![Omicron Coronavirus Cases In India Update: Omicron Tally Rises To 213 - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/Omicron--Omicron.jpg.webp?itok=zEjfli-K)
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. బాధితుల్లో 90 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. మొత్తం కేసుల్లో సగం వరకు ఢిల్లీ (57), మహారాష్ట్ర (54)లో ఉన్నట్టు తెలిపింది.
ఇక కోవిడ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 6,317 కేసులు బయటపడ్డాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 318 మంది ప్రాణాలు విడిచారు. దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 78,190 గా ఉంది. నిన్న ఒక్కరోజే వైరస్ బాధితుల్లో 6,906 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 0.51 శాతంగా, రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇప్పటివరకు 138.96 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.
(చదవండి: ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం)
Comments
Please login to add a commentAdd a comment