ముంబై: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒక్కరోజే అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో అత్యధిక ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి. తాజాగా రాష్ట్రంలో మంగళవారం మరో ఎనిమిది కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు ముంబైలోనే వెలుగు చూడటం గమనార్హం. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
చదవండి: వేలంలో రికార్డ్ ధర పలికిన అస్సాం మనోహరి టీ పొడి.. కిలో ఎంతంటే.
అలాగే ఇదే రోజు ఉదయం ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో 4 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 53కు పెరిగింది. మహారాష్ట్రతో పాటు మిగతా రాష్ట్రాలైన గుజరాత్ (4), రాజస్థాన్ (9), ఢిల్లీ (6) కర్ణాటక (3), కేరళ (1) ఆంధ్రప్రదేశ్ (1) కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ (1)చొప్పున కేసులు వెలుగు చూశాయి.
చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన ఆరోగ్యశాఖ మంత్రి .. ఆసుపత్రికి తరలింపు
Omicron Updates: చైనాలో ఒమిక్రాన్ కలవరం
Comments
Please login to add a commentAdd a comment