
ముంబై: దేశంలో కరోనా కొత్త రకం ఒమిక్రాన్ వేరియంట్ భయాలు రోజు రోజుకి పేరుగుతుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతకంతకూ పడిపోతూ వచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వు ఉద్దీపనల ఉపసంహరణవైపే అడుగులు వేయనుందన్న సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. జాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు డీలాపడడం కూడా సూచీలను దెబ్బతీసింది. దీంతో సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి.
చివరకు, సెన్సెక్స్ 329.06 పాయింట్లు(0.57%) క్షీణించి 57,788.03 వద్ద ఉంటే, నిఫ్టీ 103.50 పాయింట్లు(0.60%) క్షీణించి 17,221.40 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.30 వద్ద ఉంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఒఎన్‌జీసీలు, పవర్‌గ్రిడ్, టీసీఎస్ షేర్లు నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్‌ఎం, మారుతీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు రాణించాయి. ఆటో మినహా, అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు నష్టాల్లో ముగిశాయి, ఐటి, మెటల్, రియాల్టీ, పిఎస్‌యు బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment