నారని ఆయన తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదుచేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 70,17,671 డోసుల వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు అందించడం ద్వారా, ఇప్పటివరకు 139.70 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కాగా గడచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 6,960 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ఐతే, దేశంలో ఇప్పటివరకు 236 ఒమిక్రాన్ కేసులు కూడా వెలుగులోకిరాగా, వీరిలో 104 మంది రోగులు కోలుకున్నారు. ఇంతవరకూ ఒక్క ఒమిక్రాన్ మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తవేరియంట్ ఉధృతి కొనసాగుతోందని ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. చదవండి: నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో! Koo App Accomplishing more new feats! Congratulations India 🇮🇳 Aided by public participation & dedicated efforts of our health workers, over 60% of the eligible population fully vaccinated now 💉 #SabkoVaccineMuftVaccine View attached media content - Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 23 Dec 2021 -
బ్రిటన్‌లో ఒమిక్రాన్ విలయం.. లక్ష దాటిన కొత్త కేసులు
UK Reports Over 1 Lakh Daily Covid Cases: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచదేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. మిగతా వేవ్‌ల కంటే ఒమిక్రాన్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ముఖ్యంగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అధిక కేసులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బ్రిటన్‌లో ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి. యూకేలో గడిచిన 24 గంటల్లో 106,122 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 13 వేలకు పైగానే ఉంది. ఇక ఇప్పటి వరకు యూకేలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69 వేలు దాటినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడవ టీకా అంటే బూస్టర్ డోస్ తీసుకోవాలని యూకే ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అదే విధంగా ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన ఫైజర్ టీకాను పిల్లలకు అందించేందుకు బ్రిటిష్ రెగ్యులేటర్లు బుధవారం అంగీకరించారు. చదవండి: బ్రిటన్‌ని వెనక్కి నెట్టిన భారత్.. నెక్ట్స్ టార్గెట్ చైనానే కాగా ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తున్న దేశాల్లో బ్రిటన్ ముందు వరుసలో ఉంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ -19 కారణంగా 147,573 మంది మరణించారు. 11 మిలియన్ల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా ప్రజలు ఇక్కడ బూస్టర్ మోతాదులను తీసుకున్నారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 37,101 ఓమిక్రాన్ కేసులు నిర్ధారించారు. చదవండి: ఒమిక్రాన్‌తో కరోనా విశ్వరూపం! ఇంతకముందు బ్రిటన్‌లో కోవిడ్ సెల్ఫ్ ఐసొలేషన్ సమయాన్ని పది రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించారు. క్వారంటైన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆరు, ఏడు రోజుల్లో వరుసగా రెండు నెగిటివ్ ఫలితాలు వస్తే వారి క్వారంటైన్‌ను ఇక అక్కడితో ముగించేయవచ్చునని బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ బుధవారం తెలిపారు. -
ఒమిక్రాన్ ముప్పు: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు..
Restrictions In India Due To Omicron: డెల్టా కంటే ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ సంక్రమణ శక్తి మూడురెట్లు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో... కొత్త వేరియెంట్‌ను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. భారత్‌లో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బుధవారం నాటికి దాదాపు 250 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దేశంలో కోవిడ్–19 తాజా స్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. ►దేశ రాజధాని పరిధిలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు గుమిగూడ కుండా చూడాలని కలెక్టర్లకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఆదేశాలు జారీచేసింది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు, పండుగలకు జనం గుమిగూడటాన్ని నిషేధించింది. 200 మందికి పరిమితమై వివాహ సంబంధ వేడుకలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి పాజిటివ్ కేసు శాంపిల్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతోంది. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 50 దాటింది చదవండి: ఒమిక్రాన్ ముప్పు: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలొద్దు.. ►రెండు డోసులు తీసుకొని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను చూపితేనే జనవరి 1 నుంచి షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లలోకి అనుమతిస్తామని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. వ్యాక్సినేషన్ పూర్తయితేనే అధికారులతో సహా ఎవరినైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశం ఉంటుందని ఆదేశాలు జారీ అయ్యాయి. ►కేరళలలో ఒమిక్రాన్ కేసులు 24కు పెరిగాయి. రాజస్తాన్‌లో మొత్తం 22 మందికి ఒమిక్రాన్ సోకింది. ►ప్రజలు కోవిడ్ జాగ్రత్తలను అలక్ష్యం చేస్తున్నారని.. ఇది సరికాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. -
జాగ్రత్త పడాల్సిందే!
అనుకున్నంతా అయింది. నవంబర్ 24న దక్షిణాఫ్రికా అప్రమత్తం చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెల తిరిగేసరికల్లా 90కి పైగా దేశాలకు విస్తరించింది. మునుపటి డెల్టా వేరియంట్ కన్నా 3 నుంచి 5 రెట్లు ఎక్కువ వేగంతో విస్తరిస్తూ, ఒకటిన్నర–రెండు రోజుల్లో కేసులు రెట్టింపయ్యే సత్తా ఉన్న ఒమిక్రాన్ అమెరికా సహా అనేక దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌లో రోజువారీ కేసులు లక్షకు చేరుకున్నాయి. పలు ఐరోపా దేశాలు మళ్ళీ షరతులు పెట్టాయి. నెదర్లాండ్స్, తాజాగా చైనాలో కోటీ 30 లక్షల మందికి ఆవాసమైన షియాన్ లాక్డౌన్ పెట్టాయి. ‘చరిత్రలో మిగతా వైరస్లన్నిటి కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. త్వరలోనే ప్రపంచంలో ప్రతి దేశంలో అది ఉంటుంది. రాబోయే మూడు నెలలు ప్రపంచానికి గడ్డుకాలం’ –ప్రసిద్ధ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ మంగళవారం చేసిన ఈ భవిష్యత్ అంచనా ట్వీట్ అలసత్వం వహిస్తున్న అందరికీ మరో మేలుకొలుపు. ఒమిక్రాన్ పూర్తి తీరుతెన్నులు, దానిపై ప్రస్తుత టీకాల సామర్థ్యం లాంటివి ఇప్పటికీ కచ్చితంగా తేలలేదు. టీకా రెండు డోసులూ వేసుకున్నవారికి సైతం ఒమిక్రాన్ బెడద తప్పట్లేదన్న డేటా మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ అనిశ్చితి మధ్యనే వివిధ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ నలుగురూ కూడి చేసుకొనే వేడుకలను వాయిదా వేసుకోవాలన్నది ఆరోగ్య సంస్థ తాజా విజ్ఞప్తి. మన దేశంలో పండుగలకు తోడు పంజాబ్, ఉత్తర ప్రదేశ్, గోవా సహా అయిదు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలు, ర్యాలీలు ఇప్పుడే భయం పుట్టిస్తున్నాయి. భారత్‌లో మూడో వేవ్ తప్పదనీ, ఫిబ్రవరికి అది పతాక స్థాయికి చేరుతుందనీ, రోజుకు 1.5 నుంచి 1.8 లక్షల కేసుల వరకు రావచ్చనీ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ సారథ్యంలోని ‘నేషనల్ కోవిడ్19 సూపర్ మోడల్ కమిటీ’ అంచనా. ఈ పరిస్థితుల్లో కర్ణాటక, తాజాగా ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాలు సమావేశాలు, సామూహిక ఉత్సవాలపై షరతుల మొదలు నిషేధం దాకా చర్యలు మొదలుపెట్టాయి. ఒమిక్రాన్ కేసుల్లో భారత్ ఇప్పటికే 250 మార్కు దాటేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణలు ఈ కొత్త వేరియంట్ కేసుల్లో ముందు వరుసలో ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సి వచ్చింది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలను పూర్తిగా అనుమతించాలనుకొన్నా, భారత్ సహా దాదాపు 25 దేశాలు వెనక్కి తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూలు, షరతులతో కూడిన అనుమతులు, కంటైన్మెంట్ జోన్లు పెట్టాలంటూ కేంద్రం మంగళవారం పారాహుషార్ సందేశం పంపిన విషయం మర్చిపోలేం. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. ఒమిక్రాన్‌తో కోవిడ్ వ్యాపిస్తున్నా, మునుపటిలా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కాకపోవడం ఉన్నంతలో ఊరట. అలాగని అశ్రద్ధ చేయలేం. ఒకేసారి వందలు, వేల సంఖ్యలో కరోనా బారినపడ్డ వారు ఆసుపత్రి పాలైతే, పరిస్థితి ఏమిటన్నది ఊహించడం కష్టం. ప్రస్తుతం భారత్‌లో సీనియర్ సిటిజన్ల సంఖ్య 13.8 కోట్లు. వారిలో సగం మందికి కరోనా తీవ్రంగా వచ్చినా, పరిస్థితి అతలాకుతలమవుతుంది. కరోనా దెబ్బతో రెండేళ్ళ క్రితంతో పోలిస్తే, ఇప్పుడు పౌర ఆరోగ్య వసతులు కొంత మెరుగైనమాట నిజమే కానీ, పడకల మొదలు ఆక్సిజన్ దాకా ఎందరికి సరిపోతాయన్నది చెప్పలేం. ప్రపంచానికి కరోనా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి దాకా పని ఒత్తిడితో శారీరకంగా, మానసికంగా డస్సిపోయిన వైద్య సిబ్బందికి అది మరింత భారమయ్యే ప్రమాదమూ ఉంది. మరోపక్క ప్రస్తుతం కరోనాపై అత్యంత ప్రభావశీలమైన యాంటీబాడీ కాక్టైల్ చికిత్సకయ్యే రూ. 60 వేల ఖర్చు సామాన్యులు భరించడమూ కష్టమే. ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు రోగ నిరోధకశక్తిని పెంచే బూస్టర్ డోస్‌గా మూడో డోస్ మార్గం పట్టాయి. ఇజ్రాయెల్ ఏకంగా 4 డోసుల విధానం వైపు నడుస్తోంది. త్వరలో ఆ పద్ధతిని ఆచరణలో పెడితే, నాలుగు డోసుల పద్ధతి అనుసరిస్తున్న తొలి ప్రపంచ దేశం ఇజ్రాయెలే అవుతుంది. మామూలుగా టీకా వల్ల కలిగే ఇమ్యూనిటీ మూడు నెలల మొదలు ఏడాది లోపల తగ్గిపోతుందని నిపుణుల మాట. అందుకే, భారత్‌లో సైతం నిర్ణీత రెండు డోసులే కాకుండా మూడోదీ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ బెడదతో కనీసం ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ, ఇతర అనారోగ్యాలున్న వారికైనా ముందుగా ఈ బూస్టర్ డోస్ వేయాలనే వాదన రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటికైతే బూస్టర్ డోస్‌లు, పిల్లలకు టీకాలకు సర్కార్ సుముఖంగా లేదు. మామూలు జలుబు వైరస్ నుంచి ఒమిక్రాన్ తన జన్యుద్రవ్యాన్ని తీసుకుందని ఎన్ఫెరెన్స్ సంస్థ అధ్యయనం. అలాగే, ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఒమిక్రాన్ చివరకు కోవిడ్ వ్యాధిగా కాక, సాధారణ కోవిడ్ ఫ్లూలా తయారవుతుందని ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ వైద్యుడు ప్రవీణ్ హిసారియా అంచనా. అదే నిజమైతే, ప్రపంచం నెత్తిన పాలు పోసినట్టే! ఆధునిక భారతావనిలో క్రికెట్, మతం, రాజకీయాలు మూడూ అతి పెద్ద విశ్వాసాలనుకుంటే, చివరి రెండింటితో ఉత్సవాలు, ఊరేగింపుల పుణ్యమా అని కరోనా వ్యాప్తి ఉదంతాలు గత రెండేళ్ళలో అనేకం. టీకాలు వేసుకోవడం, భౌతిక దూరం–మాస్కు ధారణ లాంటి కోవిడ్ జాగ్రత్తలతో కూడిన ప్రవర్తన– ఈ రెండే ఎన్ని వేరియం ట్లొచ్చినా శ్రీరామరక్ష అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాటలే తారకమంత్రం. -
ఒమిక్రాన్ విజృంభణ.. బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
Bill Gates Warns World on Omicron surge: టెక్ మేధావిగా, వ్యాపార దిగ్గజంగానే కాదు.. ప్రపంచ సమకాలీన అంశాలపై అంచనా వేయగలిగే మేధావిగా బిల్‌గేట్స్‌కి పేరుంది. కరోనా విషయంలో మొదటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే డెల్టాఫ్లస్ లాంటి ప్రమాదకరమైన వేరియెంట్ విజృంభణ సమయంలో.. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడం, పాజిటివిటీ రేటు పడిపోతుడడంపై బిల్‌గేట్స్ ఓ అంచనాకి వచ్చారు. కరోనా అంతమయ్యే సమయం ఎంతో దూరం లేదంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. కానీ, ఒమిక్రాన్ బిల్‌గేట్స్ అంచనాల్ని తలకిందులు చేసింది ఇప్పుడు. దీంతో తన తాజా ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారాయన. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుందని, రానున్న రోజులు మరింత కీలకమని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఏడాదిలో అన్ని దేశాలు అన్ని రంగాల్లో సంక్షోభాల్ని ఎదుర్కొక తప్పదని అంచనా వేశారు. ఈ మేరకు తన ట్విటర్లో వరుస ట్వీట్లు పోస్ట్ చేశారాయన. ‘‘సెలవుల్ని బంధువులతో కలిసి ఆస్వాదిద్దాం అనుకున్నా. కానీ, నా సన్నిహితులు సైతం ఒమిక్రాన్ బారినపడ్డారు. దీంతో మొత్తం కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నా. చరిత్రలో ఏ వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ కన్నా వేగంగా విస్తరించలేదు. అతిత్వరలో అన్ని దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించడం ఖాయం. రాబోయే మూడు నెలలు ప్రపంచం గడ్డుకాలం ఎదుర్కొబోతోంది. కొన్నినెలలపాటు ఆ ప్రభావం కొనసాగుతుంది. There will be more breakthrough cases in people who are vx’d, which sounds concerning but is purely a factor of how many people are vx’d and how fast this variant is spreading. Vaccines are designed to prevent people from getting seriously ill or dying & are doing that well. — Bill Gates (@BillGates) December 21, 2021 సంక్షోభాలు తప్పకపోవచ్చు!. డెల్టాలో సగం తీవ్రతకు చేరుకున్నా.. ఒమిక్రాన్ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. పరిస్థితులు దిగజారిపోతాయి. కానీ, ఒక్కటి మాత్రం కరాకండిగా చెప్పగలను. సరైన జాగ్రత్తలు పాటిస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకుంటే 2022లోనే కరోనాను జయించొచ్చు. వీలైనంత త్వరలో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు బిల్‌గేట్స్. Omicron is spreading faster than any virus in history. It will soon be in every country in the world. — Bill Gates (@BillGates) December 21, 2021 ఆ కామెంట్‌పై విమర్శ కరోనా ప్యాండెమిక్లో దారుణమైన దశకు చేరుకున్నామన్న బిల్‌గేట్స్.. మరో ట్వీట్‌తో విమర్శలపాలయ్యారు. బూస్టర్ షాట్స్ తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన సలహాను చాలామంది తప్పుబడుతున్నారు. సంబంధిత వార్త: కరోనా అంతమయ్యేది అప్పుడే: బిల్ గేట్స్ చదవండి: బిల్‌గేట్స్, బెజోస్ తర్వాత ఎవరంటే.. -
ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు..
హైదరాబాద్‌కు చెందిన నారాయణకు 60 ఏళ్లు. దీర్ఘకాలిక సమస్యలున్నాయి. రెండో డోస్ పూర్తయి 6 నెలలైంది. థర్డ్‌వేవ్ హెచ్చరికలతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వేయించుకున్నారు. డాక్టర్ సూర్యనారాయణరావు (పేరు మార్చాం). 52 ఏళ్లు. కరోనా రెండో వేవ్ సమయంలో ఈయన గుండెకు స్టెంట్లు వేశారు. షుగర్ కూడా ఉంది. పైగా కరోనా రెండో డోస్ వేసుకొని ఆరు నెలలైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని మూడో డోస్ వేయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరికలతో రాష్ట్రంలో అనేకమంది కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా మూడో డోస్ వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయసు పైబడినవారు బూస్టర్ వేయించుకుంటున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి కూడా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆయనే స్వయంగా అంతర్గతంగా వెల్లడించడం గమనార్హం. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పలువురు బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. ఇదంతా అనధికారికంగా జరుగుతుండటంతో ఎంతమంది వేయించుకున్నారో స్పష్టత లేదు. మరోవైపు అవసరమైన వారికి బూస్టర్ డోస్ వేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవలే కేంద్రానికి విన్నవించిన విషయం తెలిసిందే. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు.. రెండో డోసులేసుకున్న ఆర్నెల్ల తర్వాత.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్ భయంతో టీకాలు వేయించుకోవడానికి అనేకమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే 97.35 శాతం మంది మొదటి డోస్.. 56.08 శాతం మంది రెండో డోస్ వేయించుకున్నారు. 11 జిల్లాల్లో నూరు శాతం ఫస్ట్ డోస్ పూర్తయింది. సహజంగా రెండు డోసులు వేసుకున్న ఆరు నెలల వరకే కరోనా నుంచి రక్షణ ఉంటుంది. ఆ తర్వాత బూస్టర్ డోస్ వేయించుకుంటే మంచిదన్న భావన ఉంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లకు బూస్టర్ వేయాలన్న చర్చ నేపథ్యంలో ఈ వర్గం ప్రజలు చాలా చోట్ల మూడో డోస్ వేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోస్ వేయాలని వాదనలు నడుస్తున్నాయి. చదవండి: హైదరాబాద్: ఆరుగురు పరారు.. నలుగురు దొరికారు తొలి, రెండో డోస్‌పైనే కేంద్రం దృష్టి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ వేయించుకునే వారి నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నట్లు కొందరు తెలిపారు. అధికారికంగా వేయడానికి అనుమతి లేకపోవడంతో రిజిస్ట్రేషన్ లేకుండానే వేస్తున్నారు. కేంద్రం ప్రస్తుతం మొదటి, రెండో డోస్‌పైనే దృష్టి పెట్టింది. అనేక దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఉండటంతో బూస్టర్ వేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కేంద్రమూ బూస్టర్‌పై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. చదవండి: క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను -
ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. బాధితుల్లో 90 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. మొత్తం కేసుల్లో సగం వరకు ఢిల్లీ (57), మహారాష్ట్ర (54)లో ఉన్నట్టు తెలిపింది. ఇక కోవిడ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 6,317 కేసులు బయటపడ్డాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 318 మంది ప్రాణాలు విడిచారు. దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 78,190 గా ఉంది. నిన్న ఒక్కరోజే వైరస్ బాధితుల్లో 6,906 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 0.51 శాతంగా, రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇప్పటివరకు 138.96 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. (చదవండి: ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం) -
అమెరికాను కమ్మేసిన ఒమిక్రాన్.. 73 శాతం అవే కేసులు
Omicron Cases In US: అమెరికా ఒమిక్రాన్ వేరియంట్‌తో వణికిపోతోంది. మిగతా వేరియంట్లతో పోలిస్తే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కారణంగానే భారీ సంఖ్యలో పౌరులు కోవిడ్ బారిన పడుతున్నారు. గత వారం నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ విస్తృతి ఒక్కసారిగా ఎక్కువైంది. గత వారంలో ఇన్ఫెక్షన్లలో ఈ వేరియంట్ వాటా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగింది. న్యూయార్క్ ప్రాంతంలో కొత్త కేసుల్లో 90శాతానికిపైగా కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే. గత వారం మొత్తంగా 6,50,000 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ చివరివరకూ నమోదైన కేసుల్లో 99.5 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని వ్యాధి కట్టడి, నివారణ కేంద్రాల(సీడీసీ) డైరెక్టర్ డాక్టర్ రాషెల్ వాలెన్స్కీ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని ఒమిక్రాన్ అత్యంత వేగంగా ఆక్రమించి అమెరికా ఆరోగ్య వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించింది. చదవండి: యూఎస్‌లో తొలి ఒమిక్రాన్ మరణం.. భయాందోళనలో ప్రజలు అమెరికాలో తొలి ‘ఒమిక్రాన్’ మరణం టెక్సాస్ రాష్ట్రంలో గతంలో కోవిడ్ నుంచి కోలుకున్న ఒక మధ్య వయస్కుడికి ఒమిక్రాన్ సోకి పరిస్థితి విషమించి మరణించారని అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. అతడు కోవిడ్ టీకాలు తీసుకోలేదని హ్యారిస్ కౌంటీ ప్రజారోగ్య విభాగం పేర్కొంది. బైడెన్ సిబ్బందిలో ఒకరికి కరోనా అమెరికా అధ్యక్షుడు బైడెన్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. బైడెన్ తన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ ప్రత్యేక విమానంలో శుక్రవారం దక్షిణ కరోలినాలోని ఆరెంజ్ ప్రాంతం నుంచి ఫిలడెల్ఫియాకు పయనించారు. ఆ సమయంలో విమానంలో సిబ్బందిలో ఒకరు 30 నిమిషాలపాటు బైడెన్‌తోపాటు ఉన్నారు. ఆ వ్యక్తికే కరోనా సోకింది. దీంతో బైడెన్‌కు కరోనా సోకుతుందనే అనుమానాలు పెరిగాయి. బైడెన్‌కు రెగ్యులర్‌గా కరోనా టెస్ట్‌లు చేస్తారు. బుధవారం మరోసారి టెస్ట్ చేయనున్నారు. కరోనా వ్యాప్తిని మరింత వేగంగా గుర్తించి కట్టడికి చేసేందుకు బైడెన్ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రజలు ఇంట్లోనే ర్యాపిడ్ టెస్ట్ చేసుకునేందుకు వారికి 50 కోట్ల కిట్లను ఉచితంగా అందివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
డెల్టా కంటే 3 రెట్లు వేగం.. ఒమిక్రాన్‌తో బహుపరాక్.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్ ఉంది. తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఒమిక్రాన్ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రస్తుతం ఆధారాలున్నాయి. అందుకే, అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్మెంట్ విషయంలో చురుగ్గా ఉండాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘వార్‌రూంలను క్రియాశీలకం చేయాలి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేసుల్లో చిన్నపాటి పెరుగుదల కనిపించిన ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలి. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటెయిన్మెంట్ చర్యలను కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలి. పెళ్లిళ్లు, ఉత్సవాల్లో ప్రజలు భారీగా గుమికూడకుండా నియంత్రించాలి. వైరస్ బాధితుల హోం ఐసోలేషన్ సమయంలో నిబంధనలను తు.చ.తప్పకుండా పాటించాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హులైన మొదటి, రెండో డోస్ లబ్ధిదారులందరికీ టీకా వేగంగా అందేలా చూడాలి. వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి’అని ఆయన కోరారు. గత వారం రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 10%, అంతకంటే ఎక్కువగా ఉన్న, ఐసీయూ బెడ్ ఆక్యుపెన్సీ 40%, ఆపైన ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. క్లస్టర్లలో సేకరించిన శాంపిళ్లను తక్షణమే తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపాలన్నారు. ప్రస్తుతం పిల్లలకు టీకా అక్కర్లేదు ప్రస్తుతానికి దేశంలో చిన్నారులకు కోవిడ్–19 టీకా అవసరం లేదని వ్యాధి నిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్‌లో నిర్ణయించినట్లు పేర్కొంది. ‘పిల్లలకు కోవిడ్ ముప్పు అంతగా లేదు. అందుకే, చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం’అని మంగళవారం ఎన్టీఏజీఐ తెలిపింది. -
Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయిలో మారణహోమాన్ని రగిలించిన కోవిడ్ రెండో వేరియంట్ డెల్టాప్లస్ కంటే కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ శర వేగంగా విస్తరిస్తోంది. ఐతే తాజా అధ్యయనాల ప్రకారం త్వరలో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశం మొత్తంలో 200 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఐతే డెల్టా ప్లస్ కంటే ఒమిక్రాన్ 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసి పతనంచేస్తుందని, రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకూ వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసుల్లో గొంతు నొప్పి, అలసట వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే బయటపడ్డాయి. ఇంట్లోనే తగు జాగ్రత్తలతో కోలుకుంటున్నారు కూడా. దేశంలో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్ మృతి నమోదవ్వనప్పటికీ, అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించడంతో యావత్ ప్రపంచం భయాందోళనల్లో ఊగిసలాడుతోంది. చదవండి: ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్ -
స్టాక్ మార్కెట్‌కి ఊరట.. లాభాల్లో ట్రేడ్
ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనల నడుమ గ్లోబల్ మార్కెట్ నిన్నంతా (సోమవారం) భారీ నష్టాల్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సైతం భారీ పతనాల్ని ఎదుర్కొన్నాయి. అయితే మంగళవారం కాస్త ఊరటనిచ్చే ఫలితాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం(21-12-2021) లాభాలతో మొదలైంది. ఉదయం 9.40గం. సమయంలో నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి(1.09%) 16, 751 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 478 పాయింట్లు లాభంతో (1.09%) 56,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో నిఫ్టీ-సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రోలు.. నిఫ్టీలో టాప్ లాసర్స్‌గా సిప్లా, హీరో మోటర్కాప్, ఎయిచర్ మోటర్స్, ఉన్నాయి. ఐసీఐసీఐ, రిలయన్స్, బజాజ్‌ఫైనాన్స్, టాటామోటార్స్, విప్రో లాభాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లో సానుకూల ప్రభావం, దేశీయ కంపెనీల భారీ ఒప్పందాల నడుమ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల పట్టినట్లు నిపుణులు చెప్తున్నారు. -
తెలంగాణ: 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్!
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా నిర్ధారణ అవగా అందులో నలుగురు విదేశీయులు మినహా మిగిలిన వారికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ వారిని ప్రత్యేక వార్డులకు తరలించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. సొమాలియా, కెన్యాకు చెందిన నలుగురు కేన్సర్ బా«ధితులు మెరుగైన చికిత్సకై హైదరాబాద్ చేరుకొనే క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా బారినపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికితోడు ధైర్యం చెప్పేందుకు పక్కన కుటుంబ సభ్యులు ఉండే వీల్లేకపోవడం, భాషా సమస్య కారణంగా వైద్యులు చెబుతున్న విషయాలు వారికి అర్థం కావట్లేదు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతోనూ ఆ విదేశీయులు బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరోవైపు ఒమిక్రాన్ అనుమానిత బాధితుల నమూనాల జీనోమ్ సీక్వెనింగ్ పరీక్షలు సోమవారం గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు 48 నమూనాలను పరీక్షించారు. వాటి నివేదికలు మరో మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ పరీక్షలను పుణే వైరాలజీ ల్యాబ్ లేదా సీసీఎంబీకి పంపేవారు. 156 మందికి కరోనా సాక్షి, హైదరాబాద్/ముస్తాబాద్ (సిరిసిల్ల): రాష్ట్రంలో సోమవారం 33,140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 6,79,720కి చేరింది. తాజాగా 207 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,72,063కి పెరిగింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 4,015కు చేరుకుంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బులెటిన్ విడుదల చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న రిస్క్ దేశాల నుంచి సోమవారం 658 మంది విమాన ప్రయాణికులు హైదరాబాద్ చేరుకోగా వారికి నిర్వహించిన పరీక్షల్లో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే వారికి ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకొనేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపారు. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న సంఖ్య మొత్తం 8,396 చేరిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఈ నెల 16న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామవాసి పిట్ల చంద్రానికి సోమవారం ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్వగ్రామంలో ఉన్న అతన్ని జిల్లా అధికారులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచారు. -
ఒమిక్రాన్ దెబ్బ! సర్రున జారి పోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై : ఒమిక్రాన్ వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. క్రిస్మస్ పండగ సీజన్లో సైతం యూరప్ దేశాలు కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిసెంబరు మలి భాగంలోకి వచ్చినా మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా స్టాక్మార్కెట్లో బేర్ హవా కొనసాగుతోంది. ఫలితంగా ఈ వారం మార్కెట్ ఆరంభమైన కొద్ది సేపటికే నష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం ఎన్ఎస్సీ నిఫ్టీ నష్టాలతోనే మొదలైంది. గత వారం 16,985 దగ్గర క్లోజవగా సోమవారం ఉదయం 16,824 దగ్గర ఓపెన్ అయ్యింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:30 గంటల సమయంలో 310 పాయింట్లు నష్టపోయి 16,674 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 55,517 పాయింట్ల దగ్గర ప్రారంభం అవగా ఉదయం 9:30 గంటల సమయానికి 1,044 పాయింట్లు నష్టపోయి 55,967 దగ్గర కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు అర గంట వ్యవధిలోనే ఏకంగా 1.80 శాతానికి పైగా క్షీణించాయి. మరోసారి సెన్సెక్స్ 55వేలకు పడిపోయింది. నిఫ్టీ 16,600 పాయింట్ల రేంజ్లో కొట్టుమిట్టాడుతోంది. -
మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో..
Netherlands going into lockdown again amid Omicron అమ్‌స్టర్‌డామ్: నెదర్లాండ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున ఉధృతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్ధేశ్యంతో డచ్ ప్రభుత్వం శనివారం లాక్‌డౌన్‌ను విధించింది. ఈ మేరకు హేగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే ప్రకటించారు. ఈ నిర్ణయంతో నెదర్లాండ్స్ మరొకమారు లాక్డౌన్లోకి వెళ్తుంది. ‘ఊహించిన దానికంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. అందువల్లనే లాక్డౌన్ తప్పనిసరైంది. కొత్త లాక్డౌన్ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అమల్లోకొస్తుంది. కఠిన నిబంధనలతో ఈ లాక్‌డైన్ కొత్త సంవత్సరం జనవరి 14 వరకు అమల్లో ఉంటుంది. ఐదో వేవ్ చేరువ అవుతున్న తరుణంలో లాక్‌డైన్ అనివార్యమైంద'ని రుట్టే తెలిపారు. సూపర్ మార్కెట్లు, వైద్యపరమైన వృత్తులు, కార్ గ్యారేజీలు వంటి ఇతర ముఖ్యమైన షాపులు తప్ప, మిగతా ఇతర షాపులు, అన్ని విద్యా సంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్లు, మ్యూజియంలు, థియేటర్లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. శుక్ర, శని వారాల్లో దాదాపుగా 14,742 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, ఓఎమ్టీ సభ్యుడు జాప్ వాన్ డిసెల్ మీడియాకు తెలిపాడు. అంతేకాకుండా క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాగా డిసెంబర్ 14న నెదర్లాండ్స్‌లో కొన్ని ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే! తాజాగా వాటిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అప్రధాన షాపులకు నైట్లాక్డౌన్ అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించారు. అంతేకాకుండా క్రిస్టమస్ సెలవులకు ఒక వారం ముందునుంచే పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని ఆదేశించారు. ఐతే ఒమిక్రాన్ అడ్డుకోవాలంటే ఈ ఆంక్షలు సరిపోవని భావించిన డచ్ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసిన నాలుగు రోజులకే తాజాగా సంపూర్ణ లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! -
డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే..
న్యూఢిల్లీ: గత యేడాది ప్రారంభంలో కేవలం అతి తక్కువ కాలంలోనే కరోనా డెల్టా స్ట్రెయిన్ ఘోర మారణహోమం సృష్టించింది. ముఖ్యంగా మనదేశంలో ఏప్రిల్ - మే నెలల్లో లక్షల మరణాలకు కారణమైంది. దీని నుంచి పూర్తిగా బయటపడక ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరొకమారు ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. దీనిని ధృవీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీరి అధ్యయన ఫలితాలు ఏం చెబుతున్నాయంటే.. ఒక వ్యక్తికి సార్స్ కోవిడ్- 2 వైరస్‌కు చెందిన డెల్టా స్ట్రెయిన్, ఒమిక్రాన్ రెండూ ఒకేసారి సోకినట్లయితే అతనిలో సూపర్ స్ట్రెయిన్ అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నట్లు ఒక నిపుణుడు అభిప్రాయపడుతున్నాడు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా కంటే 30 రెట్లు అధికంగా స్పైక్ ప్రొటీన్ కలిగి ఉందని దీనిని ఎదుర్కోవడం కష్టసాధ్యమని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఉధృతి చూస్తుంటే సూపర్ స్ట్రెయిన్ అవకాశాన్ని తోసిపుచ్చలేమని యూకే పార్లమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీకి మోడెర్న్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాల్ బర్టన్ తెలిపారు. రెండు వైరస్‌లను తట్టుకునే శక్తి ఖచ్చితంగా మనుషుల్లో ఉండదనే విషయాన్ని దక్షిణాఫ్రికా కూడా మీడియాలో ప్రచురించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు వేరియంట్లు జన్యువులను మార్చుకుని మరింత ప్రమాదకరంగా రూపాంతరం చెందడం సాధ్యమేనని యూకే పార్లమెంటేరియన్లకు ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఒకసారి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకినవారికి తిరిగి మళ్లీమళ్లీ సోకే అవకాశం 5 రెట్లు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయని, డెల్టా కంటే దీని ఉధృతి తక్కువ అనడానికి ఎటువంటి సంకేతాలు బయటపడలేదని తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 11 మధ్య కోవిడ్ సోకిన వ్యక్తులపై నేషనల్ హెల్త్ సర్వీస్ డేటా ఆధారంగా యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నిర్వహించిన అధ్యయన ఫలితాలు ఈ విషయాలను వెల్లడించాయి. ఐతే డెల్టాకంటే ఒమిక్రాన్ ఏవిధంగా ప్రాణాలకు హాని చేకూరుస్తుంది, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయంలో ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదని అన్నారు. వాక్సిన్ స్టేటస్, వయస్సు, లింగం, జాతి, లక్షణరహిత స్థితి, ప్రాంతం ఆధారంగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ 5.4 రెట్లు ఎక్కువ సార్లు మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! -
భారత్‌లో సెంచరీ దాటేసిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ బాధితులు పెగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అలెర్ట్ చేశాయి. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్న విదేశాల నుంచి వస్తున్న వారిలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో అధికశాతం విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య సెంచరీని దాటేసింది. ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో అనవసర ప్రయాణాలు, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని తెలిపింది. మరోవైపు డెల్టా వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను ఓమిక్రాన్ అధిగమించే అవకాశం ఉందని తెలిపింది. చదవండి: తమిళనాడు: పాఠశాలలో గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ ఢిల్లీలో శుక్రవారం పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య 20కు చేరినట్లు డిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. 20 మందిలో 10 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలో శుక్రవారం కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య తొమ్మిదికి పెరిగినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ ఆంక్షలు -
Telangana: హన్మకొండలో ఒమిక్రాన్ కేసు
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. యూకే నుంచి హనుమకొండలోని పోస్ట్ల్ కాలనీకి వచ్చిన యువతికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 1న యూకే నుండి వచ్చిన సదరు యువతికి 12వ తేదీన ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆపై 13వ తేదీన ఒమిక్రాన్ టెస్టు నిర్వహించగా మూడు రోజుల తర్వాత పాజిటివ్ వచ్చింది. హన్మకొండలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదును వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. తాజా ఒమిక్రాన్ కేసుతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. కాగా, జిల్లాలో వారం రోజుల్లో 91కి కరోనా కేసులు రాగా, తాజాగా 12 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. -
తెలంగాణ: ఒమిక్రాన్ కలవరం.. ఒకేరోజు నాలుగు కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 4 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో ముగ్గురు కెన్యా దేశానికి చెందిన వారు కాగా.. మరొకరు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని వైద్యాధికారులు చెప్పారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. భారత్‌లో మొత్తంగా ఒమిక్రాన్ కేసులు 87కి చేరుకున్నాయి. చదవండి: (ఆ ఇమ్యూనిటీతో ఎదుర్కోవచ్చు) -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ ఆంక్షలు
Fresh Guidelines For Omicron Strain: ముంబైలో కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు కరోనా నియమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను, నియమాలను జారీ చేశారు. ఈ నూతన మార్గదర్శకాలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో జరిగే వివాహాలు, ఇతర వేడుకలపై ఆంక్షల ప్రభావం పడనుంది. దేశవ్యాప్తంగా ఇటీవల ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదయ్యే ఒమిక్రాన్ కేసులలో సుమారు 50 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా డిసెంబర్ 31 వేడుకలు, ఇతర కార్యక్రమాలతో ఒమిక్రాన్ విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 16 నుంచి 31 వరకు ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. అంతేగాక, ఇప్పటికే అమలులో ఉన్న నియమాలను ప్రజలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలించనున్నారు. వ్యాక్సిన్‌తోనే పూర్తి స్థాయి రక్షణ ముంబైలో అయిదు వేల మంది కాలపరిమితి పూర్తయినప్పటికీ రెండో డోస్ తీసుకోలేదు. రెండు డోసులు తీసుకుంటేనే కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందనీ, దీన్నొక కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని మునిసిపల్ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా బస్సుల్లో పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నవారు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతున్నారు. ప్రతి రోజూ బెస్ట్ బస్సుల్లో 28 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారనీ, కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు.. దేశంలో మొత్తం 77 కేసులు కరోనాపై పోరులో కొత్తమందు! -
ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు.. దేశంలో మొత్తం 77 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. గురువారం నమోదైన కొత్త ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య పదికి చేరింది. 40 మందిని లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్చామని అనుమానిత కేసులను వేరు చేసి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. చదవండి: హెచ్‌సీఏ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తాం: సుప్రీంకోర్టు ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయని, అందుకోసమే కచ్చితమైన పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల ఒమిక్రాన్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా నమోదైన 4 కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో 7,974 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలల్లో 343 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. -
కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక
వాహింగ్టన్: గత యేడాది మారణహోమం సృష్టించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని యూఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గురువారం వెల్లడించింది. అమెరికాలోని మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. యూఎస్ దేశ వ్యాప్తంగా 96 శాతం మెజార్టీ కేసులన్నీ డెల్లా ఫ్లస్కు చెందినవి కాగా, 3 కంటే ఎక్కువ శాతం కేసులు ఒమిక్రాన్‌కు చెందినవని ఆయన తెలిపారు. 75 దేశాల్లోని 36 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయని, కేవలం రెండు రోజుల వ్యవధిలో కొత్త వేరియంట్ కేసులు రెట్టంపయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా యూఎస్ నేషనల్ జినోమిక్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ డేటాను సీడీజీ విడుదల చేసింది. వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ విజృంభణ కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కోవిడ్ డెల్టా ప్లస్‌ను డామినెట్ చేసే ఆధిపత్య జాతిగా పురోగమిస్తుందని యూఎస్ సీడీసీ నివేదించింది. మరోవైపు ఈయూ/ఈఈఏ దేశాల్లో 2022 మొదటి రెండు నెలల్లో ఒమిక్రాన్ వీఓసీ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పండుగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! #WATCH | US Centers for Disease Control and Prevention (CDC) Director Rochelle Walensky said, "...Early data suggest that Omicron is more transmissible than Delta, with a doubling time of about two days." pic.twitter.com/RbbLoaQ3Nk — ANI (@ANI) December 15, 2021 -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ‘ఆఫీస్ రిటర్న్’ నిరవధిక వాయిదా
After Google Now Apple Delays Return To Office Deadline Indefinitely: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన కొనసాగుతోంది. కరోనా వైరస్‌లో శరవేగంగా విస్తరిస్తున్న వేరియెంట్ కావడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగుల భద్రత దృష్ట్యా మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటున్నాయి కంపెనీలు. గూగుల్ ఇదివరకే ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేయగా.. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ అదే బాటలో పయనించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ప్రకటించిన యాపిల్.. ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రతీ ఉద్యోగికి 1,000 డాలర్ల(76 వేల రూ. పైనే) వర్క్‌ఫ్రమ్ హోం బోనస్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది కూడా. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! కేంద్రం కీలక నిర్ణయం..! దీంతో మరికొన్ని కంపెనీలు ఈ జాబితాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూగుల్ కూడా ఇలాగే వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగిస్తూ.. ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కంపెనీలు ఈ ఏడాది జూన్ నుంచే వర్క్ఫ్రమ్కు ఎండ్‌కార్డ్ వేయాలనుకున్నాయి. కానీ, డెల్టా ఫ్లస్ వేరియెంట్, ఆ వెంటనే ఒమిక్రాన్ వేరియెంట్లు వచ్చి పడ్డాయి. అయినప్పపటికీ వ్యాక్సినేషన్ కారణంగా ఏది ఏమైనా ఈ జనవరి నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఒమిక్రాన్ ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో పాకేసింది. గాలిలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ ప్రమాదకరమైందనే సంకేతాలిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ఆరోగ్యం పట్ల రిస్క్ తీసుకునే ఉద్దేశంతో కంపెనీలు లేనట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు భారత్‌లోనూ వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా ఉద్యోగుల్ని మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పిస్తుండగా.. మరికొన్ని 45 ఏళ్లలోపు వాళ్లను మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చాలావరకు మాత్రం 2022లోనూ వర్క్‌ఫ్రమ్ హోం విధాన కొనసాగింపుకే మొగ్గు చూపిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి కూడా. వర్క్ ఫ్రమ్ హోంపై ఐటీ కంపెనీల సంచలన నిర్ణయం..! -
పిల్లలపై ఒమిక్రాన్ పడగ; 7 ఏళ్ల బాలుడికి పాజిటివ్
7 Year Old Boy Tested Omicron Positive: భారత్‌లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పిల్లలు సైతం కొత్త వేరియంట్ కాటుకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణయింది. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అబుదాబి నుంచి డిసెంబర్ 10న హైదరాబాద్ మీదుగా బెంగాల్‌కు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఓమిక్రాన్ వేరియంట్‌ను చూపించింది. బాలుడి తల్లిదండ్రులకు ఒమిక్రాన్ సోకలేదని, వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వారికి సమాచారం అందించారు. దీంతో బాలుడిని ముర్షిదాబాద్ జిల్లాలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 40 దాటాయని వార్తలు వస్తున్నాయి. (చదవండి: చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు) -
బేర్ దెబ్బకు డీలా పడిపోతున్న స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశంలో కరోనా కొత్త రకం ఒమిక్రాన్ వేరియంట్ భయాలు రోజు రోజుకి పేరుగుతుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతకంతకూ పడిపోతూ వచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వు ఉద్దీపనల ఉపసంహరణవైపే అడుగులు వేయనుందన్న సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. జాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు డీలాపడడం కూడా సూచీలను దెబ్బతీసింది. దీంతో సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 329.06 పాయింట్లు(0.57%) క్షీణించి 57,788.03 వద్ద ఉంటే, నిఫ్టీ 103.50 పాయింట్లు(0.60%) క్షీణించి 17,221.40 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.30 వద్ద ఉంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఒఎన్‌జీసీలు, పవర్‌గ్రిడ్, టీసీఎస్ షేర్లు నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్ఎం, మారుతీ, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు రాణించాయి. ఆటో మినహా, అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు నష్టాల్లో ముగిశాయి, ఐటి, మెటల్, రియాల్టీ, పిఎస్‌యు బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం తగ్గాయి. (చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!) -
ఒమిక్రాన్ వల్ల ప్రాణభయం లేదు: మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. ఇప్పటి వరకు రెండు కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకినవారు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే. సోమాలియా, కెన్యా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు అధికారులు పరీక్షల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీశ్‌రావు స్పందిస్తూ.. ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదని పేర్కొన్నారు. అందరూ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తి అయిందని తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. తెలంగాణలో రెండు డోసుల వ్యాక్సినేషన్ 64 శాతం మందికి వేశామని తెలిపారు. బూస్టర్ డోసులను అందించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. -
Omicron Updates: మహారాష్ట్రలో కొత్తగా 8 కేసులు.. 7 ముంబైలోనే..
ముంబై: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒక్కరోజే అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో అత్యధిక ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి. తాజాగా రాష్ట్రంలో మంగళవారం మరో ఎనిమిది కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు ముంబైలోనే వెలుగు చూడటం గమనార్హం. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. చదవండి: వేలంలో రికార్డ్ ధర పలికిన అస్సాం మనోహరి టీ పొడి.. కిలో ఎంతంటే. అలాగే ఇదే రోజు ఉదయం ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో 4 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 53కు పెరిగింది. మహారాష్ట్రతో పాటు మిగతా రాష్ట్రాలైన గుజరాత్ (4), రాజస్థాన్ (9), ఢిల్లీ (6) కర్ణాటక (3), కేరళ (1) ఆంధ్రప్రదేశ్ (1) కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ (1)చొప్పున కేసులు వెలుగు చూశాయి. చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన ఆరోగ్యశాఖ మంత్రి .. ఆసుపత్రికి తరలింపు Omicron Updates: చైనాలో ఒమిక్రాన్ కలవరం -
చైనాలో ఒమిక్రాన్ కలవరం
బీజింగ్: కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో ఒమిక్రాన్ రెండోకేసు నమోదైంది. 67 ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకినట్టు చైనా అధికారిక మీడియా మంగళవారం తెలిపింది. నవంబర్ 27న విదేశాల నుంచి గ్వాంగ్జౌ వచ్చిన సదరు వ్యక్తికి తొలుత పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని, రెండు వారాల క్వారంటైన్ అనంతరం పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపింది. ఆ ఫలితాలను మరింత లోతుగా అధ్యయనం చేయగా ఒమిక్రాన్‌గా తేలిందని చైనా మీడియా వెల్లడించింది. ఇప్పటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాలో తాజాగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడం అధికార వర్గాలను కలవరపెడుతోంది. సోమవారం తొలి కేసు చైనాలో సోమవారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. అయితే, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలూ లేవని, ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
పాకిస్తాన్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
ఇస్లామాబాద్ : కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా పంజా విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన ప్రకారం ఇప్పటి వరకు 63 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. తాజాగా పాకిస్తాన్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.. కరాచీకి చెందిన 57 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సిఒసి) సోమవారం నిర్ధారించింది. అయితే ఒమిక్రాన్ సోకిన మహిళ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోన్నట్లు గుర్తించారు. చదవండి: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక కరాచీకి చెందిన ఒమిక్రాన్ బాధితురాలు ఆగాఖాన్ యూనివర్శిటీ కరోనా లక్షణాలతో గతవారం ఆస్పత్రిలో చేరగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇస్లామాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. బాధితురాలు ప్రస్తుతం ఇంటివద్దనే క్షేమంగా ఉందని, అన్ని పనులు చేసుకుంటోందని ఆస్పత్రి ప్రకటించింది. చదవండి: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం -
ప్రపంచంలో తొలి ‘ఒమిక్రాన్’ మరణం
First UK Death Recorded With Omicron Variant: ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం బ్రిటన్‌లో నమోదైందని దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం ప్రకటించారు. పశ్చిమ లండన్‌లోని టీకా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా బోరిస్ మీడియాతో మాట్లాడారు. ‘ ఒమిక్రాన్ వేరియంట్‌పై పోరు సందర్భంగా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. బిటన్పై భీకర ఒమిక్రాన్ అల విరుచుకుపడబోతోంది. వయోజనులకు రెండు డోస్‌ల సంరక్షణ ఏమాత్రం సరిపోదు. డిసెంబర్ 31కల్లా అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి’ అని బోరిస్ స్పష్టంచేశారు. ఇక్కడ చదవండి: అదేం కక్కుర్తిరా నీకు!... ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకుంటావా! లండన్‌లో నమోదవుతున్న కేసుల్లో 40శాతం కేసులు ఒమిక్రాన్‌వేనని ఆయన వెల్లడించారు. బ్రిటన్‌లో బూస్టర్ డోస్‌లకు డిమాండ్ పెరిగింది. ఆన్లైన్ బుకింగ్ పెరగడంతో నేషనల్ హెల్త్ సర్వీస్ టీకా బుకింగ్ వెబ్సైట్ కుప్పకూలింది. దీంతో వయోజనులు టీకా కేంద్రాల వద్ద బారులుకట్టారు. ‘ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉంది. ప్రతీ రెండు మూడ్రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది’ అని బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ ఆందోళన వ్యక్తంచేశారు. కోవిడ్ తాజా కఠిన నిబంధనలపై మంగళవారం పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. కోరలు చాస్తున్న ఒమిక్రాన్! ఈ దేశాల్లో చేయిదాటుతోన్న పరిస్థితి..! ఆదివారం కొత్తగా 1,239 ఒమిక్రాన్ కేసులొచ్చాయి. దీంతో మొత్తం 48వేల కేసుల్లోఒమిక్రాన్ కేసులు 3,137 దాటాయి. బ్రిటన్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడిచేసేలా కొత్త కఠిన చర్యలు తీసుకోకుంటే మరణాలు భారీగా పెరుగుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. జనవరిలో ఈ వేరియంట్ వ్యాప్తి పెరిగి ఏప్రిల్‌కల్లా 25వేల నుంచి 75 వేల మంది కోవిడ్‌తో మరణించే ప్రమాదముందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ – ట్రోపికల్ మెడిసిన్ హెచ్చరించింది. బ్రిటన్‌లోని వైద్య గణాంకాలను తీసుకుని ఈ అధ్యయనం చేశారు. -
ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’!
New variant Omicron Updates In Telugu వాషింగ్టన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి రోజురోజుకీ ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. బ్రిటన్, ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ఐతే బ్రిటీష్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక లెక్కల ప్రకారం గడచిన 24 గంటల్లో యూకేలో దాదాపు 663 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయెల్ దేశంలో 57 శాతం వేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్‌లో మహమ్మారి బారీన పడ్డవారి సంఖ్య 1898కి చేరుకోగా, ఇజ్రాయెల్‌లో 35 నుంచి 55 కు చేరింది. నిపుణుల అంచనా ప్రకారం.. ఇదే విధంగా మహమ్మారి ఉధృతి కొనసాగితే ఈ నెల చివరినాటికి యూకేలో ఒమిక్రాన్ కేసులు పది లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులే సగానికి పైగా ఉంటాయని హెచ్చరిస్తోంది. కాగా యూకే జనాభాలో 12 యేళ్లకు పైబడిన 81 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్లు వేయడం పూర్తయ్యింది. ఏదిఏమైనప్పటికీ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ మాత్రం.. వచ్చే యేడాది (2022) ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్ కారణంగా 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ బారీనపడ్డవారిలో అధికశాతం మంది విదేశాల నుంచి వచ్చినవారేనని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 55 మందిలో 36 మంది సౌత్ ఆఫ్రికా, బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్, యూఏఈ, బెలారస్, హంగేరీ, ఇటలీ, నమీబియా నుంచి వచ్చారు. 11 మంది వీరితో కాంటక్ట్‌లో ఉన్నవారు. మిగిలిన 8 మందికి ఎటువంటి కాంటాక్ట్ లేకుండానే మహమ్మారి సోకిందని తాజాగా వెల్లడించింది. చదవండి: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు -
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తక్కువే!: ఆర్థిక శాఖ
జీడీపీ జోరుకు పగ్గాల్లేవ్ పటిష్ట వృద్ధిని సాధించనున్న దేశాలలో భారత్ ఆర్థిక శాఖ తాజా సమీక్ష న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దుష్ప్రభావాల తదుపరి పటిష్ట వృద్ధిని అందుకోనున్న కొద్దిపాటి ప్రపంచ దేశాలలో భారత్‌కూడా ఒకటని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ఇటీవల పలు దేశాలలో తలెత్తుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దేశీయంగా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ఇందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వేగవంత వ్యాక్సినేషన్ సహకరించనున్నట్లు తాజా ఆర్థిక సమీక్షలో తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కోవిడ్–19 దెబ్బకు పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుదేలైన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 8.4 శాతం అప్ Economy Of India ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో రియల్ జీడీపీ 8.4 శాతం ఎగసింది. కరోనా మహమ్మారికి ముందు అంటే 2019–20 ఏడాది ఇదే కాలంలో వృద్ధితో పోలిస్తే ఇది రెట్టింపని నెలవారీ సమీక్షలో ఆర్థిక శాఖ వివరించింది. కోవిడ్–19 నేపథ్యంలోనూ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశాలలో భారత్ ఒకటని వెల్లడించింది. గతేడాది(2020–21) క్యూ3, క్యూ4లతోపాటు.. ఈ ఏడాది క్యూ1, క్యూ2లను ప్రస్తావించింది. సర్వీసుల విభాగంలో నమోదైన రికవరీ, తయారీ, వ్యవసాయ రంగాలు సాధించిన నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్న అంశాన్ని రికవరీ ప్రతిఫలిస్తున్నట్లు వివరించింది. భారీ వ్యాక్సినేషన్, సమర్థవంత ఆర్థిక నిర్వహణ, స్థూల, సూక్ష్మ ఆర్ధిక పరిస్థితులను ఉత్తేజితం చేయడం వంటి మద్దతిచ్చినట్లు తెలియజేసింది. మరింత స్పీడ్ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ మరింత పటిష్టపడనున్నట్లు తాజా సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యూ2లో ఇందుకు పలు సంకేతాలు(హెచ్ఎఫ్ఐలు) వ్యక్తమైనట్లు పేర్కొంది. సమీక్షలో ఆర్థిక శాఖ ఇంకా ఇలా వివరించింది.. ‘కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్ వేరియంట్ గ్లోబల్ రికవరీకి తాజా సవాళ్లను విసురుతోంది. అయితే ప్రాథమిక దృష్టాంతాల ప్రకారం దేశీయంగా అంతంతమాత్ర ప్రభావాన్నే చూపగలదని అంచనా. వేగవంత వ్యాక్సినేషన్ ఇందుకు కారణంకానుంది. కోవిడ్–19వల్ల గతేడాది తగిలిన దెబ్బనుంచి దేశం వేగవంతంగా పుంజుకుంటోంది. క్యూ2లో ఇది ప్రదర్శితమైంది. ఈ ఏడాదికి జీడీపీ 9.5 శాతం ఎగిసే వీలున్నట్లు తాజా సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అభిప్రాయపడింది. మహమ్మారికి ముందు ఏడాది అంటే 2019–20తో పోలిస్తే ఇది 1.6 శాతం అధిక వృద్ధికి సమానం. గతేడాది నమోదైన క్షీణత నుంచి బయటపడి పటిష్ట రికవరీ సాధిస్తున్న అతికొద్ది ప్రపంచ దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. ఇందుకు వ్యవసాయం దన్నునిస్తోంది. పుంజుకున్న ఆహార ధాన్యాల దిగుబడి, ఖరీప్, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు, గ్రామీణ ప్రాంత ఆదాయాలు మెరుగుపడటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. చదవండి: సింగపూర్ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్’ ! కేంద్రం కొత్త ఆదేశాలు -
Omicron Variant: హోం క్వారంటైన్‌లోనే...ఒమిక్రాన్ తగ్గింది
సాక్షి, అమరావతి/ విజయ నగరం టౌన్/ ఎస్.కోట రూరల్: విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ బారిన పడ్డ వ్యక్తి హోం క్వారంటైన్‌లోనే వైరస్‌ను జయించాడని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవన్నారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు అతడి నమూనాలు పంపామన్నారు. ఈ ఫలితం శనివారం రాత్రి అందిందని చెప్పారు. అయితే హోమ్ క్వారంటైన్ అనంతరం శనివారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో అతడికి నెగెటివ్‌గా తేలిందన్నారు. అతడితో కాంటాక్ట్ అయిన 40 మందికి కూడా పరీక్షలు చేశామని.. అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. విదేశాల నుంచి 15 వేల మంది రాష్ట్రానికి రాగా వీరిలో 12,900 మందిని గుర్తించామన్నారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. వీరి నమూనాలను కూడా హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. 10 మంది ఫలితాలు వెలువడగా కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ఫేక్ వార్తలు నమ్మొద్దు.. డాక్టర్ హైమావతి తిరుపతిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌గా తేలిందని జరుగుతున్న ప్రచారాన్ని హైమావతి తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం.. ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు. ఒమిక్రాన్ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ తగ్గింది ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు. ఒమిక్రాన్ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు. -
చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మూడో వేవ్ మూడో వేవ్ అంటూ కొంతకాలం ఆందోళనతో గడిచిపోయినా...ఆ తర్వాత ఎందుకో కరోనా కాస్త చల్లబడింది. అయితే ఒమిక్రాన్ అనే కొత్త వేరియెంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో మళ్లీ అలజడి మొదలైంది. పిల్లలపై దీని ప్రభావం పెద్దగా ఉంటుందనే భయాందోళనలు నిపుణుల్లో వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మొదటి వేవ్, రెండో వేవ్‌లో కరోనా చిన్నారులపై అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడీ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ పిల్లలపై ఎందుకు ప్రభావం చూపనుందనే ఆందోళనకు డాక్టర్లు కొన్ని దాఖలాలు చూపుతున్నారు. అవి...∙కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి దాన్ని తొలుత 65 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వడం... ఆ తర్వాత ఆ వయోపరిమితిని 45 ఏళ్లకు తగ్గించడం... కొద్దికాలం తర్వాత 18 ఏళ్లకు తగ్గించడంతో ఇప్పటివరకు చురుగ్గా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా కేవలం 18 ఏళ్లకు పైబడినవారికే పరిమితమైంది. కొన్ని పాశ్చాత్యదేశాల్లో ఫైజర్ వంటి వ్యాక్సిన్లు పిల్లలకూ సురక్షితమని తేలడంతో... అక్కడ 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు ఇచ్చినప్పటికీ మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్న పిల్లల సంఖ్య, శాతం ఇప్పటికీ చాలా తక్కువ. ఇక మన దేశంలో నిర్వహించిన పరిశోధనల్లో సైతం మనం రూపొందించిన వ్యాక్సిన్లు చిన్నారుల్లో సురక్షితమని తేలినప్పటికీ... పిల్లలకు వేయాల్సిన మోతాదు, ఎన్ని విడతల్లో ఇవ్వాలి... ఇలాంటి మార్గదర్శకాలేవీ ఇప్పటికీ రూపొందలేదు. దాంతో అధికారికంగా 18 ఏళ్లలోపు పిల్లలంతా వ్యాక్సిన్లు వేయించుకోనివారే. ∙కనుగొన్న వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒమిక్రాన్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. డెల్టా విషయంలో అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతగానీ ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా చెప్పలేదు. కానీ... ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం వంద మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి... వ్యాప్తి (ట్రాన్స్మిటబిలిటీ) : దాని వ్యాప్తి తీరును పరిశీలించినప్పుడు ఒమిక్రాన్ కనుగొన్న దేశాల్లో దాని వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ దీని వ్యాప్తి చురుగ్గా ఉన్నట్లు గమనించిన పరిశోధకులు... ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వని పిల్లల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు. చిన్నారుల్లో లక్షణాలు / చికిత్స : ఒమిక్రాన్‌లోనూ సాధారణ కరోనా లక్షణాలే ఒమిక్రాన్‌లోనూ కనిపిస్తున్నాయి. జ్వరం, తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, అలసట, ఒళ్లునొప్పులు, ఎడతెరిపి లేకుండా దగ్గు, విపరీతమైన తలనొప్పి, గొంతు బొంగురుబోవడం వంటివి పిల్లల్లో కనిపించే లక్షణాలు. దాంతోపాటు పాటు చిన్నారుల ఒంటిపైన ర్యాష్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుండటం విశేషం. ఇక చికిత్స విషయానికి వస్తే... ఇప్పటివరకూ ఇస్తూ వస్తున్న సాధారణ చికిత్సే వీరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లలకు వ్యాక్సినేషన్ : మనదేశంలో పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే పెద్దలకు ఇచ్చిన మోతాదులోనే పిల్లలకు ఇవ్వడం కుదరకపోవచ్చు. పైగా చిన్నారుల వయసును, బరువును బట్టి వారికి ఇవ్వాల్సిన మోతాదును సైతం నిర్ణయించాల్సిన అవసరముంది. ఉదాహరణకు ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వారికీ, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల వారికీ, పన్నెండేళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారికి ఏయే మోతాదుల్లో వ్యాక్సిన్ ఇవ్వాలనేదీ శాస్త్రీయంగా నిర్ధారణ చేయాల్సి ఉంది. ఇప్పటికే భారత్‌లో రూపొందిన కోవాక్సిన్, జైడస్ వంటి వ్యాక్సిన్లు పిల్లల విషయంలో సురక్షితమని తేలినప్పటికీ... సరైన మార్గదర్శకాలు రూపొందేవరకు అవి పిల్లలకు లభ్యమయ్యే అవకాశం లేదు. (ప్రస్తుత వ్యాక్సినేషన్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొంటుందా అన్న సందేహం ఉన్నప్పటికీ) చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. తీవ్రత / విస్తృతి : పిల్లల్లో వ్యాప్తివిస్తృతిపై ఇంకా అధ్యయనాలూ, పరిశీలనలూ జరుగుతున్నప్పటికీ... గతంలో ఆల్ఫా మొదలుకొని డెల్టా వరకు వచ్చిన వేరియెంట్లతో పోలిస్తే... ఒమిక్రానే పిల్లల్లో గణనీయంగా వ్యాప్తిచెందిన దాఖలాలు (డేటా) లభ్యమయ్యాయి. అయితే తీవ్రత విషయంలో ఇంకా డాక్యుమెంటేషన్ ప్రక్రియ జరుగుతోంది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా జరగకపోవడం... పిల్లలకు అంత ప్రమాదకరం కాదని మున్ముందు తేలినా... ఒకవేళ వారికి గనక వస్తే అది పిల్లల నుంచి ఇంట్లోని పెద్దలకూ, వృద్ధులకూ సోకే అవకశం ఉన్నందున... ఈ మేరకు పిల్లలు వ్యాధిని వ్యాప్తిచెందించే వాహకులు (ట్రాన్స్మిటర్స్)గా ఉండగలరనే అభిప్రాయాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి ఇప్పటికి కరోనాతో హాస్పిటల్లో చేరిన చిన్నారుల విషయానికి వస్తే... దక్షిణాఫ్రికా గణాంకాల ఆధారంగా ఒమిక్రాన్‌తో చేరిన పిల్లల సంఖ్యే ఎక్కువనీ, అందునా ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని తేలింది. ఈ అంశం కూడా శాస్త్రవేత్తలు, అధ్యయన వేత్తలు, వైద్యనిపుణులను ఆందోళనలో ముంచెత్తుతోంది. డా. రవీందర్‌రెడ్డి పరిగె, సీనియర్ పీడియాట్రీషియన్ – నియోనేటాలజిస్ట్ -
స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు!
భువనేశ్వర్: స్కూల్‌కు సెలవులు ఇవ్వడం లేదని ఓ విద్యార్ధి ఏకంగా 20 మంది విద్యార్ధుల జీవితాలను ఇరకాటంలో పెట్టాడు. ఎందుకు చేశావని స్కూల్ ప్రిన్సిపాలు అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అసలేంజరిగిందంటే.. ఒడిశాలోని బర్గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ల్లో 11వ తరగతి చదివే విద్యార్థి (16) తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కారణంగా మరోమారు లాక్డౌన్ విధించే అవకాశం ఉందని నేరానికి పాల్పడిన విద్యార్ధి ఆశించాడు. అలా జరగకపోవడంతో ఈ పనికి పూనుకున్నాడని తెలిపాడు. ఐతే అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే విద్యార్ధి కెరీర్, చిన్న వయసును దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు. ఐతే పాఠశాల యాజమన్యం సదరు విద్యార్ధిని కొన్ని రోజులపాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలలోని హాస్టల్లో నివసిస్తున్న విద్యార్ధి ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లు వచ్చినప్పుడు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల కూడా స్కూళ్లు మూతపడి సెలవులిస్తారని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో తోటలోని పురుగుల మందును నీళ్లలో కలిపి విద్యార్ధులకు తాగేందుకు ఇచ్చాడు. నీళ్లను తాగిన విద్యార్ధులు ఆనారోగ్యానికి గురయ్యారు. చదవండి: జపాన్‌లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..! -
ఒమిక్రాన్ టెన్షన్.. 2 రోజుల పాటు కర్ఫ్యూ
సాక్షి, ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. డిసెంబర్ 11, 12 రెండు రోజుల పాటు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు ఊరేగింపులు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని వెల్లడించారు. (చదవండి: రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్! ) ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా 33 ఒమిక్రాన్ కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కన్నా 2-4 రెట్లు అధిక ప్రమాదమే కాక.. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓతో సహా నిపుణులు హెచ్చరిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: తీవ్రతపై త్వరలో స్పష్టత! -
జపాన్‌లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..!
Omicron Variant Updates In Telugu టోక్యో: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించిన కేసులు మరో 8 నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో మొత్తం 12 కేసులకు పెరిగనట్లు ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు తెల్పింది. నవంబర్ చివరి నుంచి ఈ నెల ప్రారంభం వరకు వచ్చిన ప్రయాణికులకు ఈ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెప్పింది. కాగా జపాన్‌లో నవంబర్ 30న మొదటి కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొత్తగా వైరస్ సోకిన వారిలో 30 ఏళ్ల మహిళ, పురుషుడు కూడా ఉన్నారని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ సీజీ కిహారా తెలిపారు. వీరిద్దరూ నవంబర్ 28న నమీబియా నుంచి వచ్చారు. అదే విమానంలో జపాన్‌కు వచ్చిన నమీబియా దౌత్యవేత్తలకు కూడా వ్యాధి సోకినట్లు గుర్తించారు. జపాన్‌లో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్కు గురైన మొదటి కేసు ఇది. దీంతో జపాన్ మరోసారి విదేశీ ప్రయాణాల పట్ల కఠినంగా వ్యవహరించక తప్పలేదు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే ప్రయాణాకులపై జపాన్ నిషేధం విధించింది. కొత్తగా ఒమిక్రాన్ బారీనపడ్డ వ్యక్తులు ఈ వారం ప్రారంభంలో యుఎస్, మొజాంబిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియాలో గణనీయంగా నమోదవుతున్న కరోనా కేసులు దక్షిణ కొరియాలో కరోనా కొత్త కేసులు శుక్రవారం కూడా వరుసగా మూడవ రోజు 7000 కంటే ఎక్కువ నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని త్వరగా తగ్గించడంలో విఫలమైతే దేశం అసాధారణమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని ప్రధాని కిమ్ బూ-క్యుమ్ ఒక సమావేశంలో అన్నారు. కోవిడ్ చికిత్స కోసం మరో రెండు వేల పడకలను సంయుక్తంగా ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చాలామటుకు మైనర్ కేసులకు ఇంట్లోనే చికిత్స చేసేలా మెడికల్ రెస్పాన్స్ విధానాన్ని మెరుగుపరిచామని తెలిపారు. చదవండి: బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు! -
బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు!
గుంటూరు మెడికల్: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో అనుసరించిన ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్నే అవలంబిస్తోంది. విదేశాల నుంచి జిల్లాకు 864 మంది విదేశాల నుంచి వచ్చిన వారి గురించి అధికారులు ప్రాంతాల వారీగా జల్లెడపడుతున్నారు. ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది ద్వారా ట్రేస్ చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారిని ఇటీవల కలిసిన వారికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణైతే తక్షణం వైద్యం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు మొదలైనప్పటి నుంచి జిల్లాకు పలు దేశాల నుంచి 864 మంది వచ్చారు. వీరంతా ఎక్కడెక్కడ ఉంటున్నారో వారి పాస్‌పోర్టు ఆధారంగా వైద్యసిబ్బంది గుర్తించారు. వారిని కలిసిన వారితోపాటు ఇప్పటివరకూ 1,109 మందికిపైగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పాజిటివ్ రిపోర్టు రాలేదు. నిత్యం సర్వే విదేశాల నుంచి వస్తున్న వారి సమాచారాన్ని జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద నుంచి సేకరించిన వైద్య అధికారులు ప్రతిరోజూ ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి చేరవేసి సర్వే చేయిస్తున్నారు. దీనికోసం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ముందస్తు కట్టడే వ్యూహం ఒమిక్రాన్‌ను ముందుగానే కట్టడి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. యాంటీబాడీస్‌పై శ్రద్ధ యాంటీ బాడీస్ పరీక్షపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ పరీక్ష చేయించుకునేందుకు ఎక్కువ మంది ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. శరీరంలోని యాంటీబాడీస్ కరోనా వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తాయి కాబట్టి.. అవి ఉన్నాయా లేదా అనే సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు ల్యాబ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఒమిక్రాన్ భయంతో రెండు డోసులు టీకా వేసుకున్న వారూ యాంటీబాడీస్ టెస్టు చేయించుకుంటున్నారు. అవసరమైతే మూడో డోస్ వేయించుకునేందుకు యత్నిస్తున్నారు. అనుమతులు రాలేదు ఎలాంటి వైరస్ సోకినా శరీరంలో కొంత వరకు యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. చాలామంది యాంటీబాడీస్ టెస్టుల కోసం, మూడో డోస్ వేయించుకోవాలా లేదా అనే సందేహాలతో వైద్యసిబ్బందిని, అధికారులను సంప్రదిస్తున్నట్టు సమాచారం ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు. – డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ -
గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు..
హింగోలి: గాడిదపాల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. అంతేకాదు గాడిద పాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుందని విక్రేతలు చెప్తున్నారు కూడా. కరోనా వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందనే నమ్మకం కూడా లేకపోలేదు. దీంతో గాడిద పాలకు గరిష్ఠంగా లీటరుకు పది వేల రూపాయలు వెచ్చించిమరీ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బారీ స్థాయలో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. హింగోలిలో వీధి వీధికి గాడిద పాలను విక్రయిస్తున్నారు. స్పూను పాలు తాగితే అన్ని రకాల రోగాలు దూరమవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాడిదపాలల్లో ఔషధగుణాలు అధికంగానే ఉంటాయని, పిల్లలకు న్యుమోనియాను దూరం చేస్తుందని, జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పాల విక్రయదారులు నమ్మబలికి వ్యాపారం చేస్తున్నారు. అనేక వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని టీస్పూన్ పాలను రూ. 100కు, ఒక లీటరు పాలు ఏకంగా రూ. 10,000లకు అమ్ముతున్నారు. పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాల వరకు రోజూ ఈ పాలను తాగిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. దీనితో జనాలు విపరీతంగా కొనుగోలు సాగిస్తున్నారు. వైద్యులు ఏమి చెబుతున్నారంటే.. ఈ వందంతులన్నీ పూర్తిగా అవాస్తవాలని, గాడిద పాలు తాగడం వల్ల కరోనా లాంటి ఇన్ఫెక్షన్లు నయమవుతాయనేది అసాధ్యమని, ఇలాంటి వదంతులకు మోసపోవద్దని డాక్టర్ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రజలు తమ డబ్బును వృధాగా ఖర్చు చేసకోవద్దని సూచించారు. చదవండి: పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం... -
హైదరాబాద్ మెట్రోకు ఒమిక్రాన్ ఫియర్!
Omicron Effect On Hyderabad Metro: మెట్రో ప్రయాణాలపై కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్ కలకలం నేపథ్యంలో పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న మెట్రోకు తాజాగా మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. స్కూల్-కాలేజీలు, కొన్ని ఆఫీసుల వేళల మినహా.. మిగతా అన్ని టైంల్లో రైళ్లు అరకొర ప్రయాణికులతో దర్శనమిస్తున్నాయి. దీంతో మెట్రో ఆదాయంపై ప్రభావం పడుతోంది!. ఇక ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో గుంపు ప్రయాణాలకు బదులు.. సొంత వాహనాలు, రైడ్లు బుక్ చేసుకుంటున్నవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలతో హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటకపోవడం తీవ్రతను తెలియజేస్తోంది. కొవిడ్ లాక్‌డౌన్‌కు ముందు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు రూట్లలో 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లో కనాకష్టంగా మూడు లక్షల లోపే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతూనే.. ఆఫర్ల ద్వారా ప్రయాణికులను రాబట్టేందుకు మెట్రో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవీ కూడా కారణాలే! అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం లేకపోవడం, సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో సిటీజన్లు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రోకు ఆశించిన స్థాయిలో ప్రయాణికుల ఆదరణ పెరగడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మరోవైపు ఐటీ, బీపీఓ, కేపీఓ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అమలు చేయడం కూడా మెట్రో రద్దీ గణనీయంగా తగ్గేందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గట్టెక్కేదెప్పుడో? ► మహా నగరంలో మెట్రో ప్రారంభం నుంచి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. గత నాలుగేళ్లుగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నిర్మాణ వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు పెరగడంతోపాటు గతంలో తీసుకున్న రుణవాయిదాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, స్టేషన్లు, రైళ్లు, డిపోల నిర్వహణ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు కూడా సంస్థకు భారంగా పరిణమిస్తున్నాయి. ► మెట్రో నష్టాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరచూ ఉన్నతస్థాయిలో సమీక్షా సమావేశాలు జరుపుతున్నా... ఆర్థిక సాయం అందజేసే అంశంపై స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో మొదటిదశలో పెండింగ్‌లో ఉన్న ఎంజీబీఎస్–ఫలక్‌నుమా సహా రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రూట్లలో మెట్రో ప్రాజెక్టు ఎప్పుడు సాకారం అవుతుందన్న అంశం సస్పెన్స్‌గా మారింది. ► వచ్చే ఏడాది జనవరి నుంచి పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే అవకాశాలుండడంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్కు చేరుకుంటుందని మెట్రో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తుండడం విశేషం. తొలిదశ మెట్రో ప్రాజెక్టులో మూడు మార్గాల్లో సుమారు 10 లక్షల మంది జర్నీ చేస్తారని దశాబ్దం క్రితం సిద్ధంచేసిన మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో అంచనా వేశారు. అందులో సగం మార్కును ఇప్పటికీ చేరుకోకపోవడం విశేషం. చదవండి: Hyderabad.. మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఇంటర్నెట్! -
బెంగళూరు ఒమిక్రాన్ సోకిన వైద్యుడికి మళ్లీ పాజిటివ్
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడిన మొదటి ఇద్దరిలో ఒకరైన బెంగళరు వైద్యుడి(46)కి మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. ఆ వైద్యుడికి మొదటగా నవంబర్ 22న కరోనా పాజిటివ్‌గా తేలింది. నిర్థారణ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో మూడు రోజులపాటు ఇంట్లోనే గడిపారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మరోసారి ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేశారు. (చదవండి: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లాక్డౌన్ తప్పదా..?) ఈ పరీక్షల్లో ఆయనకు మళ్లీ కరోనా సోకినట్లు తేలిందని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. వారం తర్వాత ఆయనకు మరోసారి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కోవిషీల్డ్ టీకా రెండు డోసులు ఆయన తీసుకున్నప్పటికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని చెప్పారు. దేశంలోనే ఒమిక్రాన్ రెండో బాధితుడైన దక్షిణాఫ్రికా వాసి(66) ఫైవ్‌స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉంటనే నిబంధనలకు విరుద్ధంగా అధికారుల కళ్లుగప్పి దుబాయ్‌కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చదవండి: ప్రయాణికులకు ఊరట.. ఆర్టీపీసీఆర్ @రూ. 750 -
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లాక్డౌన్ తప్పదా..?
Omicron Scare CM Arvind Kejriwal Clarity On Lockdown: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. వీటిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. లాక్డౌన్ విధేంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. (చదవండి: ఒకే చోట 281 కేసులు.. లాక్డౌన్ విధిస్తారా?!) ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ భయపడాల్సిన పని లేదు. పరిస్థితులను నేను అనుక్షణం సమీక్షిస్తున్నాను. లాక్డౌన్ విధేంచే ఆలోచన లేదు. కానీ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మాస్క్ ధరించండి.. సామాజిక దూరం పాటించండి. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కే మనకు శ్రీరామ రక్ష. సమీక్షా సమావేశాల్లో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, మందులు, ఆక్సీజన్ లభ్యత వంటి తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ప్రజలు భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,347 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడగా.. భారత్‌లో ఈ సంఖ్య 24కి చేరుకుంది. చదవండి: వర్క్ ఫ్రం హోం.. పరిశ్రమల మూసివేత -
తర్వాతి వైరస్..మరింత ప్రమాదకారి కావొచ్చు!
లండన్: భవిష్యత్తులో మానవాళికి సోకే వైరస్ ప్రస్తుత కరోనా కంటే మరింత ప్రాణాంతకం, మరింత తీవ్రమైన వ్యాపించవచ్చని కోవిషీల్డ్ టీకా రూపకర్త, ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ హెచ్చరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా సారా గిల్బర్డ్ పనిచేస్తున్నారు. ‘మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్ చిట్టచివరిది కాదు. మున్ముందు ఇంతకంటే ప్రమాదకరమైంది రావచ్చు. చదవండి: కేన్సర్‌ను చంపే రోబోలు! ఆ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందేది, ప్రమాదకరమైంది అయి ఉండొచ్చు. అయితే, ఇప్పటి మాదిరి పరిస్థితులనే మున్ముందు దాపురించే అవకాశం రానీయవద్దు. ప్రస్తుతం సాధించిన విజయాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది’అని ఆమె తెలిపారు. పూర్తి సమాచారం తెలిసే వరకు కొత్త వేరియంట్ల వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
స్టాక్ మార్కెట్ అప్డేట్.. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో నష్టాలు!
ఒమిక్రాన్ వేరియెంట్ నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభం నష్టాలతోనే మొదలై.. ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్ల నష్టంతో 57,347 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 17,172 వద్ద ట్రేడవుతూ.. మొదలు నష్టం కంటే కొంచెం మెరుగైంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.20 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌యూఎల్, టైటన్ షేర్లు రాణిస్తున్నాయి. మారుతీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఎన్ఎస్ఈ టాప్ గెయినర్స్‌గా ఐడియా, రెలిఇన్ఫ్రా, ఏబీక్యాపిటల్, హింద్ జింక్, టాప్ లాసర్స్‌గా కోల్ ఇండియా, రెల్క్యాపిటల్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భారత్ఫార్గ్, డిష్ టీవీలు ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ లోనూ ఇదే ట్రేడ్ కనిపిస్తుండగా.. అదనంగా శ్రీరామ్ చిట్స్ లాసర్ కేటగిరీలోకొనసాగుతోంది. అనిశ్చి తప్పదా? ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్డౌన్లు విధిస్తుండటం వల్ల ఆర్థిక రికవరీకి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశీయ సూచీలు సైతం ఒమిక్రాన్ వేరియెంట్ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల తరహాలోనే కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం 6-8 తేదీల్లో జరగనుంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల కీలక రేట్లను యథాతథంగానే ఆర్బీఐ కొనసాగించొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
ఒమిక్రాన్: భారత్‌లో ఒకే రోజు 17 కొత్త కేసులు
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక కేసు నమోదు కాగా, మరో 7 కేసులు మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, రాజస్తాన్‌లో 9కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 21కి చేరుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు తిరిగివచ్చిన ఒకే కుటుంబంలోకి నలుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. వీరితో సన్నిహితంగా మెలిగిన మరో ఐదుగురికి కూడా సోకిందని వీరందరికీ చికిత్స అందిస్తున్నామని రాజస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓవ్యక్తి(37)కి ఒమిక్రాన్ వేరియెంట్ నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 17 మందిని, వారిని కలుసుకున్న మరో ఆరుగురిని ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పటివరకు 12 శాంపిల్స్‌ను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒకటి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. నైజీరియా నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. నైజీరియా నుంచి ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలతో పింప్రి చించ్వాడ్కు వచ్చారు. వీరందరికీ ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. ఫిన్లాండ్ నుంచి వచ్చిన మరొకరికి కూడా ఒమిక్రాన్ సోకింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 8కి చేరుకున్నాయి. కేంద్రం పరిశీలనలో వ్యాక్సిన్ అదనపు డోసు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి టీకా అదనపు డోసు, ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై చర్చించడానికి సోమవారం నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సమావేశం కానుంది. సగం మంది వయోజనులకు రెండు డోసులు దేశంలో అర్హత కలిగిన వయోజనుల్లో సగం మందికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కోటికి పైగా టీకా డోసులు ఇవ్వడంతో సగం మంది అర్హులకు పూర్తి వ్యాక్సినేషన్ ఘనత సాధించామన్నారు. -
భారత్‌లో 12కు చేరిన ఒమిక్రాన్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పుణెలో కొత్తగా మరో 7 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులును వైద్యులు గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 12కు చేరింది. ఆదివారం టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన 37వ్యక్తి కోవిడ్ కొత్త వేరియంట్ సోకింది. లోక్‌నాయక్ జై ప్రకాష్ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కో కేసు బయటపడగా.. కర్ణాటకలో రెండు కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
మరో రెండు ఒమిక్రాన్ కేసులు
ముంబై/అహ్మదాబాద్: దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శనివారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్, మహారాష్ట్రలో ఈ కేసులు బయటపడ్డాయి. ‘వైరస్ ముప్పు’ దేశాల జాబితాలో ఉన్న జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్నగర్కి వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులొచ్చాయి. జింబాబ్వే నుంచి గుజరాత్‌కి ఆ వృద్ధుడు నవంబర్ 28న వచ్చారు. డిసెంబర్ 2న అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణమైంది. ఆ తర్వాత శాంపిళ్లని జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒమిక్రాన్ వేరియెంట్‌గా తేలిందని జామ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్ చెప్పారు. మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల వయసున్న వ్యక్తి నవంబర్ చివర్లో దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. ఆపై ముంబై విమానాశ్రయంలో దిగిన అతనిలో జ్వరంగా కనిపించింది. అతను ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు. అతనిని కరోనా సోకినట్లు వెల్లడికావడంతో ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. జన్యుక్రమ విశ్లేషణలో అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియెంటేనని తేలింది. ఆ ప్రయాణికులు ఎక్కడ? న్యూఢిల్లీ: ఒకవైపు ఒమిక్రాన్ వేరియెంట్ అందరి గుండెల్లో దడ పెంచుతూ ఉంటే అత్యంత ముప్పు కలిగిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల నుంచి అధికారుల కళ్లు గప్పి పారిపోవడం అధికారుల్లో టెన్షన్ పెంచుతోంది. వారిలో ఎంతమందికి ఇప్పటికే కరోనా సోకి ఉంటుందన్న ఆందోళనతో అధికారులు వారి కోసం వేట మొదలు పెట్టారు. ఆ మిస్సింగ్ కేసులు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గుదిబండగా మారాయి. విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి వచ్చిన ప్రయాణికులు 300 మందిలో దాదాపుగా 13 మంది అధికారుల కళ్లు గప్పి పారిపోవడమే కాదు, తప్పుడు చిరునామాలు, కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడం అధికారులకి తలకాయ నొప్పిగా మారింది. ఈ 13 మందిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వారిని కనిపెట్టి పరీక్షలు నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. n దక్షిణాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన 10 మంది ప్రయాణికులు కనిపించకుండా పోవడం ఆందోళన పుట్టిస్తోంది. విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా వెళ్లిపోయారని కర్ణాటక రెవిన్యూశాఖ మంత్రి ఆర్. అశోక్ చెప్పారు. -
ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే..
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా చాపకింద నీరులా కోరలుచాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. దీనికి సంబంధించి నాలుగో కేసు వెలుగులోకి రావడంతో భారత్‌లో తీవ్ర కలకలం రేగింది. కరోనా చివరి వేవ్‌లో డెల్టా వేరియంట్ సోకిన తర్వాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అధిక జ్వరం, బలహీనత, ఆహారం రుచి, సువాసన తెలియకపోవడం వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఐతే ఒమిక్రాన్ విషయంలో ఈ లక్షణాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ మూడు ప్రధాన లక్షణాలివే.. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెప్పబడుతోంది. ఇప్పటివరకు కనుగొనబడిన రోగులందరిలో కరోనాలో కనిపించే సాధారణ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఫ్లూ లాంటి సమస్యలూ బయటపడలేదు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఏం చెబుతున్నారంటే.. ఓమిక్రాన్ మూడు ప్రధాన లక్షణాలు ఇవి... ►తలనొప్పి ►తీవ్రమైన అలసట ►ఒళ్లు నొప్పులు ఒమిక్రాన్ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదు. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. ►కరోనాను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ►ఏవైనా లక్షణాలను బయటపడితే వెంటనే తనిఖీ చేయించుకుని, ఒంటరిగా ఉండండి. ►ఈ విధంగా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ►మాస్క్‌ను సరైన విధానంలో ధరించాలి. ►సామాజిక దూరాన్ని పాటించాలి. ►ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ►ఇప్పటివరకు రెండు డోస్‌ల టీకాలను తీసుకోకపోతే.. వీలైనంత త్వరగా తీసుకోండి. చదవండి: Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు! -
ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!
లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన తర్వాత వైద్య సిబ్బంది ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో.. సరైన అవగాహన లేకపోవడం.. వైరస్ గురించి పూర్తిగా తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించి చాలా మంది వైద్య సిబ్బంది రోజుల తరబడి ఆస్పత్రులకే పరిమితం అయ్యారు. కరోనా వైద్య సిబ్బందిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసిందని విశ్లేషకులు తెలిపారు. వైరస్ తన రూపు మార్చుకుంటూ.. దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ జనాలను భయపెడుతుంది. ఇది డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ భయంతో ఓ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్య, బిడ్డలను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. నిందితుడి పేరు డాక్టర్ సుశీల్ కుమార్. ఇతడు కాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు(18), కుమార్తె(15) ఉన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలిసినప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. (చదవండి: Omicron India: భారత్‌లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదు.. ఎక్కడంటే) తన భార్య, బిడ్డలు మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ముందుగానే చంపేస్తే మంచిదని ఆలోచించాడు. విచక్షణ మరచిపోయి.. అత్యంత దారుణంగా వారిని హత్య చేశాడు. ఆ తర్వాత తన సోదరుడికి కాల్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. నిందితుడు సోదరుడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు పారిపోయాడు. (చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు) సంఘటన స్థలంలో పోలీసులుకు ఓ డైరీ, హత్యకు వాడిన సుత్తి లభించింది. మృతులను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డైరీ చదివిన పోలీసులు షాక్ అయ్యారు. దానిలో నిందితుడు తాను నయం కానీ ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు రాసుకున్నాడు. అలానే ‘‘ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరం. అది అందరిని చంపేస్తుంది. నా అజాగ్రత్త వల్ల నేను తప్పించుకోలేని ఓ ప్రమాదంలో చిక్కుకున్నాను. నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ముందే సురక్షితమైన ప్రాంతానికి పంపాలి’’ అని రాసుకున్నాడు. డైరీ పరిశీలించిన పోలీసులు నిందితుడు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడికి కోసం గాలిస్తున్నారు. చదవండి: వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్! -
Omicron India: భారత్‌లో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: ప్రంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ భారత్‌లో కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా శనివారం మరో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. గుజరాత్, జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. ఇతడు కొన్ని రోజుల క్రితమే జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చినట్లు తెలిసింది. ఇది భారత్‌లో ఒమిక్రాన్ మూడో కేసు. (చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు) 72 ఏళ్ల బాధిత వ్యక్తి జింబాబ్వే నుంచి వచ్చిన తర్వాత స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. టెస్ట్‌లు చేయింగా.. గురువారం అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు రాష్ట్ర హెల్త్ కమిషనర్ జై ప్రకాశ్ శివ్‌హారే తెలిపారు. బాధితుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. (చదవండి: Omicron: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం) మహారాష్ట్రలో నాలుగో కేసు.. మహారాష్ట్రలో నాలుగో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. నవంబర్ నెల చివర్లో దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబై చేరుకున్న మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ►తీవ్రమైన కండరాల నొప్పులు ►చికెన్‌గున్యా లక్షణాలు ►తీవ్రమయిన అలసట చదవండి: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక -
కుప్పకూలుతున్న క్రిప్టో మార్కెట్.. భారత్ వల్లే!
క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సస్పెన్స్ నడుమ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ తరుణంలో భవిష్యత్తు ఆందోళనల నడుమ గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో కరెన్సీలు దారుణమైన పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళన నేపథ్యంలో గ్లోబల్ స్టాక్ మార్కెటన్నీ దారుణంగా కుదేలు అయిన వేళ.. క్రిప్టో మార్కెట్ మాత్రం లాభాల బాట నడిచింది. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు మార్కెట్ పతనం దిశగా కొనసాగుతోంది. అందుకు కారణం.. క్రిప్టో కరెన్సీ మీద భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అనే బెంగ. అవును.. క్రిప్టో కరెన్సీపై ప్రత్యేక చట్టం తేవాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఊపందుకున్న వేళ.. అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ భారీ పతనం చవిచూస్తోంది. ఈ ఏడాది నవంబర్ 10న 69వేల డాలర్ల హై వాల్యూతో ఆల్‌టైం హైలో బిట్‌కాయిన్ నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి కరెన్సీ ఇప్పుడు ఏకంగా 31 శాతం పతనం చవిచూసింది. శనివారం మధ్యాహ్నానికి ఏకంగా 12.50 శాతం పతనంతో ట్రేడ్ అవుతోంది. ఇక ఎథెరియం దాదాపు 10 శాతం, కార్డానో 14 శాతం పతనంతో కొనసాగుతున్నాయి. టెథెర్ కొంచెం మెరుగైన ఫలితం (3.94 లాభం)తో, యూఎస్డీ కాయిన్ 3.91 శాతం పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ► బిగ్గెస్ట్ గెయినర్: కోక్స్స్వాప్(COX) ► బిగ్గెస్ట్ లాసర్: జెమ్(DGM) గరిష్టంగా పతనం అయ్యింది ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అస్సెట్’గా మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోందని, మనీ లాండరింగ్‌ను అరికట్టడానికి ఈ బిల్లులో ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’(పీఎమ్ఎల్ఏ) నిబంధనలను సైతం పొందుపరచనున్నారని ఆ కథనాలు ఉటంకిస్తున్నాయి. ఇక ‘ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ బిల్లుకు సంబంధం లేకుండా ఇది విడిగా ఉంటుందని, డిజిటల్ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా వర్గీకరించడానికి మధ్య అంతరం ఉండేందుకు ఇలా చేయనున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో మీమ్ కాయిన్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే కొనసాగుతోంది. డోజ్కాయిన్, షిబా ఇను, డోజ్లన్ మార్స్, సామోయెడ్కాయిన్లు కూడా పతనం దిశగానే కొనసాగుతున్నాయని కాయిన్‌మార్కెట్ క్యాప్ డాట్ కామ్ వెల్లడించింది. ► డోజ్కాయిన్ 4.53 శాతం పతనం అయ్యింది ► షిబా ఇను 4.22 శాతం పతనం అయ్యింది మొత్తంగా ఈ ఉదయానికి క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్(2.43 ట్రిలియన్ డాలర్లు విలువ) 6.16 శాతం పతనం చవిచూసింది. అయితే గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 20 శాతం క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ పెరిగి.. 137 బిలియన్ డాలర్లపైకి చేరుకుంది. చదవండి: చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్! -
ఎలుకల నుంచే ఒమిక్రాన్!
Omicron Variant Updates In Telugu: ఒమిక్రాన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్. ఇప్పటికే ఉన్నవి చాలనట్టు ఈ కొత్త వేరియంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. కరోనా రూపుమార్చుకుని (మ్యూటేషన్ చెంది) కొత్త వేరియంట్‌గా ఎలా మారిందన్నది పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలుకల్లో కరోనా మ్యూటేట్ అయి ‘ఒమిక్రాన్’ పుట్టిందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ రోగ నిరోధక శక్తిని బట్టి.. సాధారణంగా వైరస్లు తమకు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందుకు మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తి సరిగా లేనివారిలో, హెచ్ఐవీ బాధితుల్లో లేదా కరోనా ప్రభావానికి గురయ్యే జంతువుల్లో మ్యూటేషన్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త వేరియంట్ పుడుతుంటాయి. ప్రస్తుతం వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా.. రోగ నిరోధక శక్తి దెబ్బతిన్న హెచ్ఐవీ రోగిలో మ్యూటేట్ అయి ఉంటుందని ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ వేరియంట్ ఎలుకల్లో పుట్టి.. ‘రివర్స్ జూనోసిస్’ పద్ధతిలో మనుషులకు సంక్రమించి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ‘ఒమిక్రాన్’లోని కొన్ని అసాధారణమైన మ్యూటేషన్లే దీనికి ఆధారమని తెలిపారు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్యూలేన్ యూనివర్సిటీ, అరిజోనా యూనివర్సిటీల శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. ఏమిటీ ‘రివర్స్ జూనోసిస్’? జంతువులు, పక్షుల్లో ఉండే కొన్నిరకాల వైరస్లు మనుషులకు కూడా సంక్రమిస్తుంటాయి. దీనిని ‘జూనోసిస్’ అంటారు. అలాంటి వైరస్లు కలుగజేసే వ్యాధులను ‘జూనోటిక్’ వ్యాధులు అంటారు. కరోనా వైరస్ కూడా ఇలా గబ్బిలాల నుంచి మనుషులకు సోకిన ‘జూనోసిస్’ వైరసే. జంతువుల నుంచి మనుషులకు సోకి రూపు మార్చుకున్న (మ్యూటేట్ అయిన) వైరస్లు.. తిరిగి ఇతర జంతువులకు సోకడాన్ని ‘రివర్స్ జూనోసిస్’ అంటారు. ఇలా మనుషుల నుంచి జంతువులకు సోకిన వైరస్లు.. ఆయా జంతువులకు తగ్గట్టు మళ్లీ మ్యూటేట్ అవుతాయి. ఇలా మార్పులు జరిగాక రెండోసారి సులువుగా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2020 మధ్యలోనే ఎలుకలకు వెళ్లి.. కరోనా తొలివేవ్ సమయంలోనే అంటే 2020 సంవత్సరం మధ్యలోనే ఆ వైరస్ ఎలుకలకు వ్యాపించి ఉంటుందని.. అప్పటి నుంచీ వివిధ మ్యూటేషన్లు జరిగాక ఇప్పుడు మనుషులకు వ్యాపించి ఉంటుందని స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త క్రిస్టియన్ అండర్సన్ తెలిపారు. ‘ఒమిక్రాన్’ వేరియంట్లో వచ్చిన మ్యూటేషన్లే దీనికి ఆధారమని వెల్లడించారు. ఒమిక్రాన్‌లో కనిపించిన మ్యూటేషన్లలో ఏడు మ్యూటేషన్లు ఆ వైరస్ ఎలుకలకు సంక్రమించడానికి వీలు కల్పించేవేనని.. ఆల్ఫా, బీటా, డెల్టా సహా ఇతర వేరియంట్లలో ఈ తరహా మ్యూటేషన్లు పెద్దగా కనిపించలేదని ట్యూలేన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ రాబర్ట్ గారీ తెలిపారు. అంతేకాదు ఇతర వేరియంట్లు వేటిలోనూ లేని కొన్ని అసాధారణ మ్యూటేషన్లు కూడా.. ఈ కొత్త వేరియంట్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. ఎందుకింత గందరగోళం? సాధారణంగా ఏ వైరస్ అయినా.. వ్యాపిస్తూ వెళ్లినకొద్దీ మ్యూటేట్ అవుతూ వస్తుంది. ప్రతి కొత్త వేరియంట్లో దానికన్నా ముందటి వేరియంట్‌కు సంబంధించిన మ్యూటేషన్లతోపాటు, కొత్త మ్యూటేషన్లు కూడా కనిపిస్తాయి. కానీ ‘ఒమిక్రాన్’లో ప్రస్తుతమున్న వేరియంట్లలోని మ్యూటేషన్లు లేవని.. అంతేగాకుండా ఒక్కసారిగా అతి ఎక్కువగా కొత్త మ్యూటేషన్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలోనే (ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు పుట్టకముందే) విడివడిన ఒక వేరియంట్.. భారీగా మ్యూటేషన్లు జరిగాక తిరిగి వ్యాపించడం మొదలుపెట్టిందని అంటున్నారు. చదవండి: OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!. చదవండి: Madhya Pradesh: ఎందు‘కని' పారేస్తున్నారు? -
విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్‌లో ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే, సింగపూర్, కెనడా నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారందరని ఐసోలేషన్‌లో ఉంచారు. (చదవండి: వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్!) భారత్‌లో ఒమిక్రాన్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు కరోనా నెగిటివ్ రిపోర్ట్‌తో నవంబర్ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగెటివ్ రావడంతో దుబాయ్‌కి వెళ్లిపోయారు. ఆయన నుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాగ్ నెట్వర్క్కి పంపి జన్యుక్రమాన్ని విశ్లేషించగా అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియెంట్ అని నిర్ధారణైంది. (చదవండి: ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..) ఇక ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రెండో వ్యక్తి బెంగుళూరుకి చెందిన డాక్టర్. రెండు డోసులు పూర్తి అయిన ఆయన ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకి కూడా ప్రయాణించలేదు. జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో నవంబర్ 21న కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మర్నాడే అతను ఆస్పత్రిలో చేరారు. మూడు రోజలు తర్వాత డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. చదవండి: కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం -
వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్ గుడ్‌న్యూస్
Google Postpone Work From Home End In 2022 January: కరోనా వైరస్ వేరియెంట్ల విజృంభణతో పట్టింపు లేకుండా.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలన్న బడా కంపెనీల నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. ఈ విషయంలో ముందుగా నిర్ణయాలు ప్రకటించే ఆల్పాబెట్ కంపెనీ ‘గూగుల్’.. ఇప్పుడూ ముందడుగు వేసింది. గూగుల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు తప్పనిసరిగా రావాలన్న ఆదేశాల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. ఈమేరకు గురువారం ఎంప్లాయిస్‌కు ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనలు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలపై నిరసన సెగలు తగిలిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి జనవరి నుంచి వర్క్‌ఫ్రమ్ హోం పాలసీకి ముగింపు పలకాలని, వారంలో కనీసం మూడు రోజుల చొప్పున ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని (వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లను) గూగుల్ ప్రణాళిక వేసుకుంది. ఈ మేరకు ఉద్యోగులతో తేల్చి చెప్పింది కూడా. డెల్టా వేరియెంట్ భయాందోళనలు సైతం పట్టించుకోకుండా ముందుకెళ్లాలని అనుకుంది. అయితే ఈలోపే త్వరగతిన వ్యాపించే ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, ముందు అనుకున్న తేదీ (జనవరి 10, 2022) నాటికి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే మరో నిర్ణయం తీసుకుంటామని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులతో పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గూగుల్‌కు మొత్తం 60 దేశాల్లో 85 దాకా ఆఫీసులు ఉన్నాయి. జనవరి నుంచి ఉద్యోగుల నుంచి ఎలాగైనా ఉద్యోగులను రప్పించాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగులు గత కొన్నివారాలుగా ఆఫీసులకు ‘క్యూ’ కడుతున్నారంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్నిగంటలకే వందల మంది ఉద్యోగులు.. వ్యాక్సినేషన్ తప్పనిసరి పాలసీపై నిరసన వ్యక్తం చేయడం, వర్క్‌ఫ్రమ్ హోం పాలసీలో మరికొన్నాళ్లు కొనసాగుతామని డిమాండ్ చేయడంతో గూగుల్ ఇరకాటంలో పడినట్లయ్యింది. చదవండి: ఒమిక్రాన్- హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటంటే.. -
Omicron కలకలం: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది మిస్సింగ్
బెంగళూరు: ఒమిక్రాన్ వేరింయట్ ప్రపంచ దేశాలను ఒణికిస్తోంది. తాజాగా భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బృహన్ బెంగళూరు మహనగర పాలికే (బీబీఎంపీ) చేసిన ఓ ప్రకటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన 10 మంది విదేశీ ప్రయాణికులు పత్తా లేకుండా పోయినట్లు వెల్లడించింది. ఆరోగ్య శాఖ అధికారులు వీరి జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు బీబీఎంపీ వెల్లడించింది. ఈ సందర్భంగా బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘విదేశీ ప్రయాణికులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. కొందరు ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. అలాంటి వారి కోసం కేంద్రం ఓ ప్రామాణిక ప్రోటోకాల్ జారీ చేసింది. దాన్ని అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. జాగ్రత్తగా ఉండండి.. భద్రతా ప్రమాణాలు పాటించండి’’ అని కోరారు. (చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!) ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు. వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉంది. సదరు ప్రయాణికులు ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. (చదవండి: Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) కర్ణాటకలో గురువారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినటుల కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో ఓ విదేశీ ప్రయాణికుడు ఇప్పటికే దేశం విడిచిపోయాడని.. మరోక వ్యక్తి కర్ణాటక స్థానికుడని.. అతడికి ఎలాంటి ప్రయాణ చరిత్రలేదని ఆరోగ్యశాఖ తెలపింది. చదవండి: దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు.. -
రియల్ ఎస్టేట్ రంగానికి మరో ఎదురు దెబ్బ
కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. దేశంలో సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రీటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ.10 నుంచి 15కి పెరిగింది. ఇప్పుడు అదే సిమెంట్ ధర రూ.15 నుంచి రూ.20లకు పెరిగి రానున్న రోజుల్లో సిమెంట్ ధర రూ.400తో ఆల్ టైమ్ హై రికార్డ్‌కు చేరుకోనున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. అయితే సిమెంట్ ధరలు పెరగడానికి కారణం దేశంలో బొగ్గు, డీజిల్ ధరలు పెరగడమే కారణమని క్రిసిల్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నిర్మాణ రంగంపై భారం వాస్తవానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు 11-13 శాతం పెరిగినట్లు క్రిసిల్ అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం కరోనా లాక్డౌన్ల నేపథ్యంలో పరిశ్రమ దీన్ని వృద్ధిగా భావించట్లేదు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెరిగితే గానీ తమకు లాభాలు వచ్చే పరిస్థితి లేదని, మార్కెట్లో 75శాతం వాటా ఉన్నా 17 సిమెంట్ కంపెనీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు క్రిసిల్ తెలిపింది. సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి దేశంలోనే సిమెంట్ ధరలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా ధర రూ.54పెరిగింది.సెంట్రల్ రీజియన్‌లో రూ.20 పెరిగితే, ఉత్తరాది రాష్ర్టాల్లో రూ.12, పశ్చిమాది ప్రాంతాల్లో రూ.10, తూర్పు నగరాల్లో రూ.5 మేర పెరిగింది. ఆయా కంపెనీలను బట్టి మార్కెట్లో బస్తా ధర రూ.350 నుంచి రూ.400 పలుకుతుండగా.. ఈ క్రమంలో సిమెంట్ ధరలు మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి చేర్చగలవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. -
Omicron: ఆ సినిమా పోస్టర్ల కథేంటంటే..
Fact Check On Omicron Movie Posters Viral కొత్తగా ఏదైనా పుట్టుకొచ్చిందంటే.. దాని పూర్వాపరాలను తవ్వితీయడం, రంధ్రాన్వేషణ చేయడం అందరికీ అలవాటైన పనే. కరోనా విజృంభణ తర్వాత లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమోగానీ.. అప్పటి నుంచి ఇలాంటి వ్యవహారాలు మరింత పెరిగాయి. తాజాగా ఒమిక్రాన్ (ఒమైక్రాన్) వేరియెంట్ పేరు తెర మీదకు వచ్చిన తరుణంలో.. తెర మీద ఆడిన ‘ఒమిక్రాన్’ సినిమా గురించి చర్చ మొదలైంది. గురువారం సాయంత్రం గూగుల్ ట్రెండ్‌లో టాప్-25 సెర్చ్ కంటెంట్‌లో మూడు ఒమిక్రాన్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఇది ఒక సినిమాకు సంబంధించిన సెర్చింగ్ ద్వారా ట్రెండ్‌లోకి రావడం. 1963లో ‘ఒమిక్రాన్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అది ఇటాలియన్ సై-ఫై సినిమా. కథ.. ఏలియన్ బాడీస్నాచర్స్ చుట్టూ తిరుగుతుంటుంది. అంతేకానీ పాండెమిక్స్ గురించి కాదు. అలాంటప్పుడు ఈ సినిమా ఎలా ట్రెండ్ అయ్యిందంటారా? ఐర్లాండ్‌కు చెందిన డైరెక్టర్ బెక్కీ చీట్లే ఈ ఇటాలియన్ సై-ఫై క్లాసిక్ సినిమా టైటిల్‌ను మరోలా వాడేసింది. ‘ది ఒమిక్రాన్ వేరియెంట్’ పేరుతో సినిమా పోస్టర్లను ఫొటోషాప్‌తో ఎడిట్ చేసి.. కింద ‘ది డే ది ఎర్త్ వాజ్ టర్న్డ్ ఇన్టు ఏ సిమెట్రీ’(భూమి మొత్తం శ్మశానంగా మారిన రోజు) అంటూ ఓ క్యాప్షన్‌ను జత చేసింది. అంతే.. అది నిజమని అనుకుని చాలామంది అలాంటి ఓ సినిమా ఉందని, అది ఆ టైంలోనే ప్రస్తుత పరిస్థితులను ఊహించిందంటూ పొరపడి తెగ వైరల్ చేశారు. విశేషం ఏంటంటే.. డైరెక్టర్ ఆర్జీవీ లాంటి సినీ సెలబ్రిటీలు కూడా ఆ పోస్టర్లను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అయితే అవి విపరీతంగా వైరల్ కావడం దృష్టికి రావడంతో బెక్కీ చీట్లే మళ్లీ స్పందించింది. తాను సరదాగా వాటిని ఎడిట్ చేశానని, 70వ దశకంలో వచ్చిన సినిమాల పోస్టర్లను అలా చేయించానని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టత ఇచ్చింది. Believe it or faint ..This film came In 1963 ..Check the tagline 😳😳😳 pic.twitter.com/ntwCEcPMnN — Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2021 ఇక 1957 సూపర్ హీరో కామిక్ స్ట్రిప్ ‘ఫాంటమ్’లోని ఓ సీన్ డైలాగ్ కూడా ఇలాగే వైరల్ అవుతోంది. ‘నేనెలా కట్టుకున్నానో అలా కట్టుకో. ఇది నిన్ను ఈ లోయలోని చైనా వైరస్ నుంచి కాపాడుతుంది’ అంటూ ఓ రైటప్ ఉందక్కడ. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ కాగా.. అది ఫేక్ అని తేలింది. వాస్తవానికి అక్కడ డైలాగ్ ‘స్లీప్ డెత్’ అని ఉంటుంది. సో.. కరోనా వైరస్‌కు ముడిపెట్టి ఎడిట్ చేసిన ఫొటో అలా వైరల్ అవుతోందన్న మాట!. -
అమెరికా వెళ్తున్నారా? ఈ రూల్స్ పాటించాల్సిందే ! బైడెన్ సర్కార్ కొత్త ఆదేశాలు
ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నిబంధనలు కఠినం చేసింది. విదేశాల నుంచి అమెరికా చేరుకునే ఆ దేశ పౌరులు, విదేశీయులు తప్పనిసరిగా కొన్ని నిబందనలు పాటించాలంటూ జో బైడెన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గత బుధవారం కాలిఫోర్నియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ఆరోగ్య , వైద్య విభాగం వెంటనే ప్రభుత్వానికి కొన్ని సూచనలు జారీ చేసింది. వీటి ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. - విదేశాల నుంచి అమెరికాకు చేరుకునే వారు తమతో పాటు 24 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. గతంలో 72 గంటలుగా ఉన్న నిబంధనను ఒక రోజుకి కుదించారు. - గడిచిన పద్నాలుగు రోజులుగా దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రయాణించిన వారికి అమెరికాలోకి ఎంట్రీ లేదు. అయితే అమెరికన్ సిటిజన్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. - విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులకు తప్పనిసరిగా హాజరు కావాలి - విమానంతో పాటు బస్సు, రైలు, క్యాబ్‌లలో సైతం మాస్కు ధరించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. మార్చి 18 వరకు ఈ రూల్ కొనసాగుతుంది. చదవండి: ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! మహా సర్కారు కొత్త నిబంధనలు -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఫ్లైట్ చార్జీల బాదుడు.. వామ్మో! ఈ రేంజ్‌లోనా?
పరిస్థితులు అంతా చక్కబుతున్నాయని అనుకునేలోగా ఒమిక్రాన్ రూపంలో మరొ కొత్త ముప్పు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై క్రమంగా ఆంక్షలు సడలిస్తున్న తరుణంలో కరోనా న్యూ వేరియంట్ వార్తలు తిరిగి గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆంక్షల భయాలు ఒమిక్రాన్ విజృంభంతో మళ్లీ లాక్డౌన్ పెడతారా ? ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తారా అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫలితంగా మరో అంతర్జాతీయ ప్రయాణాలు సందిగ్ధంలో పడిపోయాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ కారణంగా ఏ దేశం అంతర్జాతీయ ప్రయాణాల రద్దు, లాక్డౌన్ వంటి చర్యలు తీసుకోకపోయినా అనుమాన మేఘాలు అయితే అంతటా ఆవరించాయి. దీంతో ఒక్కసారిగా విమానఛార్జీల ధరలు రెండింతలు అయ్యాయి. క్రిస్మస్ సీజన్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడంతో క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. వివిద దేశాల మధ్య విమాన సర్వీసులు మొదలవుతున్నాయి. విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను చూసేందుకు భారతీయులు ప్రయాణాలకు రెడీ అవుతున్నారు. మరోవైపు క్రిస్మస్ సీజన్ కావడంతో యూరప్, అమెరికాలో డిసెంబరులో పండుగ వాతవారణం నెలకొంటుంది. ఏడాదిన్నరగా తమ వాళ్లకు దూరమైన ఎన్నారైలు తమ వారిని అమెరికా రప్పించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఒమిక్రాన్ భయాలు వారి బడ్జెట్ ప్లాన్స్‌ని తలకిందులు చేస్తున్నాయి. పెరిగిన డిమాండ్ ఒమిక్రాన్ విజృంభిస్తే ఏ క్షణమైనా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావచ్చనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. దీంతో కఠిన ఆంక్షలు అమల్లోకి రాకముందే ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారను. ఫలితంగా ఒక్కసారిగా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఏడాది కాలంగా సర్వీసులు లేకుండా నష్ట్లాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇదే అదనుగా భావించిన అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. గల్ఫ్ మొదలు యూఎస్ వరకు అన్ని విమానాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కీలకమైన మార్గాల్లో ధరలు దాదాపుగా ఇలా ఉన్నాయి - విమాన ప్రయాణాలకు సంబంధించి న్యూఢిల్లీ నుంచి కెనడాలో లోని టోరంటోకి కనీస ఛార్జీ రూ.80వేలు ఉండగా ఇప్పుడది రూ. 2.37 లక్షలకు చేరుకుంది. - ఢిల్లీ లండన్ల మధ్య ప్రయాణానికి గతంలో రూ. 60,000 ఖర్చు అవగా ఇప్పుడు రూ. 1.20 లక్షలకు చేరుకుంది - ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే గల్ఫ్ దేశాలకు చెందిన విమాన సర్వీసుల్లో గతంలో టిక్కెట్ చార్జీ రూ. 20 వేలను మించలేదు. ప్రస్తుతం అది రూ. 33 వేల దగ్గర ఉంది. - ఇండియా నుంచి అమెరికాలోని ప్రధాన నగరాలకు విమాన ఛార్జీలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షలు ఉండగా ఇప్పుడు కనీసం రూ.1.70 లక్షలకు చేరుకుంది. షికాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ సిటీ వంటి నగరాలకయితే చార్జీలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు రూ.6 లక్షలుగా ఉన్నాయి. చదవండి: ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు.. రిజల్ట్స్‌కి ఎంత సమయం పడుతుంది? -
జర్మనీలో ఒమిక్రాన్ గుబులు.. అలా అయితే కష్టమే.. వారికి ‘లాక్డౌన్’
బెర్లిన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. టీకా తీసుకోని వారికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తికాని వారు.. మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. దీంతోపాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో జర్మనీ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయనుంది. ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం తర్వాత.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైవు.. జర్మనీ జనాభాలో ఇప్పటివరకు 75శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాదాపు 68శాతం మందికి మాత్రమే టీకాలు పూర్తి చేసింది. ఇక డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియెంట్‌కు సంబంధించి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. (చదవండి: Viral Video: కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..) -
Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి వచ్చేసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు కరోనా నెగిటివ్ రిపోర్ట్‌తో నవంబర్ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో ర్యాండమ్‌గా నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగెటివ్ రావడంతో దుబాయ్‌కి వెళ్లిపోయారు. ఆయన నుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాగ్ నెట్వర్క్కి పంపి జన్యుక్రమాన్ని విశ్లేషించగా అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియెంట్ అని నిర్ధారణైంది. చదవండి: (ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..) ఆ వృద్ధుడిని నేరుగా కలుసుకున్న 24 మంది ప్రైమరీ కాంటాక్ట్‌లు, వారిని కలుసుకున్న మరో 240 మందికి (సెకండరీ కాంటాక్ట్) కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రెండో వ్యక్తి బెంగుళూరుకి చెందిన డాక్టర్. రెండు డోసులు పూర్తి అయిన ఆయన ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకి కూడా ప్రయాణించలేదు. జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో నవంబర్ 21న కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మర్నాడే అతను ఆస్పత్రిలో చేరారు. మూడు రోజలు తర్వాత డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. చదవండి: (దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు..) ఆయన నుంచి సేకరించిన శాంపిళ్లను అదే రోజు జన్యుక్రమాన్ని విశ్లేషించడానికి పంపగా ఒమిక్రాన్‌గా తేలింది. ఈ కేసులో ఆందోళన కలిగించే అంశమేమిటంటే డాక్టర్‌ను కలుసుకున్న వ్యక్తుల్లో ముగ్గురు ప్రైమరీ, ఇద్దరు సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే వారికి సోకింది ఒమిక్రాన్ వేరియెంటా, కాదా అన్నది ఇంకా జన్యు పరీక్షల్లో తేలాల్సి ఉంది. మొత్తంగా 13 మంది ప్రైమరీ, 205 మంది సెకండరీ కాంటాక్ట్స్‌కి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన అయిదుగురిని ఐసొలేషన్‌లో ఉంచారు. -
కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం
న్యూఢిల్లీ: కోవిడ్ మేనేజ్మెంట్పై కేంద్ర ప్రభుత్వ తీరును లోక్‌సభలో ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కరోనా వ్యాక్సినేషన్, బూస్టర్ డోసుపై రోడ్‌మ్యాప్ గురించి సభకు తెలియజేయాలని సూచించాయి. ఈ వైరస్ కారణంగా అసలు ఎంతమంది చనిపోయారో వాస్తవ గణాంకాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా మహమ్మారిపై లోక్‌సభలో గురువారం తొలుత శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ చర్చ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ డోసులు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ డోసులు ఇస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని 130 కోట్ల మంది బాధ్యత ప్రధానమంత్రిపై ఉందని గుర్తుచేశారు. జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకా డోసులు కేటాయించాలన్నారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 38 శాతం జనాభాకే టీకా రెండు డోసులు ఇచ్చారని అన్నారు. దీంతోనే సంతృప్తి చెందుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాల మధ్య కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. పేదలను ఆదుకోలేరా? కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని ముందుగానే నిపుణులు హెచ్చరించినా కేంద్ర సర్కారు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల నష్టపోయినా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి మరిన్ని కష్టాలకు గురిచేస్తోందని అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి గానీ పేదలను ఆదుకోవడానికి ఉండవా? అని నిలదీశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కానీ, రూ.50 వేలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు నిర్వాకం వల్లే కరోనా సెకండ్ వేవ్‌లో అధికంగా మరణాలు సంభవించాయని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు ఎగువ సభలో ఆమోదం దేశంలో డ్యామ్‌ల భద్రత కోసం సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు ఉద్దేశించిన డ్యామ్ సేఫ్టీ బిల్లు–2019 గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. రెండు అధికారిక సవరణతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. ఎగువ సభలో సవరణలు చేయడంతో ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. డ్యామ్‌ల భద్రత విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలు, ప్రజలకు జరిమానా విధించే అధికారం ఈ అథారిటీకి ఉంటుందన్నారు. ఎన్సీడీఎస్ చేసే సిఫార్సుల అమలును సైతం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆయా అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు కోరగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిరాకరించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ముందుగా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, వామపక్షాల సభ్యులు సైతం వాకౌట్ చేశారు. అది అప్రజాస్వామికం కాదు: వెంకయ్య సభలో సభ్యుల హద్దుమీరిన ప్రవర్తనను అంగీకరించకపోవడం అప్రజాస్వామికంగా పరిగణించరాదని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. 12 మంది సభ్యుల సస్సెన్షన్‌పై ప్రతిపక్షాలు రాజ్యసభలో గత నాలుగు రోజలుగా నిరసన కొనసాగిస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ పరిణామంపై వెంకయ్య మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి ప్రతిష్టంభనకు తెరదించాలని సూచించారు. రాజ్యసభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 1962 నుంచి 2010 వరకూ 11 సార్లు సభ్యులను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. అదంతా అప్రజాస్వామికమేనా? అని ప్రశ్నించారు. -
దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు..
జోహెన్నెస్‌బర్గ్/లండన్: దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నవంబర్ 24న బయటపడిన ఒమిక్రాన్ వేరియెంట్ తొమ్మిది రోజుల్లోనే భారత్‌సహా 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించారు. డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్ వ్యాపిస్తూ ఉండడం దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. నార్వేలో క్రిస్మస్ పార్టీకి వెళ్లిన వారికి ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. దీని వ్యాప్తి చాలా విస్తృతంగా ఉండడంతో వేరియెంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు ఫ్రాన్స్‌లో ఈ కొత్త వేరియెంట్ గురువారమే బయటపడింది. మరికొద్ది వారాల్లో కేసుల తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్టుగా ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణాఫ్రికా తర్వాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే కొద్ది నెలల్లో యూరప్‌లో నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా ఒమిక్రాన్ వేరియెంట్‌వే ఉంటాయని యూరోపియన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ ఈసీడీసీ అంచనా వేస్తోంది. యువతకే అధికంగా.. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్ధిష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో యువతకే అత్యధికంగా ఈ వేరియెంట్ సోకుతూ ఉందని, వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వివిధ దేశాల కఠిన నిబంధనలు ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయడంపై వివిధ దేశాలు దృష్టి సారించాయి. లాక్డౌన్, మార్కెట్లు మూసేయడం కంటే వ్యాక్సినేషన్, మాస్కులు సహా కోవిడ్–19 నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని వివిధ దేశాలు నిర్ణయించాయి. ► వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలను జర్మనీ పరిమితం చేసింది. నిత్యావసరాల దుకాణాలకు తప్పితే అలాంటి వారిని మరే ఇతర స్టోర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించబోమని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ గురువారం ప్రకటించారు. దేశంలో పరిస్థితి సీరియస్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనసరి చేయడాన్ని పార్లమెంటు పరిశీలిస్తుందని తెలిపారు. గత 24 గంటల్లో 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ► 60 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారి నెలవారీ పెన్షన్ నాలుగో వంతు కోత వేసే యోచనలో గ్రీస్ ప్రభుత్వం ఉంది.పెన్షన్‌లో నెలకు 100 యూరోల(రూ.8,471) కోత పడనుంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇంకా 17 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ప్రభుత్వం ఈ జరిమానా అస్త్రం ప్రయోగించింది. ► స్లోవేకియా మాత్రం 60 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంటే 500 యూరోలు (రూ.42,355) బోనస్‌గా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ► లాక్డౌన్లకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నెదర్లాండ్స్‌లో నిరసన ప్రదర్శనల్ని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. ► అమెరికా బూస్టర్ డోసుల్ని కూడా ఇస్తోంది. రెండు డోసులు పూర్తయినప్పటికీ కరోనా నుంచి మరింత రక్షణ కోసం బూస్టర్ డోసులు ఇస్తోంది. ► ఒమిక్రాన్ సోకిన వ్యక్తులతో ఎవరు సన్నిహితంగా మెలిగారనేది సదరు రోగుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా ఇజ్రాయెల్ తెలసుకుంటోంది. గోప్యత హక్కుకు ఇది భంగకరమని హక్కుల సంఘాలు ధ్వజమెత్తడంతో గురువారం దీన్ని ఆపివేసింది. ► 18 ఏళ్లు పైబడిన వారు ఆరునెలలకు ఒకసారి బూస్టర్ డోస్‌ను తీసుకోవడాన్ని చిలీ తప్పనసరి చేసింది. అప్పుడే పాస్ రెన్యువల్ అవుతుంది. ఈ పాస్ లేకపోతే రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లలేరు. -
ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..
న్యూఢిల్లీ, బెంగుళూరు: అందరూ భయపడుతున్నట్టుగానే జరిగింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి వచ్చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు, బెంగళూరుకి చెందిన 46 ఏళ్ల వయసున్న వైద్యుడికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టుగా ఇన్సాకాగ్ నెట్వర్క్ జన్యు విశ్లేషణల్లో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వారిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్ని కలుసుకున్న వారిలో ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచారు. కోవిడ్ నిబంధనలు పాటించాలి కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వచ్చేసిందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు వద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కోవిడ్ నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. ‘ఒమిక్రాన్‌పై ఎవరూ ఆందోళన చెందవద్దు. కానీ కరోనా నిబంధనలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం వంటివన్నీ చేస్తే ఒమిక్రాన్ సహా ఏ కరోనా వేరియెంట్‌నైనా ఎదుర్కోగలం’ అని లవ్ అగర్వాల్ చెప్పారు. డెల్టా కంటే ఈ వేరియెంట్ ప్రమాదకరమైనదా? కాదా? అన్నది ఇంత త్వరగా చెప్పలేమన్నారు. దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీ– పీసీఆర్ పరీక్షలు నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాతే వారిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ పిలుపునిచ్చారు. మరోవైపు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పకడ్బందీగా స్క్రీనింగ్, కరోనా పరీక్షలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అధికారుల్ని ఆదేశించారు. బూస్టర్ డోస్‌లపై అధ్యయనం ఒమిక్రాన్ రాకతో భారత్‌కు మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ బూస్టర్ డోసులపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ బూస్టర్ డోసులు ఇవ్వడంపై శాస్త్రీయపరమైన కారణాలను విశ్లేషిస్తున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త వేరియెంట్‌ను ఎదుర్కోవడంలోనూ వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని నీతి అయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ చెప్పారు. భారత్ దగ్గర టీకా డోసులు సమృద్ధిగా ఉండడం అదృష్టమని చెప్పారు. అందరూ టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పారు. దేశ జనాభాలోని వయోజనుల్లో 40 శాతం మంది కరోనా టీకాలు రెండు డోసులు తీసుకుంటే, 84.3% మంది ఒక్క డోసు తీసుకున్నారని చెప్పారు. -
పటాన్చెరు: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలలో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పటాన్చెరు, ఖమ్మం వైరా గురుకులు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. (చదవండి: ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే!) పటాన్చెరు-ఇంద్రేశం గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఖమ్మం వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ తగిన నిర్ణయం తీసుకోవాలిని కోరుతున్నారు. (చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!) తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరిగితే.. రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నా ఎదుగుదల సర్వేల్ గురుకులం భిక్షే -
తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!
జోహన్నెస్‌బర్గ్: కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం అయ్యేలా లేదు. కాలం గడుస్తున్న కొద్ది.. మహమ్మారి తన రూపు మార్చుకుంటూ.. మరింత శక్తిమంతంగా మానవాళి మీద దాడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు డెల్టా వేరియంట్ జనాలను బెంబెలెత్తించింది. దాన్నుంచి తేరుకుని.. కాస్త ఊపిరి పీల్చుకునే సమయానికి ఒమిక్రాన్ దాడి ప్రారంభించింది. ఒమిక్రాన్ డెల్టా కన్నా కూడా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్.. అప్పుడే ప్రపంచ దేశాలను చుట్టేస్తూ.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మరో వుహాన్.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్’) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నిపుణుడు అన్నే వాన్ గాట్బర్గ్ మాట్లాడుతూ.. ‘‘గతంలో కోవిడ్ బారిన పడినవారికి.. ఒమిక్రాన్ సోకదనే గ్యారెంటీ లేదు. గతంలో సోకిన ఇన్ఫెక్షన్.. ఒమిక్రాన్ నుంచి కాపాడలేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహమ్మారి ముప్పు ముంచుకొస్తున్న వేళ వ్యాక్సిన్ మాత్రమే మనల్ని కాపాడగలదు. తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా ఉండటమే కాక.. మహమ్మారి సోకితే పరిస్థితి విషమించకుండా.. ఆస్పత్రిలో చేరే పరిస్థితి తలెత్తకుండా టీకా మనల్ని సంరక్షిస్తుంది’’ అని తెలిపారు. (చదవండి: భారత్‌లో ఒమిక్రాన్ కలకలం) ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగు చూడటంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు.. సౌతాఫ్రికా, దాని చుట్టుపక్కల దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల నిర్ణయంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మేలు కోసం మేం ఒమిక్రాన్ ఉనికి గురించి ముందుగానే హెచ్చరిస్తే.. మాపై ఇలా నిషేధం విధించడం తగదన్నారు. చదవండి: ఒమిక్రాన్‌కు ‘సినిమా’ చూపిద్దాం! -
భారత్‌లో ఒమిక్రాన్ కలకలం
Omicron variant detected in India, two positive cases in Karnataka ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో ప్రవేశించింది. తాజాగా.. భారత్‌లో రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కాగా, వీరికి తీవ్రమైన లక్షణాలు లేనట్లు పేర్కొన్నారు. గత నెల 11, 12 తేదీల్లో వీరిద్దరూ విదేశాల నుంచి వచ్చినట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. వైరస్ సోకిన ఇద్దరు పురుషుల్లో ఒకరికి 46, మరోకరికి 66 ఏళ్లని కేంద్రం తెలిపింది. వైరస్ సోకిన ఇద్దరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో తరలించినట్లు కేంద్రం తెలిపింది. కాగా, ఒమిక్రాన్ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే, వీరిద్దరిలో తీవ్రమైన లక్షణాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేరళ, మహారాష్ట్రలలో 10,000 కంటే ఎక్కువ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. దేశంలోని 55 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లో నమోదయ్యాయని చెప్పారు. వారంవారీ కోవిడ్-19 పాజిటివిటీ రేటు 15 జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ.. 18 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. (Omicron: మరో వుహాన్.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్’) ఇప్పటివరకూ 29 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూడగా, 373 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు సద్దుమణిగిందనుకున్న తరుణంలో ఒమిక్రాన్‌గా రూపుమార్చుకుని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వేరియంట్ భారత్‌లో ప్రవేశించకుండా కేంద్రం ముందుగానే చర్యలు చేపట్టినప్పటికీ రెండు కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఒమిక్రాన్ పై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష.. న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వైరస్‌పై ప్రధాని నరేంద్రమోదీ అధికారులతో అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితిని ఆరోగ్యశాఖాధికారులు మోదీకి వివరించారు. ప్రజలందరు మాస్క్ ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని మోదీ సూచించారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. టీమిండియా పర్యటన వాయిదా!
India Tour Of South Africa Delay One Week, Omicron Fear.. ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌ను వారం పాటు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒమిక్రాన్‌కు వేరియంట్ తొలి కేసు వెలుగు చూసింది దక్షిణాఫ్రికాలో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే టీమిండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా జట్టు ఎంపికకు సంబంధించి సెలెక్షన్ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికి వాయిదా పడింది. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు 8 రోజుల క్వారంటైన్లో ఉండాలంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం స్పందించారు. చదవండి: Cricketers In Number 10 Jersey: ఆట ఏదైనా ఆ జెర్సీ అంటే ఎందుకంత క్రేజ్! ''బోర్డు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నందని.. పర్యటన షెడ్యూల్లోనే ఉంది. నిర్ణయించుకోవడానికి మాకు ఇంకా సమయం ఉంది. డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు జరగనుంది. దాని గురించి ఆలోచిస్తాం. ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం ఎల్లప్పుడూ బీసీసీఐ మొదటి ప్రాధాన్యత. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి” అని గంగూలీ పేర్కొన్నాడు. భారత్ దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనుంది. అయితే కొన్ని మ్యాచ్‌లు కుదించే అవకాశముందని తేలింది. చదవండి: బాబర్ అజమ్ ఇండో-పాక్ ఎలెవెన్.. టీమిండియా అంటే ఇష్టమనుకుంటా -
ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు.. రిజల్ట్స్‌కి ఎంత సమయం పడుతుంది?
Rapid PCR Test Cost And Result Time Details at Hyderabad Chennai Airport: ఒమిక్రాన్ వేరియింట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. బుధవారం నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఏ రకమైన పరీక్షలు చేస్తున్నారు ? రిపోర్టు రావడానికి ఎంత సమయం పడుతుందనే అంశాల పట్ల ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎదురు చూస్తున్నారు. రోజుకు 5000ల మంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా దేశంలోని వివిధ నగరాలు, విదేశాల నుంచి నిత్యం 5000ల మంది ప్రయాణికులు రాష్ట్రంలోకి వస్తున్నారు. వీరిలో కేంద్రం పేర్కొన్న అట్ రిస్క్ జాబితాలో ఉన్న 12 దేశాల నుంచి ఇంచుమించు 500ల మంది ప్రయాణికులు నగరానికి వస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కి పంపిస్తున్నారు. రెండు నుంచి ఆరు గంటలు ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆర్టీ పీసీఆర్, ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఆర్టీ పీసీఆర్ పరీక్షకు సుమారు 6 గంటల సమయం పడుతోందని ఎయిర్‌పోర్టు అథారిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష రిజల్ట్ రెండు గంటలలోపు వస్తుంది. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ధర రూ.999 ఉండగా ర్యాపిడ్ కిట్ ధర రూ.4,500లుగా ఉంది. టిమ్స్‌కి ఎయిర్ పోర్టు ప్రాంగణంలో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు రిజల్ట్ వచ్చే వరకు ఎదురు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 400ల మందికి తగ్గట్టుగా ఎయిర్‌పోర్టులో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. అక్కడ హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. చెన్నైలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు విదేశీ ప్రయాణాలు, దేశంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు హైదరాబాద్ తర్వాత ఎక్కుగా చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను ఉపయోగించుకుంటారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కి రూ.700 ఛార్జ్ చేస్తుండగా రిజల్ట్ కోసం ఆరు గంటల సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కి రూ.3500 ఛార్జ్ చేస్తుండగా 30 నిమిషాల నుంచి రెండు గంటలలోపు రిజల్ట్ అందిస్తున్నారు. చదవండి: ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! -
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా
న్యూఢిల్లీ/ జెనీవా/లాగోస్: అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని బుధవారం డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది. ఈనెల 15 నుంచి పునరుద్ధరించాలని గత నెల 26న నిర్ణయించింది. తర్వాత ఒమిక్రాన్ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదావేసింది. దేశంలో ఈ కేసు లు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది. నిషేధంతో అరికట్టలేరు: డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించినంత మాత్రాన ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పట్నుంచి ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకొని పలు దేశాలు విమానాల రాకపోకల్ని నిషేధిస్తూ ఉండడంతో డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రాయాసెస్ స్పందించారు. ప్రయాణాలను నిషేధిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్ల పైబడిన వారు ప్రయాణాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అమెరికాలో ఒమిక్రాన్ తొలి కేసు కాలిఫోర్నియాలో బుధవారం నమోదైంది. దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్ పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్ వేరియెంట్ అక్టోబర్‌లో బయటపడింది. ఈ వేరియెంట్‌పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. ‘గత వారంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నమూనాలో జన్యుక్రమాన్ని పరిశీలిస్తే ఒమిక్రాన్ కేసులు అని తేలింది. ఆ నమూనాలు పరీక్షించినప్పుడే అక్టోబర్‌లో సేకరించిన శాంపిళ్లనూ పరీక్షిస్తే ఒమిక్రాన్ వేరియెంట్‌గా నిర్ధారణ అయింది. అంటే రెండు నెలల కిందటే ఒమిక్రాన్ వేరియెంట్ పుట్టుకొచ్చిందని అర్థమవుతోంది’ అని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. -
ఒమిక్రాన్‌కు ‘సినిమా’ చూపిద్దాం!
ఆయన ఓ ఫ్యాక్టరీలో వర్కర్.. చిన్న ప్రమాదం జరిగి ప్రాణం పోతుంది.. కానీ కాసేపటికే లేచివస్తాడు. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తాడు. చుట్టూ ఉన్న ప్రతిదానిని తరచి చూస్తుంటాడు. అన్నీ తెలుసుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటాడు. ఆ వివరాలన్నీ ఎవరికో పంపుతుంటాడు. అంతా చిత్రంగా చూస్తుంటారు. కానీ కాసేపటికి అతను ‘ఒమిక్రాన్’ గ్రహానికి చెందిన ఏలియన్ (గ్రహాంతర వాసి) అని బయటపడుతుంది. భూమిని ఆక్రమించుకోవాలనుకునే ‘ఒమిక్రాన్’ వాసులు.. ముందుగా అన్ని వివరాలు తెలుసుకొమ్మని ఆ ఏలియన్‌ను పంపుతారు. ఇదంతా 1963 నాటి ఇటాలియన్ సినిమా ‘ఒమిక్రాన్’ కథ. ..మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సినిమా పోస్టర్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘‘కోవిడ్ వైరస్‌లపై భవిష్యత్తులో ఓ ఉత్కంఠ భరిత సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. అందులో కోవిడ్ వేరియంట్లు అన్నీ దుష్టశక్తులుగా ఉంటే.. ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఓ సూపర్ హీరోగా రంగంలోకి వస్తుంది. కరోనా వేరియంట్లు అన్నింటినీ ఓ సాధారణ జలుబు వైరస్‌లుగా మార్చేసి.. మానవాళిని కాపాడుతుంది’’ అని ట్వీట్ పెట్టారు. ‘ఒమిక్రాన్’ వేరియంట్ విపరీతంగా వ్యాప్తి చెందినా.. లక్షణాలు, ప్రమాదం రెండూ తక్కువేనని, కోవిడ్ సాధారణ జలుబుగా మారేందుకు ఇది దారితీస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించిన వార్తను తన ట్వీట్‌కు లింక్ చేశారు. ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మొక్కలను నాశనం చేసే వైరస్‌తో.. ‘ఒమిక్రాన్’ వేరియంట్‌పై ఆందోళన నేపథ్యంలో.. ఇదే పేరుతో ఉన్న మరో సినిమాపై పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆ సినిమా పేరు ‘ప్రాజెక్ట్ ఒమిక్రాన్ (ఏ విజిటర్ ఫ్రం ప్లానెట్ ఒమిక్రాన్)’. ఒమిక్రాన్ గ్రహం నుంచి వచ్చిన ఓ గ్రహాంతర వాసి.. భూమ్మీద పంటలు, మొక్కలను నాశనం చేసే వైరస్‌ను వదులుతూ ఉంటాడు. కానీ ఓ మహిళ తాను పెంచే మొక్కలు, తాజా ఉత్పత్తులతో.. అతడిపై విజయం సాధిస్తుంది. ఢిల్లీ శివార్లలో ‘ఒమిక్రాన్’ దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఓ టౌన్షిప్ పేరు విని జనం జడుసుకుంటున్నారు. ఎందుకో తెలుసా.. ఆ టౌన్షిప్ పేరు.. ‘ఒమిక్రాన్’. అంతేకాదు ఆ పక్కనే.. ఇంతకు ముందటి ‘మ్యూ’ వేరియంట్ పేరిట మరో టౌన్షిప్ ఉండటం గమనార్హం. కొత్త వేరియంట్‌పై ఆందోళన నేపథ్యంలో ఈ ఫొటో కూడా వైరల్‌గా మారింది. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!
Omicron Variant Confirmed in 12 Countries: కొన్ని రోజులు క్రితం దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వైరస్ అప్పుడే పలు దేశాల్లో విరుచకుపడటానికి సన్నహాలు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్‌తో ప్రపంచదేశాలన్ని అతలాకుతలం అయ్యిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటికి దడ పుట్టించేలా విరుచకుపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించని కొద్ది రోజుల్లోనే జపాన్, ఐరోపా, యునైటెడ్ కింగ్డమ్తో సహా సుమారు 12 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన తొలి కేసులు నమోదైనట్టు ధృవీకరించడం గమనార్హం. తాజాగా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులలో కొత్త కోవిడ్ -19 వేరియంట్ తొలి కేసులను గుర్తించినట్లు ధృవీకరించింది. (చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) అయితే ఈ కరోనా మహమ్మారీ కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాలైన అమెరికా, భారత్, చైనాలో ఇంతవరకు కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసులు నమోదు కాలేదు. ఈ మేరకు భారత్ కొత్త వేరియంట్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా ఆంక్షలు కఠినతరం చేయడమే కాకా ముందుగానే పలు టెస్ట్‌లు నిర్వహించి హోం క్యారంటైన్లో ఉంటే గానీ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్‌లోని ఒక సీనియయర్ వైద్యుడు ఈ ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే దేశంలోకి వచ్చే ఉండవచ్చని, ఇది డెల్లా వేరియంట్ కంటే వేగంతగా వ్యాప్తి చెందే అటువ్యాధి అని అన్నారు. పైగా ఇది చాలా ప్రాణాంతకమైనదని వ్యాక్సిన్లు ఎంతవరకు రక్షణగా ఉంటాయి అనే అంశంపై పరిశోధనలను వేగవంతం చేయాలని చెప్పారు. అంతేకాదు డెల్టా వేరియంట్ వల్ల కలిగే నష్టాన్ని అరికట్టలేని ప్రస్తుత వైద్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్న భారత్‌కి ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని వైద్యుల ఈ ఒమిక్రాన్ ప్రమాదకరమైన వైరస్ కావచ్చు కానీ డెల్టా కంటే తేలికపాటి లక్షణాలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారిపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో అనే అంశం పై నిపుణులు కచ్చితమైన అవగాహనకు రావడానికి నాలుగు వారాలు పట్టవచ్చని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ యాక్టింగ్ హెడ్ అడ్రియన్ ప్యూరెన్ అన్నారు. ఏదీఏమైన డబ్ల్యూహెచ్ఓకి గతేడాది అల్పా వేరియంట్‌ని ప్రమాదకరమైన వేరియంట్‌గా గుర్తించడానికి కొద్ది నెలల సమయం పట్టింది. కానీ ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ని కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించడం గమనార్హం. (చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) -
Cryptocurrency: ఒమిక్రాన్ పేరులోనే మ్యాజిక్ ఉంది
ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన పేరు.. ఒమిక్రాన్. కరోనా వైరస్ వేరియెంట్లలో ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తిస్తుండడంతో ఎంతటి విపత్తుకు దారితీస్తుందోనని హడలిపోతున్నారంతా. అయితే ఈ పేరు మాత్రం అక్కడ లాభాలు కురిపిస్తోంది. ఒమిక్రాన్ ఇదే పేరుతో క్రిప్టో స్పేస్‌లో ఓ కాయిన్ ఉంది. నవంబర్ 27న ఈ క్రిప్టోకరెన్సీ విలువ 64 డాలర్లుగా ఉండింది. అయితే డబ్ల్యూహెచ్‌వో ‘ఒమిక్రాన్’ వేరియెంట్ ఆందోళన ప్రకటన తర్వాత వేరియెంట్ గురించి విస్తృత స్థాయిలో జరిగిన చర్చ.. ఈ కాయిన్ విలువను అమాంతం పెంచేసింది. నవంబర్ 29న ఒమిక్రాన్ మార్కెట్ వాల్యూ 692 డాలర్లకు చేరుకోగా.. నవంబర్ 30న ప్రారంభ విలువకు 900 శాతం పెరిగి 689 డాలర్లకు చేరుకుంది. చివరికి మంగళవారం 420 డాలర్ల వద్ద ఉండిపోయి.. క్రిప్టో మార్కెట్లో తన జోరు కొనసాగిస్తోంది. ఒమిక్రాన్ కరెన్సీకి ఎలాంటి మద్దతు లేదు. డోజ్కాయిన్ లాగే ఇది కూడా అంచనాల నడుమే తన విలువను పెంచుకోవడం, పడిపోవడం జరుగుతోంది కూడా. ఇక ఒమిక్రాన్ అలర్ట్ పరిణామాల తర్వాత డిజిటల్ ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్, ఇతరత్ర కాయిన్స్ విలువ లాభాలతో కొనసాగుతుండడం విశేషం. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్ B.1.1.529కు గ్రీకు 24 అక్షరాల్లోని 15వ అక్షరం ఒమిక్రాన్ ఆధారంగా పేరును నిర్ణయించింది ఫైలోజెనెటిక్ ఎసైన్మెంట్ ఆఫ్ నేమ్డ్ గ్లోబల్ ఔట్‌బ్రేక్ కంపెనీ. చదవండి: చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు! -
ఒమిక్రాన్ జాడ ఇలా తెలుస్తుంది!
న్యూఢిల్లీ: తాజాగా ప్రపంచవ్యాప్తంగా అందరి ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్.. ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల నుంచి తప్పించుకోలేదని, టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రసర్కార్ సూచించింది. రాష్ట్రాలు/యూటీల ఉన్నతాధికారులతో మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వర్చువల్ పద్ధతిలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు. ‘ వైరస్ నిర్ధారణ పరీక్షల నుంచి ఒమిక్రాన్ తప్పించుకోలేదు. టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుంది. పరీక్షల సంఖ్యను పెంచడం ద్వారా ఈ రకం వేరియంట్ వ్యాప్తిని ముందుగానే అరికట్టేందుకు ఆస్కారముంది’ అని బలరాం అన్నారు. ఫలితాలొచ్చేదాకా ఎయిర్‌పోర్ట్‌లోనే.. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బొట్సావానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల నుంచి భారత్‌కు ప్రయాణికులు వస్తే వారికి ఎయిర్‌పోర్టులోనే ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఆయా ప్రయాణికులంతా ఎయిర్‌పోర్టులోనే వేచిఉండాలి. ఈ నిబంధన డిసెంబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానుంది. ఆర్టీ–పీసీఆర్ టెస్ట్‌కు, టెస్ట్ రిజల్ట్ వచ్చే దాకా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నపుడు ఆహారం కోసం మొత్తంగా రూ.1,700 ఖర్చుకానుంది’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్‌తో ‘హై రిస్కే’: డబ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్‌పై ఇప్పటిదాకా చేసిన పరిశోధనలు, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ వేరియంట్‌ను ‘హై రిస్క్’ కేటగిరీలోనే కొనసాగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)పునరుద్ఘాటించింది. రానున్న కొద్ది రోజుల్లో ఇది తీవ్ర పరిణామా లకు దారి తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రతను లెక్కిస్తే అది భారీస్థాయిలోనే ఉండొచ్చని సంస్థ రఅభిప్రాయపడింది. జపాన్‌లో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది.