
Omicron Community Spread In Delhi సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేనివారు కొత్త వేరియంట్ బారినపడుతున్నారని ఆయన తెలిపారు. తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం పాజిటివ్ శాంపిల్స్‌లో 46శాతం ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే కేసులు గణనీయంగా పెరుగుతున్నా వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇదిలాఉండగా... 320 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. 450 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది.
ఆంక్షలపై ఆగ్రహం
మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అమలుచేస్తున్న ఆంక్షలపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహ్రాలీ-బదర్‌పుర్ రోడ్డు రోడ్డును దిగ్బంధించడమే కాకుండా.. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టారు. ఎల్లో అలర్ట్ అమల్లో ఉన్నందున 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ బస్సులు సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ల వద్దే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు ఆగ్రహానికి లోనయ్యారు. బస్సులపై దాడులు చేశారు.
(చదవండి: ‘మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63)
Comments
Please login to add a commentAdd a comment