Coronavirus News: COVID-19 Entering Endemic Stage In India - Sakshi
Sakshi News home page

భారత్‌లో ఎండెమిక్‌ స్టేజ్‌కు కరోనా.. అధికారుల కీలక ప్రకటన

Published Wed, Apr 12 2023 5:17 PM | Last Updated on Wed, Apr 12 2023 5:33 PM

Corona Virus Updates: COVID 19 entering endemic stage in India - Sakshi

భారత్‌లో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. ఆందోళన అక్కర్లేదని అంటున్నారు ఆరోగ్యశాఖ అధికారులు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటే చాలని ప్రజలకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  అయితే రాబోయే రెండు వారాల్లో భారత్‌లో కేసులు విపరీతంగా పెరుగుతాయని, ఆ తర్వాత గణనీయంగా తగ్గిపోతాయని చెబుతున్నారు. 

రాబోయే 10-12 రోజుల్లో ఎండెమిక్‌ స్టేజ్‌(స్థానిక దశ)కు కేసుల సంఖ్య చేరుకోవచ్చు. ఆ తర్వాత కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది. అంతేకాదు కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగా ఉన్నాయని, రాబోయే రోజుల్లోనూ ఇది ఇలాగే కొనసాగుతుందని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. 

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో 21.6 శాతం, మార్చిలో 35.8 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. 

ఎండెమిక్ అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రజల మధ్య శాశ్వతంగా ఉండిపోయే స్థితి. "ఎండెమిక్‌గా మారి, పూర్తిగా అంతం కాని ఎన్నో వ్యాధులు ఇప్పుడు మన మధ్యే ఉన్నాయి. అవి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఎండెమిక్‌గా మారుతాయి. అంటే తట్టు, సాధారణ ఫ్లూ, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, మశూచి లాంటి వ్యాధులు. పాండెమిక్ అంటే ప్రజల్లో తీవ్రంగా సోకి, పెద్ద ఎత్తున వ్యాపించే ఒక వ్యాధి. ఇక ఎండెమిక్ అంటే జనాల మధ్యే ఉంటూ, ఎక్కువకాలం పాటు అలా ఉండిపోయే వ్యాధి.

భారత్‌లో కొత్తగా ఏడు వేలకు పైగా కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement