సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. గురువారం నమోదైన కొత్త ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య పదికి చేరింది. 40 మందిని లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్చామని అనుమానిత కేసులను వేరు చేసి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.
చదవండి: హెచ్‌సీఏ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తాం: సుప్రీంకోర్టు
ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయని, అందుకోసమే కచ్చితమైన పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల ఒమిక్రాన్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా నమోదైన 4 కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో 7,974 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలల్లో 343 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment