1985లో సోదరుడు రాజేశ్ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఓ సందర్భంల్లో స్టాక్ మార్కెట్‌లో రాణించేందుకు ఆయన చెప్పిన విజయ సూత్రాల్ని ఒక్కసారి చూద్దాం.
► మహిళలు, మార్కెట్లు, మరణం, వాతావరణం గురించి ఎవరూ అంచనా వేయలేరు.
► కెరటాలకు ఎదురెళ్లండి. అంతా అమ్మేస్తున్నప్పుడు కొనండి, అంతా కొంటున్నప్పుడు అమ్మేయండి.
► నష్టాలకు సిద్ధపడి ఉండండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు జీవితంలో నష్టాలు కూడా భాగమే.
► మార్కెట్‌ను గౌరవించండి. ఎంత ఒడ్డాలి. నష్టపోతే ఎప్పుడు తప్పుకోవాలి గుర్తెరగాలి. బాధ్యతగా ఉండాలి.
► అసమంజసమైన వేల్యుయేషన్లలో ఇన్వెస్ట్ చేయొద్దు. ప్రస్తుతం వెలుగులో ఉన్న కంపెనీల వెంట పరుగులు తీయొద్దు.
► తొందరపాటు నిర్ణయాలు ఎల్లప్పుడూ నష్టాలే తెచ్చిపెడతాయి. తగినంత సమయం తీసుకుని, అధ్యయనం చేశాకే ఏ షేరులో ఇన్వెస్ట్ చేయాలి.
► ఎల్లప్పుడూ స్టాక్ మార్కెట్లే కరెక్ట్. అదను కోసం ఎదురుచూస్తూ కూర్చోవద్దు.
► భావోద్వేగాలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే, కచ్చితంగా నష్టాలే మిగులుతాయి.
► నష్టాలను భరించే సత్తా లేకపోతే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందలేరు.
► సమర్ధమైన, పోటీతత్వం ఉన్న మేనేజ్‌మెంట్ గల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి.
► మంచి ట్రేడరు, ఇన్వెస్టరుగా ఉండదల్చుకుంటే.. రెంటినీ వేర్వేరుగానే ఉంచాలి.
► ట్రేడింగ్ చేయాలంటే మనిషి తన అహాన్ని తగ్గించుకోగలగాలి. అలాంటి సామర్థ్యాలు చాలా కొద్దిమందికే ఉంటాయి. కాబట్టే 10 లక్షల మందిలో 9.99 లక్షల మంది నష్టపోతుంటారు. అందుకే ట్రేడింగ్ చేయొద్దన్నది నా వ్యక్తిగత సలహా.
► ఆర్థికవేత్తల మాటలను పట్టించుకుని ఉంటే నేను ఇంత సంపద ఆర్జించి ఉండేవాణ్ని కాను.
► మార్కెట్ అసంబద్ధమైనదని, మీరే శ్రేష్ఠమైన వారు అని మీకు మీరు అనుకుంటే తప్పుల నుంచి ఎన్నటికీ నేర్చుకోలేరు.
చదవండి👉 రాకేష్ ఝున్‌ఝున్‌వాలా: 5 వేలతో మొదలై.. 50 వేల కోట్లకు!
Comments
Please login to add a commentAdd a comment